Total Pageviews

Thursday, October 30, 2014

ఆలోచించి కొనండి ....ఆపెల్  ఐ పోన్  ఫోర్  ఎస్ , 8 జి బి , 8మెగా  ఫిక్సెల్  కెమెరా , బేటరీ  మెమరీ  కార్డు  ఇన్ బిల్ట్ . మనం మైక్రో  సిమ్ చేపించి  వేస్తాము  కదా ,దానికి వాళ్ళు  ఇచ్చి న పిన్ తో ,మాత్రమే సాద్యం . మరో మెమరీకార్డు  వేసుకోలేము ,పోన్ 
ఇంస్టా లేషన్  కే  5 జి బి  ఖర్చు అయిపోతుంది . ఇక మిగిలింది  3 జి బి . ఇందులోనే  మనం పాటలైనా ,పోటో లైన 
వేసుకోవాలి . నాకు  వాట్స్ అప్  లేదు ,పేస్ బుక్  నచ్చదు . అందరికి అలా వుండదు కదా ,అవి అవసరం  ఐన 
వాళ్ళు వుంటారు . బ్లూ టూత్  ఓన్లీ  అపెల్  టు అపెల్ . స్టూడెంట్స్ కి చాల ఇబ్బంది అవుతుంది . బేటరీ  బ్యాక్ 
అప్  కేవలం  పది గంటల  యాభై  నిముషాలు  . 


అవే  రింగ్  టోన్స్ వాడాలి  వేరేవి వేసుకోడానికి ,వీలు కాదని  విన్నాను . కాని  నల్ల మోతు  శ్రీధర్ గారి వీడియో 
చూసాక  మనకు నచ్చిన  రింగ్ టోన్స్  వేసుకో వచ్చని తెలిసింది . పోన్  మెటల్ బాడీ  తో  సాలిడ్ గా వుంది . 
మీరు  పి  సి  నుంచి  ఏమి ఏమైనా  అప్ లోడ్  చెయ్యవచ్చు  కానీ పాటలకి ఐ ట్యూన్స్  app ని డౌన్ లోడ్  చేసుకోవాలి  ప్యానల్ కవర్ సిలికాన్  వుంటే మంచిది  బరువు  తగ్గుతుంది .   మీ  కాళ్ళకి  స్లిప్పేర్స్  ఉండేట్టు 
చూసు కొండి . మెటల్ బాడీ  కాబట్టి  ఆమాత్రం జాగర్త  అవసరం . 


మీరు కొనాలనుకున్న ఏ  పోన్  ఐనా  అప్పటికే వాడుతున్న వాళ్ళను ,సంప్రదించి  కొనండి , చాల  డబ్బు 
పెట్టి కొనే వస్తువు కాబట్టి , తరచూ మార్చే అవసరం రాదు . చాల మంది కొత్త మోడల్ రాగానే మార్చేస్తారు . 
మోడల్ ముందే చూసి కొనుక్కుంటే ,ఆ అవసరం  రాక పోవచ్చు . అవి లేవు ,ఇవిలేవు  అని  ఫీలయ్యే 
పని వుండదు . నాకు మాత్రం నా అవసరాలకు సరిపడా  వుంది .  సౌండ్  క్లారిటీ  చాల చాల  బావుంది . 
ఇవి  నాకు తెలిసి నంత లో  నా ఐ పోనే  విశేషాలు . మీకు ఉపయోగ  పడాలనే కాని ,వేరే  ఉద్దేశ్యం లేదు . 

                                      **************************************

Friday, October 24, 2014

నా దివాలీ ..

అందరికి  దీపావళి  శుభాకాంక్షలు , నాకు ఈ  దీపావళి నచ్చింది  ఎందుకంటే , మంచి గిఫ్ట్  వచ్చిందిగా ........                                          
                                        *****************************************

Thursday, October 23, 2014

దీపావళి శుభాకాంక్షలు

దీపాల సరాలతో  ప్రతి  ఇల్లు  కళ కళ  లాడాలని , శ్రీ లక్ష్మి దేవి ఆశీర్వాదం 

అందరికీ  లభించాలని ,మీకోరికలు , ఆశలు , ఆశయాలు,  నెరవేరాలని ,

ఆశిస్తూ ......... అందరికీ   '' దీపావళి  శుభాకాంక్షలు ''. 

        Tuesday, October 21, 2014

పండుగంటే పనులు

పండుగంటే  పనులే  అని  భయమేస్తుంది  కదండీ , ఇది కాక బోల్డన్ని  పిండి వంటలు , ఎక్కడా ఖాళీ యే  దొరకదు
మరికాస్త పని త్వరగా  ముగిసే  వీలుంటే బావుంటుంది కదా , చాల మందికి  పని మనిషిని  ఇంట్లోకి రానియ్యడం 
అంత ఇష్టం  వుండదు . ఇక  కొంత మందికి వాళ్ళు  వుండే చోట  పనివాళ్ళే దొరకరు . తప్పని సరిగా  మనమే 
చెయ్యవలసిన  పనులు  కొన్ని వుంటాయి . వాటిలో కొన్ని సులువుగా చేసు కోవడానికి వీలుగా ,అతి తక్కువ 
ధరలో  కొన్ని చిన్న చిన్న  ఐటమ్స్  చూపిస్తాను . వీటి దయవల్ల  ఎన్నిపనులు  చేసుకున్నా చేతులు  ఎంతో 
సుకుమారం గా వుంటాయి . అందులో ముఖ్య మైనదిఈ బ్రష్. .   మెత్తని కుంచెలా  వుండే  దీని తో కంప్యూటర్ 
కీబోర్డ్  శుబ్రం  చేస్తారు . కాని  మనం  పూజ రూం ,శుభ్రం  చేసుకోవచ్చు ,ముందు రోజు  ఉంచిన పూలు , 
కుంకుమ ,తుడిచేసి నీట్  గా  ఉంచుకోవచ్చు . ఉతికి  మళ్లీ  వాడు కోవచ్చు . ఇక   వంటింటి  సింక్  అతిముఖ్య  మైనది . సింక్  ఎంత నీట్ గా  వుంటే  అంత  ఆరోగ్యం . అందుకే  ఈ బ్రష్ . 
దీనితో  సింక్  కడగవచ్చు ,చేతికి తడికుడా  అంట కుండా ,పని అయ్ పోతుంది . అలాగే వాష్ బేసిన్  కూడా 
చేతులు కడుగు కునే వాష్ బేషిన్  కూడా ఇదే విధం గా  శుబ్రం  చేసుకోవచ్చు . కాని వేరు వేరు  రంగుల్లో 
రెండు తీసు కోవడం మర్చి పోవద్దు  ఎందు కంటే , వేరు వేరు గా  ,దేనికదే  వాడడం  ఆరోగ్యకరం . గ్యాస్  గట్టు శుభ్రం  చేసే  టప్పుడు ,నీరు చేతితో కాకుండా , ఈ  రబ్బరు  దానితో  జరిపే సెయ్యాలి ,ఒక్క చుక్క 
నీరు  లేకుండా  ఆరి పోతుంది . చేతికి  డిటర్జెంట్  తగలదు , చేతితో  చేసామన్న  చిరాకు  వుండదు . చూసారా  నీరు  అస్సలు  లేకుండా  ఎంత  నీట్  గా  వచ్చేసిందో , ఇవన్ని  పెద్ద ఖరీదు  కూడా  కాదు , ఇరవై
ముప్పై  రూపాయలు లోపు  దొరికి పోతాయి . ఇప్పుడు చైనా బజార్ లు  ప్రతి  చోటా  ఉంటున్నాయి .
తప్పకుండా  ప్రయత్నించండి , ఇప్పటికే వాడు తున్నట్లయితే ,మరీ మంచిది ,మీచేతులు సురక్షిత మన్న మాట .
                                ************************************************

Saturday, October 18, 2014

డిజైన్ బ్లౌజెస్

పండుగలో  అతి ముఖ్యమైనది , షాపింగ్  , చాలామంది  మగవాళ్ళు ,అమ్మో  మేము మాత్రం  వెళ్ళం ,వాళ్ళే
చూసుకుంటారు , అంటూ  భార్యల  షాపింగ్  లో తలదుర్చరు . తప్పించు కుంటారు . మనం కొనేది తక్కువ
విండో  షాపింగ్  ఎక్కువ  అని వాళ్ళ ఉద్దేశ్యం . కాని  ఎప్పుడు రాముకాదా ,వచ్చి నప్పుడే  నాలుగు చోట్ల
చూసి  ధరలు బేరీజు  వేసుకుని కొందాము ,అని  అనుకోడం  తప్పేన ? చివరాఖరికి  వాళ్ళ జేబుకే గా మేలు
అన్నీ పక్కన  బెడితే  మనం  పండుగ బాగా దగ్గరైతే  కాని  వెరైటీ  ఉండదని   వెళ్ళం . మనం  తెచ్చినవి
లేట్  అయిందని  కుట్టడం కుదరదని , ఏవో సాకులు ,బ్రతి మాలి ఇచ్చినా పాడు  చేసి  మన మూడ్ పాడు
చేస్తారు టైలేర్స్ . మనమేమి  జీన్స్కొషర్ట్ కొ  నుక్కోము గా  ఆయనగారి లా ! పిల్లల లా  రెడీ మేడ్  వేసు
కోము , మహా ఐతే చుడిదార్ ,లేక పొతే మన  యుని వెర్సల్  డ్రెస్  '' చీర  '' .  చీర  అంటే  మరి  బ్లౌస్ ?
అందుకే  రెడీ మేడ్ . ఇప్పటికే  మన వార్డ్ రోబ్  లో  ఆరు వరకు  కొని పెట్టుకుని  వుంటాము కదా  .
ఇది టిష్యు  మీద    పింక్ నెట్ తో  లేయర్స్  లేదా పనేల్స్  గా  వర్క్ చేసింది . పట్టు , మైసూర్ సిల్క్ ,ఉప్పాడ 
సారీస్ కి  బావుంటుంది . నెక్ ఏ మాత్రం  అసబ్యం గా  లేకుండా  చాల చక్కగా ఉంది  కాంట్రాస్ట్  ఐనా ,మాచింగ్ 
అయినా  చాల  బాగుంటుంది . ఇది  చాల  మాములుగా  సాయంత్రాలు  బయటికి  వెళ్ళేప్పుడు  కట్టుకునే  జర్జేట్ , షిఫ్ఫాన్  శారీస్ కోసం అదుర్స్ .
 చాల  సింపుల్ గా  వుంది ,పోట్  నెక్ , గోల్డ్ బాల్స్  ఫినిషింగ్  తో  వుంటుంది .


 ఈ  టైపు  టిష్యు డాట్స్  బ్లౌస్ , పట్టు లో సింపుల్  బోర్డర్ తో వున్నవి  మనం ఇంతకు  ముందే కొన్న శారీ కి
బ్లౌస్  ఏ  ప్రాబ్లం  వున్నా  ఇది సరైన  ఎంపిక .


 ఇది గోల్డ్ కలెర్  సైడ్ ఓపెన్  ప్రిన్సెస్  కట్ బ్లౌస్  డార్క్ ప్లైన్  శారీస్  సింగల్ పల్లుకి  అదుర్స్ ..
మెగా స్లీవ్స్  తో ,ఒక శారీ  ఖరీదు లో ,వస్తుంది ,ఐదు  చీరల   కి  మేచ్  అవుతుంది .


ఇది బంజారా  వర్క్ చేసిన  డబల్  లైన్ , ప్రిన్సెస్ కట్ బ్లౌస్ , డబల్  లైన్ అంటే  రెండు వరుసలుగా  హుక్క్
ఇస్తారు , సన్నగా వున్నా,  లావు గా వున్నా మనం  ట్రైల్  రూం కి  వెళ్ళ  కుండ నే  ధైర్యం గా  కొనచ్చు .
ఇవన్ని నేను ఎప్పటినించో  వాడు తున్నవి  కాని ,వాష్ చేసే  టప్పుడు  తీసు కున్న జాగర్తల  వల్ల
ఇంత  నీట్  గా వున్నాయి .  ఈ బ్లౌస్ కి  ఐతే మిర్రర్స్ కూడా  వున్నాయి . ప్లైన్ శారీకి  చాల  బాగుంటుంది .
చేతితో  షాంపు  లో ఉతకాలి , ఎప్పుడు మిషన్ లో వెయ్య కుండా వాష్  చెయ్యాలి . లాస్ట్ కినిమ్మ చుక్కలు   వేసిన వాటర్  లో ముంచి తీసి  నీడ లో ఆర పెట్టాలి .  మైసూర్ సిల్క్ శారీ లు కూడా ఇదే విధం గా చేస్తే
డ్రై క్లీన్ కి ఇచ్చే పని తప్పుతుంది . డబ్బు  ఆదా  అవుతుంది . బట్టలు మెరుస్తూ వుంటాయి .వీటికి  కుందన్  కొని తెచ్చి  నేనే  వర్క్  చేశాను  కుట్టే పని కూడా లే లేకుండా  గ్లూ  తో  అంటించాను . 
       ఇవన్ని కొని దగ్గర పెట్టుకుంటే సమయం వున్నపుడు మీరు కూడా చేసేసు కోవచ్చు . ఈ స్టోన్స్ కూడా 
       గొలుసు మాదిరిగా  వస్తున్నాయి ,వాటిని ఎంత మేర కావాలో  గ్లూ సాయం తో అతికిస్తూ చాలను కుంటే 
       చేత్తో  అక్కడికి తెంప [విరిచేయ ] వచ్చు . 
                 
         అన్నిటికి  మగ్గం వర్క్ చేయిస్తే ,చాల  వసూలు  చేస్తారు . కొన్ని టికీ  ఇంట్లో మనం కూడా చేస్తే
         చాల  హెప్పీ గా  వుంటుంది చేసి చుడండి , మనమే చేసు కున్నామని  అనుకుంటే  అదో తృప్తి .

                                                    **************************

                                                

Wednesday, October 15, 2014

అన్న చెల్లెలు ........                  ఆ రెళ్ళ  అనురాగం 


నాకో స్నేహితురాలు  వుంది , అంటే తను  అన్నయ్య  క్లాస్ మేట్ , నాకన్నా  నాలుగేళ్ళు  పెద్దది . ఎలాగో మేము
మంచి  స్నేహితులమై ,  పెళ్లి ళ్ళు అయ్యాక  అదేనండి  ఒకొక్క  పెళ్ళే ,ఇద్దరికీ  వేరు వేరు గా  అని  చెప్పడం  నా 
ఉద్దేశ్యం . ఇక్కడికే  కాపురానికి  రావడంతో  తరచూ కలుస్తూ  వుండే వాళ్ళం . విధి  చిన్న  చూపు చూసి ,వాళ్ళు 
బెంగళూర్  దగ్గరలో ఒక కంపెనీ  లో  ఆయనికి ,అదేనండి  వాళ్లాయ నికి వుద్యోగం  రావడంతో  అక్కడికి  వెళ్లారు . 
ఎన్నోసార్లు  నన్ను  కుటుంబం తో  రమ్మన్నది కానీ  పుట్టింటికే  వెళ్ళే టైం లేని రోజులాయె  వెళ్ళడం  కుదరలేదు . 
నా  స్నేహితు రాలి  పేరు మాధురి . వాళ్ళది చాల పెద్ద కుటుంబం ,నలుగురు అన్నలు  ముగ్గురు  అక్కలు . అంతా 
తలా వొక చోట  సెటిలయ్యారు . అందులో ఒక అన్న  ఇక్కడే ఒక హీరో  దగ్గర  పి  ఎ  గా చేసి  అదే  హీరోతో సినిమా 
తీసి చేతులు  కాల్చు కుని  ఈమధ్యే  కోలుకుని ,మంచి  ఏరియా లో  ఇల్లు  కొనుక్కు న్నాడు . ఇంతకీ  విషయం 
ఏమిటంటే ,మాధురి  పుట్టింటికి  వెళ్ళాలంటే ,ఇక్కడికి  అంటే హైదరాబాద్  వచ్చి ,సాయంత్రం  ట్రైన్  ఎక్కి ఉదయం 
రాజమండ్రి లో దిగి  బస్ లో  వాళ్ళ వూరు వెళ్ళాలి . కాని  ఇక్కడ  ఉన్న  అన్న  రమ్మంటేనే  గా  వచ్చి  ఉండగలదు 
తన  భార్య ఒప్పుకోదని  అతను  ఆవిషయమే  మాట్లాడడు . ఇలా  ఊరుకి వెళ్తున్నాను  అని పోన్ చేస్తే  సరే నమ్మా 
అంటాడట ,ఎలావెల్తావు  వచ్చి  ఇక్కడ  రెండు రోజులుండి  వెళ్ళు  అన్న మాటేలేదు . తను  రెండు రోజులకి సరిపడా  టిఫిన్స్  చేసు కుని  పిల్లలితో  అవస్తపడుతూ  వెళ్తుంది . ఎందుకిలా  తనతో పాటు ఇరవై  ఏళ్ళు పెరిగిన చెల్లిని 
ఆమె తో  తనకున్న  అనుబంధాన్ని  మర్చి పోతారు . అసలు అవసరమేముంది మర్చి పోవడానికి ?మగవాళ్ళే 
కదా ,ఇంట్లో  ఆడవాళ్ళు ఎక్కువ  మాట్లాడితే , హద్దులు చూపించ లేరా , బుద్ది చెప్పలేరా , చెల్లెలు  ఏడాదికి  ఒక 
సారే వస్తుంది . అంతగా ఆర్దికంగా  హీన పరిస్తితి  ఐతే కాదు కదా !నాలుగురోజులు సర్దుకోమని  చెప్పలేరా . 
ఒకవేళ  వదిన ఆడ పడుచుకి కుదరక  పొఇన  ,వాళ్ళు  మాట మాట  అనుకున్నా ఇతను  చూస్తూ ఊరుకోవాలి . 
వాళ్ళు ఇద్దరూ  తనకి  ముఖ్య  మైన వ్యక్తులు , వాళ్ళే  సర్దు కుంటారు అనుకోవాలి . ఎవరిని నొప్పించక  తానొవ్వక 
పరిస్తితి  సర్దుబాటు చేసు కోవాలి . అంతే కాని ,పసుపు కుంకుమ  పెట్టి పంపాల్సిన  చెల్లిని  ఎప్పటికి  ఇంటికి 
రమ్మని పిలవక పోవడం మంచి పద్దతి కాదు . తను సంతోషం గా  పుట్టింటి నించి  వెళ్తే  ఆ  సంతోషం  రెట్టింపుగా 
 కుటుంబాన్ని పైకి తెస్తుంది . ఈ పద్దతులన్నీ  మన పెద్దవాళ్ళు ఊరికే  పెట్టలేదు , మన సంప్రదాయాన్ని గౌరవించి 
మంచి ఫలితాలని అందుకోవటం  మన చేతుల్లోనే  వుంది . ఇవన్ని అందరికి తెలిసిన విషయాలే ,సమయం లేదని 
మనం అన్ని విషయాలు ఆలోచించ లేక పోతున్నాము . అమ్మ లో' ' అ ' ని  నాన్న లోని 'న్న ' కలిపితేనే  ''అన్న ''
అని వస్తుంది . తల్లి తండ్రు ల  తర్వాత ఆడపిల్లను  చూసుకోవాల్సిన బాద్యత పూర్తిగా అన్నదమ్ముల దే , అదే 
విస్మరించి ,మనం పొందేది ఏమి వుండదు . పలాయన వాదం అన్ని విషయాల లో  పనికిరాదు . 

