Total Pageviews

Thursday, August 27, 2015

చెక్కిన అందాలు .. 3
                                                                     శృతి హాసన్                                                                   అనుష్క శర్మ                                                                   శిల్పా శెట్టి

                                                                      కత్రినా కైఫ్                                                                 ప్రియాంక చోప్రా

ఇషా డీయోల్ 

ఐశ్వర్య రాయ్ 


                                                                అల్లు అర్జున్                                                                                                                                       
                                   ***************************************************

Thursday, August 20, 2015

పిల్లలిని కొడతారా ??!!!!!!!


పిల్లలిని  కొడతారా ! అని ఆశ్చర్య  పోయాను ఆమెని చూసి , వెనకింటి  ఆమె  వాళ్ళ అమ్మాయిని  చెంపలు
వాయిస్తోంది ,అదికూడా  వాకిట్లో ,అందులోనూ  అమ్మాయి చిన్నది కాదు ,ఇంటరు  చదివే అమ్మాయి .
తల్లికూతురు  ఒకేలా వుంటారు బొద్దుగా ,అక్కాచెల్లెళ్ళ  లా వుంటారు  మోకాళ్ళ  వరకూ వుండే  జీన్స్ లూస్
గా  వుండే '' పేద్ద టాప్ '' వేరే డ్రెస్ లో  చూడలేదు  నేను వాళ్ళని . ఎదిగిన పిల్లని  కొట్టడమే  జీర్ణించు  కోలేదు .
నెట్టేసి గేటు  వేసేసి  లోపలి వెళ్ళిపోయింది . మేడమీద నించున్న  నాకు  ఒకటే కంగారు ,ఎటన్నా వేల్లిపోతుందేమో
అని  కోపం లో ఏమన్నా  చేసుకుంటే  ఏమిటి  దారి ? అసలే ఇవాళ రేపు  పిల్లలు చాలా  సున్నితం గా
 వుంటున్నారు . అమ్మకోడితే ,పెద్దవాళ్ళు చేరతీసేవాళ్ళు ,ఇప్పుడె వరున్నారు స్నేహితులతో ఇలాంటివి చెప్పడం
వాళ్ళ కి  అవమానం . వాళ్ళు అవమానం గా  భావించేలా  మనం ఉండ చ్చా ?! విదేశాల్లో  ఐతే  ముందు గ
ఒక ఫోన్  నెంబర్  పిల్లలికి నేర్పిస్తారు . అమ్మ నాన్న  కొడితే కాల్  చెయ్యమని .కొన్ని ఇళ్ళలో అమ్మానాన్న లే
కాదు ఐన వాళ్ళు  కూడా  కొట్టేస్తుంటారు  పిల్లల్ని .  టీచర్లు  బంధువులు  ఎవరన్నసరే  పిల్లల మీద  చెయ్యి
ఎత్తడానికి  భయపడేలా  చట్టం  వస్తే  బావుండును .

వాళ్ళకి ఏదీ  చెప్పి నేర్పించలేము ,మనం ఎలావుంటే ,వాళ్ళు అలా  వుంటారు . ఇంకా చెప్పాలంటే  మనల్ని
అనుకరిస్తారు  ఎంత అంటే చాలా ...  వాళ్ళముందు ఒకలా  వెనుక ఒకలా  మనం నటించడం  మొదలు పెడితే
మనం  'అపరిచితు'[ డు ]లమైపోతాము . మీరెప్పుడూ  కొట్టలేదా  అంటే  కొట్టాను  చిన్న క్లాస్  చదివే టపుడు
చిన్న చిన్న  దెబ్బలు పడేవి , తొడపాసం  పెట్టేదాన్ని [దీనినే  కొన్నిచోట్ల  సొంటి పిక్కలందురు] అదికూడా మా వజ్రానికి మాత్రమే ,పాప కిప్పటివరకు  అవసరం రాలేదు ,రాలేదు అనేకంటే  తనే రానివ్వలేదు అంటే సరిపోతుంది .
వాళ్ళు స్కూల్  నించి రాగానే  తినడానికి పెట్టి వాళ్ళు చెప్పే దంతా  వింటాను అస్సలు విసుక్కోను ,విసుక్కుంటే
మళ్లీ  జీవితం లో మనతో ఏమి చెప్పరు . ఇలా ఎందుకు చేసావు ,అలా చేసుండాల్సింది ,అంటూ మధ్యలో
సలహాలిస్తూ వుంటాను . అంత  వరకే , తర్వాత ఒక బుక్ తీసుకుని కుచుంటాను  చదువు కుంటూ .. వాళ్లకి
అర్ధమై పోతుంది .చదువుకునే టైం అని ,నేను చెప్పకుండానే  బుక్స్ తెచ్చుకుని  వర్క్స్ చేసేసు కుంటారు .

