Total Pageviews

Saturday, September 27, 2014

దసరా లో దర్శనీయం ...........

సెలవులు  ,పండుగరోజులు ,అందరూ  ఆటవిడుపు గా  ,ఆనందం గా  వుండి వుంటారు కదా ,అలా  సరదా గా
కుటుంబం తో  బయటకు  వెళ్ళాలని పిస్తోందా  , అబ్బా  ఎవరు డ్రై వ్  చేస్తారు  అనుకుంటున్నారా ,అందుకే 
ఉదయం  వెళ్లి  సాయంత్రం  వచ్చేసే చోటు ,అది  కూడా  పుణ్యం , పురుషార్దం  కలసి  వచ్చే లాగ దగ్గరి లోని 
ఒక  గుడికి , ఈపండుగకి  అనుసందానం గా  వుంటుంది .                                        
                                      ''  వర్గల్ సరస్వతి ''
                 ''వర్గల్  సరస్వతి '' గుడికి .   మీలో  చాల మందికి  తెలిసే వుంటుంది . తెలియని  వారి కోసం  ఒక్కసారి వివరాలు 
చెప్పాలను కుంటున్నాను . సికింద్రాబాద్  జూబిలీ బస్ స్టాప్  నుండి  45,50 కిలో మీటర్ల లోపే  వుంటుంది .
ఉదయాన్నే బయల్దేరితే ,గంటన్నర  లోపే  కరీం నగర్  రోడ్ లో  వుంటుంది . వర్గల్  అన్న పేరు తో ప్రక్క 
రోడ్ లోకి ఆహ్వానిస్తూ  ఆర్చ్  కన్పిస్తుంది . మీకు దారి  ఏ మాత్రం  అనుమానం  వున్నా  అడుగుతూ 
వెళ్ళారంటే  చెబుతారు . పల్లెటూరు వాతావరణం  వుంటుంది  సిటీ కాదుగా  చెప్తారు . గుడి బాగా ఎత్తులో 
వుంటుంది ,మీ కూడా పెద్ద వాల్లున్నట్లయితే ,మెట్ల పక్కకే  లిఫ్ట్  వుంటుంది . ఆలయ అభివృద్ధి నిమిత్తం 
నామమాత్రం  రుసుము  అంటే 5రూపాయలు  మాత్రమే వుంటుంది . అమ్మవారి కి అర్చన ,ఒకసారికి 
ఆరు కుటుంబాల చొప్పున ,కూర్చుండ బెట్టి పూజ జరిపిస్తారు . చదువు కునే పిల్లలందరి పేర్లు చెప్పవచ్చు . 
వీలయితే వారి పుస్తకాలూ పెన్ను [కొత్తవి ] తీసుకువెళ్ళండి . అమ్మవారి పాదాల  దగ్గర పెట్టి ఇస్తారు . 


                                      ''  రత్నాలయం ''

మీకు\ఇష్టమైతే  అక్కడే  భోజనం  ఏర్పాట్లు వుంటాయి . లేదంటే  మీరు తిరుగు ప్రయాణం లో  అలియాబాద్ 
క్రాస్ రోడ్స్  దగ్గర వున్నా  వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఆగవచ్చు . అక్కడ కూడా స్వామి ఎత్తులోనే వుంటారు . 
కాని మెట్లు  ఎక్కగలిగేట ట్లు  వుంటాయి . గుడి చాల ఆహ్లాదం గా  మనసు కెంతో ప్రశాంతం గా వుంటుంది . 
చుట్టూ  చాల బాగా  అభి వృద్ది చేసారు . మీరు వెంట తెచ్చు కున్న పలహారాలు వుంటే  అక్కడే తినవచ్చు . 
పిల్లలు ఆడుకోవడానికి  ,అన్ని వసతులూ  వున్నాయి . సాయంత్రం దాక అక్కడే  ఉండి ,వీలయితే  మరో 
సారి  దర్సనం చేసుకుని  తిరుగు ప్రయాణం కండి .  వచ్చే టప్పుడు ప్రసాదం ,అదేనండి  అక్కడ  వడ ,లడ్డు ,
దొరుకుతాయి  తెచ్చు కోవడం  మర్చి పోవద్దు .  మీచిన్నరులకి  అక్షరాబ్యాసం  చెయ్యాలన్న  కూడా 
వర్గల్  చక్కని  ఆలోచన . 

