Total Pageviews

Thursday, April 30, 2015

పట్టు చీర

సంత్సరం  కావస్తోంది ,ఈ బ్లాగ్  పెట్టి ,ఈ సందర్భం గా ,నాకునచ్చిన  పాత టపా  ఒకటి
మరొక్కసారి ... మీ పెదవుల పై  చిరునవ్వు  కోసమే ...........

అప్పుడు  మేము  అపార్ట్ మెంట్  లో  ఉండే వాళ్ళం , నాలుగేళ్ళ  క్రితం  అన్నమాట . క్రింది  ఫ్లోర్  లో అంటే ఫస్ట్ ఫ్లోర్  అన్నమాట  ఒక అంటి  ఉండేది .  అపార్ట్ మెంట్  అంటే ఎలా  ఉంటుందో తెలుసుగా  ఒకరి తో ఒకరికి  సంబంధం ఉండదు . కానీ అంటి తరచూ  నాకోసం వచ్చేది ,ఏదైనా సలహా  ఇచ్చే టప్పుడు  మా అత్త  లా  మంచి ,చెడ్డ మాట్లాడే  టప్పుడు  మా నానమ్మ లా  అన్పించేది . అందరూ  దూరంగా ఉండడం  తో ఆవిడకి  బాగా  దగ్గరయ్యాను . ఆమె కి ఉన్నబలహీనత  ఒక్కటే  ఇక్కడి  విషయం అక్కడ , అక్కడి విషయం ఇక్కడా  చెప్పడం . అదిచాలు కదా , కాని నేను  బలహీనతలు  లేని  మనుషులు  ఉంటారా అని ,సర్దుకు పోయేదాన్ని . నన్ను తరచూ టి వి లో వచ్చే ప్రోగ్రామ్స్ కి ఫోన్  చేయ్యమనేది , లేదా 'అమ్మలక్కలు ' అనే ప్రోగ్రాం కి చేసి వాళ్ళు వస్తారండి  మనం చెప్పే ముచ్చ ట్లు ,ప్రసారం  చేస్తారు అనేది ,నాకిష్టం ఉండదంటే అదోల చూసేది . ఒకరోజు  నారత కొద్ది ఒక లైవ్  చూసాను ,పేరేమో 'ముట్టు  కుంటే  ముతక చీర ' అనే ప్రోగ్రాం .  ల్యాండ్ లైన్ ఫోన్  దగ్గరగా  కూర్చున్నానేమో ,[అంటి మాటలు కూడా  పనిచేసి  ఉంటై ]ఫోన్ ట్రై  చేశాను . మొదట  రింగ్ ఐంది కానీ  ఎవరూ తీయ లేదు . నంబర్లు  మనకి ,చీరలు  బందు  వర్గానికి . అని తిట్టుకున్నాను ,మళ్లీ చేశాను ,ఎవరో ఫోన్ తీసారు , మీపేరు,  అడ్రెస్స్ ,వివరాలు ,చెప్పండి  అన్నాడు అన్ని  రాసు కున్నాడు . మీరిలా కాదు గట్టి  గా మాట్లాడాలి ,అని విసుక్కున్నాడు . 'అరె భయ్ ,ఒక్క ఫోన్ కాల్ కె అయిదారు  వేల రూపాయల  చీర  లిస్తుర్రు  జర ఓపిక తో  నుండాలే ' అని సమజ ఇంచు కొంటి . 'లైన్ లోనే ఉండండి ,వేరే కాల్ మాట్లాడు తోంది . అన్నాడు  అదికూడా విన్పిస్తోంది . 'ఆయ్ మీది [ఏకరింగ్ ]చాలా బాగుంటా  దండి , మాకు మీరంటే పేనవండి ఆయ్ ' అంది . లైన్ లో  ఉన్నవాడే మొ'  చీర ఊరికే ఇస్తోంది కదా  'అన్నాడు , అక్కడున్న మగ  గొంతు లన్నీ నవ్వాయి ,నేను పెట్టే ద్దాము  అనుకునే సరికి 'ఉన్నారా లైన్ లో  ,తర్వాత మీరే , అరే  మంచి చీర పోతోందండి ' అన్నాడు . పేరంటి అన్నాను 'చిన్నా 'అన్నాడు . అవతల కాలర్  చీర గెలుచు కుంది  చప్పట్ల ఆడియో  ప్లే చేసారు . మీరే మాట్లాడండి  గట్టిగా , అన్నాడు . 'హలో  మీపెరెంటి ' చెప్పాను , మీవారి పేరు?  చెప్పాను  [అదే నేను చేసిన తప్పు ] మీరు ఏం  చేస్తుంటారు ? సాదారణం గా ఈపాటికి భోంచేస్తుంటాను  ఈరోజు  లేటైంది ,ఆమె గలగల మని  నవ్వేసింది . మీ వారేమి చేస్తారు ?  [అచేప్పేస్తారు ] ఆఫీసు కెల్తారు . ఈసారి ఏడవలేక  నవ్వింది ,మీరు నాకన్నా పంచ్ లు వేస్తున్నారు అంది ,[నీకలా అర్ధం అయ్యిందా ]అనుకుని 'ఏదో మీ అభిమానం ' అన్నాను . ఆమె కి ఏమి  అర్ధం కాలేదు ,నిజానికి  నాకూ అర్ధం  కాలేదు . సర్లెండి చీర చూద్దాం మూడు ధరలు  చెప్తాను  ఒకటే రైటు  అదేమిటో చెప్పండి  అంది . చీర చూపించారు  బానే ఉంది  బాగోక పొతే మాత్రం ఏమి చేస్తాం  అప్పనంగా  వస్తోందికదా ,నేనొక ధర చెప్పాను ,ఆమె చప్పట్లు కొట్టి షాపింగ్ బాగా చేస్తారా అంది  నేను అవును ,కాదు  అన్నట్లు  తలకాయ ఆడించాను . మళ్ళి ఆమెకి కనపడదని గుర్తు వచ్చి వెకిలి నవ్వు నవ్వు తూ  అవునండి  అన్నాను .   