Total Pageviews

Saturday, October 18, 2014

డిజైన్ బ్లౌజెస్

పండుగలో  అతి ముఖ్యమైనది , షాపింగ్  , చాలామంది  మగవాళ్ళు ,అమ్మో  మేము మాత్రం  వెళ్ళం ,వాళ్ళే
చూసుకుంటారు , అంటూ  భార్యల  షాపింగ్  లో తలదుర్చరు . తప్పించు కుంటారు . మనం కొనేది తక్కువ
విండో  షాపింగ్  ఎక్కువ  అని వాళ్ళ ఉద్దేశ్యం . కాని  ఎప్పుడు రాముకాదా ,వచ్చి నప్పుడే  నాలుగు చోట్ల
చూసి  ధరలు బేరీజు  వేసుకుని కొందాము ,అని  అనుకోడం  తప్పేన ? చివరాఖరికి  వాళ్ళ జేబుకే గా మేలు
అన్నీ పక్కన  బెడితే  మనం  పండుగ బాగా దగ్గరైతే  కాని  వెరైటీ  ఉండదని   వెళ్ళం . మనం  తెచ్చినవి
లేట్  అయిందని  కుట్టడం కుదరదని , ఏవో సాకులు ,బ్రతి మాలి ఇచ్చినా పాడు  చేసి  మన మూడ్ పాడు
చేస్తారు టైలేర్స్ . మనమేమి  జీన్స్కొషర్ట్ కొ  నుక్కోము గా  ఆయనగారి లా ! పిల్లల లా  రెడీ మేడ్  వేసు
కోము , మహా ఐతే చుడిదార్ ,లేక పొతే మన  యుని వెర్సల్  డ్రెస్  '' చీర  '' .  చీర  అంటే  మరి  బ్లౌస్ ?
అందుకే  రెడీ మేడ్ . ఇప్పటికే  మన వార్డ్ రోబ్  లో  ఆరు వరకు  కొని పెట్టుకుని  వుంటాము కదా  .




ఇది టిష్యు  మీద    పింక్ నెట్ తో  లేయర్స్  లేదా పనేల్స్  గా  వర్క్ చేసింది . పట్టు , మైసూర్ సిల్క్ ,ఉప్పాడ 
సారీస్ కి  బావుంటుంది . నెక్ ఏ మాత్రం  అసబ్యం గా  లేకుండా  చాల చక్కగా ఉంది  కాంట్రాస్ట్  ఐనా ,మాచింగ్ 
అయినా  చాల  బాగుంటుంది . 



ఇది  చాల  మాములుగా  సాయంత్రాలు  బయటికి  వెళ్ళేప్పుడు  కట్టుకునే  జర్జేట్ , షిఫ్ఫాన్  శారీస్ కోసం అదుర్స్ .
 చాల  సింపుల్ గా  వుంది ,పోట్  నెక్ , గోల్డ్ బాల్స్  ఫినిషింగ్  తో  వుంటుంది .


 ఈ  టైపు  టిష్యు డాట్స్  బ్లౌస్ , పట్టు లో సింపుల్  బోర్డర్ తో వున్నవి  మనం ఇంతకు  ముందే కొన్న శారీ కి
బ్లౌస్  ఏ  ప్రాబ్లం  వున్నా  ఇది సరైన  ఎంపిక .


 ఇది గోల్డ్ కలెర్  సైడ్ ఓపెన్  ప్రిన్సెస్  కట్ బ్లౌస్  డార్క్ ప్లైన్  శారీస్  సింగల్ పల్లుకి  అదుర్స్ ..
మెగా స్లీవ్స్  తో ,ఒక శారీ  ఖరీదు లో ,వస్తుంది ,ఐదు  చీరల   కి  మేచ్  అవుతుంది .


ఇది బంజారా  వర్క్ చేసిన  డబల్  లైన్ , ప్రిన్సెస్ కట్ బ్లౌస్ , డబల్  లైన్ అంటే  రెండు వరుసలుగా  హుక్క్
ఇస్తారు , సన్నగా వున్నా,  లావు గా వున్నా మనం  ట్రైల్  రూం కి  వెళ్ళ  కుండ నే  ధైర్యం గా  కొనచ్చు .
ఇవన్ని నేను ఎప్పటినించో  వాడు తున్నవి  కాని ,వాష్ చేసే  టప్పుడు  తీసు కున్న జాగర్తల  వల్ల
ఇంత  నీట్  గా వున్నాయి .  ఈ బ్లౌస్ కి  ఐతే మిర్రర్స్ కూడా  వున్నాయి . ప్లైన్ శారీకి  చాల  బాగుంటుంది .
చేతితో  షాంపు  లో ఉతకాలి , ఎప్పుడు మిషన్ లో వెయ్య కుండా వాష్  చెయ్యాలి . లాస్ట్ కినిమ్మ చుక్కలు   వేసిన వాటర్  లో ముంచి తీసి  నీడ లో ఆర పెట్టాలి .  మైసూర్ సిల్క్ శారీ లు కూడా ఇదే విధం గా చేస్తే
డ్రై క్లీన్ కి ఇచ్చే పని తప్పుతుంది . డబ్బు  ఆదా  అవుతుంది . బట్టలు మెరుస్తూ వుంటాయి .







వీటికి  కుందన్  కొని తెచ్చి  నేనే  వర్క్  చేశాను  కుట్టే పని కూడా లే లేకుండా  గ్లూ  తో  అంటించాను . 
       ఇవన్ని కొని దగ్గర పెట్టుకుంటే సమయం వున్నపుడు మీరు కూడా చేసేసు కోవచ్చు . ఈ స్టోన్స్ కూడా 
       గొలుసు మాదిరిగా  వస్తున్నాయి ,వాటిని ఎంత మేర కావాలో  గ్లూ సాయం తో అతికిస్తూ చాలను కుంటే 
       చేత్తో  అక్కడికి తెంప [విరిచేయ ] వచ్చు . 




                 
         అన్నిటికి  మగ్గం వర్క్ చేయిస్తే ,చాల  వసూలు  చేస్తారు . కొన్ని టికీ  ఇంట్లో మనం కూడా చేస్తే
         చాల  హెప్పీ గా  వుంటుంది చేసి చుడండి , మనమే చేసు కున్నామని  అనుకుంటే  అదో తృప్తి .

                                                    **************************









                                                

No comments:

Post a Comment