Total Pageviews

Sunday, August 31, 2014

ఖైరతాబాద్ గణేశా .........

           పండుగ  ముందు రోజు ,పండుగ  రోజు  కురిసిన  వర్షం  చూసి ,ఇన్నాళ్ళకు  హైదరాబాద్  తడిసి మురిసిందని పించింది . కానీ  వర్షం లో  బయటికి  వెళ్తే రోడ్స్  పరిస్టితి తెలుసు  కాబట్టి  ఇంట్లోనే  కూర్చో వలసి
వచ్చింది . టి  వి  కి  అతుక్కు పోక  తప్పని  స్తితి ,ఒక చానల్లో  ఖైరతాబాద్  వినాయకుడిని  చూపిస్తున్నారు .
ఎంత  జనం వున్నారంటే ,హమ్మో  దర్సనం  మన వల్ల  అవుతుందా అని పించింది . పొఇన  సారి  కుడా  ఏవో
కారణాల  వల్ల  వెళ్ళ  లేక పోయాము ,ఈసారి  తప్పకుండా వెళ్ళాలి ,నాకేమో  ఎక్కడా వేచి వుండాలంటే  కాదు .
బాగా  ఆలోచించి ,ఉదయాన్నే  వెళ్ళాలని అనుకున్నా ,పిల్లలిని అడిగా శనివారమే గా   వెళ్లి  వచ్చేద్దాం  అని .
అబ్బే  ఇద్దరూ ఏవో సాకులు చెప్పారు . నేను  చంద్రని  అడిగా  తీసుకు వెళ్ళమని . పిల్లలు  వెళ్ళగానే ఇద్దరం
వెళ్ళాం ,అబ్బా  ఎంత మంచి  దర్శనం ఐంది  అంటే  చాల దగ్గర  నించి ,చేసుకున్నాము . వాతావరణం చుస్తే
ఇలావుంది  ఎలాగ  వెళ్లి దర్శించు  కుంటా మో  అను కున్నాను .         
                                                             దగ్గరనించి  దర్శించు  కోవడమే  కాదు , మన  వీక్షకుల  కోసం  ఫోటో లు  కూడా తీసుకున్నాను , ఆ గనేశుని 
అనుగ్రహం  మా తో  పాటు  మీ అందరికి  లభించాలని , మనస్పూర్తిగా  కోరుకుంటూ , స్వామి  అరవయ్ అడుగుల 
స్వరూపాన్ని  మీ  అందరి ముందు ఆవిష్కరించే , నా  అదృష్టానికి పొంగి  పోతూ ..........అంతే  కాదండీ  చిన్న పాటి  షాపింగ్  కూడా  చేశాను . ఒకచోట  కప్పులు  అమ్ముతూ ,ఒకతను  కూచుని 
వున్నాడు , వెంటనే  అటు వెళ్లి  పెద్దవి  ఇదు  కప్పులు  నూట ఎనభై  చెపితే  వందకి , చిన్నవి ఆరు ఏ భై  కి 
కొన్నాను .  కొంచం ముందుకి రాగానే  బుజ్జి గణేష్  ని  మట్టితో  చేసి  మువ్వలు  ,గంటా  కట్టి  చాల చక్కగా 
తాయారు  చేసినవి  వున్నాయి , అక్కడ  కూడా  అరవైకి  మాట్లాడి  తీసుకున్నాను . మొత్తానికి ,ఒక చిన్న 
గుజ్జు రూపం  లో ,ఖైరతాబాద్  గణేష్  ని  ఇంటికి  తెచ్చేసుకున్నాను . మీరు వెళ్తే  మర్చి పోకుండా ,
ప్రయత్నించండి మరి ........


Saturday, August 30, 2014

స్నేహ బంధమూ ....

