Total Pageviews

Thursday, June 25, 2015

పేరు లో ''నేము''న్నది '' .
బారసాల  జరుగుతోంది ,బంధువులందరి  తో  ఇల్లంతా  సందడి గా  వుంది . పంతులు  గారి  మంత్రాలు వీధి  వరకు
వినిపిస్తున్నాయి . ''బాబూ  మీరు  మనసు లో పేరేమి అనుకున్నారో  ఆ పళ్ళెం లోని  బియ్యం  లో  రాసి అబ్బాయి
చెవిలో  ముమ్మారు చెప్పి ,బంగారు ఉంగరం తో పాలు నాలికకు రాయండి ,తర్వాత  అందరూ  వరుసలో  వచ్చి అదే
విధం గా  చేస్తారు'' . పిల్లాడి తండ్రి  ప్రసాదు  బియ్యం ఉన్న  పళ్ళెం లో  పేరు  రాయడం  మొదలు పెట్టాడు . చోటు
సరిపోక  పంతులు గారి వైపు  చూసాడు 'ఫర్లేదు  రాసిన చోటే రాయి నాయనా '' అనడం తో  హమ్మయ్య  అనుకుని
రాయసాగేడు ,అతని తమ్ముని వరుసయ్యే  వాడు, వాడి తొమ్మిది నెలల జీవిత చరిత్ర  రాస్తున్నావా  ఏ మిటి  అని
అడగడం తో  పంతులు  నవ్వాపుకున్నాడు  . రాయడం పూర్తి  కాగానే అబ్బాయి పేరు  బంధువులందరికీ  చెప్పండి ,
వాళ్ళు కూడా  పేరు చెప్తూ  పాలు తాగిస్తారు అనగానే ,పెరుచేప్పడం  మొదలెట్టాడు ప్రసాదు ''వీర  వెంకట  సత్య
సాయి శ్రీనివాస భాస్కర ప్రసన్న  శ్రీ రామచంద్ర బాలయోగి  అనంత పద్మనాభ ఆంజనేయ త్రిమూర్తి  శివ పరమేశ్వర్
పట్టాభి వరప్రసాద్  శ్రీకాంత్  సిద్దార్ద్ '' గుక్కతిప్పకుండా చెప్పేసి  ఆనందం గా అందరి  వేపు చూసాడు . ముందు వరుస లోని  కుర్చుని  మొత్తం  శ్రద్దగా  ఆలకించిన   పెద్దామె  చర్రున  లేచింది ,''మీ పెదనాన్న పేరు 'కాసి విశ్వనాద్  కలపలేదట్రా  , సొంత పెద్దమ్మను  కాదనేగా ,  వేలు   విడిచిన  దాన్ని  అనేగా ''అంటూ  రుస రుస లాడింది .

బోలెడంత బ్రతిమాలి  ఆమె ను, శాంతింప చేసి , కాశీ విశ్వనాద్  కూడా తగిలించేసారు ,ఈసారి అంతా  లేవండి
భోజనాలకి  అంటూ పిల్లాడి తాత  గారు అందర్నీ వెంట  బెట్టుకెళ్ళాడు  . అక్కడే బిక్క మొగమేసుకుని కూర్చున్న
పిల్లాడి తల్లి తులసి  ని చూసి  ఏమ్మా అలావున్నావు అంది వరుసకు అక్క అయ్యే ఆమె ,పిల్లాడి కి పెట్టిన పేరు లో
ఒక్క ముక్క కూడా   గుర్తు లేదక్కా  అంది తులసి 'అయ్యో మీ ఆయన్ను కాగితం మీద రాసిమ్మను ,రెండు రోజులు
కంటథా   పడితే రాదా  అంది . ఇంతలో తులసి తమ్ముడు ముందు కొచ్చి అక్కా బళ్ళో వెయ్యాలంటే  మొత్తం రిజిస్టర్
అంతా సరిపోదేమో  అన్నాడు . తులసికి ఇంకా దుఖం ముంచుకొచ్చింది . తులసి బావ వచ్చి  ఏమైంది అని అడిగి
విషయం విని, నాకు మధ్యలో ఎక్కడో  యోగి అని  వినబడింది ,ఎంచక్కా ప్రభాస్ సినిమా పేరు  దాంతో వేసేయ్ బళ్ళో
అన్నాడు . కాదు ప్రసన్న అని చప్పుడు వచ్చింది దాంతో వెయ్యి అని మరొకరు . చిన్నో బుజ్జో పిలవండర్రా అనొకరు
తులసికి ఇంకా కంగారు ఎక్కువైంది . రావడం చూసి రాగం ఇంకాస్త పెంచింది . అతనొచ్చి అంతావినిపిచ్చిదానా  మా వాళ్ళంతా  నొచ్చుకోకుండా  అందరి పేర్లు కలిపాను అంతే ,మనం బళ్ళో వేసేటప్పుడు నీకిష్ట మైన
''రెండు '' అక్షరాల పేరుతొ వేద్దాం అదే వాడి పేరు సరేనా  అన్నాడు . అంతే తులసి  మొహం మతాబులా  వెలిగింది .