పిల్లలిని ఎప్పుడూ  ఐన వాళ్ళ దగ్గర వుంచి  చదివించ కూడదు . మన దగ్గరే వుంచుకోవాలి ఎంత ఇద్దరూ వుద్యోగస్తులైన  సరే . వీలైనంత ఎక్కువ టైం  కేటాయించాలి  , డబ్బు కాదు ,చాలామంది  ఎక్కువసేపు
ఒంటరి  గా  వుంటున్నారు కదా అని  డబ్బిచ్చేస్తూ  వుంటారు . ఏదో ఒకటి కొని తింటారు  అని ,కాని
చెడు అలవాట్లకి ,మంచి అలవాట్లకి  మధ్య దూరం చాల తక్కువ . ఒకవేళ డబ్బిచ్చినా  ఆరా  తీస్తున్నట్లు
కాక సహజం గా  అడుగుతున్నట్లు  అడిగి  తెలుసు కోవాలి . వాళ్ళ స్నేహితులందరి తో  మనకి కూడా
పరిచయం వుండడం ముఖ్యం . చిన్న చిన్న పార్టీలు  పెట్టి  వచ్చిన వాళ్ళను  గమనిస్తుండాలి .

ఇక హాస్టల్  లో పిల్లలను ఉంచడానికి  నేను పూర్తి  వ్యతిరేకిని .  అక్కడ వుంచడం వల్ల  వీళ్ళను మించిన
వాళ్ళు పరిచయం  అవుతారు ,చాలా మారి పోతారు . మానసికంగా  పెద్దవాళ్ళకు దూరం అవుతారు .
మేం  ఒంటరిగా ఉంటున్నాం  పెద్దవాళ్ళ మయ్యాము  అనే భావం  వచ్చేస్తుంది . 24 గంటలు  చదివి
రాంకులు  కొట్టడం , ఉద్యోగాలు  పట్టడమే కాదు ,తల్లితద్రులు ,కుటుంబం , విలువలు ఇలాంటివన్నీ
ముఖ్యమే కదా ! అంతే  కాదు బాల్యం ,ఆటపాటలకు దూరం గా  పెరిగితే ,వాళ్ళ  జ్ఞాపకాల్లో  ఏమి
మిగులుతుంది . పిల్లలు పిల్లలే  వాళ్ళు రేపటి మన డబ్బు మెషీన్లు  కారు . ఆట పాటలకీ  దూరంగా
చీకటి గదుల్లో బంధించి చదివించే హక్కు మనకు లేదు . బాగా బ్రతకడమే కాదు బ్రతికుండడం  కూడా
ముఖ్యమేకదా !

నేను  మాత్రం  వాళ్ళని అది చెయ్యి  ,  ఇది చెయ్యకు , అని ఎప్పుడూ  అధికారం చెయ్యను . ఏది చేసినా
దానివల్ల  వచ్చే  మంచి చెడు మాత్రం వివరం గా  చెప్పేస్తాను . నిర్ణయాధికారం  వాళ్ళదే ,పిల్లలు  నా
బానిసలు  కాదు ,నా  ఫ్రెండ్స్  అంతే ........

                                           ***********************************

Thursday, August 13, 2015

పూల సొగసులు ....ఈ  చిట్టి తల్లులు  మీ  అందరికి  కనిపించాలని  ఎప్పటి  నుంచో  ఎదురు  చూస్తూ  వున్నాయి . నాకున్న చిన్ని
ఇంటికి  బుల్లి  తోట వుంది ,అందులోనివే  ఈ అందాలన్నీ ,మీకు  నచ్చుతయన్న  ఆశ  తో ...........

*******************************************************************

Thursday, August 6, 2015

వయసంటే ఎందుకో అంత భయం ?

