Total Pageviews

Thursday, December 25, 2014

తెలుఘోరాలు ..........


తమిళులు  సినిమాకి   తమిళ్  పేరు  కాకుండా  ఇంగ్లిష్ లో  పెడితే  చూడరు ,వారి భాష  మీద వారికంత ప్రేమ .
 తెలుగు  భాష  ఎప్పుడో , దారి  తప్పి పోయింది , ఎక్కడో  ఒకటి  అరా  ఎవరన్నా పిల్లలికి  తెలుగు  మాట్లాడటం
వస్తుంది . చదవడం  అసలే  రాదు ,ఎందుకంటే ,మనకి  ' ఎంగ్లిష్ ' అంటే  అంత మోజు,  బడి లో  వెయ్యడమే 
 A B C లు  తప్ప ,అ ఆ  లు  దిద్దిన్చము , పిల్లలు తెలుగు  చదువుతున్నారు  అంటే  లోకువై పోతాము 
అనే భయం . ఇంగ్లిష్  ముఖ్యమే  కాని , ఇక్కడ  బ్రతకాలంటే  తెలుగు  కూడా  ముఖ్యమే  కదా ! మీరు కూడా 
చూసే  వుంటారు , బస్టాప్ లో   నించున్నప్పుడు  చాల మంది ,చదువు రాని  వాళ్ళు ' ఆ బస్సు  ఏవూరు 
పోతుందమ్మా ' అని అడుగు తుంటారు . కొన్నాళ్ళకి  మన  పిల్లలు  చదువు కుని కూడా ,ఎవరన్నా  వురి వాళ్ళని 
ఆ  బస్ ఏ  వూరు పోతుంది ' అని అడగాల్సిన  పరిస్తితి  వస్తుంది  ఎందు కంటే  వాళ్ళకి  తెలుగు  రాదు  కదా !
ఇదంతా  మనకి  అవసరమా ,తెలుగు ' కూడా ' ఒక సబ్జెక్ట్  గా  తీసుకోమని  ప్రోత్సహించాలి . మా పిల్లల కి 
అలాగే  తెలుగు  కూడా  తీసుకున్నాను . ఇప్పుడు  మర్చి  పోతారేమో  అని  న్యూస్  చానల్లో వెళ్తున్న లైన్స్ 
చదవమంటాను . ఇదంతా  ఎందుకు చెప్తున్నా నంటే , మన  టీ  వి  లలో  ప్రేజెంటర్  నోట్లో  ద్రాక్ష  పండు 
పెట్టుకుని  మాట్లాడు తుంటారు ,[నేను ద్రాక్ష  పండు పెట్టుకుని  మాట్లాడి  చూపిస్తాను  పిల్లలికి ] అచ్చు 
అలాగే వస్తుంది  మాట . తెలుగేదో తప్పుడు భాష అన్నట్లు ,అది మాట్లాడితే  పరువు పోతుందన్నట్లు 
తయారైంది మన పని . ఈమధ్య న్యూస్  చూస్తుంటే  న్యూస్  రీడెర్ ''ఇవి ఈనాటి  ఇసీసాలు '' అన్నాడు . 
ఏమి సీసాలో  నాకైతే అర్ధం కాలేదు . నిర్ణయం అని పలకడం రాని  వాళ్ళుకూడా  న్యూస్  చదివేస్తారు 
నిరణ యం  అంటారు .  సోనియమ్మ  అనడానికి  '' సో'  నియ్యమ్మ అనేవాళ్ళు వున్నారు .  మీయ పూర్ 
అనేది  హైదరాబాద్ లో ఒక ప్లేస్  దాన్ని ''మీ  అయ్యా పూర్ ''అని   అఫ్జల్ గంజ్  ని ''అప్పలగంజ్ ''అని 
చదువుతున్నారు  . నేను ఊరికే చెప్పడం లేదు మీరుకూడా  పరిశీలించండి  తెలుస్తుంది మీరే ఆశ్చర్య 
పోతారు . ఒంటేలు  మీద [ఒంటెలు మీద  ] ఊరేగారు , ఇలాంటివి విని  నాకు చాల బాధ  అన్పిస్తుంది .
 ఎలాంటి పక్షపాతం లేకుండా  పరిపాలిస్తానని ప్రమాణం  చేస్తున్నాను . 
 ఎలాంటి ' పక్షవాతం ' లేకుండా ,ఇది  సరైనదా . 
ఇక   ప్రకటనల్లో  జరిగే  తప్పులైతే అన్నీ  ఇన్నీ  కావు . 
హార్లిక్స్  ఏ డ్  ;  ఈవేల  హార్లిక్స్  ఇచ్చవ .. 
ఒక  నిముషం పాటు  కడిగితే  కాని ''క్రీములు ''పోవు [క్రిములు ]. 
సేవంటి  ఫైవ్  రూపాయలకే [సేవేంటి ఫైవ్  రుపీస్ అనాలి ,లేదా  డెబ్బై ఐదు అనాలి  కదా ] .
మీ టూత్  పేస్ట్ లో  వుప్పుంద్యా [ ఉప్పు వుందా ] .
దురగ  నై , అంటే తెలుసా ,''దుర్గా  నెయ్యి '' అన్నమాట .  
కొన్ని తెలుగు  పదాలు  అసలు   ఎప్పుడో కొట్టుకు పోయాయి .
విపులీకరించడం ,
విసదీకరించడం ,
విడమరచి  చెప్పడం  ,
మోషాడ గొట్టడం ,
వెగటు , నోటికి హితవు ,   ఇలాంటివి  చాలా .......... 
ఇలాంటి వి  ముందే ఊహించారేమో , మా  నాన్నగారు  మమ్మల్ని కూర్చో పెట్టి ,
''తక్షణమే  హస్తినకేగి ''
''విక్ష్వక్షేనుని  కొడుకు ఖస్  ఖస్  ఖం భట్లు '' ఇలాంటి కష్ట మైన పదాలు  నేర్పించే వారు . 
''రాముని  తో  కపివరుండు  యిట్లనియె '' అని రాయడానికి  ఒకతను  ఇలా  రాసాడని 
 వ్రాసి  చూపించే వారు . 
''రాముని   తోక   పీకి వరుడిట్లనియే '' అలా  వుంటుంది  భాష మీద పట్టు లేక పొతే . 
కాకినాడ లో ' గొడా రి గుంట ' వెళ్ళే దారి లో  ఒక కొట్టు  వుండేది . దాని పేరిలా  వ్రాసి  వుండేది . 
ఇప్పుడుందో లేదో ,పేరుమర్చారో  తెలీదు మరి . 
 ''కన్యకు     మారికి    రాణా షాప్ ''    అసలు   పేరు   ''కన్యా  కుమారి  కిరాణ   షాప్ ''   అదీ   విషయం .

                                         **************************

                                        క్రిస్మస్ శుభాకాంక్షలు 

                                         
                                        *****************************************

Thursday, December 18, 2014

చెక్కిన అందాలు . 1.
మాటల్లేవ్     మాట్లాడు కోడా ల్లేవ్ . 

                                                      *******************************

Thursday, December 11, 2014

త్రిష కి నచ్చే రంగులు

త్రిషకి  అన్ని  రంగులు  నచ్చ వేమో  అని  అనుకుంటున్నా ,లేకపోతే  సెంటి మెంట్ కూడా  కావచ్చు  ఎప్పుడూ
ఎక్కువగా  కనిపించేది ,పింక్  లేదా  బ్లూ . బహుశా  ఆ  రంగుల్లో  బావుంటుందని ,తనకనిపించి  ఉండచ్చు
నేను మాత్రం  త్రిషకు  నచ్చిన  రంగులు ఇవే  అని  ఫిక్స్  అయ్యాను .అదండీ  విషయం , ఏ దోవోకటి  కాకుండా, ఏ ది  నప్పుతుందో  అది వేసు కోవలన్నమాట . 