మొన్న '' వర్గల్ '' లో అర్చన సమయం లో  పిల్లల పేర్లు చెప్తూ  ,లవ్లీ ,ఇషిక  అంటూ చెప్తున్నారు . నాకైతే చాల
ఆశ్చర్యం  వేసింది  చెప్పుకోవడా నికి  ఇబ్బంది పడే  పేర్లు  పెట్టుకొనేల ! ,ఆ బాధేలా ! ,  ముద్దుగా  పిలవాలంటే
''ఇస్శూ ''అనాలేమో , ఒకమ్మాయికి  కాంతి  అని పేరు పెడితే  తల్లి తండ్రుల దగ్గర  ఉన్నంత సేపు  కాంతి  అదే
అత్తారింటికి  వెళ్ళేక  కాంతం ,వయసైనాక కాంతమ్మ గారు ,అవునూ ఇంతకీ  నన్ను అంజూ  అనిపిలిస్తే  ఏమి
బావుంటుంది  ముంజు లాగ , తర్వాత కొన్ని రోజులకు  అంజమ్మ గారు అంటారా కొంపతీసి ? . నేను ఒప్పుకోను అంజలీదేవి గారూ  అని  పిలిపించు  కుంటా  కాస్త  గెటప్ కూడా మార్చేస్తాను . అదెలాగో  తెలుసా పాత సినిమా లో
జమిందారి ణి  లా ,ఒకే చోట చిన్న తెల్ల జుట్టు ,ఖరీదైన పట్టు చీరా ,శాలువా ,బరువైన నగలు  వేసుకుని  మొహం
ఒకపక్కా భుజాలు  ఒక పక్కా  పెట్టి ,చూపులు ఆకాశం లో పెట్టి భారీ డైలాగులు చెప్తూ ,ఒక్కసారి నన్ను నేను
ఊహించు కుంటే  హబ్బే నేనలా  ఉండలేను నాకసలే నవ్వాగదు ... అన్నట్టు  పేద్ద ... ముడి మెడ తిరగకుండా
అది మర్చిపోతే ఎలా ...   లుక్కు రావద్దూ ... !


పేరుకు లింగబేధా  లు  ఉంటాయని తెల్సుగా ! మాధవి అంటే  అమ్మాయి  ,అదే  మాధవ్ అంటే  అబ్బాయి . లింగ
భేదాలు  లేని  పేర్లు కొన్ని వున్నాయి  . అవే  ఇవి,  రాఘవ ,రమణ ,నూక రాజు . ఈ పేర్లు  మానా న్నమ్మ తరపు
కొంత మంది బంధువులు వచ్చే వారు  వాళ్లకి ఉండేవి .ఆడ  మగా కూడా ,ఈపేర్లు పెట్టేసు కుంటారు .   నాకో చిన్న సంఘటన గుర్తు వస్తోంది ,అదేమిటో చెప్తానుఒకసారి  నాన్నమ్మ  బంధువులు వచ్చి భోంచేసి  వెళ్ళేరు . మళ్లీ వంటచేస్తోంది . ఇంతలో మా బాబాయ్  భోజనానికివచ్చారు ,ఏమిటి ఇప్పుడు వండుతున్నావు  అని అడిగాడు . చక్రం వాళ్ళు వచ్చి భోంచేసి  వెళ్లారు  రా అందుకే!అంది . అప్పుడు  బాబాయ్  ఠకీ మని ''ఏ  చక్రం ? ఆడ చక్రమా , మగ చక్రమా ? అని అడిగేసేరు . నేనైతే ఒకటేనవ్వడం  అలా  వుంటుంది  మరి ,మనమేమో  పేరులో'' నేము'''న్నది అనుకుంటాము . పేరు లోనే అంతా వుంది .[ఏమిటి  ఫ్యామిలీ  అంతా  వంకరే అనుకుంటున్నారా విన్పిస్తోంది లెండి ]