ఇక్కడికి  వచ్చిన కొత్త లో  హబ్సిగుడా  లో  వున్నాము . మొదటి అంతస్తు  లో ఫర్నిచర్  షాప్ , రెండో  అంతస్తు లో ఇంటి  ఓనర్స్ ,మూడో అంతస్తు లో  మేము వుండే వాళ్ళం . పక్క పోర్షన్  కాళిగా వుంది ,ఎవరన్నా స్నేహం గా వుండే  వాళ్ళు  వస్తే బాగుండునని  అనుకునే దాన్ని ,ఐతే ఒకరోజు  సాయంకాలం  సామాను తో ఎవరో వచ్చారు .
ఎవరో చూద్దామని  చాలా సేపు  ఎదురు చూసాను . ఎవరు  కనిపించలేదు  బహుశా సామాను  సర్దుకుంటూ 
ఉండవచ్చు . ఉదయం చంద్ర ఆఫీస్  కేల్తుంటే బాబుని  ఎత్తుకుని  బయటికి  వచ్చాను . అప్పుడే ఆ పోర్షన్ 
నించి  కుడా వాళ్ళు  బయటికి  వచ్చారు . ఆమె కూడా  బాబుని  ఎత్తుకుని వుంది ,హమ్మయ్య  మంచి ఫ్రెండ్ 
దొరికింది  అని  మనసులో అనుకున్నాను . మగవాల్లిద్దరు  పరిచయం చేసుకుంటూ దిగి  వెళ్లారు ,నేను  ఆమె 
వైపు చూస, తను  నైటీ  లోవుంది  బొట్టు లేదు ,ఉంగరాల జుట్టు ,విల్లు లాంటి కనుబొమలు  బావుంది ,స్నేహంగా 
నవ్వింది ,నేను  'సర్డుకోడం పూర్తయిందా 'అనిఅడిగా  అంతే  'యాను  మలయాళ  కుట్టి ఎంద  పరిందా 'అచ్చంగా 
ఇలాంటి  సౌండ్ ఏదో ఇచ్చింది . చచ్చింది రా గొర్రె  అనుకున్నాను . ఎలా చెప్పాలి ? నేను  తెలుగు అన్నా నావేపు 
వేలితో  చూపించు కుంటూ , కొన్ని శబ్దాలు  సైగలు  తర్వాత తేలింది ఏమిటంటే,  ఇద్దరికీ  నాభాష ఆమె కి రాదు 
ఆమె భాష  నాకు రాదు . సహజ నటి జయసుధ లా  ఏడుపు  నవ్వు కలలిసిన  భావం ఒకటి నా మోహన 
కదిలింది , ఈ మధ్యే  ఎర్ర బస్  దిగాను ,పచ్చపెట్టి తో ,కాస్త దోస్త్  దొరికితే  లోకం  చూద్దామను కున్నా ,ఇలా 
తగలడింది . నా భావం అర్ధమైంది  అనుకుంటా , తను కూడా దిగి  వచ్చింది [మేడ మీంచి కాదు ]ఇద్దరం కల్సి 
హిందీ లో మాట్లాడు కోవాలని నిర్ణ ఇంచుకున్నాము , ఏమిటి మీ అనుమానం ?ఇద్దరికీ హిందీ రాదుగా  ఎలా 
మాట్లాడు కుంటరనే గా ,అదేకదా తమాషా , 'నహయా 'అని అడిగింది    ఏ  హాయి  గురించి అడుగుతోంది ? 
ఛ  ఛ  దానిగురించి ఐ  వుండదు  అనుకుంటూ ,ఏమిటన్నట్లు  మొహం పెట్టా ,తను  మగ్  తో నీళ్ళు భుజాన్న 
వేసుకున్నట్లు  చూపించింది ,నాకు  అర్ధమై  స్నానమా చేశాను  అని ఎందుకన్నా మంచిదని 'హ ' హు ' హై '
అన్నాను . తను వెళ్లి చేసి  వస్తాను  అని  బాబుని  ఇక్కడే ఉంచుతాను  అని చెప్పింది , అబ్బా అదేనండి 
సైగలతో ,సరేనన్నా తను వెళ్ళింది , పిల్లలిద్దరూ  ఆడు కుంటార నుకున్నాను . కానీ వాడు చాల అల్లరి , 
మామగారి  పేరని , పోళ్ మన్  అని  చెప్పింది ,తన పేరు జెస్సి అట  అయన పేరు  జాన్  అనింది . ఏదో 
కేబుల్ లో  పని చేస్తాడట . ఇక వీళ్ళు  ఆట మొదలు పెట్టారు , నీళ్లన్నీ  ఇంటి నిండా పోసారు ,అందులో 
తలగడాలు వేసారు ,అవి బోట్స్ ట ,రెండు  గన్స్ వుంటే  వాటిని నాలుగు చేసారు ,రెండు కార్లు  వుంటే 
వాటిని  ధన్  ధన్  మని గుద్దించారు లైట్లు పోయాయి ,నేను అడ్డుకోవాలని  చూసాను  కానీ  నావల్ల 
కాలేదు ,నేను కోపంగా  చుస్తే చాలు భయ పడే  మా వజ్రం నన్నసలు  పట్టించుకోలేదు . ఇలా గంటన్నర 