ఇంతలో ఎవరో వచ్చారు  డోర్ తీసి చూద్దును కదా అంటి ,మీరేనా ఫోన్ లో  అంది  అవును  అన్నాను గర్వంగా  , ఆవిడ ఆయాస  పడుతూ , నాకుతెలుసు  వీళ్ళంతా నమ్మలేదు. అంది ఎవరూ  అంటూ అడుగు బయటకేసాను  , ప్లాట్స్ లో ఆడళ్ళంతా  గుమ్మాలలో నిలబడి ఉన్నారు . నేను గతుక్కు మన్నాను . ఆడని సినిమా  ఆడించ టానికి ఖాళీ దియేటర్ కి వెళ్ళిన 'ఒక్క ' సినిమా హిరోయిన్ లా అందరికి చేతులుపాను . ఇంతసేపు కలగని  సంతోషమేదో వాళ్ళ జెలస్ చూసాక కలిగింది . అంటి అంది  అందరికి చెప్పి బయటకి పిలిచాను ,ముందు ఎవరూ  నమ్మలేదు  అంది . ఇది నీ ఘనకార్యమా తల్లీ  అనుకున్నాను . రండి లోపలి కి టీ తగుదురు గాని  అని లోపలి కి  నడిచాను .
      నాకా  నిముషం  తెలీదు ఇది  ఎక్కడికి పోయి  ఆగుతుందో ,మూడు రోజుల తర్వాత  ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది  అడ్రెస్స్ కన్ఫర్మ్  చేసుకున్నారు ,నాఖర్మ కొద్ది  ఫోన్  వచ్చినప్పుడు  అంటి అక్కడే ఉంది . చూసారా మీరు  నమ్మ లేదు  వాళ్ళే ఫోన్ చేసారు  అని లేచింది . పాపం ఇప్పుడీమే  మూడు ఫ్లోర్ లు ఎక్కి ,దిగి  విషయం ముప్పయ్  ఫ్లాట్స్ కి  చెప్పి రావాలి కదా  అనుకున్నా . ఇరవయ్ రోజులయ్  నా  చీర  రాలేదు  ఇరుగు పొరుగు  రావడం  'చీర వచ్చిందా చూద్దామని వచ్చాం ' అంటున్నారు . నాకు తల తిరగడం మొదలైంది . ఈయన తో  చెపితే 'తల్లి  నాబుర్ర తినకు  ఐదు వేలు  నేనిస్తాను ,చీర కొని అందరికి చూపించు ' అన్నారు . మరో సమస్య  ఆరోజు ప్రోగ్రాం  అందరు చూసేరు , అందులో అంటి ని  మాయ చెయ్యడం  నావల్ల కాదు . చీర మారిన  విషయం ఇట్టే  పట్టేస్తుంది . ఎలారా  దేవుడా  ఉన్నదానిని ,ఉండకుండా  టి వి  ఎందుకు  చూసితిన్ ,చూసితిని ఫో ,ఫోన్ ఎందుకు చేసితిని . చేసితిని  ఫో ,లైన్  ఎందుకు కలిసినది ,కలిసినది ఫో ,ధర  ఎందుకు చెప్పితిని  అని కడు  విచారము గా నుంటిని .  సరే  అని  అదే నంబర్ కి చేశాను . ఎవరో తీసారు ,పేరు కృష్ణ ట 'ఇదంతా చూసేది భార్గవి మేడం  ట నంబరిచ్చి ఆమె కి  చెయ్యమన్నాడు  చేశాను ,మళ్లీ మొత్తం వృత్తాంతం అంతా  చెప్పాక 'మీ  ఐ  డి  ఫ్రూఫ్స్ తీసుకొని ఆఫీస్ కి రండి  అంది  తప్పుతుందా ,బయటే వివరాల్ని రాసు కుని ,వేలిముద్రలు  తీసు కుని లోపలి పంపారు ,లోపల చాల సేపు కూర్చున్నా , ఎంకర్స్  కబుర్లుచేప్పు కుంటూ తిరుగు తున్నారు . ఒకతను వచ్చి బిల్ సు  వివరాలు తీసుకు వెళ్ళాడు  చీర తో వచ్చాడు . మూత  తీసి చుస్తే ,నాపేరు ఫోన్ నంబరు  ఉన్నాయి . మళ్లీ  ఎంట్రన్స్ దగ్గర  సంతకాలు  వేలి ముద్రలు అయ్యాక  బయటికి వస్తే వర్షం  అలాగే ఆటో పిల్చుకుని  ఇంటి కొచ్చే సరికి  బాల్కనీ లో అంటి నుంచుంది  నా చేతిలో పెట్టె చూడ గానే ఆమె కళ్ళు మెరిసాయి . ఎలాగో ఇంటిలోకి వచ్చి పడ్డాను . అంటి నా వెనకే  వచ్చి చీర చూసి వెళ్ళింది  , ఈవాన లో అన్నిఫ్లోర్స్ తిరగాలీవిడ . మరుసటి రోజు మా ఇంటికి చుట్టాలు  రావడం తో  రెండు రోజులు  ఆమె కి  రావడానికి కుదర లేదు  వాళ్ళిలా  వెళ్ళారో లేదో  వచ్చేసింది 'మీ పట్టు చీర ఇస్తారా  అందరూ  అడుగుతున్నారు  ఆరోజు వర్షమాని  అడగలేదు ఇప్పడు ఇస్తే అందరికి చూపించి  తెస్తాను అంది' నాకు  తిక్క రేగింది  ఈవిడ తీస్కెళ్ళి అందరికి చూపిస్తే ,నేనెలా  కట్టుకునేది ,కట్టుకున్నపుడల్లా  ఇదే  ఫలానా చీర అని  గుస, గుస  లాడితే  తల ఎక్కడ పెట్టుకోవాలి , 'నిన్న  వచ్చిన  మా  బందువులు  తీసు కెళ్ళారు  అందరికి చూపించ టానికి  అని చెప్పాను . ఆవిడ  మొహం  చూడాలి , ఆమె  అటు వెళ్ళ గానే  దొర్లి ,దొర్లి  నవ్వుకున్నాను , అంటే కాదు  ల్యాండ్ లైన్  ఫోన్  తీ ఇంచే సాను  మనసు కోతి  లాంటిది కదా ...........  