Tuesday, September 23, 2014

బంగారు కలలు

దసరా అనగానే  మనకు  గుర్తు  వచ్చేది  జమ్మి చెట్టు , పండుగ  రోజు ఇంటికి  ఎ అతిధి  వచ్చినా జమ్మి ఆకులు
తెచ్చిచ్చి ,  [ ఇక్కడ  జమ్మి  ఆకులని  ఆరోజు  బంగారం  గా పిలుస్తారు ] .ఈబంగారం తో మీ ఇంటిలో  బంగారం
పండాలంటారు . ఈసారి  నిజంగానే  బంగారం పండించొచ్చు  ఎలా అంటారా  .. ! ధర  తగ్గి అందుబాటులోకి
వచ్చింది  కదా !అలా అన్నమాట . ....... !

అవసరాన్ని బట్టే  తీసుకోండి సుమా , ఆయన  గారిని   వేధించకండి పట్టూ  విడుపు ఉండాలిగా 
ఆనక  మళ్లీ  నన్ననుకునేరు ... మీ వారితో  నాకు మాటొస్త ది .  ఉండనా  మరీ .............

Saturday, September 20, 2014

యంత్రుడా ........
అలా  సరదాగా   బయటికి వెళ్లి నపుడు , గుడి లోనో ,మాల్ లోనో , సినిమా  హల్లోనో ,పసి పిల్లలని  ఎత్తుకున్న
తల్లి తండ్రులను  చుస్తే  భయమేస్తుంది . పిల్లల  పువ్వు లాంటి బుగ్గలిని  తడిమి నపుడో , వాళ్ళ గుప్పిటని చేత్తో 
పట్టుకున్నపుడో ,అన్పిస్తుంది  వీళ్ళ  భవిష్యత్  ఏమిటని ..... ముందు  పక్కింటి వాళ్ళను కూడా  వరస పెట్టి 
అత్తయ్య  గారానో ,వదిన  గారనొ పిలిచేవాళ్ళం . మరి ఇప్పుడో ,ఐన వాళ్ళను కుడా ఆదరించ లేని  బిజీ  లో 
వున్నాము . నా అన్నవాళ్లు కూడా  దూరమైన పరిస్తితి . ఎవరి నైనా  ఐదు వేలు అప్పు అడిగమంటే  అంతే 
ఆరోజు తో  ఆస్నేహమో ,చుట్టరికమో  అంతటి తో సరి . ఆస్తులు  పంచుకునే  చోట తోడ పుట్టిన వాళ్ళు  కూడా 
దూరం  అవ్వాల్సిందే . అపార్ట్ మెంట్స్  వచ్చాక పక్కవాళ్ళు  ఎవరో  కూడా మనకు తెలీదు . ఒక  కనుబొమ 
ఎత్తి  వింత జంతువును  చూస్తున్నట్లు  చూసుకుంటూ వెళ్లి పోతాము . మన తరానికే  ఇలా వుంది . మరి 
ముందు ముందు ? డాలర్లు ,రూపాయలు ,హ్యాండ్ రైడ్ పోన్ లు ,ట్యాబ్ లు , లాప్ టాప్ లు, గటేడ్ కమ్యునిటీ లు 
విల్లాలు ,లగ్జరీ కార్ లు ,ఇవి మన  సంభాషణ లోకి  రాకుండా  ఒక్కరోజు మొత్తం   మనం  మాట్లాడు కోగలమా , 
మనమే  సజీవ మైనవి  వదిలేసి ,నిర్జీవ మైన  యంత్రాలతో  మమేకం అవుతున్నాము . మరి రాబోయే తరాలు 
ఎంత ప్రమాదం లో వున్నాయో  చుడండి . ఖరీదైన  , పేరుమోసిన ,కాలేజ్  లో చదువు 'కొంటేనే ' చదువు . 
విమానం లో  వెళ్లి  విదేశాల్లో  డాలర్లు సంపాదిస్తేనే  మనిషి  ,ఇక్కడ  ఉన్న వాళ్ళంతా  వట్టి  చాతకాని  వాళ్ళు . 
రూపాయలు ఎందుకు పనికి వస్తాయి ?డాలర్లు అయితేనే  గౌరవం ? .

ఇంత చెప్తున్నానా ,లోపలెక్కడో  నాపిల్లలు  అమెరికాలో సెటిలైతే
బాగుండునని  వుంది . ఎంతైనా  నేనుకూడా ''  ఇండియన్ విమెన్  ''కదా ,  ఎం  కాదా ......... 

Wednesday, September 17, 2014

అత్త గారూ .. కోడలూ ...

