Total Pageviews

Saturday, September 30, 2017

దసరా శుభాకాంక్షలు

 బ్లాగ్ సోదర  సోదరీ మణులకు , ప్రేక్షకులకు ,వీక్షకులకు  దసరా శుభాకాంక్షలు . ************************************

Thursday, September 14, 2017

మేకింగ్ ఆఫ్ ...


మేకింగ్ ఆఫ్ ... బాహుబలి  అంటాననుకున్నారా ! అబ్బా ఆశ దోసె  ,అప్పడం వడ . నేను ఇవి చేశాను అని చెప్పడానికే, మీరు చేసారా అని నమ్మలేనట్లు చూసారుకొందరు అప్పుడు నాకు ఇదేదో గొప్పపని కాబోలని మీకు చెప్పాలని ఇదంతా ,చిన్ని చిన్ని కుండలు ,కొనుక్కొచ్చి ఈ పండుగకి డెకరేషన్ అద్దిరిపోవాలి అని  అనుకున్నా ఏదన్నా అనుకుంటే అయిపోవాలి  వెంటనే ,ఈ మాయరోగం  ఒకటి వుందికదా !అబ్బెబ్బే ఆయన్నేమి వేధించను కావాలంటే మీరే ఆయనతో  మాట్లాడు కోవచ్చు . ఫోన్ నెంబరా ? చివర్లో పెడతానే ... :)) నా కాలక్షేపం నాదే, ఇంట్లోనే ఉండి టైం పాస్ చెయ్యడానికి బోలెడు  ఆలోచనలు చేస్తుంటాను .

ఇంట్లో  గేట్ కి వెయ్యడానికి తెచ్చిన  పెయింట్ లు  వున్నాయి . అలాగే ఒక వాటర్ పైప్ 4ఇంచెస్ ది వుంది. నేను కొన్నదేమిటంటే ,ప్లాస్టర్ అఫ్ పారిస్ ,ఎం సి ఎల్  ఒకటి తెచ్చాను .పైప్ నీట్ గా కడిగి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీళ్లతో కలిపి పైప్ కి పట్టించేసాను.కాస్త మందం గా అయింది . పడిపోకుండా బ్యాలెన్స్ కోసం క్రిందవైపు  మళ్ళీ పైన ఏమైనా పెడితే  పడకుండా పై వైపు ఒక రౌండ్ గా పొడవుగా  చేసి అతికించాను . మిగిలిన పి  ఒ పి తో చిన్న బుడిపెల్లా చేసి  అతికించాను అందం కోసం . ఒక దువ్వెనతో  లైన్ల మాదిరిగా గీతలు  పెట్టాలనుకుని మళ్ళీ రెగ్యులర్ గా ఉంటుందనిపించి మానేశా. 
 

రంగు వేసాక  ఇలా  తయారయ్యింది , గడపల  కోసం తెచ్చిన  ఎల్లో  ఆరంజ్ కలర్ వున్నాయి . వాటితో మరిన్ని హంగులు అద్దేసాను . ముందుగా  ఏమి అనుకోలేదు కానీ  చేస్తూ ఉంటే  ఇలా ఐతే బావుంటుంది అన్పించింది చేస్తూ వెళ్ళాను . మొత్తానికి  బాగానే  ఉందనిపించింది . కొని తెచ్చిన చిన్న కుండలని   కూడా  తోచిన విధంగా రంగులద్దేసాను .


అంతా  అయ్యేసరికి  పండుగకి  అలంకరించేసరికి  ఈవిధంగా  వున్నాయి . ఆ పువ్వులవీ  ఎం  సి ఎల్  తో చేసి అతికించాను  . కొని తెస్తే ఏమో కానీ  నేను చేశాను  అనుకుంటే మాత్రం  చాల బావుంటుంది మనసుకి . మరీ చిన్న పిల్లలుంటే  ఇలాంటి పని చేయలేము . (వాళ్ళు పూసుకునేదే ఎక్కువ ఉంటుంది : )) ఒక రెండు గంటలు కూర్చోగలము ఫర్వాలేదు  అనుకుంటే మొదలు  పెట్టచ్చు . కుదరలేదు అనుకోండి ,ఇంత కన్నా అందమైనవి బయట చాలాచోట్ల దొరుకుతున్నాయి  శుభ్రంగా కొని తెచ్చేసు కోవడమే ... సింపుల్ గా ...


***************************************

Thursday, September 7, 2017

వర్షం పడగానే ..చినుకులు మొదలవ్వగానే  వచ్చే  మట్టి వాసన  నచ్చని  వాళ్లుండరని  నా గట్టి నమ్మకం ,
ఐతే  మన ఆహార వ్యవహారాలు ,అలవాట్లు  బట్టి ఆరోగ్యం  కాస్త అటు ఇటూ అవడానికి 
ఎక్కువ  ఆస్కారం  మాత్రం ఈ సీజన్ లో నే  . గ్రీన్ టీ లు ,అల్లం టీ లు పక్కన పెడితే 
వర్షం పడి  వాతావరణం చల్ల బడగానే ,నేను ఇంట్లో చేసేది ''అల్లం పులుసు ''ఆ .. .. 
బోలెడన్ని వంటలు ప్రోగ్రామ్స్  వున్నాయి ,మన వంటలు  ఎవరు పట్టించుకుంటారు ?
అనుకున్నాను ,కానీ''  కొబ్బరి అన్నం ''పోస్ట్ పెట్టిన కొద్దిరోజులకు  జనవరి 11న అనుకుంటా 
అభిరుచి  ఛానల్ లో దేశీరుచులు ప్రోగ్రాం లో'' కొబ్బరి అన్నం ''చేయడం చూపించారు . 

అలాంటప్పుడు ఆరోగ్యానికి పనికి వచ్చే ,ఈ పులుసు  చేయడం చూపించాలి  అనుకున్నా !
తీపిపదార్ధాలు  ఎక్కువతినడం వల్లవచ్చేపైత్యం, వికారం ,తగ్గుతాయి ,ప్రయత్నించండి . 
కట్టా మీఠా ,ఇష్ట పడేవాళ్లకు నచ్చుతుంది  కూడా ... 

అల్లం శుభ్రం చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి 
అదే సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి 
అదే సైజు చింతపండు గుజ్జు  తీసి పెట్టు కోవాలి 
స్పూన్ కారం ,సరిపడా ఉప్పు ,నూనె ,పసుపు 
వలిచిన  వెల్లుల్లి పాయరేకులు కొంచెం ఆవాలు
కరివేపాకు ,ఎండుమిర్చి ,కాస్త బెల్లం   .

విధానం ; ముందుగా నూనె  వేడిచేసి  ఆవాలు వేసి కరేపాకు ,వెల్లుల్లి ఎండుమిర్చి వెయ్యాలి .
ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించి ,అల్లంపేస్ట్ వేయాలి వేగాక పసుపు ,ఉప్పు ,కారం వేసి
వేయించి ,చింత పండు పులుసు వేయాలి ,కొంచెం నీళ్లు పోసి ఉడక నివ్వాలి ,దగ్గరకాగానే
బెల్లం వేసి ,అన్ని కలిపి ఉప్పు సరిచూసుకోవాలి . పొద్దున్నే ఒక్కరోజుకు టిఫిన్ త్యాగం చేసి
వేడి వేడి  అన్నం లో ఈ పులుసు వేసుకుని  భోజనం చేసేయండి .(ఎండల్లో మాత్రం వద్దు .)

  
***************************************************************************