పేరులో  నేమి లేదు  అంపించే పేర్లు కూడా వున్నాయండొయ్  అలాంటివి కొన్ని చూద్దాం ! పిల్లాడి 21 వ రోజు
పెరుపెట్టేస్తాం ,రంగు తప్ప  రూపు రేఖలు  తెలీవు . తెల్లగా వెన్నెల్లా  వున్నా అమ్మాయికి '' నిశిత''  అనికాని ,
నల్లని అమ్మాయికి శ్వేత అనికాని పెడతారు . ఇక ఆకార వికారాలంటా రా  తర్వాత తర్వాత రూపుదిద్దు కుంటాయి
శ్రీరాం అనిపెరున్నవాడు  రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరిదీ పూచీ ? భీమేశ్వర్ అన్నవాడు పుల్లలా  వుంటే
ఏమిచెయ్యగలం ? వేణి అన్నపేరున్న  అమ్మయికి జడ లేకపోతె ఎలా ? '' భిక్షపతి '' కోటీశ్వరుడు  గా  ఉండచ్చు .
మాచిన్నప్పుడు  మా  బంధువు ఒకాయన  మద్రాసు నించి వచ్చేవారు ,ఆయన కు పెళ్ళికాలేదు . ఒకనెల వచ్చి
అందరి దగ్గరా ,నాలుగేసి రోజులు వుండేవారు . మేము మెడ్రాస్ మామ  అనేవాళ్ళం పెద్దవాళ్ళు మెడ్రాస్ బాబు ,
అనేవారు  ఆయన పేరు  ''శోభానా ద్రీస్వర్ ర్రావు '' కాని ఆయనకు పెళ్లి కాలేదు . అదిమన తప్పా ?పేరు మాత్రం
''శోభనా ...  కాని ఆయన జీవితం లో మాత్రం ...... లేదు .  అర్ధ మైన్దనుకుంటా ?!!!!!!!!.

ఇంకేంటి మరి , చాలా  సేపైంది  ఉండనా మరి వచ్చేవారం కలుస్తాం కదా !!!!!!!!!!!!


**********************************************************************************

Thursday, June 11, 2015

ఆమె ఎవరు ..???????


ఇంటి ముందు  లాన్  లో కూచుని ,తలెత్తి బంగ్లా  వేపు  చూసింది ,ఇంత సాధించిన  ప్రతి  వాళ్ళ లాగ  '' ఆమె ''
పెదవులు  చిరునవ్వు తో  విచ్చుకోలేదు ,కళ్ళు గర్వం  గా  ఆనందం తో  మెరవలేదు . నిర్లిప్తం గా  ఒక నిట్టూర్పు
విడిచింది . కారణం ఆమె   , ఏమిసాధించిందో ,ఏమి పోగొట్టుకుందో  ఆమెకు తెలుసు . అదేమిటతెలుసుకునే
  తీరికా  , ఆలోచనా లేనివాళ్ళు  అదృష్ట వంతులు . అమాయకంగా  రోజులు వెళ్ళిపోతాయి .