అత్తలంతా  శాడిస్ట్ లేనా ,ఒక్కసారి  ఆలోచించండి .
అత్తా  ఒకింటి కోడలే ,మరి కోడలిని  అత్తా నిలబడ
నివ్వదని ,మనమంతా  ఎందుకను కుంటాము .
ఆడ పిల్లకి  తండ్రి దగ్గరా ,మగపిల్లా డికి తల్లి
దగ్గరా , చేరిక  ఎక్కువ ,దాంతో ప్రతి  తల్లి
కొడుకు మీద ఎక్కువ ప్రేమ పెట్టుకుంటుంది .
కోడలు రాగానే  వాళ్ళిద్దరే  లోకంగా వుండడం
ఆమె కి  కొంచెం  ఇబ్బంది  కరమేమో , కానీ

చాల మంది  అత్తలు ,ఈడూ  జోడూ గా ,కళ్ళ ముందు  తిరుగుతున్న జంటని  చూసి ముచ్చట  పడే వాళ్ళే  ఎక్కువ . దానికి తోడూ అమ్మయిని  కాపురానికి  పంపే టపుడు ,'మీ అత్తగారితో  జాగర్త 'అంటారు అంటే
ఏమిటిఅర్ధం  ? ఆమె  జీవితాంతం  కలిసుండ బోయే  భర్త గురించి చెప్పరు ,అత్త గురించి హెచ్చరిస్తారు .
అప్పుడే ఆమెకి  కొంచెం  అవగాహన  వచ్చే స్తుంది . నేనిలాగే వుండాలి  అని నిర్ణ ఇంచు కుంటుంది .
దానికన్నా  అత్త తో కూడా  అమ్మ దగ్గర లాగే సర్దుకు పోతూ ,ఆమె ఏదన్నా  అన్నా మన అత్తే ,అనో
పెద్దావిడ  కదా అనో  ఊరుకుంటే ,ఐపోతుంది ఇంటికి పెద్దావిడ ,మనకన్నా  ఒక తరం ముందు  వచ్చినామే
రేపు  మంచి  చెడు ,చెప్పాల్సినామే  భవిష్యత్ లో  ఎన్నో విషయాల  గురించి ,కుటుంబ బాద్యతల గురించి ,
ఆవిడేగా  తెలియ పరచాలి . పుట్టింటి పద్దతులు ఇక్కడ నడవు ,ఇక్కడి పద్దతి ప్రకారమే చెయ్యాలి . అన్నీ
తన దగ్గరే తెలుసు కోవాలి . తన వాళ్ళని  వదులుకుని  ఎవరి చెయ్యి పట్టుకుని ఈ  ఇంటికి వచ్చిందో ,
ఆ  భర్తను  కన్నతల్లి . ఈఒక్క  విషయం చాలు ,ఆవిడను గౌరవించడానికి . ఇప్పుడంతా  చదువు కున్న
అమ్మాయిలు ,తెలివైన వాళ్ళు , కానీ  నిశ్చితార్దం  కాగానే ,కాబోయే భర్తను వాళ్ళు అడిగేదోక్కటే  ప్రశ్న ,
'మన ప్లాట్  ఎక్కడ తీసావు  సింగల్  బెడ్ రూమ్  ఐనా  ఓ కే ' . చిన్నపుడు అన్నం  తినిపిస్తూ అడిగో
బూచాడు అంటారు , పెద్ద అయ్యే కొద్ది  అదిగో అత్తబూచి  అనిమాత్రం చెప్పకండి .