జరిగింది . అప్పుడు వేరే  నైటీ వేసుకుని ,పిల్లాడికి  అన్నం కలుపు కుని వచ్చింది . హమ్మయ్యా అనుకున్నా 
వాడికి అన్నం పెడుతుంటే , మావాడు చూస్తున్నాడు నేను వెళ్లి అన్నం  కలిపి తెచ్చాను . కుక్కర్ శబ్దానికి 
పారి పోయే వాడు కాస్తా  అన్నం తినసాగేడు . దానితో  జరిగిన  నష్టం మరిచి పోయాను . ఇలా కొన్నాళ్ళు 
జరిగింది . ఆమెకి  తెలుగన్నా రావాలి ,నాకు హిందీ అన్నా  రావాలి అని పట్టుదలగా  వున్నాను . [ నాకు 
హిందీ యే వచ్చింది ]. 
                               

                 ఒకరోజు  మేము  ఫాన్సీ షాప్ కి వెళ్ళాలని  నిర్ణ ఇంచు కున్నాము . మా స్నేహం గురించి 
అందరికి తెలిసి పోయింది . అపార్ధం చేసు కోకండి ,మేము సైగలతో  మాట్లాడు కుంటా మని . పిల్లలిని 
తీసుకుని  వెళ్ళాము  వాళ్ళని దించి ,గాజులవీ  చూస్తున్నాము ,మా ఖర్మ కొద్దీ ఆ  షాప్ అతను తెలుగు 
కాదు ,మార్వాడి నో ,మహారాష్ట్ర అతనో  ఆ భాషే  వేరుగా  వుంది . పైగా ముసలతను , ఇక చాదస్తానికి 
ఏమి కొదవ ? ఇంతలో ఎందుకో అనుమానం వచ్చి ,కౌంటర్ మీదుగా కిందకి చూసాడు , పిల్లలిద్దరూ 
గోళ్ళ  రంగులు పెట్టె తో సహా దించు కుని కుర్చుని , వాడు మూతికి ,మా వాడు చాల తేలి వైన  వాడు 
సుమీ ,మూతికి కాదు వేళ్ళకి  పూసుకున్నాడు . భలే ముద్దు గా  వున్నాడు ,కానీ ఆ ముసలతనికి 
కోపం వచ్చేసింది ,ఆవేశం గా  ఊగి పోతూ అటు తలుపు తెరచుకుని వచ్చేసాడు . నేను ఎందుకన్నా 
మంచిదని  మావాణ్ణి ఎత్తు కున్నా ,జెస్సి కూడా పో ళ్  మన్  నిఎత్తుకున్నది ,మావాడు వాణ్ణి అలాగే 
పిలుస్తాడు మరి . ముసలతను ఏదో తిట్టాడు ,చాలదన్నట్లు  మా చేతిలో రంగులు కలిసి పొఇన 
గోళ్ళ రంగులు  మా చేతిలో పడేసి నట్లు పెట్టాడు . డెబ్బై రూపాయలు తీసుకున్నాడు . నాకు  చాల 
కోపం  వచ్చింది . అలాంటప్పుడే జేజమ్మ వచ్చి వాల్తుంది ,ఆమె ఎవరను కుంటున్నారా  మన 
అరుందతి అమ్మ , నువ్వు నన్నేమి చెయ్యలేవురా  అని అరవాలని అన్పించింది , నా మొహాన 
ఎర్రని వెలుగు పడింది .  'ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో  కొమ్ములు తిరిగిన  కుమార్ గారి అమ్మాయిని 
నన్నిలా అన్నావని  మా ఇద్దరన్నలతో చెప్పానంటే , నిన్ను జీప్ లో ఎక్కించు కుని ఊరవతలి కి 
తీసు కెళ్ళి తుంగలో తొక్కేస్తారు ' . అని అరిచేను . జెస్సి  బలవంతంగా తీసుకోచ్చేసింది . నాకు 
ఎంత కోపం వచ్చిందంటే  వెంటనే ఈ ఊర్లో నించి  వెళ్లి పోవాలను కున్నా ,కానీ మా అమ్మ కు 
కారణం చెబితే ,'ఆ  చెరువు  మీద అలిగి ----కడుక్కోడం మానేసే  డం టా ' అంటుంది . చంద్ర కి 
చెప్పి చూద్దాము అనుకున్నాను . చెపితే ముందు  ముసి ముసి గా  నవ్వు కుని  ఏమన్నారో 
తెలుసా  మీరు  నవ్వ కూడదు మరి , 'మీ ఆడవా ళ్ళు  షాప్ కి వెళ్తే  వంటి మీద బట్టలే  చుస్కోరు 
పిల్లలిని  ఏమి చుస్కుంటారు ? అన్నారు . అకటా కటకటా  ఎంతటి అవమనమూ .......... 