                                 


                                     చాల మందికి వయసు  పెరుగుతోంది  అంటే  తలనెరుస్తుంది ,ఇప్పుడు కాలేజ్  పిల్లలకి  కూడా  కాలుష్యం వల్ల 
మెరిసి పోతోంది ,అదివేరే సంగతి అనుకోండి . ఇక మన విషయానికి వస్తే జుట్టు మెరవగానే  రంగు వేసుకోడం ,
మనం మాములుగా చూసే విషయం ,కాని  ఇప్పుడు  వేలకు వేలు పోసి ,పేస్ లిఫ్టింగ్ అని ,బొటక్స్ ఇంజక్షన్స్ 
తీసుకోడం అని ,మన బ్లడ్ తీసి మళ్లీ  మనకే మొహం లో ఎక్కిస్తారట ,అందువల్ల ముడతలు కనపడవట . 
ఇవన్నీ సినిమా వాళ్ళు  చేస్తే ఓకే ,కాని ఇప్పుడు  మాములు జనాలు కూడా ఇవన్ని చేయించుకుంటున్నారు . 
ఇంట్లో పెద్దవాళ్ళకు  కళ్ళజోడు వచ్చినప్పుడు ,పంచాంగం చూసేటప్పుడో ,బియ్యం ఏరే ట ప్పుడో  పెట్టుకుంటే ,
చూస్తే  ముచ్చటేసేది  మనమెప్పుడు  పెద్దవాళ్ల మౌతమా  అన్పించేలా  కళ్ళకి ఇంపుగా వుండే వారు . అదే 
ఇప్పుడైతే అదొక నేరం లా వుంది . వయసు పెరిగితే హుందాగా ఆ విషయం  అంగీకరిస్తేనే బావుంటుందేమో !
పాత నీరు  కొట్టుకు  పొతే నే గా  ,కొత్తనీరు ప్రవహించేది ? పెద్దావిడ  ప్యాంటు షర్టు  వేసుకుంటే ఏమి బావుంటుంది 
కాని నేనుచూ సాను . చూడ చక్కగా వున్నారు ఆవిడ ,కాని ... అదే ఒకబెంగాలి కాటన్  శారీ వేసుకుని చిన్న 
వేలు ముడి వేసుకుంటే  దణ్ణం పెట్టకుండా ముందుకు కదలలేము ,కాని ఆమె సౌకర్యం ఆమెది కదా!!!!!!!!!!!!

                                                                                                                                                                


అందరం కూర్చుని  కబుర్లు చెప్పుకునే వేళలో  మా నాన్న ,అమ్మను బాగా ఆడించేవారు ఏదో ఒక విధం గా
వయసు ప్రసక్తి  తెచ్చి '' మీ ఇంటికి బట్టలు తెచ్చి అమ్ముతాడే  మీ సూర్రావు  అన్నయ్య , నీ ఈడువాడే  కదూ'' 
అంటే చాలు  అమ్మకి  తిక్క రేగేది '' మీరు మరీనూ ,  మేము బడికి వెళ్ళే రోజుల్లోనే ..  అతనికి పెళ్లి అయ్యింది . 
ఇప్పటి లాగా  '''ఆంటి '' అంకుల్ '' అని పిలుపులు  అప్పుడు లేవు కనుక  అన్నయ్య అంటున్నాము , 
అతనే నాటివాడు ?'' అనేది  నవ్వులతో ఇల్లు హోరేత్తేది . నాన్న వదలకుండా  మరి మీ చుట్టాలతను వున్నాడు 
చూడు  బాబు రావు ,అతను  నువ్వు ఒక తోటి వాళ్ళేనా  ,అని మళ్లీ  ఉడికించే వారు . బావుంది అతను  మా 
 నాన్న  దగ్గర  పన్చేస్తాడు  . మాకన్నా చాల పెద్దోడు ''అతనే  నాటివాడు 'అనేది .  అందరూ  నవ్వుతుంటే నాకు మాత్రం ' వయసంటే ఎందుకో  అంత భయం ' పెద్ద ఐతే  నేను ఇలాగేనా' అనుకునే దాన్ని . తర్వాత ఆ విషయం  మర్చిపోయినా   ఈమధ్య  బాగా గుర్తు  వస్తోంది  .