      చాల ఇళ్ళలో ఇలా అంటుంటారు ,'ఇలాగే  పగలబడి  నవ్వుతావా ! అత్తారింట్లో  ఊరుకోరు '
'మామ గారి  ముందు  ఇలాంటి బట్టలతో  తిరిగితే  అత్తారింట్లో  నవ్వుతారు '    'ఇలాగే అక్కడ  కుడా
వండే వంటే  పళ్ళు ఊడ  కొడతది  అత్త ' .   దురదృష్ట  వశాత్తు  మన రాత్రిని  విదేశీయుల పగలుకు
తాకట్టు పెట్టాము . ప్రతి వాళ్ళు ఆడా  మగా ,తేడా  లేకుండా రాత్రిళ్ళు పని చేయక  తప్పదు . పగలు
 పడుకోక  తప్పని పరిస్తితి . అత్త  వారింట్లో కుదరదేమో , ఊళ్ళోనే విడిగా  వుంటే సరిపోతుంది ,వారానికి
ఒకసారి  వెళ్లి చూసి రావచ్చు  అనే భావం , అదే విషయం  వివరంగా మాట్లాడు కుంటే  పెద్దవాళ్ళ
''మనోభావాలు'' దెబ్బ తినకుండా  వుంటాయి .
నిజంగా  అత్తగారు  అంత  భయంకర మైనదా ....
         ఈమధ్యే పెళ్లి చేసుకున్న  ఆఫియా  వుద్యోగం మానేస్తాను  అంటే  అత్తగారు 'వద్దమ్మా రోజంతా
ఎదురెదురుగా  కుర్చుని  పోట్లాటలు తప్ప  ఏముంది  నాకు కూరలు తరిగిచ్చి వెళితే చాలు అందరికి
లంచ్ బాక్స్ లు సర్దేస్తాను ' అందట  ఆవిడకి  నిజంగా దణ్ణం పెట్టాలి .  ఇందు మతి  అత్తగారు 'ఇందు
అని  ముద్దుగా పిలుస్తుంది . ''పిల్లలిని  నేను చూసుకుంటాను మీ వూరు  వెళ్లి  చీరలు తెచ్చి నీ
బ్యుటి పార్లర్ లో  పెట్టిచూడు నాకు ఎందుకో  బాగా వె ల్తాయని  అనిపిస్తోంది''  . ఈమాత్రం అండగా
వుంటే చాలదూ , ఆడవాళ్లు కూడా చక్రాలు తిప్పేస్తారు . ఇద్దరి మధ్య  నలిగి పోవాల్సిన  ఆ కొడుకు
వత్తిడి తగ్గి ఎన్నో విజయాలు సాధిస్తాడు .

          ఇంత చెప్పి  మా అత్తగారి గురించి చెప్పక పొతే  ఎలా ? మా అత్తగారు  అమాయక మైన ,
ముక్కు సూటి మనిషి , ఏ దుంటే అది అనేస్తారు ,మనసులో ఏది దాచుకోలేరు . చాలామందికి
ఇబ్బంది ఐనా ,నాకలవాటు  కాబట్టి  కోపం ఎపుడు రాలేదు . అందులోను మేనరికం  కనుక
నాకు పిలుపుకే కాదు  మనసుకూ    తను  ''అత్తమ్మ ''.
   

Sunday, September 14, 2014

మన హీరొయిన్ లకి గౌన్లు లేవా ?...నిన్న పోన్ లోకి  '  కిట్ కాట్ ' రింగ్  టోన్ కోసం వెదికితే ,ఇది దొరికింది .
ఇంతకీ  త్రిషకి ఎన్నేళ్ళు?   ఏడ్  1993లో వచ్చింది మరి ............సమంతా  అత్తారింటికి  దారేది లో , గౌను  బావుంది కదా ............శృతి  హాసన్  రేస్ గుర్రం లో  మళ్ళీ అదే గౌను ...... ఏమిటో .......

మన హీరొఇన్స్ కి  గౌనులు  లేవా , బుల్లి తెర లో వాడినవే వాడేరంటే
అదివేరు ,  లో బడ్జెట్  కనుక  మరి కోట్ల రూపాయల పారితోషికం  తీసుకుంటూ
ఇదేమి ఖర్మమో పాపం , బట్టలకి  ఎలాగూ తక్కువ బడ్జెట్ మీటరు  గుడ్డేగా
వాడతారు  అందులో మళ్ళీ పొదుపు  కానివ్వండి  చూసే వాళ్ళు  వి[ ఐ ]పి లైతే ఇంతే మరి .........

Wednesday, September 10, 2014

అడవిలో అందాలు .. 2

(మా నాన్న గారు కుమార్ .)

ఒకసారి  ఎవరో వేటకు [హంటింగ్ ] వచ్చి  పులిని  చంపేసారు . అది పులి  అని వాళ్ళకు  తెలీదు  వేరే ఏదో జంతువని  షూట్  చేసారు , దాని అరుపులకు  భయపడి  పారి పోయారు ,నగరం లో పోలిస్  వ్యవస్థ  లాంటిదే  అడవిలో ఫారెస్ట్
వుద్యోగం ,పులిని టౌన్  కి తీసుకు వెళ్తూ , నాకు చూపిద్దామని  లారి లో ఇంటికి  తీసుకు వచ్చారు . చాల పెద్దగా
దాదాపు  లారి వెనుక  భాగమంతా వుంది . నిర్జీవంగా పడి  వున్నా  దాని రాజసానికి  తిరుగు లేదు . అలా చుసిన
భయమేసిందంటే , సజీవంగా  చుస్తే  వుంటది మరీ ...  నేను చూసేక  లారి టౌన్ కి వెళ్ళింది ,అక్కడ చర్మం ,గోళ్ళు ,
వేరు చేయించి ,లక్కీ బోన్  అని వుంటుంది  దాన్ని  ముఖ్యమైన  వాళ్ళకి  ఇస్తారు . పులిచమురు  ఐతే బాటిల్స్  లో
నింపి  కీళ్ళ నొప్పులు  వున్నా వాళ్ళకి  ఇస్తారు . నొప్పులకి  మంచి మందట  ఆ చమురు .


