ఆమె తల్లి తండ్రులు ,మావురే కావడం వల్ల ,పెళ్లి ఇక్కడే కనుక వెళ్ళాం . వరుడి బామ్మ చాల చలాకి గా వుంది .
ఆడపెళ్ళివారి తరపున మర్యాదలకు ,లోటు జరిగినా , సర్దుకు పోతూ ,ముఖం మాడ్చుకున్న కోడలికి నచ్చచేప్తు ,
వధువు తండ్రిని హెచ్చ రిస్తూ ,అజమాయిషీ చేసేస్తోంది . అందరింట్లో బామ్మలు ఇలా వుంటే ,సర్దుకు పోతుంటే
ఏ ఇబ్బందులు రావుకదా ! అనుకుంటూ వెళ్ళిన కొంచెం సేపటికే తన అభిమాని ని అయిపోయా ,నేనుకూడా
బామ్మనయ్యాక ఇంతే అవగాహనతో అందరి తో [ఆశ్రమం లో చేర్పించ కుండా ఇంట్లో ఉండనిస్తే ]సర్దుకు పోవాలి
అని నిర్ణ ఇంచు[చేసు ] కున్నాను . మొదట్లో ఐదు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవి ,తర్వాత ఒకరోజు కి వచ్చాయి .
ఇప్పుడేమో గంటల్లోకి వచ్చాయి . హైదరాబాద్ ట్రాఫ్ఫిక్ లో పడి ''కాస్త '' లేటు గా వెళ్ళాం అనుకోండి అంతే ,
విప్పేసిన పూలు ,ఎత్తేసిన కుర్చీలు ,బోర్లించిన గిన్నెలు కనబడతాయి . పెళ్లి వాళ్ళు వెళ్లి పోవడము ,మరో
పెల్లివాళ్ళు వచ్చి అలంకారం మొదలు పెట్టడం జరిగి పోతాయి . బిక్కమొగమేసి ,ఇదేమిటి ఇలా జరిగింది ?
భోజనం లేకపోతే పోయే ,అలంకారం వృధా ఐతే పోయే ,పెట్రోల్ పొతే పోయే , అసలు పెళ్లి వాళ్ళు 'పలక రించిన '
'పలకరించక పోయినా ' కనీసం వాళ్ళ దృష్టి లో నన్నా పడాలి లేదా ,వీడియో లోనన్న ' పడాలి ' తర్వాతన్న
చూసుకుంటారు . ఆ అవకాసము పోయే ,ఇలా ఒకటి రెండుసార్లు జరిగాక ,నేను అందరికంటే ముందు అంటే
ఉదయం తొమ్మిదికి ముహూర్తం ఐతే ,ఏ డున్నరకే అక్కడుండడం మొదలు పెట్టాను . నేను వెళ్లాకే ఆడ పెళ్లి
వాళ్ళు ,మగ పెళ్లి వాళ్ళు వస్తారన్నమాట . అలా ముందుగా వేల్లికుచోడం వల్ల బామ్మ మంచి ఇంట్రస్టింగ్
అన్పించింది ,ఆమె చుట్టూ అక్కడక్కడే తిరగసాగెను ఇంతలో ఒకరొకరె రాశాగేరు . అందరు ముందుగ బామ్మ
ని పలకరించి వెళ్తున్నారు . ఇంతలో ఒకామె 'అత్తమ్మా 'అంటూ బామ్మని వాటేసుకుంది ,ఎలాగున్నవే కాత్యాయిని
అంటూ ,మీ ఆయనేడే అంది ,ఆమె అటువేపు చూపిస్తూ అక్కడున్నారు అంది . అక్కడ చాలమందే వున్నారు .
ఎవరెవరో నాకర్ధం కాలా ,బామ్మకి అర్ధమైతే చాలని వుర్కున్నాను . ''నా కోడలివి కావలసిన దానివి ఈరోజు
ఇదంతా నీ చేతుల మీదుగా జరగాల్సిన తంతు '' అంటూ బామ్మ నిట్టూర్పు విడిచింది . అబ్బో అనట్టు తలాడిస్తూ
ఇంతవిషయం వుందా అనుకున్నాను . ''నీ తమ్ముడేగా నువ్వు హక్కుతో నాలుగు కేక లేస్తే వినక పోయే వాడా
అంతా నువ్వు చేసి ఇప్పుడనుకుని ఏమి లాభం ?'' అని ఇదంతా నిన్నే జరిగినట్లు నిష్టురమాడింది కాత్యాయిని
ఆమె గారి కళ్ళు కూడా తడిసాయని నా అనుమానం . ''అవునే అత్తమ్మా మన సోమేసు [వరుడు సోమశేఖర్ ]
ముంబై లో వుద్యోగం ,అమ్మాయి హైదరాబాద్ ,మరి కాపురం ఎక్కడ పెడతారు'' అని అడిగింది . 'నీ మొహం
ఈ రోజుల్లో కాపురం అదీ ఏమిటి ,వాడికేప్పుడు సెలవు దొరికితే అప్పుడు వస్తాడు ,రెండు రోజులుంది వెళ్తాడు .
