తమిళులు సినిమాకి తమిళ్ పేరు కాకుండా ఇంగ్లిష్ లో పెడితే చూడరు ,వారి భాష మీద వారికంత ప్రేమ .
తెలుగు భాష ఎప్పుడో , దారి తప్పి పోయింది , ఎక్కడో ఒకటి అరా ఎవరన్నా పిల్లలికి తెలుగు మాట్లాడటం
వస్తుంది . చదవడం అసలే రాదు ,ఎందుకంటే ,మనకి ' ఎంగ్లిష్ ' అంటే అంత మోజు, బడి లో వెయ్యడమే
A B C లు తప్ప ,అ ఆ లు దిద్దిన్చము , పిల్లలు తెలుగు చదువుతున్నారు అంటే లోకువై పోతాము
అనే భయం . ఇంగ్లిష్ ముఖ్యమే కాని , ఇక్కడ బ్రతకాలంటే తెలుగు కూడా ముఖ్యమే కదా ! మీరు కూడా
చూసే వుంటారు , బస్టాప్ లో నించున్నప్పుడు చాల మంది ,చదువు రాని వాళ్ళు ' ఆ బస్సు ఏవూరు
పోతుందమ్మా ' అని అడుగు తుంటారు . కొన్నాళ్ళకి మన పిల్లలు చదువు కుని కూడా ,ఎవరన్నా వురి వాళ్ళని
ఆ బస్ ఏ వూరు పోతుంది ' అని అడగాల్సిన పరిస్తితి వస్తుంది ఎందు కంటే వాళ్ళకి తెలుగు రాదు కదా !
ఇదంతా మనకి అవసరమా ,తెలుగు ' కూడా ' ఒక సబ్జెక్ట్ గా తీసుకోమని ప్రోత్సహించాలి . మా పిల్లల కి
అలాగే తెలుగు కూడా తీసుకున్నాను . ఇప్పుడు మర్చి పోతారేమో అని న్యూస్ చానల్లో వెళ్తున్న లైన్స్
చదవమంటాను . ఇదంతా ఎందుకు చెప్తున్నా నంటే , మన టీ వి లలో ప్రేజెంటర్ నోట్లో ద్రాక్ష పండు
పెట్టుకుని మాట్లాడు తుంటారు ,[నేను ద్రాక్ష పండు పెట్టుకుని మాట్లాడి చూపిస్తాను పిల్లలికి ] అచ్చు
అలాగే వస్తుంది మాట . తెలుగేదో తప్పుడు భాష అన్నట్లు ,అది మాట్లాడితే పరువు పోతుందన్నట్లు
తయారైంది మన పని . ఈమధ్య న్యూస్ చూస్తుంటే న్యూస్ రీడెర్ ''ఇవి ఈనాటి ఇసీసాలు '' అన్నాడు .
ఏమి సీసాలో నాకైతే అర్ధం కాలేదు . నిర్ణయం అని పలకడం రాని వాళ్ళుకూడా న్యూస్ చదివేస్తారు
నిరణ యం అంటారు . సోనియమ్మ అనడానికి '' సో' నియ్యమ్మ అనేవాళ్ళు వున్నారు . మీయ పూర్
అనేది హైదరాబాద్ లో ఒక ప్లేస్ దాన్ని ''మీ అయ్యా పూర్ ''అని అఫ్జల్ గంజ్ ని ''అప్పలగంజ్ ''అని
చదువుతున్నారు . నేను ఊరికే చెప్పడం లేదు మీరుకూడా పరిశీలించండి తెలుస్తుంది మీరే ఆశ్చర్య
పోతారు . ఒంటేలు మీద [ఒంటెలు మీద ] ఊరేగారు , ఇలాంటివి విని నాకు చాల బాధ అన్పిస్తుంది .
ఎలాంటి పక్షపాతం లేకుండా పరిపాలిస్తానని ప్రమాణం చేస్తున్నాను .
ఎలాంటి ' పక్షవాతం ' లేకుండా ,ఇది సరైనదా .
ఇక ప్రకటనల్లో జరిగే తప్పులైతే అన్నీ ఇన్నీ కావు .
హార్లిక్స్ ఏ డ్ ; ఈవేల హార్లిక్స్ ఇచ్చవ ..
ఒక నిముషం పాటు కడిగితే కాని ''క్రీములు ''పోవు [క్రిములు ].
సేవంటి ఫైవ్ రూపాయలకే [సేవేంటి ఫైవ్ రుపీస్ అనాలి ,లేదా డెబ్బై ఐదు అనాలి కదా ] .
మీ టూత్ పేస్ట్ లో వుప్పుంద్యా [ ఉప్పు వుందా ] .
దురగ నై , అంటే తెలుసా ,''దుర్గా నెయ్యి '' అన్నమాట .
మీ టూత్ పేస్ట్ లో వుప్పుంద్యా [ ఉప్పు వుందా ] .
దురగ నై , అంటే తెలుసా ,''దుర్గా నెయ్యి '' అన్నమాట .
కొన్ని తెలుగు పదాలు అసలు ఎప్పుడో కొట్టుకు పోయాయి .