ఇంటి  ముందంతా చెట్లు  ఉండేవి ,అందులో ఒకటి  కమలా ఫలమేమో  అన్నట్లుగా  వుండేది  అది '' ముషి ణి ''
చెట్టు  ఆపండ్లు ఆరెంజ్  రంగులో  చాల బాగుండేవి ,కాని తింటే  చనిపోతారట ,రోజు కొన్నైనా  రాలి పడేవి ముందే
చేప్పడం  వల్ల అవి ముట్టుకునే వాళ్ళం కాదు . ఇంకా కుంకుడు ,శీకాయ ,చింత , చాల  రకాలుచెట్లు   వాటి నించి
వచ్చే  గాలి  ఎంతో మంచిదట  వాటి మీంచి  వచ్చే ' చేదు ' వాసన కూడా  గుండె నిండా పీల్చు కోవాలని పించేది .
పట్న  వాసంలో  టన్ను ల కొద్ది  దుమ్ము పీల్చే  మనకు  ,ఔ షదాల  వాసనేమి నచ్చుతుంది  అంటారా ....

కొంతమంది  గుంపుగా బయలు దేరి రబ్బరు చెట్లు  వుంటాయి  వాటికీ గీత [గాట్లు ]పెట్టుకుంటూ  వెళ్తారు .
నంబర్లు  కూడా వేస్తారు  చెట్టుకి . నాలుగు రోజులాగి  ఈసారి మళ్లీ వెళ్తారు . నాటు పెట్టినచోట పాలలా జిగురు
వస్తుంది ,అది ఎండి పోయి  గట్టిగా అవుతుంది . దాన్ని సేకరించి తీసుకు వచ్చి గిరిజన్  కార్పో రేషన్ కేజీ ఇంతని
ధర వుంటుంది  అక్కడ అమ్ముతారు . ఇక వారాంతపు  మేళ ,అంటే సంత  జరుగుతుంది . అదింకా బాగుంటుంది .
రంగు రంగుల  చీరెలు  కొత్త విధం గా  కట్టుకుని ,మనము  ఎప్పుడూ చూసి కూడా ఉండము  అలంటి  విధి ,
విధాలైన పూలల్లు కుని ,కొప్పున పెట్టుకుని ,రంగు రంగుల పూసల పేరులు  మేడలో వేసుకుని ,గిరిజన స్త్రీలు
అందంగా ముస్తాబయ్యి ,వారికీ తోచినవి ,పండించినవి ,అందుబాటులో  వున్నవి, తీసుకొచ్చి  అమ్మకానికి
పెడతారు . కూడా మంచి నీళ్ళు తెచ్చు కుంటారు . ఎలాగంటే ,ఆనప కాయ  బాగా ముదిరినది  తీసుకుని ,
ఎండ పెట్టి లోపల శుబ్రం చేసి ,నీరు నింపి ,తాడు తో కట్టి  వెంట తెచ్చు కుంటారు . అవి మన వాటర్ బాటిల్స్
కన్నా  అందం గా ,వంపుగా  వుంటాయి . దళారీల బాధ  వాళ్ళకి ఎక్కువే , వాళ్ళు ఏదన్నా  వస్తువు యాభై
అంటే ,దళారీలు  పది  తీసెయ్యి  అని బేరం  ఆడుతారు . గిరిజనులు 'నానియ్యాను ' అంటారు ,వీళ్లేమో  ఇదు
తీసెయ్ ,అంటారు ,వాళ్ళు సరే అంటే  చిల్లర నోట్లు  లెక్క పెట్టి ,పది తగ్గించి  ఇచ్చేస్తారు . వాళ్ళకి  అంతగా లెక్క
తెలీదు కనుక తీసు కుంటారు . ఒకవేళ వాళ్ళు తిరగేసి అడిగినా ,ఒక్కోనోటు వెనకకి  ముందుకి లెక్క పెట్టి
తమాషా  చేసి  వాళ్ళని ఒప్పించి ఇచ్చేస్తారట . మా రెండో అన్నయ్య ఐతే  బాగా చెప్తాడు , సంతను  మన
కళ్ళముందు  ఆవిష్కరిస్తాడు , భాషతోను ,యాసతోనూ .  వాళ్ళు ఈడబ్బు తీసుకుని ,వారికీ దొరకనివి
నూనె ,ఉప్పు  కారం  లాంటివి కొనుక్కుని ,ఇళ్ళకు వెళ్తారు . వాళ్ళు అమ్మే వాటిల్లో , తేగలు ,బుర్ర గుంజూ ,
నాటు కోళ్ళు ,పిట్టలు [మాంసం కోసం] నేరేడు ,, రేగు ..  సీతా ఫలాలు .  ఎక్కువగా  డోర్ మేట్స్  కోసం
వాడే పీచు , వంటకి ఉపయోగించే కట్టెల మోపులు ఇవే వుంటాయి .  బేరంలో  మాత్రం  బాగా  మోసపోతారు .