******************************
              

Friday, December 5, 2014

ఇది పెళ్లంటారా !!!.........

ఆ మధ్య  ఒక పెళ్ళికి  వెళ్ళాము . పెళ్ళికొడుకు  ముంబై  లో  ఉద్యోగం . పెళ్ళికూతురు  హైదరాబాద్  లో  ఉద్యోగం .
ఆమె  తల్లి తండ్రులు ,మావురే  కావడం వల్ల ,పెళ్లి ఇక్కడే  కనుక  వెళ్ళాం . వరుడి బామ్మ చాల  చలాకి  గా వుంది . 
ఆడపెళ్ళివారి తరపున  మర్యాదలకు ,లోటు జరిగినా , సర్దుకు పోతూ ,ముఖం మాడ్చుకున్న కోడలికి నచ్చచేప్తు ,
వధువు తండ్రిని హెచ్చ రిస్తూ ,అజమాయిషీ  చేసేస్తోంది . అందరింట్లో బామ్మలు ఇలా వుంటే ,సర్దుకు పోతుంటే 
ఏ ఇబ్బందులు  రావుకదా ! అనుకుంటూ  వెళ్ళిన కొంచెం సేపటికే  తన అభిమాని ని  అయిపోయా ,నేనుకూడా 
బామ్మనయ్యాక ఇంతే అవగాహనతో  అందరి తో [ఆశ్రమం లో చేర్పించ కుండా  ఇంట్లో  ఉండనిస్తే ]సర్దుకు పోవాలి 
అని  నిర్ణ ఇంచు[చేసు ] కున్నాను . మొదట్లో  ఐదు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవి ,తర్వాత  ఒకరోజు కి వచ్చాయి . 
ఇప్పుడేమో గంటల్లోకి వచ్చాయి . హైదరాబాద్  ట్రాఫ్ఫిక్ లో పడి ''కాస్త '' లేటు గా  వెళ్ళాం అనుకోండి  అంతే ,
విప్పేసిన పూలు ,ఎత్తేసిన కుర్చీలు ,బోర్లించిన  గిన్నెలు  కనబడతాయి . పెళ్లి వాళ్ళు వెళ్లి పోవడము ,మరో 
పెల్లివాళ్ళు వచ్చి అలంకారం  మొదలు పెట్టడం జరిగి పోతాయి . బిక్కమొగమేసి ,ఇదేమిటి ఇలా జరిగింది ?
భోజనం లేకపోతే  పోయే ,అలంకారం  వృధా ఐతే పోయే ,పెట్రోల్ పొతే పోయే , అసలు పెళ్లి వాళ్ళు  'పలక రించిన '
'పలకరించక పోయినా ' కనీసం  వాళ్ళ దృష్టి లో నన్నా పడాలి లేదా ,వీడియో  లోనన్న '  పడాలి ' తర్వాతన్న 
చూసుకుంటారు . ఆ అవకాసము పోయే ,ఇలా ఒకటి రెండుసార్లు జరిగాక ,నేను అందరికంటే  ముందు  అంటే 
ఉదయం తొమ్మిదికి ముహూర్తం  ఐతే ,ఏ డున్నరకే  అక్కడుండడం  మొదలు పెట్టాను . నేను వెళ్లాకే  ఆడ పెళ్లి 
వాళ్ళు ,మగ పెళ్లి  వాళ్ళు వస్తారన్నమాట . అలా ముందుగా  వేల్లికుచోడం  వల్ల  బామ్మ  మంచి ఇంట్రస్టింగ్
అన్పించింది ,ఆమె చుట్టూ అక్కడక్కడే  తిరగసాగెను ఇంతలో  ఒకరొకరె  రాశాగేరు . అందరు ముందుగ బామ్మ
ని పలకరించి వెళ్తున్నారు . ఇంతలో ఒకామె 'అత్తమ్మా 'అంటూ బామ్మని  వాటేసుకుంది ,ఎలాగున్నవే కాత్యాయిని
అంటూ ,మీ ఆయనేడే అంది ,ఆమె అటువేపు చూపిస్తూ  అక్కడున్నారు  అంది . అక్కడ చాలమందే  వున్నారు .
ఎవరెవరో  నాకర్ధం కాలా ,బామ్మకి అర్ధమైతే చాలని వుర్కున్నాను . ''నా కోడలివి  కావలసిన దానివి  ఈరోజు
ఇదంతా నీ చేతుల మీదుగా జరగాల్సిన  తంతు '' అంటూ బామ్మ  నిట్టూర్పు  విడిచింది . అబ్బో అనట్టు తలాడిస్తూ
ఇంతవిషయం  వుందా అనుకున్నాను . ''నీ తమ్ముడేగా  నువ్వు  హక్కుతో నాలుగు కేక లేస్తే  వినక పోయే వాడా
అంతా నువ్వు చేసి  ఇప్పుడనుకుని ఏమి లాభం ?'' అని  ఇదంతా నిన్నే జరిగినట్లు  నిష్టురమాడింది కాత్యాయిని
ఆమె గారి కళ్ళు కూడా తడిసాయని  నా అనుమానం . ''అవునే అత్తమ్మా మన సోమేసు [వరుడు సోమశేఖర్ ]
ముంబై లో వుద్యోగం ,అమ్మాయి హైదరాబాద్ ,మరి కాపురం ఎక్కడ పెడతారు''  అని అడిగింది . 'నీ మొహం
ఈ రోజుల్లో కాపురం అదీ  ఏమిటి ,వాడికేప్పుడు సెలవు దొరికితే అప్పుడు వస్తాడు ,రెండు రోజులుంది  వెళ్తాడు .
పిల్లా  అంతే ,డబ్బు ఉండాలే కాని  విమానం ఎక్కితే  గంటలో అక్కడుంటారు ,ఇద్దరికీ కలిపి  ఎంతోస్తుందో తెలుసా
...  లక్షలు . ' అంది . కత్యాయినికి  మండినట్టుంది  'ఆన్ లైన్ కాపురం అన్నమాట  అంది లేచి వెళ్తూ . బామ్మ
బాగా  ఆ లోచిస్తుందని ,ప్రోద్దుట్నించి ' ఆరాధించిన 'నేను  ఖంగు తిన్నాను . ఎందుకీ  పెళ్లి ? డబ్బుంటే  చాలా !
ఇద్దరికీ ఉద్యోగాలు మంచి జీతాలు వుంటే చాలా , జీవితం వద్దా , ఇప్పుడు ఈ బామ్మని కదిపినా ,పెళ్లి ఐన కొత్తలో
సంగతులన్నీ  ఒక్కటి  మరచి పోకుండా ,కులుకుతూ  చెప్పు కొస్తుంది . ఎందుకంటే  అందరి జీవితాల్లో అవి అంత
ముఖ్యమైన  రోజులు . మరి వీళ్ళకి వద్దా ఆ జీవితం ? మొదట్లోనే  ఒక అభిప్రాయం ఎ ర్పడుతుంది ,ఆ  ఇష్టం
లోనించి  సర్దు బాటు అలవాటు అవుతుంది . మరి అలాంటప్పుడే ఎవరి వుద్యోగం వాళ్ళు చేసు కుంటూ  ఎవరి
బిజీ  లో  వాళ్ళుంటే ,ఒకరిమీద ఒకరికి  అవగాహన  ఎప్పుడొస్తుంది  . కొత్తజంట కీ ఆవిషయం  ఎవరు చెప్తారు .
చెప్పాల్సిన పెద్దలే  ఇంత కింతని లెక్కలు చుస్తే  వాళ్ళకి  అదే  నిజమన్పిస్తుంది . వాళ్ళన్న పెల్లిచుపులప్పుడు
ఒక అర్దగంట కూచుని ,ఇంట్లో వుంటావా ,వుద్యోగం చేస్తావా ,నువ్వు నాతొ వుంటావా ,నేను  నీతో  ఉండనా ,
[మన ప్రారబ్ధం చుడండి  ఎంతగా  దిగాజారాయో  పరిస్తితులు ]అడిగి  ఒక అవగాహనకి వస్తే  బాగుంటుంది కదా
అబ్బే నాజీతం నాది ,నీజీతం  నీది ,ఆన్ లైన్ లో ఇవి మాత్రం  బాగా చర్చిస్తారు . జీవితం, ప్రేమ , పిల్లలు , అనే
ఆ లోచనే కనపడదు . పోనీ ఇదొక  వ్యాపారం అనుకుందా మంటే ,పిల్లలు పుట్టు కొస్తారే  మరి ?వారి  అతీ  గతీ ?
వాళ్ళుకూడా ''రోబో ''లైతే  బాగుండు ,కాని మన లాంటి జీవులే .  చీర కట్టుకోడం  రాదు ,ఐదు అంకెల జీతం ,
పెళ్ళంటే బాద్యత అని తెలీదు , లక్షలు  కోట్లు ఖర్చు పెట్టి ,పెళ్లి ళ్లు , భర్త తో  సహజీవనం  అంటే సర్దు బాటని  వీళకి
ఎప్పుడు  అర్ధం అవుతుందో ...... ఎప్పుడెలా  పరిస్తితులు  మారతాయో తెలియని  జీవితాలు మనవి  ఉన్నదాంట్లో
సంతోషం గా  .......     ప్రతి నిముషం  సరదాగా గడుపుతూ  ........... ,ఆనందం గా  బ్రతికేస్తే  చాలదూ .........

