Total Pageviews

Thursday, September 8, 2016

రంగులపెట్టి .మీరు  ఉద్యోగస్తు లా ,ఐతే సరే  సమయం ఎలాగూ  వుండదు . సాయంత్రం అలసి పోయి వచ్చి  కాసేపు  వార్తలు కాసేపు  గేమ్ షో  చూసి బజ్జుంటారు . కాని  గృహిణుల కు  గమనిక  దయచేసి  సీరియల్స్ విషయం లో జాగ్రత్త .ఛానల్స్ మారుస్తూ .. ప్రోమోలు  చూస్తేనే భయమేస్తోంది ,ఇక రోజూ  ఆ డైలీ సీరియల్స్ చూస్తూ  రేపటి ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో అని గుండెని అరచేత్తో పట్టుకునే  సమయానికి  ఆపేస్తారు .. రేపటివరకు .. ఈలోగా జనం అనారోగ్యం పాలై పోతారు . ఇంతే కాదండి , ఒకసారి చేతబడి చూపిస్తారు అదికూడా చిన్నపిల్లాడి మీద ,మరోసారి పాముకి  బట్టలు వాసన చూపించి వదులుతారు .. వాళ్ళనే  కాటేస్తుందన్నమాట ? అత్తగారు  మెట్లు దిగుతుంటే   కోడలు నూనె పోస్తుంది , కోడలు తాగే పాలలో  అత్త విషం పోస్తుంది . ఇవన్ని జరగవు వాళ్ళు త్రుటిలో తప్పించుకుంటారు  మనం ''బకారాలమైపోతాము .మరి రెండువేల ,తొమ్మిది వందల తొంబై తొమ్మిదో భాగం కూడా ప్రసారం కావాలి అంటే  ఇదంతా తప్పదు మరి .మళ్లీ  మరుసటి రోజు ఏమిజరుగుతుందో  అంటూ అదే టైం కి టి వి ముందు ప్రత్యక్షం అవుతాము . ఇంకో అసహ్యమైన  విషయం ఏమిటంటే .. చక్కగా భార్య భర్త  అంటూ మొదలు పెడతారు . సీరియల్ , ఇదేదో సంసార పక్షం గా  ఉంటుందేమో అని చూస్తాము . ఒకవారం బాగానే వుంటుంది  ఆహ్లాదంగా .... తర్వాత  ఆమె మొదటి భర్తనంటూ  ఒకడువస్తాడు   లేదా అతని ముందు భార్యననో,  పిల్లాడి తల్లిననో  మరోకామే వస్తుంది  చూడలేము ,ఆ భాష భరించలేము ,ఆడైలాగులు  ఎవరురాస్తారో మరి  వారికి నా తరపున వందనాలు .ఒక పెళ్లైన  యువతి కోసం  ఇద్దరు ప్రయత్నించడం , గర్భవతి గా  ఉన్న ఆమెకి వేరే వాళ్ళ తో  పెళ్లి కావడం లాంటి ట్విస్ట్ లు కూడా వుంటాయి మరి  చూసి తట్టు కోవాలి . పెళ్ళిళ్ళు , శోభనాలు ఐతే  ఎప్పుడు పెట్టినా అదే జంటకుఅదే  సీరియల్ లో  మళ్లీ  మళ్లీ  జరుగుతూనే వుంటాయి ????????.పొద్దున్నే భక్తీ ,గ్రహాలు అనుకూలత ,మంచిసమయం ,పిల్లల  పుట్టిన సమయంతో వాళ్లు  విదేశాలు వెళ్తారోవెళ్ళరో చెప్తారు , భార్యా భర్తలు  విడిపోకుండా వుండాలంటే ఏ నూనె తో  దీపం పెట్టాలో చెప్తారు ,అర్ధం చేసుకుని సర్దుకుపోతే  కాపురం నిలుస్తుంది తప్ప నూనె వల్ల  కాదండి . హమ్మయ్య ఇవన్నీ  అయ్యాయి అనేసరికి బ్రతుకులో  బండ , జీవితంలో అండ  అంటూ కొత్తగా  ముందు తరం హీరోయిన్లు తో   ఒకకొత్త  ప్రోగ్రాం లు మొదలయ్యాయి . మీ పేరులో  (అక్కర్లేని చోట ) ఎల్ లు ,  హెచ్ లు ,కలుపుకుంటే  మన  డాబా మీద ఒక  డుప్లెక్స్ హౌస్ మొలుస్తుందట మా వారికీ చెప్పేను  ప్రయత్నించ కూడదు  అని  అయన నవ్వి నవ్వి నవ్వలేక ఇబ్బంది పడ్డారు  కాసేపటికే వంటలు మొదలౌతాయి (అన్ని చానల్స్ లోను ) చక్కగా పదివేల పట్టుచీర కట్టుకుని (పాపం భర్తగారు ) గోరింటాకు పెట్టుకుని తలనిండా పూలు పెట్టుకుని వంట చెయ్యడానికి వస్తారు  అవన్నా  చూద్దామంటే ..  కావాల్సిన పదార్ధాలు అంటూ మొదలు పెట్టి  ఉల్లి పాయలు  పచ్చిమిర్చి పంచదార  బెల్లం ముక్కా ,అంటూ సాగుతుంది ఆ లిస్ట్ ,అది కూరో,  స్వీటో  అర్ధం కాదు . అసలే అంతంత మాత్రం వంటతో మావాళ్ళు కక్క లేక మింగ లేక  మెక్కుతుంటారు . ఇక ఇవికూడా చుసానంటే  వున్నది పోయి  అటూ  ఇటూ కాకుండా పోతుంది
.నా వంట . తిరిగి చివాట్లు తినాలి  ఎందుకొచ్చిన గొడవ .