Thursday, April 23, 2015

నాకు నచ్చినవి ఇవి . మరిమీకు నచ్చాయా.

నాకు నచ్చిన  జోక్స్  ఇవి ..  మీకు నచ్చుతాయనుకుంటున్నాను .

కస్టమర్ ;   బాబూ  పెసరట్టు  ఆర్డరిచ్చి  ఎంతసేపయ్యింది ,ఇంతవరకు  రాలేదు ??.
సర్వర్ ;  ఉండండి  సార్ , పెసర పప్పుకోసం  వెళ్ళిన కుర్రాడు  ఇంకా  రాలేదు .....
[కుర్రాడు  పెసరపప్పు  తెచ్చాక  నానబెట్టి ,అప్పుడు పెసరట్టు వేసి ఇస్తాడన్నమాట .
పాపం  కష్ట మర్ ..... ]ఒకతను  చిలకను  పెంచుకుంటున్నాడు . ఆ  చిలుక  మాటలు బాగా  నేర్చింది .
పక్కింటి  ఆమెను ,'కాంతమ్మా ' అని  పేరుతొ  పిలిచేది . పలకక  పొతే ,
'ఒసేయ్ కాంతమ్మా ' అనేది . దాంతో  కోపమొచ్చి ఆమె  చిలుక  యజమాని తో
గొడవకొచ్చింది . యజమాని  చిలుకకి  ఎంతచెప్పినా  ఆ పిలుపు  మానలేదు .
దాంతో  కోపమొచ్చిన  యజమాని  దానిని  శిక్షగా ఫ్రిజ్ లో  పెట్టాడు . ఒక గంట
తర్వాత  దానిని  బయటికి తీసి , ''తిక్క కుదిరిందా '' అని  అడిగాడు . కాని
చిలుక  ''నా సంగతి  పక్కనుంచు  ఆ  కోడి ఏమని తిట్టింది  దాని  ఈకలు  పీకి
మరీ ఫ్రిజ్  లో పెట్టావు '' అందట .   తందూరి  చూపించి .రాము ;  ఒరేయ్  శ్యాము , నా  హోం వర్క్  బుక్  నాకు  మండే లోగా  ఇచ్చెయ్యాలి .
శ్యాము ; నీకు ' మండ'కుండానే  ఇచ్చేస్తాలేరా [?]