                          ************************************************

Tuesday, December 2, 2014

ఆరు నెలల కాలం .ఆరు నెలల  క్రితం   బ్లాగ్  పెట్టినపుడు , నేనేమంత  ఆ లోచించ  లేదు . పత్రికలకి  పంపిస్తే  తిరిగో స్తాయి   అనీ
బ్లాగ్  లో  ఐతే  'కొంత మంది 'చదువు తారు ,అన్న  ఆలోచన  తో ,మొదలు పెట్టాను . కాని 'ఇంతమంది '
చదువుతారు అనుకోలేదు .


కొన్నినేలలు  అంటే  రెండున్నర  నెలలు  ఎలాంటి  కామెంట్స్  రాలేదు . నా పని  నేను చేస్తూ  వెళ్ళాను . నిజానికి
నాకు ' కామెంట్స్  అంత  ముఖ్యమని  తెలీదు'  అంటే  సరిపోతుంది . ఇప్పటికీ  వారం లో  ఒకరోజు  మాత్రమే
ఆలోచించి  టైప్  చేస్తాను , ప్రతి రోజు ఒక  గంట  మిగతా  బ్లాగ్  లన్ని  చదువు తాను . నాకు  నా  కుటుంబం
ఎంత ముఖ్యమో   నా  కున్న  హాబీలు  అంతే  ముఖ్యం . అలాగే   నేను ముచ్చట  పడి ,పెట్టుకున్న  నా బ్లాగ్
కూడా  నాకంతే  ముఖ్యం  నా  భావాలన్నీ  మీతో పంచు కోవాలి గా ... చాల మందే  స్నేహితులయ్యారు .
అన్నీ  మంచి కామెంట్లే  వచ్చాయి .


ఉత్తమ  బ్లాగ్  లో  చోటు  దక్కడం  నాకు  చాల  ఆనందం  . ఎప్పటికీ  చది వి  ఆదరిస్తారని  నమ్ముతూ
 మీతో  కలసి   ఎంతో   ప్రయాణం  చెయ్యాలని   ఆశిస్తూ ...                                                 

బ్లోగిల్లు   వారికి  ,  ఇండి బ్లాగర్  వారికి   నా కృతఙ్ఞతలు .  

Thursday, November 27, 2014

క్రమ'' శిక్ష''ణ ..


ఈరోజు  మనం  డిన్నర్ కి  వెళ్తున్నాం ,వాసుదేవ్  ఫామిలీ తో  వస్తున్నాడు . అన్నారు . ఇది చాన్నల్లనించి అనుకుంటున్నదే ,వాసుదేవ్  గురించి చెప్తే వినడమే కాని పరిచయం లేదు ,ఈరోజు  చుస్తామన్నమాట అనుకున్న ,
చంద్ర వచ్చే సరికే  మేము రెడీ గా  వున్నాము ,తనుకూడా  ఫ్రెష్  అవగానే  అంతా కల్సి,  ఒక సినీ  హీరో  గారి
రెస్టారెంట్ కి వెళ్ళాము . పార్కింగ్ లోనే పరిచయలయ్యాయి ,భార్య నందిని , తల్లిని ,ఇద్దరు పిల్లల్ని తీసుకువచ్చాడు
వాసుదేవ్ . వాళ్ళమ్మగారు చాల పద్దతిగా  వున్నారు , టీచర్ గా చేసారట . మసక చీకటి గా వున్నా మంద్రమైన
సంగీతం  మనసుకు ఆహ్లాదం గా  వుంది . వాసుదేవ్ కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు . తను ప్రయత్నిస్తే
కాంట్రాక్ ట్లు ఎలావచ్చేస్తాయో , ఎంతమందికి జాబ్స్  వేయించాడో ,ప్రమోషన్ లు  ఇప్పించాడో ,ఇలాంటివన్నీ
మా ఇంట్లో  ఈ ఆ ట లన్ని  ఎప్పుడో ఆడేసారు ,మా నాన్నగారి కుర్చీ చేతి మీద కుర్చున్నపుడే  ఈకధలన్ని
వినేశాను . నాకు పెద్ద శ్రద్ద లేదు  ,రౌండ్  టేబుల్ చుట్టూ కూర్చున్నా మెమో ,నా ప్రక్కన  వాసు వాళ్ళ అమ్మ గారు
వచ్చారు ,ఆమె తో మాటలు కలిపాను . భోజనాలు  ఆర్డర్  ఇచ్చారు , వైటర్ చంద్రకి  నాకు మధ్యలో  కొద్దిగా వంగి
కుందేలు  మాంసం  వుంది తింటారా అని అడుగు తున్నాడు . చాచి చెంప  పేలగోట్టాలని పించింది . చూస్తేనే
మనసుకు  ఆనందం కలిగించే  దాన్ని  ఎవరన్నా కోసుకు తింటారా ? చంద్ర  కళ్ళతోనే  సైగ  చెయ్యడం తో ఊర్కున్నా లేకపోతె  అన్యాయానికి  అడ్డం పడే అలవాటుంది .మొత్తానికి భోజనం ఆర్డర్ చేసారు .