ఆమె  యవ్వనపు  తొలినాళ్ళలో , '' ఆది'' ని  ప్రేమించింది . ఆషా  మాషీ  ప్రేమలు అప్పట్లో లేవు , చూసిన వెంటనే
'ప్రేమ ' సాయంత్రం సెల్లో  మెసేజ్ ,మరుసటి  రోజు  బండి మీద షికార్ ,మరుసటి రోజు మూవీ ,తర్వాతి రోజు తగువు
విడిపోవడం ,ఇంతచక్కని  అవకాశాలు లేని రోజులవి ,కాలేజ్ లో ,'కొన్ని ' ప్రేమ జంటలువున్నా వీరిద్దరే  పెళ్లి
చేసుకుంటారు  అనుకునేవాళ్లు ,అందరూ ,అంత  చక్కగా వుండేవాళ్ళు . మూడేళ్ళు ఇట్టే గడిచాయి ,ఉద్యోగాల పై
నిషేధమున్న రోజులవి . అలంటి సమయం లో  అతనికి వుద్యోగం  వచ్చింది . 'ఆమె 'ఆనందానికి  అవధులు లేవు .
''కాని ''ఆ ఆనందం   ఆవిరవ్వడానికి  ఎంతోసేపు పట్టలేదు . వుద్యోగం వేయించింది  మేనమామ కనుక  అతని
కూతురినే  పెళ్లి చేసుకోవలన్నదే  షరతని చెప్పాడు . కనుక నిన్ను పెళ్లి చేసుకోలేనన్నాడు . నయం  తనతో
ఉండమన్నాడు కాదు ,అంత గౌరవంగా  చెప్పాక  ఇంకేంటి ?..  ఆ బంధమెంతగా  భాదించిందంటే ,అలా కొన్ని
నెలలు  అయోమయం లో వుండి  పోయింది . మొదటిసారిగా  మనుష్యుల  మీద ,మమకారాల మీద అసహ్యం
వేసింది . వాళ్ళ వ్యాపార లక్షణం తనని కుంగదీసింది . కొన్ని నెలల లోనే  తండ్రి తనకీ చిరుద్యోగినితెచ్చాడు
వరుడిగా ... !  సమయం కావాలంది ,చెల్లెలు  పెళ్లి చెయ్యాలి కాబట్టి  తప్పదన్నాడు ,త్వరపడాలన్నాడు .
ఆయన్ని  గౌరవించి  పెళ్లి చేసు కుంది . పెద్ద గొప్పగా  జీవితమేమి  మారలేదు  కాని ఇద్దరు మగపిల్లలు .
 పిల్లలిని  పెంచే క్రమం లో  తానూ ,ఆస్తులు  పెంచే  క్రమం లో  అతనూ ,డిపార్ట్ మెంట్ పరిక్షలంటూ ,కెరియర్
అంటూ క్షణం తీరిక లేకుండ  పరుగుల్లో  అతనూ బిజీ ...

చెల్లెలు  ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఎంతో పోరాడి  తల్లి తండ్రులని  ఒప్పించి మరీ  పెళ్లి చేసుకుంది . చెల్లెలంటే
 వాళ్ళ అత్తగారికి  ప్రాణం . చాల బాగా చూసుకుంటుంది .  తనకు మాత్రం  తన అత్తగారు ఏరి కోరి  చేసుకున్న
కోడలైనా ,ఏదో ఒక పుల్ల విరుపు  మాటలంటుంది . చెల్లెలు పెళ్ళైన నాలుగేళ్ళకే  అమెరికా  వెళ్ళిపోయింది .
భర్తకి అక్కడ వుద్యోగం . తనకీ  ఇద్దరు  పిల్లలు  అత్తగారు  వెళ్తూ వస్తూ  వుంటుంది .  ఎప్పుడన్నా తను
 వచ్చినా మాట్లాడు కోలేనంత బిజీ ..
పిల్లలిద్దరూ  బాగా చదువుకున్నారు , జీవితమంతా ఏ  సంపాదన కోసం  పరుగులేట్టాడో  భర్త , ఆ సంపాదన
వాళ్ళను విదేశాలు  పంపడానికి  ఉపయోగ పడింది . వాళ్ళు వెళ్ళిపోయారు ,ఒకరి తర్వాత ఒకరు . మళ్లీ
ఇద్దరే మిగిలారు . భర్త చెడ్డవాడు కాదు ,అలా  అని  మంచివాడు కాదు . కష్ట పడటం తెల్సు ,సంపాదించడం
తెల్సు ,కాని ప్రేమించడం తెలీదు ,ఆప్రేమని  ప్రదర్శించడం రాదు . ఆసరాగా  వుండడం రాదు ,అవసరాలు
కనిపెట్టడం ,అవతలివారిని  పట్టించుకోవడం తెలీదు . ఎందుకో  మనసంతా ఖాళీగా వుంది . తరచి చుస్తే
చిన్నతనం లో  తండ్రిఅంటే ప్రాణం ,తర్వాత ఎవరినో ఇష్టపడి దగా పడ్డది . ఆనిముషమే తనలో ప్రేమించే
గుణం  అంతరించి పోయి వుంటుంది . భర్తకు కూడా దగ్గర కాలేక పోయింది . అతనుకూడా యంత్రం లా
సంపాదన అనే  ఎండా మావుల వెంట పరుగు తీసాడు . మొక్కుబడి  గా జీవితం గడిపారు తామిద్దరూ !