అసలు వాళ్ళు చేసే వంటలు మనకి తెలిసినవే చేస్తూ నోరు తిరగని పేర్లు పెడుతూ ,తమలపాకు బజ్జి ,కొబ్బరాకు బుర్జీ ,అప్పడాల కూర ,వడియాల బిర్యానీ అంటూ అదు''బూతాలు ''చేస్తారు .
పూర్వం నించి వండే పాకం గారెలకి ,స్వీట్ వడ అనిపేరుపెట్టి (బెల్లంగారెలు )జీడిపప్పు చల్లేసి
కొత్తగా చూపిస్తారు . ఆనక ఏంకర్   రుచిచూసి మెచ్చుకుని ఇచ్చే నూనెడబ్బా అందుకుని ఛీ ..
శని, నూనె ఎపుడూ చేత్తో తీసి''కొన ''కూడదు ,''కొనవచ్చు''కానీ అదికూడా తెలీదు . వాళ్ళ ఫ్యామిలీ
మొత్తం వచ్చి రుచి చూసి బావుందంటారు (అనకపోతే  ఆ నక ఏమవుతుందో వాళ్లకు తెల్సు మరి ఒకోసారి అత్యుత్సాహం వున్న ఏంకర్ వస్తుంది . రండి పరిచయాలు పెంచుకుందాం అంటూ
మీపేరేమిటి ఏమి వండుతారు అంటూ మొదలెట్టుద్ది . మీకు పెళ్లిఅయిందా అంటుంది ??
ఆమెగారు బోలెడు సిగ్గు పడుతూ అయిందంటుంది . కొంత వంట జరుగుతూ ఉంటుంది
మీకు పిల్లలా ,అనిఅడుగుతుంది ,ఆమె ఇద్దరండి అంటుంది ''వావ్ ''అంటూ ఒక పోలి కేక
పెడుతుంది . మనఁవేపు తిరిగి అస్సలు ఆలా లేరుకదండి ఈవిడా ?అంటూ మనల్ని కూడా
ఇన్వాల్వ్ చేస్తుంది . (నాకేం తెలీదు రావుగారు  నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి . )
మరికొంత వంట తర్వాత పిల్లలేమి చేస్తున్నారు ,అని అడుగుతుంది అమ్మాయికి పెళ్లయిందని
చెప్పగానే ఏంకర్ కళ్ళుతిరిగి పడిపోయినంత  పనిచేస్తుంది . ''వావ్ '' వోవ్ ''అంటూ సదరు
ఆంటీని పొడిగి  సారీ  పొగిడి మెచ్చుకుంటుంది . మొదటినించి ప్రోగ్రాం చూసేను కనుక
నాకళ్ళకిసైట్ఇంకారాలేదు కనుక మొత్తం ఈ కథ కమామిషు లో అంత ''వావ్ ''ఏమి కనబడలేదు