వాసు  భార్య ,పిల్లలు ,అతనిలాగానే  భారీ గా  వున్నారు . ఆవిడ ముస్తాబు కూడా అలాగే వుంది . మూడు
అంతస్తులు గా  జుట్టు పిచ్చు క  గూళ్ళు పెట్టింది ,పర్లేర్ లో ఎంతసేపు కుర్చుందో మరి . టీ నే జ్ లో  వున్నా
అమ్మాయికి చేతుల్లేని జుబ్బా [తాళ్ళు మాత్రం కట్టి  వుంది ,దాని  మీద  డూ  యూ  లవ్ ఇట్  అని వుంది ]
వేసి తీసుకొచ్చింది . తల్లి కూతురు  పాముల్లా వున్నా బొట్లు పెట్టుకున్నారు ,మూతికి రంగులేసు కొచ్చారు .
నన్ను చూసి ఆమె చాల నిరాశ పడింది , చాల  పోష్ గా  ఊహించుకుని వుంటుంది . జడ వేసుకుని ,మైసూర్
సిల్క్ సారి లో సింపుల్ గా వున్నాను . తనలా  లేక పోయేసరికి  తనకంత నచ్చలేదు కూడా 1 అంతగా
మాట్లాడలేదు . వాళ్లపిల్లలు  భోజనం తిన్నారో చల్లరో ,తెలీదు ,అలా చేసారు ,పార్లేర్  వెంబడి  తిరక్క పొతే
పిల్లలికి పద్దతులు నేర్పించు కోవచ్చుగా ! . మాటల్లో వాసుదేవ్ 'నా వైఫ్ ది  కూడా  భీమవరమే' అంటఉంటే
ఆమెగారు గొంతు  సవరించు కుంది . అతను ను అంతటితో ఆ సంభాషణ  వదిలేసాడు . భలే కంట్రోల్  లో
పెట్టిందే  అనుకున్నా , ఫాలో అవ్వండీ  అని మోచేత్తో పోడుద్దమనుకున్నా  కాని  అది మా  స్టైల్ కాదు .
పిల్లలికి ఖరీదైన పోన్ లు .  వాటి లో ఆడుతూనే వున్నారు ,ఆమెకి పోన్ లు  వస్తూనే వున్నాయి , వచ్చీ
రాని  ఇంగ్లిష్ లో మాట్లాడేస్తోంది . భోజనం కాగానే వాష్ రూం కి కదిలారు  తల్లికుతుర్లు  మేకప్  కోసం .
 ఆ  కొంచెం టైం లోనే ,వాసు తల్లిగారు  తన పోన్ లో ,కోడలి  పాత పోటో చూపించారు ,పసుపు ఎరుపు
కల గలిసిన  గళ్ళ పట్టుచీరలో తలనిండా  కనకాంబరం పూలతో  పెరట్లో దిగిన పోటో అది ఎంతబావుందో .
నా ఆశ్చర్యం చూసి ఆవిడ పెదవి విరిచి ఒక భావం వ్యక్తం చేసారు . ఆవిడ ఎన్నిక చేసినపుడు  అలా
వుండేది కాబోలు ,ఇప్పుడు పట్నం పోకడలు బాగానే వంట పట్టాయి . మళ్ళీ రంగులు అద్దుకుని
వచ్చారు . మేము  ఫింగర్ బౌల్స్  లోనే  చేతులు కడిగి కూర్చున్నాము . వాసు మా పిల్లలిని అడిగారు
సెల్ పోన్  లేదా అని ,ఇద్దరూ  బాగా చదువుకుని ,జాబు వచ్చాక కొనుక్కున్ టాము , అని చెప్పారు .
వాళ్ళ పిల్లలు  హాయ్ ,బాయ్  తప్ప మా వాళ్లతో మాట్లాడిందే లేదు , సెల్ పోన్  లేని వాళ్లతో మాటలేంటి .
అనుకుని ఉండచ్చు . అందరం పార్కింగ్ ప్లేస్ లో బై  చెప్పుకుని ,బయల్దేరాం ,కార్ రివర్స్  చేస్తుంటే
వెనక్కి చూసా ,వెనక సీట్లో వున్న  పిల్లలిని చుస్తే ,క్రమ శిక్షణ  పేరుతొ 'శిక్షి 'స్తున్ననా  అన్పించింది .

                                       *********************************

Thursday, November 20, 2014

సెలవుల్లోసెలవులకని  అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం ,కాకినాడకు  పదిహేను ,ఇరవై  కిలోమీటర్ల దూరం లోవుండేవారు
వాళ్ళది  వ్యవసాయ దారుల  కుటుంబం . పొలాలు ,కొబ్బరి తోటలు  ఉండేవి . మానాన్నగారి  తరపు వాళ్ళు  బాగా
చదువుకున్న  వాళ్ళు వుండేవారు  . అమ్మతరపు  మాత్రం పొలం ,చేను ,అంటువుండేవారు . ఆ వూరి లో చాల
పచ్చ దనం ,వుండి ,బాగుండేది ,ఇల్లు కూడా  ఒకే కాంపౌండ్ లో  నాలుగు పక్కలా  నాలుగు ఇళ్ళు ఉండేవి . మద్య
మద్య  పూలమొక్కలు ,ఒకపక్కగా  మందార  చెట్టు ,మల్లెపందిరి  వుండేది . సాయంత్రం ఐతే  అక్కడ  మంచం వేసి
కుర్చునేవాళ్ళం ,పూలన్నీ మాలకట్టేవాళ్ళు ,ఆ వేళ్ళు కదిలే తీరు  చూస్తుంటే  భలే గమ్మత్తు గా  వుండేది . చాల
త్వరగా భోజనం పెట్టేసేవాళ్ళు . చేతులకు గోరింటాకు పెట్టడం ,పొద్దున్నే తలంటి పోసి [కుంకుడు  కాయ పులుసుతో ]
సాంబ్రాణి  పొగవేసేది ,జుట్టు ఆరగానే , పూలజడ వేసేది ,అమ్మమ్మకి ఇవన్ని ఎలా వచ్చునో  అని' ఆచ్చేర' పడేదాని
వేసిన కాసేపటి  వరకు చాల  బాగుండేది ,అసల నాజడే మీటరుండేది ,నేనేమో  ములంకాడ లా  వుండేదాన్ని .
పూలబరువుతో సహా మయ్యలంటే , ఎంతకష్టం  మరి ? కుచో పెట్టి  అన్నం తినిపిస్తూ  ,బోలెడన్ని కధలు చెప్పేది .
ఆకధలో పడి ,బరువు సంగతి మర్చి పోయేదాన్ని ,పొద్దున్నించి ఎన్ని సార్లడిగిన ,ఒప్పుకోని అమ్మమ్మ  సాయంత్రం  కాగానే  తనే ,జాగ్రత్తగా పూలన్నీ విప్పేసేది . హమ్మయ్య  సగం  బరువు తగ్గేది . బోలెడన్ని  పిండి వంటలు చేసి
పెట్టేది . ఈపనులేకాక  ఎండాకాలం కనుక ,తోటనించి  కొబ్బరి కాయలువలిపించి  తెప్పించి ,సహాయంగా కొంత
మంది  ఆడవాళ్ళని  పిలిచేది ,వాళ్లతో కాయలన్నీ  కొట్టించి  ఆ నీరు ఒక బిందెలో వేసే వారు , ఆనీళ్ళ  కోసం
చాలామందే వచ్చితీసుకేల్లె వాళ్ళు . కొబ్బరి వేరుచేసి  సన్నగా తరిగి ,ఎండపెట్టే వాళ్ళు ,చేస్తున్నంత సేపు
ఒక్కరి నోరు కుడా  మూత  పడేది  కాదు ,వురి లోని సంగతులన్నీ  చెప్ప్పుకుంటూ ,చేసేవారు . నేను  ముదురు
ముచ్చి లా  ఆ కబుర్లన్నీ వింటూ  అక్కడే కూర్చునే దాన్ని . ఆకొబ్బరి  ఎండినాక ,మర పట్టించి ,నునె కావాల్సి
నంత  తీసుకుని  మిగతాది  అక్కడే అమ్మేవారు . ఈవిధనమంతా  నాకు చాల ఆశ్చర్యం గా వుండేది .