Friday, August 29, 2014

గణపతి బప్పా మోరియా ...!

         


    అందరికి  వినాయక  చవితి  శుభాకాంక్షలు 

Sunday, August 24, 2014

శోభనం గది


    నా చిన్నప్పుడు  మాఇంటికి  పెళ్లి పిలుపులకు  చుట్టాలు  వచ్చారు . ఒకపెద్దయన,  ఇద్దరు  కుడా  వున్నారు .
పెద్దయనేమో  చాలా  నల్లగా వున్నాడు ,తెల్లని  బట్టల్లో  మెరిసి పోతున్నాడు . నేను ఎప్పుడు  నాన్నగారి  కుర్చీ
హండిల్ ఫై  కుర్చుని  వుండే దాన్ని ,ఎవరు వచ్చినా  సందేహాలన్నీ  అప్పుడే  అయన చెవి లో అడిగేసేదాన్ని .
ఆయన ఎవరూ  అని చెయ్యి అడ్డుగా పెట్టి చెవిలో అడిగాను ,నాన్నగారు నవ్వు ఆపుకుంటూ 'కాటన్ తాత 'అని
చెప్పారు ,నేను మళ్లీ చెవిలో అడిగాను 'సిల్క్ తాత 'అని ఎందుకు పెట్టుకోలేదు ? అని ,అప్పటికే తాత గారు
ఏమంటోంది  పాపా 'అని అడిగారు , నాన్న గారేమో మీగురించి అడుగుతోంది  అని సర్దేసారు . ఆయన చాల
ముచ్చటపడి పాప ని కూడా తప్పకుండా తీసుకు రావాలని చెప్పి వెళ్లారు . వెళ్ళాక ఆయన పేరు తాలుకు
వివరాలన్నీ చెప్పారు . అప్పట్లో  దవల్లెస్వరం  ఆనకట్ట  కట్టించిన  '' సర్ ఆర్ధర్ కాటన్ ''అంటే  రైతుల కి ఎంతో
ఆదర్శం ,అందుకే పిల్లలికి  మనవలికి  కాటన్  అని పెట్టుకునే వారట , అదికాస్తా  పలకడం లో కాటన్న అయింది
అంతే కానీ కాటన్న , సిల్కన్న ,కాదు  అనిచెప్పారు . సరే పెళ్ళికి  నన్ను కూడా తీసుకు వెళ్ళాలని  ముగ్గురం
బుల్లెట్  ఫై వెళ్ళాలని [డిపార్ట్ మెంట్ ది ] అనుకున్నాము . వెళ్ళే టైం కి షూ లేకుండా కిక్  కొట్టడం తో [అప్పుడు
సెల్ఫ్ స్టార్టర్ బులెట్ కి లేదు ]కిక్ రాడ్ కాలికి తగిలి  బ్లడ్ వచ్చింది . నాన్నగారు  చిన్న ట్రీట్ మెంట్ తీసుకున్నాక
అంబా సిడేర్ కారులో ,పెళ్ళికి వెళ్ళాము ,పెళ్లి ఎలా జరిగింది  అని మాత్రం  అడగకండి . ఎందుకంటే  అటుపక్క
పెళ్ళిళ్ళు  అర్ధ రాత్రి ముహుర్తాలు ,పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా చక్కగా రెడీ ఐ  పందిట్లో  నిద్రపోతూ వుంటారు .
అంతరాత్రి  పూట ఎవరికీ నిద్ర ఆగుతుంది  చెప్పండి , పెళ్లికొడుక్కి ,పెల్లికుతురికి ,అంటే తప్పదు  వాళ్ళ పెళ్లి
కదా , పంతులు  అలారం  పెట్టుకుంటా డెమో ,టైం కి లేచి ' భజంత్రీలు  భజంత్రీలు 'అనగానే  శబ్దానికి అంతా
లేచి  అక్షింతలు  వేసి మళ్ళి సర్దుకుని ,పడుకుంటారు . సాదారణం గా ,ఇలాగె  జరుగుతాయి కొంచెం  అటు
ఇటుగా
           
         ఆ సాయంత్రం  నేను  స్వీట్స్  సర్దుతున్న  రాములు  అనే అతని దగ్గర కెల్లాను . రండి పాప గారు
కుర్చోండి  , అన్నాడు  మళ్ళి అతనే  పెళ్లి చూసేరా అనిఅడిగేడు ,నేను తలుపేను  లేదన్నట్టు . ఎవరు
సూడలేదండి ఒకరితల్లో ,ఒకరు తలెట్టుకుని పడుకున్నారండి  ఆనాక పెళ్లి కెల్లాము తల్లో పేల ట్టయంటే
అట్టావా అండి  మరీ .. అన్నాడు . నేనేమి  అనలేదు .

రాములు  : చీనా  మిటాయి యుండ  తింటా రండీ ..

నేను        : చీనా  అంటే  చీమలు వుంటాయా ?
రాములు  : అయ్ బాబోయ్ ,చీనా  అంటే పంచాదరండి
నేను         : మరదేంటి .....
రాములు   : పంచదార చిలకండీ  తింటారా ......
నేను          : మరది కోడి పుంజులా  వుంది ?
రాములు    :  కోడి పుంజు కాదండీ  చిలకేనండి ..
నేను           :మరిదో ....
రాములు     :ఇది తొక్కుడు లడ్డు  ఇది  తింటారా
నేను            : ఛి ఛి    కాళ్ళతో   తొక్కి  చేస్తారా ?
రాములు     :అబ్బే  కదండీ ,మీకేం తెల్దండి , చప్పటి జంతికలు  చేసండి
 ,మరపట్టి , పాకం లో ఏసీ ఉండలు  కదతారండి ..
నేను           :ఇన్నెందుకు ?
రాములు     : రాత్రికి  శోభనం గది లో ఎట్టాలి  కదండీ ,
నేను          :శోభనం  గది అంటే ? మా  ఇంట్లో    దేవుడి  గది వుంది ,
పడక గది వుంది , స్నానాల గది వుంది ,శోభనం గది లేదే .........
రాములు      : అయ్  బాబోయ్  మీరు చాలా  తెలివయ్ నోరు పాపగారు .....      

     [  నేను ; ఇప్పుడు ; తెలివికాదు  రా  తింగ రోడా దాన్ని "కామన్  సెన్సు"  అంటారు ]     . 

Wednesday, August 20, 2014

పెళ్లి కాన్సిలా?

 మా  నిశ్చితార్ధం  కి  , పెళ్ళికి  చాల  గ్యాప్  వచ్చింది .  కొన్ని కారణాల  వల్ల  నెలలు  పట్టింది ,అందు వల్ల  నిశ్చితార్ధం  గ్రాండ్  గ  చేసారు ,అత్తవారి ఊరునించి  చుట్టాలు  బానే  వచ్చారు . వాళ్ళ లో  సూర్యం  అనే
 అతను  నాన్న గారితో  తరచూ  ఎవోవొక  పనులతో  ఇక్కడికి  వస్తుంటాను ,అని  చెప్పాడు  నాన్న గారు
 ఐతే  వచ్చినప్పుడు  ఇక్కడికే  రావాలని ,పని కాంగనే  భోంచేసి , రెస్ట్  తీసుకుని  వెళ్ళ వచ్చని ,చెప్పారు
 అతను  అప్పుడప్పుడు  వచ్చే  వాడు . పని కాగానే  వచ్చి ,భోంచేసి , రెస్ట్ తీసుకుని  సాయంత్రం  వెళ్ళే వాడు.
 ''సాగర  తీరం '' వాళ్ళం  కదా ఇంట్లో  ఎప్పుడూ  చేపలు  వండు తూ వుండే వారు . దాంతో  వెజ్ తక్కువ.
  సీజన్  లో మా  అమ్మ కాకరకాయ  తప్పకుండ  వండేది ,అది  ఎవరం  తినే వాళ్ళం  కాదు ,చేదు ,చేదు అని
  తను  మాత్రం చేసు కు తినేది . మాకు  మానాన్నగారి  సపోర్ట్  ఒకటి ,ఇది కాక  మా పెద్దన్న  కూడా చుస్తే
  పడేసేవాడు . తను మాత్రం  చక్కగా  వేపుడు  చేసుకు తినేది . అంతే కాదు రెండు ,మూడు  రోజులు  ఫ్రిజ్
  లో  పెట్టుకు తినేది . మా నాన్నగారు అలా  తింటే చచ్చి పోతారని ,తినవద్దని  ,చెప్పేవారు . అమ్మ మరి
  ఫ్రిజ్ ఎందుకు ,నిల్వ  పెట్టడానికే  అనేది . పోనీ పులుపు  పెడతాను ,అలా ఐతే  పాడవ్వ దు ,అని చెప్పి
  పులుసు  పెట్టింది . నేను ఫ్రిజ్  సర్దుతూ ,పులుసు పడేస్తాను ,అన్నాను . మంచిదే  ఉండనీ  అని  నాకు
  క్లాస్  పీకింది ,నాదేమి  పోయింది  అని  ఊరుకున్నాను . మధ్యానం  నేను  అత్తా వాళ్ళింటికి  వెళ్లి  వచ్చే
  సరికి  సాయంత్రం  ఐంది . వస్తుంటే బయటే  సోఫాలో  సూర్యం  తల  వాల్చేసి , నాలిక  వదిలేసి ,నిద్ర
  పోతున్నాడు , చూసుకుంటూ  లోపలి కి  వచ్చేసాను . మా రెండో అన్నయ్య  కాస్త  నల్లగా  ఉంటాడు .
  అందుకే  అత్తయ్య  తనకి  కన్నా  అని పేరు  పెట్టింది , ఇప్పటికి  అదేపేరు  పెద్ద అయినా ఎవరికీ అసలు
  పేరు  తెలీదు . పనులు కూడా  అన్ని కన్నయ్య పనులే ,మనిషికి  నిలువెల్లా  వెటకారం . ''వచ్చేవా రా
  నీ పెళ్లి  ఆగి పోయింది '' అన్నాడు ,నా గుండె  గుభేల్  మంది , ఎంగేజ్  మెంటే  పెళ్ళిలా  చేసారు ,ఇప్పటికే
  అందరూ ఇంత  గ్యాప్  ఎందుకు  వచ్చింది ? ఇన్నాళ్ళు  లేట్ చేస్తే పెళ్లి [ఆగి ] తిరిగి  పోతుంది ,అనే వారు
  అనుకున్నంతా  ఐంది  అని ఏడుపొచ్చేసింది ,కన్నా మాత్రం  ''బయట  చూసేవా మీ  అత్తవారి  వూరు
 నించి  వచ్చిన  సూర్యం  చచ్చి పడున్నాడు ,అమ్మ భోజనం లో  కాకరకాయ  వేసి పెట్టింది ,అది కూడా
 మూడు రోజుల క్రితం ది ,తినేసాడు  చచ్చి పాయిన ట్టున్నాడు''  అన్నాడు . నేను  వస్తూ చూసాను  గా
 నమ్మేసాను , ఆ భంగిమ  తల వాల్చేసి ,నాలుక వదిలేసి  నిజమే  నని పించింది . ఉదయం  ఫ్రిజ్ నుండి
 తీస్తుంటే  వద్దని  ఉన్చేసిందిగా ,వేసేసి  ఉంటుంది , తినేసి వుంటాడు ,అతనికేమి  తెలుసు  పాపం పోయాడు
 పెళ్లి  ఆగిపోఇంది , చంద్రకి  కూడా  కాకరకాయ  పులుసు  పెడుతుందేమో  అని అత్తమ్మ  పెళ్లి వద్దంటుంది
 ఏ డుపు  వచ్చేసింది ,అప్పుడు  అంత   అమాయకంగా  వుండే  దాన్ని . ఇంతలో  బయట  మాటలు
 వినిపించాయి  నాన్న వస్తూ ,సూర్యం  గారిని  పలకరిస్తూ , టీ  తీసుకుని  వెళ్ళమని  చెప్తున్నారు ,అతనేదో
 అంటున్నాడు ,    బ్రతికే  ఉన్నాడు   ఇదంతా  మా  అన్న  వేళా  కోళం  అన్న మాట  అతని గొంతు  వినగానే  అమ్మయ్యా  ప్రాణం  లేచి వచ్చింది . చాల రోజులు  అన్నయ్య  ఇంటికి  వచ్చిన  వాళ్ళందరికీ  ఇదే  చెప్పేవాడు , నాకు  కూడా  తరచు గుర్తు  వచ్చి  నవ్వుకుంటాను ..............
   