ఇప్పుడు ఈ యాభై ఏళ్ళ వయసులో  కూర్చుని  ఆలోచిస్తుంటే ,తను పొందినది  ఏమి లేదని తెలుస్తోంది .
ఆడవాళ్లంటే లత లాంటి వారంటారు , బలమైన పందిరి ఆసరా  దొరికితే జీవితం ఒకలా ,నేలని ఒదిలేస్తే
మరొకలా ,వుంటుంది . ప్రేమ కోసం ఆరాట పడటం ,ఆలంబన కోసం  ఆరాట పడటం  స్త్రీల బలహీనత
అదే భగవంతుడి  రాత కూడా ,ఇలాంటి సంఘర్షణలో  గాడి తప్పి పోయిన జీవితాలెన్నో .. భర్తలో  ఆ
ప్రేమకోసం  వెదుక్కుంటుంది . కుటుంబానికి ,ఉద్యోగానికి  రెంటికి  సమయాన్ని  కేటాయించలేక ,
సమన్వయం  లేక ,ఉరుకుల పరుగుల జీవితం లో  ఎవరికోసం  సంపాదిస్తున్నారో  వాళ్ళనే  నిర్లక్ష్యం
చేస్తూ ,ఎవరికైతే  అండగా ఉండాలో  వాళ్ళకే లేనివాడయ్యాడు . జీవితం అంటే ఒక్కరిది కాదు ,
భార్య భర్తలిద్దరిదీ .. అతని అండే  లేనప్పుడు  ఈసౌకర్యాలు  వుంటే ఎంత ,ఊడితే  ఎంత ?........
 దాదాపు అందరి  కతలు [వెతలు ] ఇలాగనే  వుంటాయి ,కాస్త అటూ  ఇటూ  గా , అన్నట్లు
  ''ఆమె '' పేరు చెప్పలేదు కదూ ! పేరెందుకు ..? ప్రతి ఇంట్లోనూ  వుండే వుంటుంది
,అమ్మ గానో అక్కగానో , చెల్లి గానో , భార్యగానో  మనం గుర్తించమంతే  .................

                                            ******************************

Thursday, June 4, 2015

మన సామెతలు ...

మన సామెతలు  చాల బావుంటాయి . ప్రతిదాని  వెనుక  ఎంతో అర్ధముంటుంది . పల్లెటూళ్ళలో  ఐతే  సామెతలు
లేకుండా , మాటలే  సాగవు . మనకి సామెతల గురించి  తెలిసింది  తక్కువే , మీకుతప్ప కుండ  నచ్చు తాయను కుంటున్నాను . ఇందులో కొన్ని  మోటు సామెతలున్నాయి ,వాడుకలోవే ,కనుకమీరు అర్ధం చేసు  కుంటార నుకుంటాను . మనలో చాల మంది  ప్రతీది  ఎక్కడో విన్నా మే  అనుకుంటారు .