తర్వాతది  ఆవకాయ పెట్టడం , కారం  ఇంట్లోనే కొట్టేవారు , ఆరోజు మాత్రం  మమ్మల్ని బయటకి రానిచ్చేది కాదు
కౌలు దారు కాయలు తెచ్చిచ్చే వాడు వాటిని  కడిగి తుడిచి ,ఆవలుపొడి చేసి ,జాడీలు కడిగి ,అబ్బబ్బా ఎంత
ఓపికొ ... శనివారం ,కొబ్బరి పచ్చడి మిక్సి లో  వెయ్యలంటేనే ,నాకు బద్ధకం ,మరి  అన్ని పనులు  అమ్మమ్మ
ఎలాచేసేదో , ఆ మొహం లో  నవ్వు చెరిగి పోయేది కాదు . తర్వాతది  పూతరేకుల ప్రహసనం , బియ్యం
నానపెట్టి , ఒకామె  వుండేది స్పెషలిస్ట్  అన్నమాట ,తనతోనే  రుబ్బించేది ,చాల మెత్తగా ,రావాలట ,కుండ
తెచ్చి ,కట్టెల పొయ్యి రెడీ చేసి  దాని మీద  కుండ బోర్లించి పెట్టి , మంట సరిచూసుకుని ,అంటే ఎక్కువ తక్కువ
కాకుండా  చూసి ,మెత్తని బట్ట ,పిండిలో ముంచి , ఒక్కసారి కుండమీద వేసి తీసేస్తారు , నిమిషం లో రేకులా
లేచేస్తుంది ,అదితీసి పక్కన పెట్టి మళ్లీ  వేస్తారు . అలా రాత్రంతా  చాల వేసేవారు . మరుసటి రోజు మధ్యానం
అమ్మమ్మే కుర్చుని  బెల్లం మెత్తగా చేసి ,నెయ్యి వేడి చేసి ,రెండు కాని మూడు కాని రేకులు  పెట్టి  వాటి
మీద ,తురిమిన బెల్లం ,నెయ్యి వేసి  చుట్టేసి ఇచ్చేది , తెల్లగా మధురంగా ఉండేవి . వుంటే జీడి పప్పు పొడి
కూడా  వేసేది ,అవి మాత్రం  నాన్నగారికోసమే .

అలాగే  సున్నుండలు  చేసేది ,మినపప్పు వేయించే టప్పుడు చూడాలి , సగం ఊరుకి తెలుస్తుంది వాసన ,
ఎవరో సున్నుండలు చేసుకుంటున్నారు  అని . అంతా బాగానే వుంది కానీ .. పంటికింది రాయి లా మామయ్య
ఉండేవాడు ,అప్పటికి టీనేజ్ లో వుండుంటాడు . రాక్షసుడు , మేము చిన్న పిల్లలం ,ఆరుగురం  వున్నాం .
ఇద్దరక్కల  తర్వాతేమో గారం తో పాడు చేసారు ,చదువు సంధ్య లేకుండా  ఊరంతా తిరగటం ,కేరమ్స్
ఆడటం ,పొలం వెళ్తే ఆడళ్ళతో వెటకారాలు ,నచ్చని కూర వండితే ,గిన్నెతో సహా ఇంటిమీద విసిరేవాడు .
అలంటి వాడికి  ''పిల్లలికి పొలం చూపెట్ట మని అమ్మమ్మ అప్పగించింది . తెగ నవ్వేసుకుంటూ పదండి
అని తీసుకెళ్ళాడు ,మూడు కిలో మీటర్లు నడిపించాడు , పొలమంతా తిప్పిచుపించాడు ,అసలే ఎండా
కాలం  బాగా దాహం గా వుంది , ఇకవెల్దాం  అనే టైం కి  మజ్జిగ తాగుతారా  అని అడిగాడు . ఇక్కడ
మజ్జిగ  ఎలా దొరుకు తుంది  అని అడిగే తెలివి కాని వయసు కాని మా కెవరికి లేదు . ఒకచోట కుండ
పెట్టుకుని కూచున్న ముసలతన్ని ,వీళ్ళంతా మా ఇద్దరక్కల పిల్లలు ,ఎండలో తిరిగి అలసి పోయారు
అందరికి మజ్జిగ ఇవ్వు అన్నాడు . ఆళ్ళ కొద్దులెండి  మీరు పుచ్చుకోండి  అన్నాడా ముసలతను ,
ఇవ్వరా  అని వాడిని ### తిట్టాడు ,వాడు మా అందరికి ,ఆకులు దొప్పలు  చేసి  ''మజ్జిగ ''ఇచ్చాడు .
అందరం  దాహం తో ఉన్నామేమో పుచ్చుకున్నాం .... తిక్క తిక్కగా వుంది ,మళ్లీ  ఎండలో మూడు
కిలోమీటర్లు  వెనక్కి నడిపించి తీసు కొచ్చాడు . ఇంటికెలా  వచ్చామో మాకే తెలీదు . అమ్మమ్మ
వాడి పోయిన మా మొహాలు ,మా దగ్గర నించి వస్తున్నా సుగంధం చూసి ,తాత కి చెప్పింది .
ఓహో అలాంటి   ##############  భాష  ఆకొట్టుడు ,అంతకు ముందు కాని తర్వాత కాని నేను
ఎక్కడా  వినలేదు ,చూడ లేదు .          [మామయ్యకి  సారి  చెప్తున్నా ].........................

                                    *********************************

Thursday, November 13, 2014

రోజంతా ఎలా చూస్తారో


ఉదయం  లేస్తూనే  నేను ఈ రోజు  లంచ్  తీసుకు వెళ్ళను , సాయంత్రం  వస్తే 4కి  వస్తాను ,ఎయిర్ పోర్ట్  కి  వెళ్తే
పది అవుతుంది . అనిచేప్పేసారు . అదివిని  పిల్లలికి  హుషారు  వచ్చేసింది ,మేముకూడా  బయట తినేస్తాము .
అనిచేక్కేసారు ,కాని  ఒక్కళ్ళు కూడా  నువ్వేమి తింటావని ,అడగలేదు . దుర్మార్గుల్లరా ! వచ్చేక వుంది మీ
పని , పొండి రా  పొండి ,మీకాలం  ఖర్మం  కలిసోస్తేనే రండి  అని  పాడుకుంటూ ,గేట్  లాక్  చేసుకుని ,ఒక మగ్
నిండా  కాఫే కలుపుకుని ,టి  వి  ఆన్ చేశాను . ఈ రోజు మొత్తం  నాది వండే  పని లేదు  ,ఫ్రూట్స్ తిని పండగ
చేస్కుంటా అనుకుంటూ  దివాన్ మీద సెటిలయ్యను . టి వి  పెట్టగానే  ముందు గా  ఒక రిషి గారు ప్రత్యక్షం
అయ్యారు . ఒకామె తన కష్టాలన్నీ ఏ కరువు పెడుతోంది ,ఆయన అన్ని విని ,చిద్విలాసంగా  ఒక నవ్వు నవ్వి
అన్నిటికి కలిపి  నేనొక పరిష్కారం  చెప్తాను చేసుకోండి ,చాల చిన్నది ,వెంటనే మంచిగై పోత్కది . అన్నారు .
అబ్బా  ఇన్ని సమస్యలికి  ఒకటే పరిష్కారమా !అని ఆసక్తి గా వింటున్నా , '' ఒక అరటి చెట్టుకి మీరు రోజు
పాలు పోసి రావాలి ,ఎవరు చుడ్కోడాద్ [చూడ కూడదు ] అచేట్కు  గెల వుండాలి  ఇలా 80 వారలు చేస్తే ,
మీ సమస్య పరిష్కరమైపోత ది ''. అన్నారు . మహా ఐతే ఆరు వారలికి ,పోని పది వారాలికి గెల  కొట్టేస్తారు .
ముందుగ అరటి చెట్టు కొట్టాకే  గెల కొడతారు ,ఎందుకంటే ,ఒకటే గెల వేస్తుంది  కాబట్టి  ,గెల కొట్టిన తరువాత
చెట్టు ఆడవాళ్ళూ చూడ కూడదని ,పూర్వం పెట్టిన పద్దతది ,అప్పుడు గంపెడు సంతానం  కోరేవారు కదా 1.
అందుకే గెల తీసిన చెట్టుని చూడ్ కోడ్ దంటారు ,బాబోయ్ నా తెలుగెంటిలా ! మరి 80 వారాలు పాలు ఎలా
పోస్తారు . 80 వారాలు తర్వాత సమస్య పరిష్కారంకాక  పోఇనా ,అలవాటైపోతుంది  అని అలా చెప్పి వుంటారు .
అనుకుని వేరే  ఛానల్ మార్చాను . అది ఒక న్యూస్ ఛానల్ ,ఒక వ్యక్తిని  పట్టుకుని  పది మంది పైనే దరువే
స్తున్నారు . ఎంటా విషయం అని చుస్తే ,ఒకామె స్నానం చేస్తుంటే ,సెల్ ఫోన్ లో చిత్రీ కరించాడట. ఆమె చూసి
అందరిని పిలిచింది . విలేకరి ఘర్షణ చిత్రీకరించి ,ఆ సెల్ పోన్  తెచ్చిచ్చి నట్టున్నాడు ,ఆ పోన్ లో దృశ్యాలు
  చక్కగా [మసగ్గా ] ప్రసారం  చేస్తూ ,ఇలాంటివాళ్ళని  ఏమి చెయ్యాలి ,ఇంతబాగా టెక్నాలజీ  వాడుకుంటున్న
 వారిని ,ఎలా దండించాలి అనే విషయం మీద  మన స్టూడియో కి  వచ్చారు ... అంటూ మొదలు పెట్టాడు .
ఇంట్లో అగ్గి పెట్టె వుంటుంది  దానితో దీపం  వెలిగించ వచ్చు ,ఇల్లూ వెలిగించ వచ్చు ,మనవివేకం  మీద
ఆధారపడి వుంటుంది .

ఇంకో ఛానల్ ,అది మ్యూజిక్ ఛానల్ ,ఏ0కర్ అడుగుతోంది కాల్ చేసిన అబ్బాయిని ,ఇంకా ప్రేమించాలేదా !
ఇంతవరకు గాళ్ ఫ్రెండ్ లేదా  అంటూ అతడిని ,విసిగిస్తోంది ,ఏ కెరియర్ గురించో అడగచ్చు కదా ఉహూ
ప్రేమ గురించి అయితేనే ,ఛానల్ మార్చరని వాళ్ళ ఐడియా . ఒక పాట వచ్చింది ,ఈ మధ్య  రిలీస్ ఐన
సినిమా  లోంచి ,హీరో ,హీరోయిన్ ,లుంగీలు కట్టుకుని ఎగురు తున్నారు ,ఇంకా అసహ్యమైన విషయం
ఏమిటంటే ,వెనుక జూనియర్ ఆర్టిస్టులు మగవాళ్ళు చీరలు కట్టు కుని ,గుండ్లు కొట్టించు కుని ఎగురు
తున్నారు ,యాక్  ఛి ..

వంటల  టైం ఐంది ఒక సాలిడ్ గ వున్నా ఏంకర్ ,డాక్టర్  వచ్చారు ,ఆమె రోజంతా మజ్జిగ తోనే ఉండి స్కిన్
గ్లో ఎలాపెంచు కోవాలో చెబుతుంది . ఒక్కదానికి వంటచేసుకునే ఆలోచన లేదు కనుక సర్దుకు కూర్చున్న
ఈరోజు ఇదే ఫాలో  అవుదాము అని ,ప్రొద్దునే అరటిపండు మజ్జిగ మిక్సి  వేసుకు తాగాలట ,ఆల్రెడీ ఆరు
ఇడ్లీ  నెయ్యి కొబ్బరి పచ్చడి తో లాగించాను కనుక అవకాసం లేదు . 11గం కల్లా ,కేబాజ్  ఆకులు మజ్జిగ
మిక్సి వేసుకు తాగాలిట ,ఒక కాఫే మగ్ నిండా కాఫీ  పట్టించాను కాబట్టి  అదీ  అవకాసం  లేదు . సాయంత్రం
పాలకూర వేసి ,ఆకలి కూడా ఎక్కువే వేస్తుంది కాబట్టి ,బాదాం పప్పులు వేసి మజ్జిగ వేసి మిక్సి  వేసి
తాగాలిట . మాములుగా ఐతే ఈ పాటికి పప్పు ,కుర , రసం ,తో  భోజనం చేస్తాను .,పిల్లలితో కలిసి స్నాక్స్
లేదా చిన్న కప్ ,నట్స్ తిని పని మొదలు  పెడతాను . నాలుగు బాదాం పప్పులు ఏ మూలకి  అది కూడా
భోజనం లేకుండా .. ఇలా కాదు కానీ పొద్దున్నే లేచి లంచ్ బాక్స్  ఇవ్వలేదను కొండి ,నా వీపు  విమానం
మోత  మోగుతుంది [అంతలేదక్కడ ] అనుకుంటూ ఏదో వొకటి తిందామని లేచాను .

అసలీ విప్లవాత్మక  నిర్ణయం ఎందుకు తీస్కున్నానో తెలుసా  మా పక్కింటి అత్తకోడలు ఒక్కనిముషం
కుడా  బయటికి రారు  వంట కూడా ఇండక్షన్  స్టౌ  పెట్టుకుని  టి వి  ముందే చేస్తారు . బ్రేక్ లో  మాత్రం
బయటికి  వచ్చి  బట్టలు ఆ రేస్తుంది , ఇంతలో ; అత్తగారు భానూ  బ్రేక్  ఐపొఇన్ది  రా ; అంటూ కేకలు
మాట్లా డ దమన్నా  కనపడనే కనపడరు ,అసలా బుల్లి పెట్టెకి  అంత పవరేంటో  అని ...............