   

Sunday, August 17, 2014

చిన్నికృష్ణా నిన్నుచేరి కొలుతు ........


     
  మాఇంటి  చిన్ని  కృష్ణుడు , చిన్నికృష్ణా  నిన్ను  చేరి  కొలుతు ,
మాఇంటి  నల్లని కన్నయ్య   తెల్లని  కన్నయ్య ఐనవేళ  ఆ  అందమే  వేరు

    

అసలైన   నల్లనివాడు ,  నీలమేఘ శ్యాముడు ,
                                                                   

అందరి కి   కృష్ణాష్టమి  శుభా కాంక్షలు .
                                     


   
Thursday, August 14, 2014

ఎటో వెళ్లిపోయింది............


ఈ  గుల్లం  బావుంది  కదా ,ఇది  మాదే ,నేను  చంద్ర  బయటికి  వెళ్ళాలంటే   ఈ  గుల్లం  మీదే  వెళ్తాం .

అని అంటా ననుకున్నారా , ఒకసారి  ఇంపీరియల్  గార్డెన్ లో  సిల్క్ ఎక్సపో  పెడితే  అక్కడికి  వెళ్లి

నపుడు  తీసిన  పిక్ ఇది .
     నేను తరచూ  క్యాంపు  కేళ్తుంటాను ,  ఆ టైం  లో పిల్లలికి  వంట్లో  బాగోక పొతే  ఇబ్బంది  పడతావు  నువ్వు 
కార్  డ్రైవింగ్  నేర్చుకో , అన్నారు  చంద్ర , కానీ పాత స్కూటీ  అనుభవం  ఇంకా  మర్చి పోలేక , వద్దులే  అన్నా 
తను  మాత్రం  పట్టు  వదలకుండా  టూ  వీలేర్  ఐతే  పడతావని  భయం ,కార్ కి  ఆ ప్రాబ్లెం  వుండదు  అంటూ 
నచ్చ చెప్పేరు ,ఎవరో పక్కన కుర్చుని  నేర్పడం ఎందుకు  మీరే  నేర్పచ్చు కదా  అని అడిగాను , 'అంటే వాళ్ళు 
సిస్తేమటిక్  గ నేర్పిస్తారన్నమాట ,మన కార్ ఐతే , కొత్తది  కొనాలి 'అన్నారు . [ఆహా  నామీద ఎంత నమ్మకం ?]
సరే  ఐతే  అన్నాను . డ్రైవింగ్ స్కూల్  నించి కార్  వచ్చింది ,రోజు ఇంటినించి  పిక్ అప్ , డ్రాప్ , ఆరు కిలోమిటర్ 
ఇచ్చేవాడు ,ఒక్క స్టీరింగ్  కె వారం తీసుకు న్తారట , కానీ  స్టీరింగ్  కంట్రోల్ బావుందని  నాలుగో రోజే గేర్ వెయ్యడం 
నేర్పించాడు . నేను మొదటి రోజే  అడిగాను 'బ్రేక్ , అక్సిలేటర్  మరీ  పక్క పక్కనే  ఉన్నవున్నాయి  కదా  అలా 
ఎందుకని ,  డ్రైవర్  అదేగా  నేర్చు కోవాలి  మరి  అన్నాడు . మనసులో  మననం  చేసుకునేదాన్ని , ఇది  బ్రేక్ 
ఇది అక్సిలేటర్ , ఎంత టెన్షన్  లో వున్నా ,దాని మీద  కాలు  దీని మీద  పెట్టకూడదు , ప్రమాదం  అని  నాకు 
నేనే  ట్రినింగ్  ఇచ్చుకునే దాన్ని . ఖాళీగా  వున్నపుడు  లోతు  గరిట  పట్టుకుని   గేర్  ప్రాక్టిస్  చేసేదాన్ని . 
      
        నెల రోజులు వెళ్ళాను ,నైట్  డ్రైవింగ్  రెండు క్లాసెస్ ,రివర్స్  రెండు ,  మేకానిజెం  ఒకటి .  పక్కన డ్రైవర్ 
వున్నాడు  కదా  అని  అక్సిలేటర్  మీద  కాలు తీసే  దాన్ని  కాదు , అతను కూడా  స్పీడ్  వద్దని చెప్పలేదు . 
స్పీడ్  వెళ్తేనే  కార్ ,  అనే  భావన  వచ్చేసింది . ఇంటి దగ్గరే రివర్స్ ,టర్నింగ్  ప్రాక్టిస్ చేసేదాన్ని , ఒకరోజు 
అలాగే  ప్రాక్టిస్  చేస్తున్నా , చంద్ర పక్కనే వున్నారు ,అనుకోకుండా  గల్లిలోనించి  ఒక స్కూటర్  అతను 
వచ్చేసాడు ,నేను అలెర్ట్ అయ్యి  స్టీరింగ్  పక్కకి  తిప్పేసాను కాని ,బ్రేక్ బదులు  అక్సిలేటర్  తోక్కేసాను . 
స్కూటర్  అతను  బ్రతుకు జీవుడా  అంటూ వెళ్ళిపోయాడు ,కార్  ఒక ధాబా లోనికి దూసుకు పోతోంది . 
బయట  స్టూల్  మీద కూర్చున్న  అతను  అనుకోని ఈ  హటాత్ పరిణామాని కి ,దూసుకొస్తున్న  మృత్యు 
దేవతలా  ఉన్న  నన్ను నోరు వెళ్ళ బెట్టీ  చూస్తూ  బిగిసి  పోయాడు . అంతవరకూ  లేచి పారిపోతడనుకున్న  
నాకు  అర్ధ మయింది ,అతను  లేవడని ,లేవలేడని ,నా మెదడు [మోకాల్లోనించి ]లోనించి  బీప్ బీప్  మని 
సౌండ్  తో సిగ్నల్  వచ్చింది . కాలు తీసి  బ్రేక్ మీద పెట్టమని ,తేరుకున్న  చంద్ర కూడా 'బ్రేక్  బ్రేక్ ' అని 
అరిచేరు ,బ్రేక్ వేసే సరికి  సరిగ్గా  అతని మోకాళ్ళ కి ఇంచ్  దూరం లో  ఆగింది కార్ , అంతా సెకండ్స్ లో 
జరిగింది , దేవుడా  బ్రతికించేవు ,ఈరోజు ఇతని ప్రాణం  తీయకుండా  కాపాడేవు . అని మనసులోనే మొక్కు 
కున్నాను .' డ్రైవింగ్  అంటే ఆట  కాదని  ప్రాణాలతో  వేట' అని  అర్ధమయ్యింది . రాస్కోరా  సాంబా  అయ్యో 
ఇక్కడే  సాంబా  లేడు కదా ! సరే  అయితే  మళ్లీ  కలుద్దాం ! బై ........... 

