Total Pageviews

Wednesday, October 8, 2014

నీ వలపుల , తలపుల ..........


నువ్వు  అతగాడిని  ఎంత గా  ప్రేమించావో  నాకు తెలుసు , ఎంతగా  ఆరాధించావో  నాకే తెలుసు ,నీప్రణాల న్ని 
అతనిమీదే పెట్టుకున్నావు . మీనాన్న ఈపెళ్ళికి  ఇష్టపడలేదు ,కానీ  అమ్మ మాత్రం ''నా తమ్ముడే గా  ఎంత 
సవతి తల్లైనా  నాకు పిన్నే  అవుతుంది గా ,బాగానే చూసుకుంటుంది . '' అని పట్టు  పట్టడం తో మీ  నాన్న 
నిన్ను  పిలిచి ''మావయ్యని  పెళ్లి  చేసుకుంటావా ?'' అని అడిగితే , ''అవును నాన్నా ''అని ధైర్యం గా  చెప్పి 
వచ్చేశావు . ఆయన మొదట ఆశ్చర్య పోఇనా ,నీ  ఇష్టాన్ని  మన్నించారు . నీ కోరిక మన్నించడానికి ,
ఒప్పుకున్నారు , సరేనన్న  రోజు  నువు  సిగ్గుల మొగ్గయ్యి  నాలోనే గా  మొహం దాచుకున్నావు ?. 

నీ ఛామన చాయ  రూపం ,అపురూపం , నీచారడేసి కళ్ళు  నిర్మలం , నీ పొడవు కు  తగ్గ  పెద్దజడా , 
నీమొహం లో  స్వచ్ఛత  , నీ  సరిజోడి గా  ఆరడుగుల  అందగాడు  వరుడు , పెళ్లి పందిరంతా  మల్లెల 
అలంకారం , పెద్ద పేరున్న  వ్యాపారవేత్త  ఏకైక కుమార్తెవు ,ఇద్దరు తమ్మళ్ళ కు ఒక అన్నకు  ముద్దుల 
చెల్లివి , పనివాళ్ళను సైతం  పరుషంగా  ఒక మాట అనలేని  అందమైన  సుకుమారమైన ఆక్రుతివి . 
నువ్వు కోరిన  కోరిక  నెరవేరు తున్న ,ఆ  శుభముహూర్తం లో  పట్టుబట్టలు మార్చుకు  రమ్మన్న 
పురోహితుని  మాటలకూ ,నువ్వే ముందుగా  మార్చుకుని వచ్చి  ''మావయ్య  రమ్మంటున్నారు ''
అని  అందరి లో  పిలిచేసి  ఎంత సిగ్గు ల  మొగ్గయ్యావు ,అతిధుల  నవ్వుల మధ్య  మూడుముళ్ల  తో 
ఒకటయ్యారు . నీ సంతోషం  చూసి  మురిసే మొదటిదాన్ని , నీ  సంసారంలో  సరిగమలు  విని ,నీ 
అదృష్టానికి  పొంగి పోయే  వాళ్ళలో ,మొదటిదాన్ని  కూడా నేనే అయ్యాను . నాలుగేళ్ళ  అనుబంధం లో 
ఇద్దరి  బిడ్డల తల్లివైనావు ,పరిపూర్ణ స్త్రీ గా  పునీతమైయ్యావు . 
  
ఒక రోజు  పిల్లలతో సహా వచ్చేసి ,ఇక  వెళ్లనని పట్టుపట్టావు . ఎవరెంత అడిగినా ,పెదవి విప్పని  నీ 
మొండి తనం  వెనుక నీ   గాయపడిన మనసు నాకే తెలుసు . నీబాదంతా నాకు చెప్పినప్పుడు ,నీ 
కన్నీళ్ళతో నన్ను తడిపి నప్పుడు ,మగవాళ్ళంతా ఇంతే  సర్దుకు పోవాలని చెప్పాలను కున్నాను ,
కాని ''అతను  ఎంత పెద్ద తప్పు చేసినా ,ప్రేమించాను కాబట్టి సర్దుకు పోయే దాన్ని ,గొప్ప గుణం చూసి 
ప్రేమించాను తప్పుడు పని చేస్తే వదిలేసే దాన్ని కాదు , ప్రేమంటే లోపాలతో సహా స్వీకరించడమే ,  కాని 
వావి వరుస లేని  పశువును  అతని లో చూసాను ,వచ్చేసాను ,ఇక  వెళ్ళను . అన్నావు .  మరో  సారి 
నీ సంస్కారాన్ని రుజువు చేసుకున్నావు .  ఎంతో అడిగి ,అడిగి  మీ నాన్న ''నేను వద్దన్నా చేసు కుంటానని 
చేసుకుంది ,  నేను వెళ్ళమన్న  వద్దంటుంది .  నా కూతురి మనసు గాయపడింది , అది నయమయ్యే దాకా 
ఎవరూ  బలవంత పెట్టొద్దు ''అన్నారు . నీ సోదరులు అటునుంచి ప్రయత్నించి నా ,నిశ్శబ్దం  సమాదానమై ,
వారితో పాటే నిన్ను పిల్లలిని  అమెరికా తీసుకు పోతామంటే ,నువ్వు పిల్లలితో సహా  పయనమై  వెళ్లి పోయావు . 
 నాకు గుండె వుంటే బద్దలయ్యేది  .   నిన్ను చూడాలని  ఆరాట పడేదాన్ని , నీబాదేమిటో  నాతొ పంచుకుంటే 
బావుండు అనుకునేదాన్ని ,కాని ఏ ళ్ళు  గడచినా నువ్వు తిరిగి రాలేదు . నువ్వు నా పై వాలినపుడు  నీలో 
సంతోషం  చూసాను , పెళ్ళప్పుడు  సిగ్గు చూసాను ,పెళ్ళయ్యాక  ఆనందం చూసాను . విడి పోయాక  నీలో   ఆ  వేదన చూసాను . ఇంకా  ఇప్పుడు ఎలా  ఉన్నవో చూడాలనుకుంటున్నాను . మీవాళ్ళకి ఏ నాటికీ తెలియని 
నీ సంసారం విచ్చిన్న రహస్యాన్ని   చెప్పాలని అనుకున్నా కాని  నాకు నోరీది ?  భగవంతుడు  నన్ను'' తలగడ ''
గా పుట్టించాడు కానీ ........ నాకు నోరే వుంటే  నీకు ఓదర్పు  నయ్యే దాన్ని ,నువ్వు  నమ్మిన వాడు  నిన్ను 
నట్టేట  ముంచినా ,నీ తోడూ నీడా  నేనయ్యి  నీతో  జీవితాంతం  కలిసుండే దాన్ని ప్చే ..  నేను కేవలం  నీ 
తలపుల  తలగడన య్యాను ............ 
 ఎందరో  పరిపూర్ణ స్త్రీ  మూర్తులు  అందరికీ  వందనాలు ..... 

*****                 ******                      ***********                          ***********                    ******

2 comments: