పండుగంటే పనులే అని భయమేస్తుంది కదండీ , ఇది కాక బోల్డన్ని పిండి వంటలు , ఎక్కడా ఖాళీ యే దొరకదు
చూసారా నీరు అస్సలు లేకుండా ఎంత నీట్ గా వచ్చేసిందో , ఇవన్ని పెద్ద ఖరీదు కూడా కాదు , ఇరవై
ముప్పై రూపాయలు లోపు దొరికి పోతాయి . ఇప్పుడు చైనా బజార్ లు ప్రతి చోటా ఉంటున్నాయి .
తప్పకుండా ప్రయత్నించండి , ఇప్పటికే వాడు తున్నట్లయితే ,మరీ మంచిది ,మీచేతులు సురక్షిత మన్న మాట .
************************************************
మరికాస్త పని త్వరగా ముగిసే వీలుంటే బావుంటుంది కదా , చాల మందికి పని మనిషిని ఇంట్లోకి రానియ్యడం
అంత ఇష్టం వుండదు . ఇక కొంత మందికి వాళ్ళు వుండే చోట పనివాళ్ళే దొరకరు . తప్పని సరిగా మనమే
చెయ్యవలసిన పనులు కొన్ని వుంటాయి . వాటిలో కొన్ని సులువుగా చేసు కోవడానికి వీలుగా ,అతి తక్కువ
ధరలో కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తాను . వీటి దయవల్ల ఎన్నిపనులు చేసుకున్నా చేతులు ఎంతో
సుకుమారం గా వుంటాయి . అందులో ముఖ్య మైనదిఈ బ్రష్. . మెత్తని కుంచెలా వుండే దీని తో కంప్యూటర్
కీబోర్డ్ శుబ్రం చేస్తారు . కాని మనం పూజ రూం ,శుభ్రం చేసుకోవచ్చు ,ముందు రోజు ఉంచిన పూలు ,
కుంకుమ ,తుడిచేసి నీట్ గా ఉంచుకోవచ్చు . ఉతికి మళ్లీ వాడు కోవచ్చు .
ఇక వంటింటి సింక్ అతిముఖ్య మైనది . సింక్ ఎంత నీట్ గా వుంటే అంత ఆరోగ్యం . అందుకే ఈ బ్రష్ .
దీనితో సింక్ కడగవచ్చు ,చేతికి తడికుడా అంట కుండా ,పని అయ్ పోతుంది . అలాగే వాష్ బేసిన్ కూడా
చేతులు కడుగు కునే వాష్ బేషిన్ కూడా ఇదే విధం గా శుబ్రం చేసుకోవచ్చు . కాని వేరు వేరు రంగుల్లో
రెండు తీసు కోవడం మర్చి పోవద్దు ఎందు కంటే , వేరు వేరు గా ,దేనికదే వాడడం ఆరోగ్యకరం .
గ్యాస్ గట్టు శుభ్రం చేసే టప్పుడు ,నీరు చేతితో కాకుండా , ఈ రబ్బరు దానితో జరిపే సెయ్యాలి ,ఒక్క చుక్క
నీరు లేకుండా ఆరి పోతుంది . చేతికి డిటర్జెంట్ తగలదు , చేతితో చేసామన్న చిరాకు వుండదు .
ముప్పై రూపాయలు లోపు దొరికి పోతాయి . ఇప్పుడు చైనా బజార్ లు ప్రతి చోటా ఉంటున్నాయి .
తప్పకుండా ప్రయత్నించండి , ఇప్పటికే వాడు తున్నట్లయితే ,మరీ మంచిది ,మీచేతులు సురక్షిత మన్న మాట .
************************************************
No comments:
Post a Comment