ఒక వంటల ప్రోగ్రాం వస్తోంది ,అన్నిరకాల కూరగాయలు వేసి ,, అదేనండి  మనం కూరలు లేక వారాంతం  లో చేస్తాము కదా వెజ్ ఫ్రైడ్ రైస్  అదన్నమాట ,చేస్తూ ,, వుంది ఏంకర్ తో ఏదోవొకటి  మాట్లాడమని చెప్తారనుకుంటా'' అన్నికూరలు వేసుకోవచ్చా అని అడిగింది ,చేస్తున్నఆమె '  అందుబాటులో వున్న వి  వేసుకోవచ్చు ' అంది .ఏంకర్ ''కాకర కాయ వేసుకోవచ్చా  అనడిగింది టక్కున ,ఇక ఆమె చూసింది చుడండి ....  వెంటనే హ్హి హ్హి కాకరకాయ చేదుకదా ! మర్చిపోయాను  అని సర్దేసుకుంది .  మరోసారి  స్వీట్ చేస్తూ  చివరిగా'' ఎలకల ''పొడి వేసుకోవాలి  అన్నదామె ,ఈసారి ఎంకర్  తెలివైంది  , '' ఓ ' యాలకుల' పొడి  వెయ్యాలా'' అని కవర్ చేసింది   .  నిజంగా  ఎలకల పొడి అనుకొని  వేస్తె ఏమిటి పరిస్తితి ?...ఇప్పుడుంది అసలైన కథ . లైవ్ లో సైకాలజీ డాక్టర్  వచ్చి భార్య భర్తలు ఎలావుండాలో గొడవలు రాకుండా ఎలా సర్దు కోవాలో  చెప్తున్నారు  ఏంకర్   తనుచేప్పేది శ్రద్దగా విని ,ఒక కాలర్ లైన్ లో  వున్నారంది  కనెక్ట్ చేసారు  అతను  ఏంకర్  నడిగాడు '' మరి డాక్టరుగారి  భార్య ఎక్కడుందో అడగండి '' అన్నాడు  ఆమెకు అర్ధం కాక  మళ్లీ  అడిగింది . ''డాక్టరుగారు  భార్య నెందుకు  వదిలేసారో కనుక్కోండి '' అని స్పష్టం గా అడిగాడు . కట్ చేసారు లైన్ . మరోసారి  చాల లావుగా వున్నఆమె  వచ్చి ఆరోగ్యంగా వుండాలంటే వొళ్ళు తగ్గించుకోవాలంటే  కొవ్వు తీఇంచు కోవాలని  చెప్తోంది . మళ్లీ మరో  కాలర్ ,  కనెక్ట్ చేసారు . ''మీరెందుకు చేయించుకోలేదు మరి ?''అని  అడిగాడు కాలర్ ,నాకు విసిల్ రానందుకు  చాల బాధ అన్పించింది . నేను చూస్తూఉన్నప్పుడే  ఇలాంటివి జరుగుతాయా  అని నా సందేహం ?
పోనీ పాటలైనా చూద్దాము అని మ్యూజిక్ ఛానెల్ పెడితే ,ఏంకర్ ప్రేమించావా , ఇంకా లేదా...
అంటూ ఇంటర్ చదివే పిల్లలతో ,ప్రేమించక పోతే  మీ బ్రతుకెందుకు  అన్నట్లు మాట్లాడతారు .
జీవితానికి లక్ష్యం అంటూఒకటుండాలి కదా ,కాస్త మంచివిషయాలు కూడా మాట్లాడితే బాగుండు
కొన్ని లక్షల  మంది చూసే  కార్యక్రమాలు ,జనం లోకి వెళ్లేముందే  ఒకసారి  సరిచుసుకుంటే  బాగుంటుంది అనిపించి  మాత్రమే ......


                                        ***********************************