నా చిన్నతనం  లో మా వీధి లో  ఒక కుటుంబం వుండేది ,చెల్లెలు తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని 
వాళ్ళిద్దరి పరిచయానికి కారణం తనే  అని భావించి ,అంతగా ఆర్దిక స్తోమతు లేని అతనితో  తన చెల్లి కి ఇబ్బంది 
రాకుడదని తలచి  ఆ  అన్నయ్య  పెళ్లి చేసు కోకుండా  ఉండి పోయారు . నిజం .... మా కుటుంబ  స్నేహితుడే 
ఆయన , ఇప్పటికీ  పెళ్లి చేసు కోలేదు  అంతే కాదు , ఈమధ్యనే  మేన కోడలికి  పెళ్లి చేసాడు . జీవితాలు 
త్యాగం  చెయ్యక్కరలేదు . జీవితం లో  చిన్న భరోసా కల్పిస్తే చాలు . నీకు మేమున్నాము  అని ధైర్యం ఇవ్వ 
గలిగితే  ఆమె ఆనందానికి  అవధులే వుండవు . భర్త పిల్లలు ,సంసారం  ఎన్ని వున్నా , నావాళ్ళు  అనే 
భావమేవేరు .  నా అన్న  వాళ్ళ కోసం  ఆమె  ఎదురు చూస్తూనే  వుంటుంది  జీవితాంతం  .
      అరవై   ఏ ళ్ళ  అనుబంధం 

                ''  నాన్న ''  నాకెంతో ఇష్టమైన  ఆఖరి అత్త   ''దేవకీ  ''  
               
నాకు  ఆడపడుచు వుంటే ఎలా చుసుకునేదన్నో కాని ,తప్పకుండా బాగా చూసుకునేదాన్ని అన్పిస్తుంది . 
కాని వీళ్ళు  ఐదుగురు అన్నదమ్ములు  ఈయనే  ఆఖరి వారు . దీపావళి  తర్వాత  వచ్చే  పండుగ వుంది 
''భగిని హస్త  భోజనం '' ఆరోజు  సోదరులు ,చెల్లెలింటికి  వెళ్లి భొంచేస్తే చాల మంచిదట . యమధర్మ రాజు 
తన  సోదరి  యమున ఇంట్లో భోజనం చేసి  ఆమె కు  ఎన్నో వరలనిచ్చాడు  అని చెప్తారు . బలి చక్రవర్తి ,
తన సోదరిని  గౌరవించింది  కుడా ఈనాడే నట ,  అందుకే  కార్తిక  విదియకి అంత  ప్రాముఖ్యం ఉన్నదట . 
ఎవరైనా  ఒకే మాట పదిసార్లు చెబితే  అదే నిజమని పిస్తుంది , మన ఆలోచన, వివేకం , మనం కాపాడు
కోవడం ముఖ్యం . మీరు సుహాసిని  నటించిన '''సంసారం ఒకచదరంగం ''సినిమా చూసారా ,మంచి సినిమా ,
అందులో సుహాసిని ,శరత్ బాబుతో ''మగపుట్టుక పుట్టాక రెండు విషయాలికి  లెక్క చూడకుడదు ,ఒకటి
అక్కచెల్లెలికి  పెట్టే  పెట్టుబోతలు , తల్లి తండ్రులకి  పెట్టే  కూడు గుడ్డలు '' అంటుంది . ఎంత నిజముంది కదా .

                                         **********************************

Tuesday, October 14, 2014

ఏ మిటో ......ఏప్రిల్  నెలాఖరు  అన్ని చోట్లా ఎలక్షన్  హడావిడి , ఉదయాన్నే  పోలింగ్  బూత్  వెదుక్కుంటూ  వెళ్ళాము . ఒక
స్కూల్  దగ్గర  ఆగి ,లిస్టు  చెక్  చేయ డా నికి  తను వెళ్లారు . నేను తురాయి చెట్టు  ఆను కుని కొమ్మ తెంపి ఆకులు
వేరు చేస్తున్నా వస్తదీ ,    రాదూ , అంటూ ఎందుకంటారా  సినిమాలు  చుట్లేదేటి , పక్కనేవరో మాట్లాడు కుంటున్నారు , బావా కారు  తాళం ఇచ్ఛా వంటే  వీళ్ళని  ఇంటి దగ్గర  దింపి వచ్చే స్తాను , అదేంటి  బావా వచ్చేప్పుడు  ఎలావచ్చేరు ,బందిమీదే  వచ్చాము  ఇప్పుడు చాల మంది అయ్యముగా , సరే ఇక్కడ  నువ్వు
చూసుకో  నేనే దిమ్పేస్తాను , [అంతే కానీ తాళం ఇవ్వడనమాట ]ఎవరీ కృష్ణార్జునులు ? అని తలతిప్పి  చూసా ,
'మేడం  మీరా ' అంటూ  వచ్చేసాడు ,రూప భర్త  కదూ  అనుకుంటూ  బావున్నారా , అన్నాను ,రూప  ఏది
అన్నాను ,తను పొద్దునే  ఓటేసి  వెల్లిపొఇన్ది  అంటూ  నా చుట్టూ  చూస్తూ  సి  ఎమ్  గారు  ఏరి  అన్నాడు .
వాళ్ళు చంద్రని  అలాగే పిలుస్తారు  నేను నా చేతిలో వున్నా కొమ్మతో  అక్కడా ! అనిచుపించాను  ఆనందం గా ,
అటు వెళ్ళాడు . కొంచెం  లావయ్యాడు ,మొహం  మారింది  కాని బొజ్జ మాత్రం  రాలేదు . తర్టి ప్లస్ వుండి ,
బొజ్జ  రాని వాళ్ళకి ఒక గులాబీ ఇద్దామని  వుంటుంది . కాని  సమయానికి  చేతిలో వుండి చావదు . నాకు
మీసాలు  లేని  మగవాళ్ళు , పొట్టవున్న వాళ్ళు చిరాకు , మానాన్న కి మీసాల్లేవు ,చంద్రకి పొట్ట వుంది  అప్పుడే మా  వజ్రానికి  చెప్పే సాను , నాకా రెండు  నచ్చవని . ఇంతలో  చంద్ర తో పాటు  కలిసి  వచ్చాడు ,ఇంటికి పోన్
చేసి తెలుసు కున్నాడట ,నెట్లో చూసి చెప్పారు ఇదే స్కూల్  అని  లోపలే  వెళ్ళండి  అన్నాడు . లో గొంతు తో ,
మా  బాబాయ్ నించున్నారు తెలుసు గా  ఆయనకే వెయ్యాలి  అన్నాడు . సరే  అని  వచ్చేసాము .