Monday, August 11, 2014

నా డ్రైవింగ్

       ఉన్నది  ఒక్క  ఆదివారం , ఇంట్లో  ఉండేదే  తక్కువ , ఒక స్కూటీ  కొనిస్తే ,కూరలు ,  కరెంట్  బిల్ ,పోన్ బిల్ 
అన్ని  నేనే  చూసుకుంటాను  కదా .  పాత  సినిమాలో  ఇల్లాలి  లా ' ఇన్నేళ్ళ  కాపురం లో  మిమ్మల్ని ఎప్పుడన్నా
ఎమన్నా  అడిగానా , అన్నా . గొంతు లో  పచ్చి వెలక్కాయ  పడ్డట్టు  చూసారు  చంద్ర . అంతే  కాదు  చూద్దాం  లే 
అంటూ  దాటేసారు . ఒక్కసారి  నా  మోకాల్లోకి  ఒక ఆలోచన  వస్తే  ఎంతకీ పోదు [నా  బుర్ర  అక్కడే వుంది  మరి ]
వదలకుండా  జిడ్డులా  పట్టుకున్నా , మాట్లాడితే  ఇన్నేళ్ళ  కాపురం లో ....ఎప్పుడన్నా  ఏదన్నా  మిమ్మల్ని .... 
ఈనస  భరించ లేక , ఒక 'సరైన  సమయం లో ' కొత్తది  కాదు ,పాతది  కొనిస్తా ,నీకు  బాగా వచ్చాక  మార్చి కొత్తది 
 కొంటాను  అని  కమిట్  చేయించారు . మెకానిక్  చెప్పి ,ఒక వైట్  స్కూటీ  కొన్నారు . దానికి  పూల మాల  వేసి 
పసుపు ,బొట్టు ,పెట్టి  నిమ్మకాయలు  తొక్కించి ,పార్క్  తీసుకేల్లాము ,కంటోన్మెంట్  ఏరియా  కావడంతో  పార్క్ 
లో ప్రేమ  జంటలుండవు , మనం  డర్టీ పిక్చర్  చూడక్కర్లేదు . బాయ్స్ మాత్రం  క్రికెట్  ఆడుతుంటారు . స్కూటీ 
నేర్చు  కోవడం మొదలు పెట్టా , ఎలాగో  కిందా ,మీదా   పడి  నాలుగు  రోజుల్లో  నేర్చేసుకున్నాను . ప్రాక్టిస్  బాగా 
చెయ్యమని  చంద్ర  ఒకచెట్టు  చూసుకుని  పేపర్  తీసారు , నేను జాం   జాం మంటూ రౌండ్స్  కొట్టేస్తున్నను . 
ఇంతలో  పెద్ద శబ్దం ,కళ్ళు  చీకటి  కమ్మాయి . చుస్తే  స్కూటీ 7 వ  నెంబర్ ,నేను 3 వ  నంబరే  వేసున్నాము . 
ఎక్కడో  ఏదో  కలుక్కు  మంది . నేను  ఇక్కడ  వుంటే ,స్కూటీ పదడుగుల  దూరం లో వుంది . బాయ్స్ పరుగున 
వచ్చి  స్కూటీ  లేపారు ,చంద్ర పరుగున  వచ్చి వాళ్ళెక్కడ  నన్ను లేపెస్తారో  అని  తనే ముందు  నన్ను  లేపారు . 
[జెలసి ]. మొత్తానికి  అన్ని పార్ట్లు  బానే  ఉన్నాయని  నిర్ధారించుకుని ,ఇంటికి  వచ్చాము ,మరుసటి రోజు  నేను 
భయ  పడుతూ  కూర్చుంటే  కుదరదు ,సాహసం  చేయరా  డింబకా ,రాజకుమారి  దొరుకుతుంది  అనుకుంటూ 
స్కూటీ  తీసి మార్కెట్  కి  వెళ్ళాను ,  ఒక  టీ బడ్డి  దగ్గర బండి  పెట్టేసి , స్టైల్ గా  కీ  ఊపుతూ  వెళ్ళి  కూరలు   కొన్నాను  బండేగా  మోస్తుంది  అని కొంచెం  ఎక్కువే కొన్నాను  ఎలాగో  అవి తీసుకుని  వచ్చి స్కూటీ కి తగిలించా 
వెళ్ళేప్పుడు  లేని  ఒక  బైక్ ,రెండు సైకెల్  అక్కడ  వున్నాయి . రోడ్  ఎత్తులో వుంది ,మట్టి లోనించి  తీసి  రోడ్  ఫై 
పెట్టడం  నావల్ల కావడం  లేదు , చుట్టూ చూసాను ఎవరి పనుల్లో  వాళ్ళున్నారు . టి షాప్ అతను చిల్లర లెక్క 
పెట్టుకునున్నాడు . ఏమి చెయ్యాలి అని చూస్తున్నాను , బల్లమీద  కూచుని  చిన్న గాజు  గ్లాస్  లో టి  తాగుతున్న 
ఒకతన్ని చూసా ,పూలు అమ్ముతడను కుంటా పక్కనే సైకిల్  దానిమీద జంగిడి  దానిలో పూలు తడి  గుడ్డ కప్పి 
వున్నాయి ,''భయ్యా '' అనిపిల్చాను ,అతను అటు  ఇటు  చూసి  తననే  అని నిర్దారించుకుని 'హా  బోలో 'అన్నాడు 
'జర  గాడి నికాలో భయ్యా ' అన్నా ప్లీసింగా ,వెంటనే వచ్చి  బండి రోడ్ మీద  పెట్టేసి 'ఠీక్ హైనా 'అన్నాడు నేను 
థాంక్స్  చెప్పాను 'అరె ఇస్మే  క్యాహే బెహన్ ' అన్నాడు ,ప్రతి వారం ఈ టైం కి  ఇక్కడే  ఉంటాడా  అడుగుదామను
కున్నా , బావోదేమో  అని ఊరుకున్న ,మెల్లగా  బేలన్స్ చేసుకుంటూ  బయల్దేరా , అదేమీ చిత్రమో  అందరూ 
నన్ను దాటి  వెళ్లి పోతున్నారు , ఆఖరికి సైకిల్  వాళ్ళు కుడా ,వాళ్ళని ఆశ్చేర్యం గా చూసుకుంటూ  ఇంటి 
దారి పట్టా , లారి  వచ్చినా ,బస్ వచ్చినా ప్రక్కకు  ఆపేస్తూ , మళ్ళి రోడ్ మీదకి వస్తూ ,నానా  తంటాలు  పడుతూ 
వస్తుంటే  ఎదురుగా కార్ లో  వస్తున్న 'స్మార్ట్ ఫెల్లో ' నవ్వుతూ ఏదో సైగలు చేసాడు ,''సచ్చినోడ ,అక్కా ,చెల్లెళ్ళు 
లేర్రా ,పోతవురరేయ్  వెళ్ళే దార్లో  కరెంటు స్తంబానికి  కార్ గుద్దుకుని ,కాళ్ళు  చేతులూ  విరిగి పోతాయి రా ''
అని  సపించాను . ఇంకాస్త ముందుకు రాగానే  బైక్ ఫై  వస్తున్న వాడు కూడా ఏదో సైగ చేస్తూ  వెళ్ళాడు . ఏమైంది 
ఈవేళ  ఈసచ్చి నోల్లందరికి  వీడుకూడా  బస్ గుద్దు కుని ... ఒక పెద్దాయన 'అమ్మా రైట్ సిగ్నల్ వేసుకు ని 
వెళ్తున్నావు  అన్నాడు [ఆడవాళ్ళం కదా అనుమానం  ముందు పుట్టి  వెనకాల మేము పుడతాము . ]అయ్యయ్యో 
ముందు  వెళ్ళిన వాళ్ళిద్దరిని కాపాడు  దేవుడా నామంచికె  చెప్పారు ,అని అనుకుంటూ  డ్డు .. డ్డు మంటూ 
ఇల్లుచేరాను ,ఛత్రపతి లా  సంచి లాక్కుంటూ వచ్చా . అన్న మాట ప్రకారం  పనులన్నీ  నేనే చేసే దాన్ని అయితే 
ఇలా రెండు నెలలు కూడా గడవలేదు ,స్కూటీ సెల్ఫ్ స్టార్టర్ పోయింది . మెకనిక్ చూపిస్తే  వాడు  బండి ఖరీదు 
అడిగాడు , ఇలా కాదని  కిక్ అలవాటు చేసుకున్నాను . స్కూల్కి వెళ్లి పిల్లలిని  తేవాలంటే మూడింటికి మొదలు 
పెట్టాలి కిక్ కొట్టడం ,ఒకోసారి  నాలుగయ్యేది ,వాళ్ళే వచ్చేసి ,బాగ్స్  నా మొహాన  పారేసి  వెళ్ళేవారు  కోపంగా 
మరుసటి రోజు నుంచి  లంచ్  అవర్ కె మొదలు పెట్టే దాన్ని కానీ నా కాలు  ఎందుకూ పనికి రాదనిపించి న్ది . 
ఇంక ఇలా కాదని  నాకు  నేనే  బండి  అమ్మేయ్  అన్నాను . వెంటనే ఉత్సాహంగా [ఇలాంటి వాటికీ ముందుంటారు 
అమ్మి పారేసారు . నా జీవితంలో ఎప్పుడు  ఏమి  అడగనండి  అని పరోక్షం గా  నాతోనే  అనిపించారు . 