(మా తాతగారు సూర్యనారాయణ . అయన అటవీ శాకలోనే ఉన్నత ఉద్యొగo  )

 పనస  పండు  ఏమి చేస్తారో  తెలుసా ,ఏటికి  తీస్కు వెల్లి ,పారే  నీళ్ళలో  వేసి కాళ్ళతో మెత్తగా తొక్కేస్తారు .
తొనలన్ని వెళ్ళిపోయి ,గింజలు మాత్రం మిగులు తాయి . అవి మాత్రమే తీసుకుని  వండు కుంటారు .
కొండ మామిడి  పళ్ళు ఎంత రుచో .. వాళ్ళు పళ్ళు తిని  టెంకలు  సేకరించి ఉంచు కుంటారు . వాటితో
పులుసు చేసుకుంటారు . జీడి  ఉన్నప్పుడైతే  జీడి  తో జావ కాచు కుని తాగుతారు . అది ఆరోగ్యానికి
అంత మంచిది కాదు ,అదివాళ్ళకి తెలీక జబ్బుపడతారు . పట్టు పురుగుల పరిశ్రమ  వుండేది ,
 [సిరికల్చర్ ] పట్టు పురుగులను గూళ్ళ తో సేకరించి ,మరుగుతున్న  నీళ్ళలో వేస్తారు . అవి జిగురు
లాంటి పదార్ధాన్ని  స్రవిస్తాయి . దాన్నిదారం లా చుట్టుకుంటూ వెళ్తారు , అవేపట్టు దారాలు  ,వాటికే
రంగులవి  అద్ది  పట్టుచీరెలు  నేస్తారు . వాటిషేల్స్ తో దండలు చేసి ,ఇళ్ళలో ఫోటో లకి  అలంకరించడానికి
అమ్ముతారు  చాల బాగుంటాయి . ఎన్ని పట్టు పురుగులు చంపితే  అంత  పట్టు దారం . అడవి లో
రోడ్  వుంటుంది  కాని  విద్యుత్ లేక  లైట్స్  వుండవు . బండి కండి షన్ లో వుంటే  సరే ,మద్యలో
లైట్స్  లేక పోయినా చాల ఇబ్బంది . ఒకసారి  బుల్లెట్ కి  అడ్డం గా  రాత్రి పూట ,పదునైన  కొమ్ములతో
అడవి దున్న  నిలబడి  వుందట ,లైటు పడి దాని కళ్ళు  టార్చ్ లా మెరుస్తున్నయిట ,భయం  తో
ఆగి పోతుందో ,లేక  నాన్నగారే  ఆపెసారో  తెలియదట ,ఇంజన్ ఆగి పోతుంది . పులి వచ్చినా  అంతే
లైటు  ఆపేయాలి . శబ్దానికి  రెచ్చి పోతుంద ని  ఆపేసి కదల కుండా  వుండి పోతారు . అది వెళ్లి పోతుంది .
ఒకసారి  ఎలుగు బంటి ఒకతన్ని గాయ పరచింది , కూడా వున్న వ్యక్తీ అగ్గిపుల్ల వెలిగించి  చూపిస్తే
భయం తో పారి పోయిందట , వళ్ళంతా  వెంట్రుకలే కదా  ,నిప్పు చుస్తే  వళ్ళు కాలి పోతుందని దాని
భయం . రెండు  పిల్లలిని  పెట్టి పులి చని పొతే ,గార్డు కి దొరికాయి  తీసుకు వచ్చి ఫై ఆఫీసర్ కి ఇచ్చాడు .
అయన  చైన్ వేసి ఇంట్లో తిప్పెవారట ,ముద్దుగా కుక్క పిల్లలిని పెంచి నట్లు  పెంచారు ,అయన కూడా
వచ్చి ఎక్కడ కూర్చుంటే  అక్కడే కుర్చునేవట . పెద్దవయ్యే కొద్ది అందరూ భయ పడుతుంటే  ''జూ ''
కి ఇచ్చే సారని  చెప్తారు . 

