Total Pageviews

Sunday, August 24, 2014

శోభనం గది


    నా చిన్నప్పుడు  మాఇంటికి  పెళ్లి పిలుపులకు  చుట్టాలు  వచ్చారు . ఒకపెద్దయన,  ఇద్దరు  కుడా  వున్నారు .
పెద్దయనేమో  చాలా  నల్లగా వున్నాడు ,తెల్లని  బట్టల్లో  మెరిసి పోతున్నాడు . నేను ఎప్పుడు  నాన్నగారి  కుర్చీ
హండిల్ ఫై  కుర్చుని  వుండే దాన్ని ,ఎవరు వచ్చినా  సందేహాలన్నీ  అప్పుడే  అయన చెవి లో అడిగేసేదాన్ని .
ఆయన ఎవరూ  అని చెయ్యి అడ్డుగా పెట్టి చెవిలో అడిగాను ,నాన్నగారు నవ్వు ఆపుకుంటూ 'కాటన్ తాత 'అని
చెప్పారు ,నేను మళ్లీ చెవిలో అడిగాను 'సిల్క్ తాత 'అని ఎందుకు పెట్టుకోలేదు ? అని ,అప్పటికే తాత గారు
ఏమంటోంది  పాపా 'అని అడిగారు , నాన్న గారేమో మీగురించి అడుగుతోంది  అని సర్దేసారు . ఆయన చాల
ముచ్చటపడి పాప ని కూడా తప్పకుండా తీసుకు రావాలని చెప్పి వెళ్లారు . వెళ్ళాక ఆయన పేరు తాలుకు
వివరాలన్నీ చెప్పారు . అప్పట్లో  దవల్లెస్వరం  ఆనకట్ట  కట్టించిన  '' సర్ ఆర్ధర్ కాటన్ ''అంటే  రైతుల కి ఎంతో
ఆదర్శం ,అందుకే పిల్లలికి  మనవలికి  కాటన్  అని పెట్టుకునే వారట , అదికాస్తా  పలకడం లో కాటన్న అయింది
అంతే కానీ కాటన్న , సిల్కన్న ,కాదు  అనిచెప్పారు . సరే పెళ్ళికి  నన్ను కూడా తీసుకు వెళ్ళాలని  ముగ్గురం
బుల్లెట్  ఫై వెళ్ళాలని [డిపార్ట్ మెంట్ ది ] అనుకున్నాము . వెళ్ళే టైం కి షూ లేకుండా కిక్  కొట్టడం తో [అప్పుడు
సెల్ఫ్ స్టార్టర్ బులెట్ కి లేదు ]కిక్ రాడ్ కాలికి తగిలి  బ్లడ్ వచ్చింది . నాన్నగారు  చిన్న ట్రీట్ మెంట్ తీసుకున్నాక
అంబా సిడేర్ కారులో ,పెళ్ళికి వెళ్ళాము ,పెళ్లి ఎలా జరిగింది  అని మాత్రం  అడగకండి . ఎందుకంటే  అటుపక్క
పెళ్ళిళ్ళు  అర్ధ రాత్రి ముహుర్తాలు ,పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా చక్కగా రెడీ ఐ  పందిట్లో  నిద్రపోతూ వుంటారు .
అంతరాత్రి  పూట ఎవరికీ నిద్ర ఆగుతుంది  చెప్పండి , పెళ్లికొడుక్కి ,పెల్లికుతురికి ,అంటే తప్పదు  వాళ్ళ పెళ్లి
కదా , పంతులు  అలారం  పెట్టుకుంటా డెమో ,టైం కి లేచి ' భజంత్రీలు  భజంత్రీలు 'అనగానే  శబ్దానికి అంతా
లేచి  అక్షింతలు  వేసి మళ్ళి సర్దుకుని ,పడుకుంటారు . సాదారణం గా ,ఇలాగె  జరుగుతాయి కొంచెం  అటు
ఇటుగా
           
         ఆ సాయంత్రం  నేను  స్వీట్స్  సర్దుతున్న  రాములు  అనే అతని దగ్గర కెల్లాను . రండి పాప గారు
కుర్చోండి  , అన్నాడు  మళ్ళి అతనే  పెళ్లి చూసేరా అనిఅడిగేడు ,నేను తలుపేను  లేదన్నట్టు . ఎవరు
సూడలేదండి ఒకరితల్లో ,ఒకరు తలెట్టుకుని పడుకున్నారండి  ఆనాక పెళ్లి కెల్లాము తల్లో పేల ట్టయంటే
అట్టావా అండి  మరీ .. అన్నాడు . నేనేమి  అనలేదు .

రాములు  : చీనా  మిటాయి యుండ  తింటా రండీ ..

నేను        : చీనా  అంటే  చీమలు వుంటాయా ?
రాములు  : అయ్ బాబోయ్ ,చీనా  అంటే పంచాదరండి
నేను         : మరదేంటి .....
రాములు   : పంచదార చిలకండీ  తింటారా ......
నేను          : మరది కోడి పుంజులా  వుంది ?
రాములు    :  కోడి పుంజు కాదండీ  చిలకేనండి ..
నేను           :మరిదో ....
రాములు     :ఇది తొక్కుడు లడ్డు  ఇది  తింటారా
నేను            : ఛి ఛి    కాళ్ళతో   తొక్కి  చేస్తారా ?
రాములు     :అబ్బే  కదండీ ,మీకేం తెల్దండి , చప్పటి జంతికలు  చేసండి
 ,మరపట్టి , పాకం లో ఏసీ ఉండలు  కదతారండి ..
నేను           :ఇన్నెందుకు ?
రాములు     : రాత్రికి  శోభనం గది లో ఎట్టాలి  కదండీ ,
నేను          :శోభనం  గది అంటే ? మా  ఇంట్లో    దేవుడి  గది వుంది ,
పడక గది వుంది , స్నానాల గది వుంది ,శోభనం గది లేదే .........
రాములు      : అయ్  బాబోయ్  మీరు చాలా  తెలివయ్ నోరు పాపగారు .....      

     [  నేను ; ఇప్పుడు ; తెలివికాదు  రా  తింగ రోడా దాన్ని "కామన్  సెన్సు"  అంటారు ]     . 

No comments:

Post a Comment