పిల్లా అంతే ,డబ్బు ఉండాలే కాని విమానం ఎక్కితే గంటలో అక్కడుంటారు ,ఇద్దరికీ కలిపి ఎంతోస్తుందో తెలుసా
... లక్షలు . ' అంది . కత్యాయినికి మండినట్టుంది 'ఆన్ లైన్ కాపురం అన్నమాట అంది లేచి వెళ్తూ . బామ్మ
బాగా ఆ లోచిస్తుందని ,ప్రోద్దుట్నించి ' ఆరాధించిన 'నేను ఖంగు తిన్నాను . ఎందుకీ పెళ్లి ? డబ్బుంటే చాలా !
ఇద్దరికీ ఉద్యోగాలు మంచి జీతాలు వుంటే చాలా , జీవితం వద్దా , ఇప్పుడు ఈ బామ్మని కదిపినా ,పెళ్లి ఐన కొత్తలో
సంగతులన్నీ ఒక్కటి మరచి పోకుండా ,కులుకుతూ చెప్పు కొస్తుంది . ఎందుకంటే అందరి జీవితాల్లో అవి అంత
ముఖ్యమైన రోజులు . మరి వీళ్ళకి వద్దా ఆ జీవితం ? మొదట్లోనే ఒక అభిప్రాయం ఎ ర్పడుతుంది ,ఆ ఇష్టం
లోనించి సర్దు బాటు అలవాటు అవుతుంది . మరి అలాంటప్పుడే ఎవరి వుద్యోగం వాళ్ళు చేసు కుంటూ ఎవరి
బిజీ లో వాళ్ళుంటే ,ఒకరిమీద ఒకరికి అవగాహన ఎప్పుడొస్తుంది . కొత్తజంట కీ ఆవిషయం ఎవరు చెప్తారు .
చెప్పాల్సిన పెద్దలే ఇంత కింతని లెక్కలు చుస్తే వాళ్ళకి అదే నిజమన్పిస్తుంది . వాళ్ళన్న పెల్లిచుపులప్పుడు
ఒక అర్దగంట కూచుని ,ఇంట్లో వుంటావా ,వుద్యోగం చేస్తావా ,నువ్వు నాతొ వుంటావా ,నేను నీతో ఉండనా ,
[మన ప్రారబ్ధం చుడండి ఎంతగా దిగాజారాయో పరిస్తితులు ]అడిగి ఒక అవగాహనకి వస్తే బాగుంటుంది కదా
అబ్బే నాజీతం నాది ,నీజీతం నీది ,ఆన్ లైన్ లో ఇవి మాత్రం బాగా చర్చిస్తారు . జీవితం, ప్రేమ , పిల్లలు , అనే
ఆ లోచనే కనపడదు . పోనీ ఇదొక వ్యాపారం అనుకుందా మంటే ,పిల్లలు పుట్టు కొస్తారే మరి ?వారి అతీ గతీ ?
వాళ్ళుకూడా ''రోబో ''లైతే బాగుండు ,కాని మన లాంటి జీవులే . చీర కట్టుకోడం రాదు ,ఐదు అంకెల జీతం ,
పెళ్ళంటే బాద్యత అని తెలీదు , లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ,పెళ్లి ళ్లు , భర్త తో సహజీవనం అంటే సర్దు బాటని వీళకి
ఎప్పుడు అర్ధం అవుతుందో ...... ఎప్పుడెలా పరిస్తితులు మారతాయో తెలియని జీవితాలు మనవి ఉన్నదాంట్లో
సంతోషం గా ....... ప్రతి నిముషం సరదాగా గడుపుతూ ........... ,ఆనందం గా బ్రతికేస్తే చాలదూ .........
************************************************

విమనాల్లోనే కాపరమండీ బాబూ! ఒక ఇల్లు అక్కడ ఉండడం మొగుడు పెళ్ళాం, పిల్లలు ఇదంతా పాత చింతకాయ పచ్చడి....డబ్బులుంటే చాలు..
ReplyDeleteమీరు నా బ్లాగ్ చదవడమేఆనందం, కామెంట్ పెట్టడం మహదానందం ,
ReplyDeleteమీకు, మీ పెద్దమనసుకి , పాదాభి వందనం .