అంతటితో కట్టేస్తే  వదిలేది ,కాని మళ్లీ పెట్టాను ఈ రోజు  ఏమైనా వదిలేది లేదు  అనుకుని  కూర్చున్నా .
లైవ్ వస్తోంది ,చీరలిస్తోంది ఓ  ఏ0 కర్ ,చాన్నాళ నించి చేస్తుంటే తగల్లెదండి ,ఇప్పుడు తగిలింది [ఎక్కడ ]
మీరెంత బాగుంటారో ,ఎంత బాగా మాట్లాడ తారో ,మీది చాల బాగుంతదండి [ఏ కరింగ్ ] అన్నది .
ఆమె తెగ ఆనంద పడి ,మీరేమి చేస్తారు ,మీవరేమి చేస్తారు ,అంది  ఆమె హౌస్  వైఫ్  అనగానే  ఏమి
వండారు  అంది , మరదే నక్కాలేది , ఇంతలో చీర చూడండి  అంది ,కట్ చేస్తే  షాప్ లో ఒకాయన
చీర పరిచి దాని గురించి వివరిస్తున్నాడు ,''సాముద్దిరిక  పోట్టండి [పట్టు ] చీరంతా  పింకు రంగోచ్చండి
బోడ్రు కి  మూడు పక్కలా సెక్స్ అండీ ,[అద్దిరి పడ్డారా  అవి  ''' చెక్స్ ''అంతే ]బోడ్రు లో సెక్సే వచ్చాయి
కాబట్టి  జాకెట్ కి సెక్సే  ఇచ్చాడండి '' నేను ఏ చానెల్ పెట్టినా ఇలాగె వుంటుంది . అందుకే  న్యూస్
మాత్రమే చూస్తాను . వాటిలో కూడా మధ్యానం ఐతే  చానెల్ లోంచే  వైద్యం  చెప్పేస్తారు . హతవిధీ ..
నేను ఇంకా  సీరియల్స్ జోలికి  వెళ్ళలేదు చూడను కాబట్టి ,ఒకరోజంతా  చూసి అవికూడా చెప్తా ఈసారి . 
చంద్ర పోన్  చేసారు ,వస్తున్నా   వచ్చిన వాళ్ళు వెళ్లి పోయారు .  నీకోసం  సమోసా తెస్తున్నా .. అని
హమ్మయ్య ..  వేడి నీళ్ళతో  మొహం కడిగితే కాని ఈ  తలనొప్పి  తగ్గదు . మీరుకూడా  ఓ కప్ కాఫీ
తాగండి  , నాతలనోప్పి  మీకంటించానో  ఏ మిటో నబ్బా ... తిట్టుకోరుగా ....

                                                ***************************

Thursday, November 6, 2014

కార్తిక మాస వనభోజనాలు
                       
కార్తిక మాసం  అనగానే ఎవరికైనా గుర్తు వచ్చేది ,పూజలు ,వ్రతాలూ ,దైవ దర్శనాలు ,వనభోజనాలు . నాకు మాత్రం
వనభోజనాలు  అనగానే  మనసు అడవిలోకి వెళ్ళిపోతుంది . ఎందుకలా ! అంటారా ఇది చదివితే  మీకే తెలుస్తుంది .
ఇక్కడ ఎన్నిసార్లు ,ఎంతమంది తో  , ఎన్నిచోట్లకు  వెళ్ళినా ,నా మనసుకు  నచ్చినవి  నాకు గుర్తుండి పొఇనవి మేం
అడవిలో వున్నపుడు  వేల్లినవే . అవే  నాకిష్టం ,ఉదయమే  మంచులో ప్రయాణం , ఉదయిస్తున్న సూర్యుడు  ,
విచ్చుకుంటున్న  పువ్వులు ,వాటిమీద  మంచు బిందువులు , పేరుతెలియని  పిట్టల  కువ కువలు ,గట్టిగా
అరుస్తూ  తమ ఉనికి  తెలియ చేసే  కౌజు పిట్టలు ,  నిప్పుకోళ్ళు , ఆ కొమ్మకి  ఈకొమ్మకి గెంతుతూ  గంతులేసే కోతులు ,పూరి విప్పి ఆడుతూ  శబ్దాని కి మాయమయ్యే  నెమళ్లు ,కుందేళ్ళు , మనసులో  చటుక్కున మెదులు
తాడు  సృష్టి కర్త ,  జోహార్లు  చెప్పకుండా  ఉండలేము .


   
నెల ముందు నించి  అత్యంత ఉత్సాహంగా  ప్రణాళిక  వేసే వారు ,మానాన్న గారు . తోటి ఉద్యోగులందరి కి  ముందే
చెప్పి ఉంచే వారు ఫలానా  రోజున  వన భోజనాలు  అందరూ కుటుంబం తో రావాలని . అప్పటికి తాయారు చెయ్య
వలసిన  వంటలు , వెంట తీసు కెల్లా వలసిన జాబితా  తయారయ్యేది . బాగా వండే  గార్డ్స్ ని  ఎంచి ,వాళ్ళతోనే
వందించే వారు . వెళ్ళే చోటు మాత్రం  పెద్దగా  ఆలోచించ వలసిన  పని లేదు . ఎందు కంటే  అడివంతా  అందాలే !
అందరం కల్సి  ఎక్కడికి వెళ్ళినా  ఆనందమే , వేరే సరదాలు  ఏమి  అక్కడ ఉండేవి కాదు  కాబట్టి  అందరూ  ఆ
రోజు కోసం  ఎదురు  చూసే వాళ్ళు . ఆరోజు ఆడవాళ్ళు  ప్రత్యేకం గా  తయారయ్యేవాళ్ళు . ఈమె  ఆఫీసెర్ భార్య ,
ఆమె గుమస్తా  భార్య  అనే తేడాలే  లేవు ,అంతా కలిసి మెలిసి వుండేవారు . ఒకరి పిల్లలిని ఒకరు  దగ్గరికి తీసే
వాళ్ళు .  ఒకసారి  కాఫీ తోటకు వెళ్తే ,మరోసారి  కమలా తోటకి వెళ్ళే వాళ్ళం . ఒకసారి పాములేరు  వెళ్తే ,మరో
సారి సాంతం  అడవి లోకి తీసుకెళ్ళే  వాళ్ళు . అక్కడ ''ఇప్పపూల ''చెట్లు ఉండేవి . అవి మన కిస్ మిస్  మాదిరి
ఉండి పిస్తా పప్పులా  తెరచి వుంటుంది . వాటితో  సారా  కాస్తారట . ఎన్నో ఏళ్ళు  నిలవ పెట్టినది మరింత రుచి
ఖరీదు వుంటాయి . వీళ్ళ లో  కొంతమంది కొంటేవాళ్ళు వుండేవారు . వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే  ఇష్టం
చూపించేవారు . మిగతా వాళ్ళని ఒప్పించి  అక్కడికే తీస్కేల్లె వాళ్ళు . తాగామన్న  సరదాలో వాగే వాళ్ళు
కొందరైతే , వాసనకే పడి  పొయ్యేవాళ్ళు మరికొందరు . ఏదేదో వాగేసి  భార్యలకు  అడ్డంగా  దొరికి పొయ్యేవాళ్ళు .అందరిని తీసుకెళ్ళడానికి  జీపు లు  సరిపోవు , జీపులు ఒకటి  వుండే ను ,రెండు వుండే ను ,మహా ఐతే
పోలిస్ జీప్ కూడా అడిగేవారు ,వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు . పోలీస్ వారు , ఫారెస్ట్ వారు ఐకమత్యం గా
వుండేవారు . సిట్టింగ్స్ పెట్టేవాళ్ళు . వాళ్ళంతా  కలిసి కూర్చునే  సమయం లో తరచూ వాళ్ళు చెప్పుకునే
జోక్ ఒకటి  నాకు ఇప్పటికి గుర్తు వుంది . ''ఫారెస్ట్ ఓడిని  పెళ్ళికి  పోలీసోడిని  చావుకి  పిలవకూడదు ''.
అని ఒకసామెత  అనుకోండి కాని వాళ్ళు  విపరీతం గా నవ్వు కొనేవాళ్ళు . పెళ్ళికి పిలిస్తే  ఫారెస్ట్ ఓడు
'ఈ పందిరికి కలప  ఎక్కడిది ? వంటలకి  వంటచెరకు [పుల్లలు ] ఎక్కడివి అంటాడట . పోలీస్ ని
చావుకి పిలిస్తే 'ఎలా చచ్చాడు ? ఎందుకు చచ్చాడు అంటూ  ఆరా తీస్తాడట  అదీ  వాళ్ళ నవ్వుల కారణం .