1) సాటివారితో  సరిగంగ లాడబోతే , ముసలి మొగుడిని  మొసలి  ఎత్తుకు పోయిందట .
అంటే  కొత్తగా పెళ్ళైన  ఆమె తో  బాటు ,పొరుగమే కూడా నదిలో స్నానానికి  వెళ్తే  ఈమె భర్త ముసలాడు  మరి.
  వయసులో ఉన్నవారితో [పక్కవారి తో  ] పోటి  వద్దని చెప్పడం  అన్నమాట . ఇటువంటిదే  మరోటి .


2) సాటి వారితో చల్లచేస్తే  చల్లకుండ చిల్లడిందని ... అంటారు .
పూర్వం ప్రతి ఇంటిలోనూ  పాడి వుండేది ,తప్పనిసరిగా  చల్లకుండలో  చల్ల [మజ్జిగ ]చిలికేవారు  వెన్నకోసం .
పొరుగామె ,పాడి లేకున్నా , మజ్జిగ లేకున్నా పోటీ గా  వట్టి  కుండ పెట్టి చిలికిందట . కుండ చిల్లుపదడా  మరి .

3) ఆడపడుచు  ఉసూరు మంటే  ఆరు తరాలు  అరిష్టం . ఇంటి ఆడపిల్లను  అందంగా మంచి చెడ్డా  చూసుకోక
పొతే  ఆరు తరాలవరకు  కుటుంబం  పైకి రాదని అర్ధం .

4) అక్క  చెల్లెలికి  పెట్టి  లెక్క రాసు కున్నట్లు . తోడపుట్టిన వాళ్ళకి  పెట్టింది  ఎవరన్నా లెక్కచుస్తారా  అని
అలాచుసిన  వాళ్ళు  మనుషులే కాదని   అర్ధం .

5) వెనకటికెవడో  ముందుకు పడ్డా మీసాలకి మట్టి అంట లేదన్నాట్ట . తప్పు  చేసామని  తెలిసేలేదని
  బుకాయించ  వాళ్ళకి ఇది వర్తిస్తుంది .

6) కడుపులో లేనిది  కావలించు కుంటే  వస్తుందా .  కడుపులో నిజంగా  ప్రేమవుంటే ప్రకటించ క్కర లేదు .
ప్రేమలేక పాయినా  కౌగలించుకో నవసరం లేదు . అదన్నమాట

7) మొహమాటానికి  పొతే  కడుపోచ్చిందట ,మోట గా  వున్నా ఇది చాల నిజం ,మొహమాటానికి ఆఫీసు లో ,
 పక్క వారి  పనులు చేసి  ఇరుక్కు పోయే వారు ,పక్కవాళ్ళు నగలడిగినా ,కార్ అడిగినా  ఇచ్చేసి ,తిరిగి
ఆకారం కోల్పోయి  అవి తిరిగి వచ్చిన  పరిస్తితి చూసి  బాధపడే వాళ్ళకు  ఇది వర్తిస్తుంది .

8) గుడారం లో  బిడారం . ''బిడారం  ''అంటే  ఒంటె ,చలిలో గుడారం [టెంట్ ] వేసుకున్న  యజమాని
ఒంతెకి  చలి వేస్తుందేమో అని  తలపెట్టు కోనిచ్చాడట  , ఐతే తెల్లవారే సరికి యజమాని బైట ,ఒంటె
గుడారంలో  ఉన్నారట . మొత్తం ఆక్రమిన్చేసిన్దన్నమాట . సాయం  చేసినవాడికే  నెత్తిన చెయ్యి పెడితే
ఇది వాడుతుంటారు .

9) కనికరిస్తే  కంట్లో వేలు  అనేది కూడా  ఇదే అర్ధం వస్తుంది .

10) జుట్టున్నమ్మ  ఎన్ని కొప్పులన్నా  పెడుతుంది . నిజమే జుట్టు లేనివాళ్ళు  ఏమి  రకాలు  వేసు కో
 గలుగుతారు , ఇది డబ్బున్న వాళ్లకు  లేని వాళ్ళకు  మధ్య పోటి సూచిస్తుంది .

ఇకనేం  మీరుకూడా సామెతలు వాడేయ్యండి . మీరు  ఇంగ్లిష్ మీడియం  అయినా  ఫర్లేదు  సరేనా!!!!!!!!!.


                                   *********************************