నాకు ఇప్పుడు గుర్తు వస్తోంది ,ఇంతకూ ముందు కూడా  ఇదే స్కూల్ దగ్గర  అంతా కలిసాము . రేషన్  కార్డు
ఫొటోస్  తీస్తున్నారంటే ,ఫామిలీలు  ఫామిలీలు  వచ్చేసాం ,అప్పుడు అంతా ఒకే చోట ,అంటే  అపార్ట్ మెంట్
లో  వుండే వాళ్ళం  తర్వాతి రోజు ,మెట్లమీద  ఎదురు పడి ,మేడం మీ రేషన్  కార్డు పోటో లు  వచ్చాయా అని
అడిగాడు . నేను అక్కడికీ  మనసును హెచ్చరిస్తూనే వుంటాను ,ఎక్కువ మాట్లాడకు చిట్టీ ,నీకీ మద్య మోకాలి
నించి నాలికకు  డైరెక్ట్  కనెక్షన్  అయి పోయింది  అని ,అతను పోటో లు  వచ్చాయా,అని అడిగి నపుడు ,
అవును  అనో  కాదు  అనో  చెప్తే సరిపోయే దానికి ,'ఆవచ్చాయి  పోలిస్ స్టేషన్ లో ,రైల్వే స్టేషన్  లో దొంగల
పోటో ల్లా వున్నాయి ' అన్నాను . అంతే  అతను నవ్వి నవ్వీ  పొట్టపట్టుకుని  రయలింగ్ మీద పడుకుండి
పోయాడు . నవ్వు ఆపుకుని  సి  ఎమ్  గారు లేరా  అన్నాడు . '''ఆయనా  నేనే పగలెప్పుడూ  ఆయన్ని
చూడలేదు  ఇంక  మీరేమి  చూస్తారు ? అన్నాను .. [హే  మల్లెస్సేను ] అతనికి ఏ  అర్ధం స్పూరించి ఇన్డో
మరి  ఈసారి మెట్ల మీద  కూచుండి పోయాడు .చాలసెపు నవ్వాక  పొట్ట పట్టుకుని  హమ్మ  హయ్యో
అనుకుంటూ  వస్తాను  మేడం  అంటూ  వాళ్ళ ఫ్లాట్  వేపు  వెళ్లి పోయాడు . నేను మెట్లు  దిగుతూ
వెనక్కి చూసి  భుజాలెగరేసాను  ఏమిటో ......... అనుకుంటూ ........

ఎలాగూ  పొట్ట సంగతి వచ్చింది కనుక  ఒక చిన్న  జోక్ వుంది  చంద్ర పొట్టమీద  ఇప్పుడే చెప్పేస్తాను  కానీ
మీరు నాకో  మాటివ్వాలి ,  నేనుమీకు  చెప్పానని  మీరు తనతో చెప్పద్దని   చెప్తున్నా , చెప్పారని చెప్తే నేను
ఏమిచెప్పను  ఇంక , ఏమిటో  ఏమి అర్ధం కాలేదు కదూ ! వదిలేద్దాం  . అసలు విషయం ఏమిటంటే ఒకసారి
సమ్మర్లో వెనకింటి ఆమె  నన్ను పిలిచింది గోడదగ్గరకి ,గోడంటే పెద్ద గోడేమి  కాదు నాలుగు  అడుగులు
ఉంటుంది  అంతే ,'' జ్యూస్  చేశాను  ఫ్రిజ్ లో  పెడదామంటే  గాజు సీసాలు  లేవు రెండు వుంటే ఇవ్వండి ''
అంది  నాకేమి అర్ధం కాలేదు ,ఇప్పుడన్నీ పెట్ బాటిల్స్  కదా గాజువేక్కడివి , అన్నాను ,అందుకే మిమ్మల్ని
అడుగుతున్నాను  అంది . మాదగ్గర కూడా లేవండి  అన్నాను నన్ను అదోలా చూస్తూ వెళ్లి తలుపేసుకుంది .
 పెద్ద చప్పుడు కుడా వచ్చింది .