విపులీకరించడం ,
విసదీకరించడం ,
విడమరచి చెప్పడం ,
మోషాడ గొట్టడం ,
వెగటు , నోటికి హితవు , ఇలాంటివి చాలా ..........
వెగటు , నోటికి హితవు , ఇలాంటివి చాలా ..........
ఇలాంటి వి ముందే ఊహించారేమో , మా నాన్నగారు మమ్మల్ని కూర్చో పెట్టి ,
''తక్షణమే హస్తినకేగి ''
''విక్ష్వక్షేనుని కొడుకు ఖస్ ఖస్ ఖం భట్లు '' ఇలాంటి కష్ట మైన పదాలు నేర్పించే వారు .
''రాముని తో కపివరుండు యిట్లనియె '' అని రాయడానికి ఒకతను ఇలా రాసాడని
వ్రాసి చూపించే వారు .
''రాముని తోక పీకి వరుడిట్లనియే '' అలా వుంటుంది భాష మీద పట్టు లేక పొతే .
కాకినాడ లో ' గొడా రి గుంట ' వెళ్ళే దారి లో ఒక కొట్టు వుండేది . దాని పేరిలా వ్రాసి వుండేది .
ఇప్పుడుందో లేదో ,పేరుమర్చారో తెలీదు మరి .
''కన్యకు మారికి రాణా షాప్ '' అసలు పేరు ''కన్యా కుమారి కిరాణ షాప్ '' అదీ విషయం .
మీరొకరున్నారా మాతో! నేనే తెను పిచ్చాణ్ణనుకున్నా తెనుగులో మాట్లాడటం నామోషీ కదా! ఇద్దరు తెనుగువాళ్ళు కలిస్తే ఇంగ్లీషులోనే మాటాడుకుంటారు.
ReplyDeleteనమస్కారం గురూ గారు ,ఆలస్యానికి మన్నించాలి ,
Deleteవిమర్శించాలని కాదు కాని ,భాష మీద ప్రేమతో .
మీ పోస్ట్ లన్నీ చదువుతుంటానండీ కానీ కామెంట్ రాయటానికి బద్దకం. కొన్ని పోస్ట్ లు చదివి చక్కగా నవ్వుకున్నానండీ. ఇక టి.వి వ్యాఖ్యాతల తెలుగు విషయానికొస్తే ఇప్పుడు పిల్లలు అలాంటి తెలుగే నేర్చుకుని మాట్లాడుతుంటే వినలేక చాలా కష్టపడవలసి వస్తుందండీ.
ReplyDeleteమహిగారూ, బ్లాగుప్రపంచానికి స్వాగతం. ఇది బహిఃప్రపంచానికి ఎందులోనూ తీసిపోదండోయ్! తస్మాత్ జాగ్రత.
Deleteమహి గారు ,బ్లాగ్ లోకానికే స్వాగతం , ఇంట్లోను ,టి వి లోను ,సినిమా లోను ,
Deleteఅన్ని సమస్యలే కదండీ , అందుకే సరదాగా ... మీరు నవ్వుకున్నా నన్నారు
అదిచాలు , thanku ...........
ఒకప్పుడు, అంటే తొంభయ్యవదశకం ప్రారంభంలో అన్నమాట, అమీర్ పేటలో అనుకుంటా ఒకచోట చూసిన చిన్న దుకాణం నామధేయం "ఘోరీ హ్రంక్రర్ షైకిఇ ఠక్సి" అలాగే అప్పటికి చాలా కాలంముందే చూసిన ఒక దుకాణంవాడి యాడ్ "You can change your husband here" అని ఉంది.
ReplyDeleteతెలుగులో మాట్లాడటం నామోషీ అనుకునే వారిని చూసి బాధపడే తరం త్వరలోనే ముగుస్తుంది లెండి. మరో పాతికేళ్ళకి తెలుగులో ఎవరన్నా మాట్లాడితే జూలో వేస్తారేమో ఆ శాల్తీని.
అప్పుతచ్చులకు మన్నించాలి. అసలు నే చూసిన నామధేయం "ఘోరీ షంక్రర్ షైకిల్ ఠక్సి". అన్నట్లు అదొక సైకిళ్ళు అద్దెకిచ్చే దుకాణం
Deleteశ్యామలీయంగారికి నమస్తే , ఆమధ్య ఒక షాప్ పేరు చదివానండి ,
Deleteపీస్ పిత్రే '' అంటే ''ఫిష్ ఫ్రై '' అన్నమాట ,రాస్తే నమ్మరేమో అని
రాయలేదండి ,అప్పటినించి మా ఇంట్లో ఆడిష్ పేరు ''పీస్ పిత్రే '' నే .
ఓ అమ్మో! ఇప్పుడు వామ్మో! అంటున్నాం లెండి. మన తెనుగు భాషకి ఎంత దివ్య వైభవం కలిగింది. ఆనందంతో మాట రావడం లేదు.
ReplyDelete
ReplyDeleteసాగ రతీ రమ్ !!!
జిలేబి
స్వాగతం బిలేజి sory జిలేబి గారు ,మీరుసూచించిన పేరు బాగుంది సుమండీ !
ReplyDelete