మేము  కూడా కొన్ని  జంతువులు పెంచాము ,వాటి గురించి ,మా ప్రయాణం లో
చుసిన పులి గురించి తర్వాత ఎప్పుడన్నా  చెప్తాను . 

Thursday, September 4, 2014

అడవిలో అందాలు ...


చుట్టూ  కొండలే  సాయంత్రం  అయ్యే సరికి  అవికాస్తా  తగలబడుతూ  ఉండేవి . కొండల  మీద  ఉన్న చెట్లు అంటుకు
పోయి  అంతా  మంటలే  ఎటు చూసినా  గాలికి ఎగసి పడుతూ  మంటలే ..... మనం  వచ్చిన దారైనా  వుందా తిరిగి
వెళ్లి పోవడానికి ? ఇక్కడి నించి ఎప్పుడు  వెళ్లి పోతాము  అని  భయంగా వుండేది . నా చిన్న తనం లో అడవిలో
కాపురం , నాన్నగారి ఉద్యోగ రీత్యా  అడవిలో వుండే  వాళ్ళం . ఇంటి  చుట్టూ మొక్కలే , గడ్డే ,చెట్లే  చుట్టూ పచ్చని
అందాలే  , ఐతే  ఇవన్నీ వుంటే పాములు  రావా ! అంటే  వస్తాయి  అందుకే ,నెమళ్ళు  పెంచే  వాళ్ళం . వాటిఅరుపు
లకి  ,పాములు చుట్టు  పక్కలకి రావు ,నెమళ్ళ  ముక్కులు వాడిగా  వుంటాయి ,వాటితో  కళ్ళు పొడిచేస్తాయని
వాటి భయం . అందుకే రావు .  కాలక్షేపాని కి  కుందేళ్ళు  పెంచే వాళ్ళం , వాటి కళ్ళు  భలే మెరుస్తూ ,గుండ్రం గా
వుంటాయి . పావురాళ్ళ కోసం , కుందేళ్ళ  కోసం తాయారు చేసే  వాటి ఇల్లు [గూళ్ళు ] చాల  బాగుంటాయి .


కుందేళ్ళ ను  పట్టు  కోవడం  చాల  కష్టమట , నిమిషాల్లో పొదల్లోకి  వెళ్లి పోతాయి . కానీ  వాటికీ స్వాభి మానం
ఎక్కువట ,ఎవరన్నా అవి వెళ్లి న పోదాచుట్టు  గీత గీస్తే ,అవి ఆ గీత దాట వట ,అంతే  కాదు ,వర్షం  నీరు ,మంచు
బిందువులు ,ఆకుల మీద వున్నవే తప్పా , ఎవరు పోసిన  నీరు  తాగవు . ఈబల హీనత  ఆధారంగా ,వేటగాళ్ళు
పొద చుట్టూ  గీత  గీసి  వాటిని పట్టేసు  కుంటారు . ఇక  అత్తి పత్తి  [టచ్  మీ  నాట్ ] మొక్కలు ముట్టుకుంటే
ముడుచు కుంటూ ,ఎంతసేపు  ఆడుకున్నా  విసుగు రాదు . ఎర్రని  మెత్తని  ముఖ్ మల్  బట్టలాంటి  మృదువైన
ఆరుద్ర పురుగులు ,అవి మెల్లగా  నడుస్తూ  అలికిడికి  ముడుచుకు పోతాయి . అప్పుడవి  ఎర్రని పగడా ల్లా
వుంటాయి . పేరు కె  పురుగులు ,  వాటి అందం చుస్తే ఇంట్లో దాచి పెట్టు కోవాలని పిస్తుంది .


