బ్లాగ్ లో ఐతే 'కొంత మంది 'చదువు తారు ,అన్న ఆలోచన తో ,మొదలు పెట్టాను . కాని 'ఇంతమంది '
చదువుతారు అనుకోలేదు .
కొన్నినేలలు అంటే రెండున్నర నెలలు ఎలాంటి కామెంట్స్ రాలేదు . నా పని నేను చేస్తూ వెళ్ళాను . నిజానికి
నాకు ' కామెంట్స్ అంత ముఖ్యమని తెలీదు' అంటే సరిపోతుంది . ఇప్పటికీ వారం లో ఒకరోజు మాత్రమే
ఆలోచించి టైప్ చేస్తాను , ప్రతి రోజు ఒక గంట మిగతా బ్లాగ్ లన్ని చదువు తాను . నాకు నా కుటుంబం
ఎంత ముఖ్యమో నా కున్న హాబీలు అంతే ముఖ్యం . అలాగే నేను ముచ్చట పడి ,పెట్టుకున్న నా బ్లాగ్
కూడా నాకంతే ముఖ్యం నా భావాలన్నీ మీతో పంచు కోవాలి గా ... చాల మందే స్నేహితులయ్యారు .
అన్నీ మంచి కామెంట్లే వచ్చాయి .
ఉత్తమ బ్లాగ్ లో చోటు దక్కడం నాకు చాల ఆనందం . ఎప్పటికీ చది వి ఆదరిస్తారని నమ్ముతూ
మీతో కలసి ఎంతో ప్రయాణం చెయ్యాలని ఆశిస్తూ ...
బ్లోగిల్లు వారికి , ఇండి బ్లాగర్ వారికి నా కృతఙ్ఞతలు .
No comments:
Post a Comment