నేనేమి  పేపర్లు సీసాలు అమ్ముకుని ,కొనే వ్యాపారం చెయ్యట్లేదు  ఎందుకామే  నన్నుఅడిగింది అని ఆలోచిస్తున్నా
సాయంత్రం చంద్ర వచ్చాక  చెప్పాను  తనువెంటనే ''నేను మందు  తాగుతానని అనుకుని వుంటుంది ''.
అన్నారు  నాకు నవ్వాగలేదు ,నిజమే మీ పొట్ట చూసి  నమ్మకంగా నన్నే అడిగింది ,అన్నాను నవ్వుతూ

 . చిన్న చారు గిన్నంత  పొట్టకే  ఇంత రాద్దాంతం చెయ్యలా ,మరి పెద్ద బానల్లా వేసుకు తిరుగు తావుంటారు  వాళ్ళకేమి కామెంట్లురావా ,మీరేమి అనుకున్నా సరే ,నేను కొత్తలోనే ఒకటడి గాను  తనని  స్టైల్ గా  సిగెరట్ కాల్చి చూపించమనిఎంతషాకై పోయాడంటే నేను ఇప్పటికి మర్చి పోలేదు ,నాముచ్చట తీరా  లేదు .రాముడు
మంచి బాలుడు అన్నట్లు గా వుంటే ఎలా మరీ ...... ఏమిటో .........

Sunday, October 12, 2014

ఇదీ మన తీరు .

సామాన్యం గా  సినిమా కి  వెళ్తే  ఎంత  ఖర్చు  అవుతుంది ? అదే  ఐ టి  పీపుల్  వెళ్తే  చాల  అవుతుంది  మరి .

వాళ్ళ  జీతల్లాగే  ఖర్చు  కూడా  !  ఒక రోజు కి  ,రోజు కూడా కాదు  గంటల   లో  వాళ్ళ  సినిమా  ఖర్చు ......

ఒక  మద్య తరగతి  జీవి తన  కుటుంబాన్ని  వారం రోజులు  పోషించు కునేంత .                                        ******************************  

Wednesday, October 8, 2014

నీ వలపుల , తలపుల ..........


నువ్వు  అతగాడిని  ఎంత గా  ప్రేమించావో  నాకు తెలుసు , ఎంతగా  ఆరాధించావో  నాకే తెలుసు ,నీప్రణాల న్ని 
అతనిమీదే పెట్టుకున్నావు . మీనాన్న ఈపెళ్ళికి  ఇష్టపడలేదు ,కానీ  అమ్మ మాత్రం ''నా తమ్ముడే గా  ఎంత 
సవతి తల్లైనా  నాకు పిన్నే  అవుతుంది గా ,బాగానే చూసుకుంటుంది . '' అని పట్టు  పట్టడం తో మీ  నాన్న 
నిన్ను  పిలిచి ''మావయ్యని  పెళ్లి  చేసుకుంటావా ?'' అని అడిగితే , ''అవును నాన్నా ''అని ధైర్యం గా  చెప్పి 
వచ్చేశావు . ఆయన మొదట ఆశ్చర్య పోఇనా ,నీ  ఇష్టాన్ని  మన్నించారు . నీ కోరిక మన్నించడానికి ,
ఒప్పుకున్నారు , సరేనన్న  రోజు  నువు  సిగ్గుల మొగ్గయ్యి  నాలోనే గా  మొహం దాచుకున్నావు ?. 

నీ ఛామన చాయ  రూపం ,అపురూపం , నీచారడేసి కళ్ళు  నిర్మలం , నీ పొడవు కు  తగ్గ  పెద్దజడా , 
నీమొహం లో  స్వచ్ఛత  , నీ  సరిజోడి గా  ఆరడుగుల  అందగాడు  వరుడు , పెళ్లి పందిరంతా  మల్లెల 
అలంకారం , పెద్ద పేరున్న  వ్యాపారవేత్త  ఏకైక కుమార్తెవు ,ఇద్దరు తమ్మళ్ళ కు ఒక అన్నకు  ముద్దుల 
చెల్లివి , పనివాళ్ళను సైతం  పరుషంగా  ఒక మాట అనలేని  అందమైన  సుకుమారమైన ఆక్రుతివి . 
నువ్వు కోరిన  కోరిక  నెరవేరు తున్న ,ఆ  శుభముహూర్తం లో  పట్టుబట్టలు మార్చుకు  రమ్మన్న 
పురోహితుని  మాటలకూ ,నువ్వే ముందుగా  మార్చుకుని వచ్చి  ''మావయ్య  రమ్మంటున్నారు ''
అని  అందరి లో  పిలిచేసి  ఎంత సిగ్గు ల  మొగ్గయ్యావు ,అతిధుల  నవ్వుల మధ్య  మూడుముళ్ల  తో 
ఒకటయ్యారు . నీ సంతోషం  చూసి  మురిసే మొదటిదాన్ని , నీ  సంసారంలో  సరిగమలు  విని ,నీ 
అదృష్టానికి  పొంగి పోయే  వాళ్ళలో ,మొదటిదాన్ని  కూడా నేనే అయ్యాను . నాలుగేళ్ళ  అనుబంధం లో 
ఇద్దరి  బిడ్డల తల్లివైనావు ,పరిపూర్ణ స్త్రీ గా  పునీతమైయ్యావు . 
  