రెండు లారీ  లు  శుబ్రం గా  కడిగించి ,గడ్డి వత్తుగా వేయించి ,పైన టార్పన్ పరచి  కూర్చోడానికి  వీలుగా
ఏ ర్పాటు  చేసేవారు . ఆడవాళ్ళూ పిల్లలు ఎక్కడానికి  రెండు  స్టూల్స్  పెట్టేవారు . అవి వెంట తీసు కెళ్ళే
వాళ్ళం  అక్కడ దిగాలిగా 1 ఒకసారి రెండో లారి వచ్చేసరికి  ఆలస్యమైంది  అంతవరకూ మొదటి లారి
లోని వాళ్ళు  దిగ దానికి  కుదర లేదు . అప్పటినించి ,ఒక్కో లారి కి  ఒక జీప్  సహాయం గా వుంటుంది .
భోజనాలు , స్టూల్స్  అన్ని వేరు వేరు గా  సర్దించే వారు . మధ్యలో   తప్పి పొఇనా  ఎవరి కి ఇబ్బంది
లేకుండా ఈ ఏ ర్పాటు .  ప్రయాణం లో  సరైన బాట  వుండేది కాదు , ఎత్తు పల్లాల లో  ఊగుతూ
ఉయ్యాల మాదిరి  ప్రయాణం సాగేది , నడుములు లారీకి  కొట్టుకుని  ఆబాధ  వుండేది చూడు ...
కాని  అదెవరూ  లెక్క చేసే  వాళ్ళు కాదు . ఆనందో  బ్రహ్మ  అన్నమాట .


వంటలంటే  మా  నాన్న గారికి  నాన్వెజ్  మాత్రమె . వెజ్ తో  ఆయనికి పెద్దగా  పరిచయం లేదు . కాని
వెజ్ లో ఆయనికి తెలిసిన వంట ఒకటే ఒకటి . అది  బీట్ రూట్ ,కేరట్ చిన్న చిన్న  ముక్కలుగా కోసి
పోపులో వేయించి ,కొబ్బరి చల్లేది . అదొక్కటే  ఆయనకు  తెలిసిన  వంటకం .వన భోజనాలకు  వెళ్తూ
చేపలపులుసు  తీసుకు పోలేముగా ! తప్పనిసరిగా కూరగాయలు వండిస్తూ ,ఆకూర  చెయ్యమనే
వారు . అంత మందికి  ఆ  వేపుడు  చెయ్యాలంటే  ఎన్ని కిలోలు ,ఎంతసేపు , ఎంతమంది , అంత
చిన్నగా తరగాలి ? కాని ఆయన వినే వారు కాదు ,నలుగురు మనుష్యులని  ఎక్కువ పెట్టి మరీ
అదే వేపుడు చేయించేవారు .  వనభోజనాలికి  సరే నా పెళ్ళికి కూడా  అదే కూర  చెయ్యాలంటారు .
మా  అమ్మ గొడవే  సుకుంది , 'థాట్  వీల్లేదు  టైమంతా వేస్టు ,వంటవాళ్లు తిట్టుకుంటారు ' అని
ఆయన వినలేదు .  మా నవ్వుల మధ్య ,అదే ఖాయం చేసారు . ఇంకా విచిత్రం ఏమిటంటే  ఆయనకీ
ఇష్టమైన  స్వీట్ సొంపాపిడి [సొంపట్ట ]. వంటవాడిని పిలిచి ,ఇంట్లో చేయించే వారు . అది ఎయిర్ టై ట్
ప్యాక్ లో ఉంటేనే  అలా వుంటుంది . బయటికి తీసి తినలేద ను కొండి  ,మళ్లీ  సెనగ పిండి అవుతుంది .
నన్ను అత్తారింటికి పంపే  టప్పుడు  సారే కావిళ్ళు అని పెడతారు . ఏ స్వీట్ ఐన రెండు బిందెలచొప్పున
పెడతారన్న మాట , ఈనేమో  సొంపాపిడి  పెడదామంటారు . మా అమ్మ  ఆవూరు  వెళ్ళే టప్పు డికి
అదికాస్తా  అడుక్కి పోతుంది ,వచ్చిన సారేలో  రెండు బిందెలు  ఖాళి గా వుంటే చూసి మీ  అక్క
మిమ్మలిని  పిచ్చి తిట్లు తిడుతుంది  అంటే అప్పుడాగేరు .
                 


 వెళ్ళిన చోట  భోజనాలు  చేసే వాళ్ళం . ఐదారు ఐటమ్స్ వున్నందుకో ,మరెందుకో కాదు ,అందర
కల్సి తిన్నందుకు ,వాటి రుచి అమోఘంగా  వుండేది . తిన్నాక  అలా తిరిగి చూసి వద్దామని అంతా
బయల్దేరే వాళ్ళు ,కాస్త స్త్రీ లమీద శ్రద్ద వున్నా వాళ్ళు  తోడుగా వచ్చే వారు ,ఎక్కడ తప్పి పోతారో
అని .  మిగతా వాళ్ళు  చతుర్ముఖ పారాయణం మొదలు పెట్టే  వాళ్ళు . అక్కదేదన్న 'ఏ రు 'వుంటే
మగవాళ్ళని పంపేసి  స్నానాలు చేసే వారు . అందులో ఒకామె పేరు గుర్తు లేదు కాని
 చాల బాగా ఈత కొట్టేది ,పిల్లలిని పంపమన్న వాళ్ళు కూడా ఆమెని చూసి  మమ్మల్ని
కూడా  దించేవారు నీళ్ళ లోకి . మధ్యానం  స్నాక్స్ ,వేడిగా టీ  అక్కడే చేసిచ్చేవారు . వీలయి నన్ని
కమలాలు తిని , కొన్ని  వెంటతీసుకుని  ,తిరుగు ప్రయాణం అయ్యే వాళ్ళం . శీతాకాలం  కాబట్టి
త్వరగా చీకటి పడేది .  అదేంటో వెళ్ళేప్పుడు  చేసిన అల్లరి , గోల వచ్చేప్పుడు  వుండేది కాదు .
అందరూ  నిద్రకోరిగే వారు . ప్రతి లారి ముందు జీప్ తో మగవాళ్ళు  వెంబడించే వారు . చాల
జాగ్రత్త గా  ఇంటికి  చేర్చే వాళ్ళు.  అందరి మనసులో  ఒకటే మెదిలేది  మళ్ళీ  'కార్తీకం ''ఎప్పుడని ....

                                 ******************************************

Monday, November 3, 2014

శిల్పారామం
                                             ***************************************