కాఫీ  తోటలు  ఉండేవి  దగ్గరలో , వాటి తో కలిపి  కో కో  పంట కూడా ,కో  కో  కాయలు తింటుంటే ,తియ్యని వగరు
రుచి ,బావుంటాయి . వెదురు మొక్కలు , వాటిని నమ్ముకుని  పాకే  తమల పాకు  తీగెలు ,మిరియం ,ఎంత
సేపు తిరిగి నా ,విసుగు రాని  వైనం .  కాఫీ  తోట లోకి  పులి వస్తుందని చెప్తారు . రాత్రి ఐతే  నక్కల అరుపులు
ఇంకా ఏవో పేరు తెలీని  జంతువుల అరుపుల తో , భయంగా వుండేది . తెల్లవారిండా  చక్కని ఉషోదయం ,
నిలువెత్తు  చెట్లని చీల్చు కుని  వచ్చే వెలుగు రేఖలు , రాత్రి కానీ వర్షం పడితే  మొక్కలు చెట్లు  అన్నీ కడుక్కు
పోయి పచ్చగా మెరిసి పోతూ  అద్బుత మైన అడవి , సమత్సరా నికి  ఒక సారి అన్నా  వెళ్లి మూడు రోజులు
వుంటే చాలు ,ఏడాదికి  సరిపడా  ఉత్సాహం తో రావచ్చు . కోతులు ఉండేవి  కాని వాటి తో ఇబ్బంది లేదు .
పులి  వస్తే ముందు  వాటికే తెలుస్తుంది ,పులినించి  వచ్చే  చెడ్డ  వాసన రెండు మైళ్ళు  వస్తుందట  ఆ
వాసనకి  కోతులు  పారి పోతాయని చెప్తారు  అదే సూచన , ఒకసారి పోన్  వైర్లు  బాగు చేస్తూ  పోల్  మీద
వున్న వ్యక్తీ  కింద వున్న పులిని చూసి ,బెదరి  పోల్ మీదనే  వుంది పోయాడు . ఫోన్ చేసి  ఎవరికైనా
చేబ్దామన్నా , భయం తో  పోన్ జారి పోయింది . పులి మాటు వేసి కూర్చుంది . తెల్ల వారే వరకు అలాగే
నరకం  చూసాడు . వెలుగు వచ్చాక పులి వెళ్లి పోయింది . అప్పుడు పోల్ దిగి లారి పట్టుకుని ఊర్లోకి వచ్చాడు .పారే సెలయేళ్ళు ,నీళ్ళు తాగడానికి  వచ్చే జింకలు , యేరు  దగ్గరకి  స్నానానికి  వెళ్ళే వాళ్ళం అదీ ఎవరన్నా
చుట్టాలు  వచ్చినపుడే , కాని చాల జాగ్రత్తగా  వుండాలి . పైన కొండల్లో ఎక్కడ వర్షం కురిసినా ఒక్కసారిగా
వాగులు పొంగి  ఉవ్వెత్తున  నీరు పెద్ద శబ్దం తో వచ్చి పడుతుంది . అడవిలో మంచి నీళ్ళు  ఎలాగో తెలుసా
యేటి వడ్డున తడి ఇసుకలో ,చేతులతో తవ్వి  కొంత సేపు వేచి చూడాలి . అప్పుడు కొంత నీరు వూరు తుంది .
చిన్న గిన్నె తీసుకుని ,ఆనీరు  తీసి బిందె కు పలుచని వస్త్రం  కట్టి  అందులో వేసు కోవాలి . ఆనీటిని కాచి
చల్లార్చి  తాగాలి . వాడు కోవడానికి తెచ్చే  నీరు కూడా యేటి లోనిదే , కావిడి కట్టుకుని  తెస్తారు . వర్షా
కాలం బురద మాయం గా  ఎర్రని  నీరు వచ్చేది . ఎలా వాడతాం ,అందుకే పెద్ద కడవలలో  నీరు  నింపి
అందులో ''పటిక ''దంచి వేస్తే ,కొంత సమయానికి  నీరు పైకి ,మురికి కిందకి  అవుతుంది . అప్పుడు
ఉపయోగించు కోవాలి . ఇంట్లోనే  గార్డ్ ,వాచెర్స్  వుండే వారు ,ఏమి కావాలన్నా  వండి పెట్టేవారు . ఎక్కడికి వెళ్ళాలన్నా  జీప్ తెచ్చి తీసుకెళ్ళేవారు . నాన్న గారికి బుల్లెట్ వుండేది ,అడవి లో ఆ నిశ్శబ్దం  లో అయన
వస్తుంటే  రెండు మైళ్ళ  దూరం నించి ఆ శబ్దం  వినపడటం  మొదలయ్యేది . వెన్నెల రాత్రుల్లో తప్పకుండా
బయట  చెక్కలతో మంటవేసి ,చుట్టూ కూచునే వాళ్ళం ,ఒక గార్డ్  తందూరి  బాగా చేసేవాడు . అప్పుడు
నాకు తెలీదు అది తందూరి  అని . నాన్న అది చీల్చి  అందరికి  పెట్టే వారు .

ఇంకా  వుంది ......