షాపింగ్  కని  కోఠీ  వెళ్ళాము , తీసుకు వెళ్లి  తను మాత్రం కార్ లో  కూర్చుని  మీరెళ్ళి వచ్చేయండి  అంటారు . 
సరే అని  కోఠీ  లో ప్రవేసిస్తాను  ఒక ఇరుకు మార్గం లో  అటూ  ఇటూ  వున్న దుకాణాల మధ్య , బండి మీద ,
అందం గ అమర్చిన చెక్కల మీద  చిట్టి పొట్టి బట్టలు ప్లాస్టిక్ సామాలు ,ఇంట్లోకి పనికివచ్చే  కాఫీ  ఫిల్టర్ లు 
ప్లాస్టిక్ పువ్వులు, బాగ్ లు ,క్లిప్పులు , బిందీలు , కప్పు లు, దుప్పట్లు దివాన్ కవర్లు ,ఏమి ఉండవని అడగండి . 
ఊరికే వెళ్ళినా  కూడా కొనాల్సినవి  చాలా  కన్పిస్తాయి . చిన్న సైజ్  ఎగ్జిబి షన్  లాంటిది . ఇదికాక  వచ్చే పోయే 
ఆటో లు  బైక్  లు  , జన సందోహాన్ని చేదించు  కుంటూ  వెళ్తూ వస్తు వుంటాయి . అంత చిన్న దారి లో ఇవన్ని 
ఎందుకు  నడవనిస్తారో తెలీదు . ఏమాత్రం అప్రమత్తం గా  లేక పోయినా కాళ్ళు పచ్చడే ,సరే ఇక  విషయానికి  వస్తే 
ఐస్ క్రీమ్  కొనివ్వగానే తినేసి ,మా అమ్మాయి  నా చెయ్యి విడిపించుకుని  డాడి  దగ్గరుంటా  అంటూ జారుకుంది . 
ఎడాపెడా  పనికొచ్చేవి పనికి రానివి కొనేసి ,''ఏమిటో ..  వీటికోసం  ఇంతదూరమోస్తామా  మళ్లీ , పెట్రోలు దండుగ 
కదూ!  అనుకుని నేను చేసిన మంచి పనికి నా భుజాలు నేనే చరుచుకుని  ఆనందం గా మోసుకొచ్చి కార్  లో 
పెడుతుంటే  హాయిగా దర్జాగా సీట్ లో పడుకుని  పాటలు వింటూ ,నన్నుచూసి  లేస్తూ , బాగ్ లు  వెనకాల పెట్టు అంటూ సలహా ఒకటి ..' నీళ్ళలోనే  వుంటారు కాని  తడి అంటదు  అదృష్ట వంతులు  అనుకుంటూ ,అన్ని పెట్టేసి 
కూర్చున్నా ,కుస్  కుస్  అంటూ  నవ్వులు  విన్పిస్తుంటే  ఏమిటి అన్నాను . ఏమిలేదు అనడం  మళ్లీ అదే నవ్వు ,  
ఏమిటో చెప్పచ్చు గా  అన్నా , శారీ పిన్స్ కొన్నావా  అనడిగేరు  , నాకు అర్ధమయ్యింది .  కొన్నాను అన్నాను . 
మరి ముందు ఒకతను వచ్చి కొనమంటే ఎందుకు కొనలేదు  అన్నారు . మళ్లీ  కుస్ కుస్ లు ఎక్కువయ్యాయి . 
''అదా  ముందు కొనమన్నవాడు ' ఆంటి ' శారీ పిన్స్  కావాలా అన్నాడు . '' నేనేమన్నా నీకు  అత్తనా ,పిన్నినా 
ఆంటీ  అంటున్నావు ,తెలియని వాళ్ళని ''మేడం''అనాలని తేలీదా  అన్నాను . అంతేకాదు శారీ  పిన్స్ వద్దన్నా 
''మరి ఎవరి దగ్గర కొన్నావు '' అక్కడజరిగిందంతా  వచ్చి చెవిలో వుదేసిందన్నమాట ,అందుకేనా ఆ నవ్వులూ ?
ఎవరిదగ్గర కొన్నావు చెప్పు .. వదిలేటట్టు లేరు ,చెప్తుంటే నాకే నవ్వు వచ్చేసింది ''అక్కా శారీ  పిన్స్ తీస్కొఅక్కా ''
అన్నాడు వాడి దగ్గర  కొన్నాను . ఎంతకీ నవ్వాగడం లేదు పాపం . వెళ్తూ కూడా నవ్వుకోవచ్చు  కార్ తీస్తారా 
ఇంటికెళ్ళి వంట చేస్కోవాలి  మళ్లీ  అన్నాను . దాన్లో ఏముంది  నువ్వు ' ఊ  'అనాలి కాని  దార్లో  మంచి హోటల్ 
లో భోంచేసి వెళ్దాము అన్నారు .ఐతే ఇంకేం  నాకసలే చాల  ఆకలి వేస్తోంది  బాగా షాపింగ్ చేసి అలసి పోయాను
రెండు ఏనుగులు ,ఒక గుర్రం  ఐతే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడున్న ఆకలికి  అన్నాను . వెళ్తున్నాం కదా ఏమాత్రం తిని వుద్దరిస్తావో  చూస్తాను  అన్నారు . సరే దేనికైనా ముందు  బయల్దేరాలి కదా అన్నాను సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ..

ఇప్పుడు తెల్సిందా  మీకు , మా అమ్మ  వయసు కధ  నాకు  ఎందుకు  గుర్తు కొచ్చిందో ............ 

                              *************************************