Friday, August 8, 2014

వరలక్ష్మి వ్రతం

            వరలక్ష్మి  వ్రతం  కదా అందరికి  ఆహ్వానం   దయచేయండి
 
     పసుపు  కుంకుమ  తాంబూలం  స్వీకరించి , వరలక్ష్మి  అనుగ్రహం  పొందండి .


         మా  ఆహ్వానాన్ని  మన్నించి  వచ్చినందుకు  కృతఙ్ఞతలు  ఆసినులుకండి ,            వరలక్ష్మి దేవి ని   దర్శించి  తరించండి , 
       ఇస్తినమ్మా  వాయనం , పుచ్చుకుంటి  నమ్మా  వాయనం , 


Monday, August 4, 2014

సాటి వారితో పోటీ

     పక్కింటి  శ్రీనివాస్  గారు  వాళ్ళ  అబ్బాయి ని  కాలేజ్  లో జాయిన్  చేస్తూనే  ఆక్టివ  బండి  కొనిచ్చారు  మొన్న  కూతురి  పుట్టిన రోజు కి  ఇరవై వేలు  పెట్టి ,  సెల్ ఫోన్  కొనిచ్చారు .  మగవాళ్ళు  ఇంటికి  వచ్చింది  మొదలు ఇదే 
 పని  ఇల్లాలికి ,  అందరూ  కాక పోవచ్చు  కానీ చాల మంది  ఇలాగె  ఉన్నారు .  వీధి  చివర ఉండే  బ్యాంక్ మేనజేర్ 
 కొడుక్కి  స్పోర్ట్స్ బైకే  కొన్నారు ,మనవాడు  కాలేజ్  కొచ్చే సరికి మనం  కొనగలమా ? , పయ్  పోర్షన్  సుధారాణి 
 సొంత ఇల్లు  కట్టు కుంటున్నారు ,పూర్తీ కావచ్చిందట మనమెప్పుడు  కట్టుకుంట మో ,  ఎలా  కట్టుకుంటారు ?
 భర్త ది  గుమస్తా  ఉద్యోగం ,బయట  కేవలం  లక్షల్లో సంపాదించే  వాళ్లే బ్రతికే  పరిస్తితి లున్నాయి . ఇంకా అతనికి 
 ఏ  అలవాట్లు ,అప్పులు ,లేవు గనుక ,గుట్టు గా  ఇల్లు  నడుపు కొస్తున్నాడు . భార్యే  అర్ధం  చేసుకోపోతే  ఎలా ,
 రోజంత కష్టపడి  ఇంటికొచ్చే  భర్త తో ఏమి మాట్లాడాలో తెలియక పోతే  ఆ మానవుడికి ఇంటికి రావలనిపిస్తుందా 
 వాళ్ళెవరో  ఇల్లు  కట్టు కున్నారంటే ,వాళ్ళకి  చిన్న పిల్లలు ,మగపిల్లలు . మరి  వీళ్ళకో ఇద్దరు  ఆడ పిల్లలు పెళ్లి కి   ఎదిగి ఉన్నారు . మంచి సంబంధం  వస్తే చేతిలో డబ్బు ఉండాలిగా ,అంతా ఇంటిమీద పెట్టుక్కుర్చుంటే ఎలా మరి .  వాళ్ళెవరో  బైకు కొన్నారంటే , వాళ్ళ దగ్గర  డబ్బు  ఉండి వుంటుంది . లేదా తీర్చ గలమనే  నమ్మకం వుంటుంది . 
 మీరు  అప్పు చేసి బైకు  కొని చ్చి ,పడితే అప్పుచేసి వైద్యం  చేయించి ,ఇవన్ని సాధ్యమేనా , ఈరోజుల్లో డబ్బుకున్న 
 విలువ  అందరికి  తెలుసు ,ఖర్చు కు పరిమితులు  లేవు . ఏ ఇద్దరి  ఆర్ధిక పరిస్తితి  ,కుటుంబ  పరిస్తితి ఒకలా 
 వుండవు  కనుక' సాటివారితో పోటీ '  పోలికలు అస్సలు వద్దు . ఏ నిర్ణయం తీసు కోనేప్పుడైన  భార్య  భర్తలు 
 కలిసి  కుర్చుని  అలోచించి ,నిర్ణ ఇంచు కోవడం ,వాస్తవానికి [ప్రాక్టికల్ ] దగ్గర గా ఉందా ,ఆచరణ లో సాధ్యమేనా 
 అన్నది చాల ముఖ్యం .


              ఇంకొందరి  ఇళ్ళల్లో  భార్యాభర్త లిద్దరిది  ఒకటే తీరు , లేని పోని  బడాయిలు ,హెచ్చులూ ,ఇద్దరికీ
  ఎవరింట్లో  ఏమివుంటే  అవే  కావాలి . అప్పులతో  తిప్పలతో  ఇల్లు నింపేస్తే , గొప్పగా బాగానే వుంటుంది
  ఏదైనా కింద మీదైతే , పింక్ స్లిప్ లు  వస్తే  కాచుకునేందుకు , మల్లి దొరికే దాకా ఇల్లు  నడిపేందుకు ఆధారం
  వుండదు . ఈ బడాయిలే పిల్లలికి  వస్తే  వాళ్ళు కూడా  ఫోన్ లు , బళ్ళు ,అంటూ  తిరుగుతారు . ఒక్కసారిగా
  పరిస్తితి  మారిందని  చెప్పినా ,తట్టుకోలేరు . ఇది అవసరమా , మొదటి నుంచి  ఎలా వుంటే  మంచిదో వాళ్ళకి
  చెప్పాలి , చిన్న చిన్న  సరదాలు  తీర్చాలి , మన తలకు మించినదైతే  ,కుదరదని చెప్పాలి . మొదట అలవాటు
  చేసి  తర్వాత  బాధ పడేకన్నా ,చూచాయగా  ఆర్ధిక పరిస్తితి  వివరించాలి . ఎంతవరకు చేయగలమో  వాళ్ళకి
  అవగాహన  ఏర్పరిస్తే  పిల్లలు చాల  తెలివైన  వాళ్ళు ,మనం తీర్చలేనివి  అడగరు . ఎలాపెంచితే  అలా  పెరుగు
   తారు . మీరు గమనిస్తూ వెళ్తే  మీకే అర్ధ మౌతున్ది .

              బైక్  కొనిచ్చే  ముందు  ఆలోచించండి ,కాలేజీ  పిల్లలు బైక్  తీసుకెళ్ళడానికి , బెంగళూర్ లో పర్మిషన్
  లేదు  అలాంటివి  ఇక్కడ  కూడా  వస్తే  [అన్నిచోట్ల ]బాగుంటుంది . చిన్న పిల్లలికి  పెద్ద బైక్  కొనిస్తున్నారు .
  మరివాళ్ళు  వాటిని  ఎలా  వాడుతున్నారో ,గమనించెదెవరు  , కొని ఇవ్వడం తో  బాద్యత  తీరిపోదు ,అలా
  అనుకుంటే  ,వాళ్ళు బెట్  కట్టి రేసింగ్  చేస్తున్నారని , వీలింగ్  అంటూ ప్రాణాల మీదికి  తెచ్చు కుంటున్నారని
  ఎప్పటికి  మనకి  తెలీదు . నేననుకోడం  ఇక్కడ అమ్మే బైక్ లు  ముప్పయ్ శాతం  మాత్రమే  ఇండియన్
  రోడ్స్  కి  సరిపోతాయి , మిగతావాటికి  విపరీతమైన  పికప్  వుంటుంది . చిన్న రేస్  ఇస్తేచాలు దూసుకు
 పోతాయి , ఇక్కడి ట్రాఫిక్ కి  అనువు కావు . కనీసం  షో రూం  లో కూడా వాటిని  ఎలా వుపయగించాలో
 చెప్పరు , డిస్క్ బ్రేక్  ఎప్పుడు వాడాలి  , ఎందుకు  వాడకూడదు ఇలాంటివి . సిగెరెట్ ప్యాకెట్ మీద  పొగ
 తాగ వద్దు  అని వుంటుంది  ఎవరు మానేస్తారు ? అలాగే ప్రమాదం  గురించి  చెప్పినంత  మాత్రాన  బైక్
 కొనడం  మానరు . షోరూం  వాళ్ళు కూడా ఎంతో  కొంత వివరించడం  తప్పనిసరి  కావాలి  ఎందు కంటే
 ఎ  ఫ్రెండ్  దగ్గరో నేర్చుకుని  బండికోనడానికి  వస్తారు ,కానీ అతని దగ్గర వున్నది  కాక వేరేది ఎంచు
 కుంటారు  దాని సమస్య లేమితో  తెలీదు  వాళ్ళకి తెలియ చెప్పడం  అమ్మే వారి బాద్యత . ఈమధ్య
 గండిపేట్  వెళ్ళినపుడు  వాళ్ళ ఫీట్స్ చూసి , వాళ్ళ తల్లి తండ్రులు  గుర్తు వచ్చి గుండె దడదడ మనింది .