ఒక రోజు  పిల్లలతో సహా వచ్చేసి ,ఇక  వెళ్లనని పట్టుపట్టావు . ఎవరెంత అడిగినా ,పెదవి విప్పని  నీ 
మొండి తనం  వెనుక నీ   గాయపడిన మనసు నాకే తెలుసు . నీబాదంతా నాకు చెప్పినప్పుడు ,నీ 
కన్నీళ్ళతో నన్ను తడిపి నప్పుడు ,మగవాళ్ళంతా ఇంతే  సర్దుకు పోవాలని చెప్పాలను కున్నాను ,
కాని ''అతను  ఎంత పెద్ద తప్పు చేసినా ,ప్రేమించాను కాబట్టి సర్దుకు పోయే దాన్ని ,గొప్ప గుణం చూసి 
ప్రేమించాను తప్పుడు పని చేస్తే వదిలేసే దాన్ని కాదు , ప్రేమంటే లోపాలతో సహా స్వీకరించడమే ,  కాని 
వావి వరుస లేని  పశువును  అతని లో చూసాను ,వచ్చేసాను ,ఇక  వెళ్ళను . అన్నావు .  మరో  సారి 
నీ సంస్కారాన్ని రుజువు చేసుకున్నావు .  ఎంతో అడిగి ,అడిగి  మీ నాన్న ''నేను వద్దన్నా చేసు కుంటానని 
చేసుకుంది ,  నేను వెళ్ళమన్న  వద్దంటుంది .  నా కూతురి మనసు గాయపడింది , అది నయమయ్యే దాకా 
ఎవరూ  బలవంత పెట్టొద్దు ''అన్నారు . నీ సోదరులు అటునుంచి ప్రయత్నించి నా ,నిశ్శబ్దం  సమాదానమై ,
వారితో పాటే నిన్ను పిల్లలిని  అమెరికా తీసుకు పోతామంటే ,నువ్వు పిల్లలితో సహా  పయనమై  వెళ్లి పోయావు . 
 నాకు గుండె వుంటే బద్దలయ్యేది  .   నిన్ను చూడాలని  ఆరాట పడేదాన్ని , నీబాదేమిటో  నాతొ పంచుకుంటే 
బావుండు అనుకునేదాన్ని ,కాని ఏ ళ్ళు  గడచినా నువ్వు తిరిగి రాలేదు . నువ్వు నా పై వాలినపుడు  నీలో 
సంతోషం  చూసాను , పెళ్ళప్పుడు  సిగ్గు చూసాను ,పెళ్ళయ్యాక  ఆనందం చూసాను . విడి పోయాక  నీలో   ఆ  వేదన చూసాను . ఇంకా  ఇప్పుడు ఎలా  ఉన్నవో చూడాలనుకుంటున్నాను . మీవాళ్ళకి ఏ నాటికీ తెలియని 
నీ సంసారం విచ్చిన్న రహస్యాన్ని   చెప్పాలని అనుకున్నా కాని  నాకు నోరీది ?  భగవంతుడు  నన్ను'' తలగడ ''
గా పుట్టించాడు కానీ ........ నాకు నోరే వుంటే  నీకు ఓదర్పు  నయ్యే దాన్ని ,నువ్వు  నమ్మిన వాడు  నిన్ను 
నట్టేట  ముంచినా ,నీ తోడూ నీడా  నేనయ్యి  నీతో  జీవితాంతం  కలిసుండే దాన్ని ప్చే ..  నేను కేవలం  నీ 
తలపుల  తలగడన య్యాను ............ 
 ఎందరో  పరిపూర్ణ స్త్రీ  మూర్తులు  అందరికీ  వందనాలు ..... 

*****                 ******                      ***********                          ***********                    ******

Saturday, October 4, 2014

మన హీరో సెంటి మెంట్లు ...............!

మన  కళ్యాణ్ ''బాబు '' కి  కొన్ని  నమ్మకాలున్నట్లున్నాయి . ఆ మాటకొస్తే కదా  నాయకి,నాయకులకు ,చాలా నమ్మకాలు  ఎక్కువే . అలాగే  నేను చూసి నంత వరకు  పవన్  కళ్యాణ్ ,సినిమాలో పాట లోనో  సీన్ లోనో ఈ
సైకల్ టైర్  సీన్  తప్పక ఇరికిస్తారు ,చుస్తే మీకు కూడా  గుర్తు రావచ్చు .


అలాగే  ప్రతి సినిమా లో  ఏదో వొక  సందర్బం లో  ఎర్ర పంచె  కట్టుకునే  సీన్  తప్పక  వుంటుంది . 


      ఈ  ఎరుపురంగు  చొక్కా  గురించి  నేను చెప్పేది  ఏముంది  మీరే చుడండి .