భర్త ;  ఏమోయ్  మీ  బంధువులు  వచ్చారు . అనిపిలిచాడు , ఆ నందంగా వచ్చిన  భార్యకి
గాడిద లను  చూపించాడు .  ఆమె  ఇంకా  రెండు ఆకులు ఎక్కువే చదివింది .
భార్య ; రండి  అత్తయ్య గారూ .. రండి మావయ్య గారూ ..  అంది . [పాపం  భర్తగారు .. ].


టీచర్ ; రామూ  ఇంత లేట్  ఎందుకయ్యింది ?
రాము ; టీచర్  దారిలో  ఒకాయన  10 రూపాయలు  పడేసుకున్నారు .
టీచర్ ; గుడ్  వెతికిచ్చి  వచ్చావా ...
రాము ; నో  టీచర్  ఆయన వెళ్ళేదాకా  నోటు మీద  కాలుంచి ,వెళ్ళేక  తీసుకుని  వచ్చాను ,
అందుకే లేట్  అయ్యింది .టీచర్ ;  మీరు  కోటీశ్వరు లైతే  ఏమిచేస్తారు  , అని  వ్యాసం రాసుకు  రమ్మన్నాను  రాసారా !!!!!!
ఏరా  రాము  నువ్వు రాసావా ?
రాము ; నన్ను అడుగుతా రేంటి  టీచర్  నా   సెక్రటరీ  ని  అడగండి .


భార్య ; ఏమండీ  ఆ పాతకాలం  గడియారం తీసి పారేయమంటే  వినరు  ఇప్పుడు చూడండి ,
కొంచెముంటే  మా అమ్మ  తల పై  పడుండేది ..
భర్త ;  వెధవ  గడియారం  ఎప్పుడూ  లేటే ...

భర్త ; ఏమోయ్ ! రాత్రి నాకు  పీచు మిఠాయి  తిన్నట్టు  కలవచ్చింది .
భార్య ; అందుకేనా  తలగడ లోని  దూది  అంతా మాయమైంది ??????


భర్త ; ఈ రోజు  కాఫీ  ఇంతబాగుందేమిటి ?
భార్య ;మీ మొహం మండా ,నాకోసం  చేకున్న కాఫీ  తాగేసారా  ఏమిటి .. ???


                                            ******************************

Thursday, April 16, 2015

ఎవరిది త్యాగం ?!!!!!!!!!,,భార్య తో  భర్త పలికే  తియ్యని  మాటలు ...


పెళ్ళైన  వారానికి .......

ఎంత అందం  గా  వున్నావో  తెలుసా ! నిన్ను  పెళ్లి చూపుల్లో  చూడగానే  పడిపోయా ,
నీ చలాకీతనం  హుషారు ,నవ్వు మొహం ,నాకు చూడగానే నచ్చేసాయి ................
నీ జడచుసి  పడిపోయానేమో  అన్పిస్తూ వుంటుంది నాకు  అప్పుడపుడు .............

పెళ్ళైన  నెలకి ........

నువ్వు  పుట్టింటికి  వెళ్తే  నాకు  బావుండదు ,నా  బంగారం నా  కళ్ళ ముందే  వుండాలి ..

పెళ్ళైన  మూడు నెలలకి .........

అమ్మ  నడిగి ,వంట ఇంకా బాగా చెయ్యడం  నేర్చుకోవచ్చుకదా !!!!   [సూచన ]

ఆరు నెలలకి .........

ఎండన పడి వుద్యోగం  చేస్తావా ! నీ ఆరోగ్యం ఏమైపోవాలి ,నేను లేనా !  అంతా నేను
చూసుకుంటాను  నువ్వు పాలు ,పళ్ళు తీసుకుంటూ రెస్ట్  తీసుకో ,పండులాంటి బాబు
కావాలి  నాకు ....... [కోరిక ]

సంత్సరానికి ........

ఎప్పుడు చూడు  జిడ్దోడుతూ  ,వాణ్ణి  చంకనేసుకు  తిరగక పొతే ,నేను వచ్చేసరికి  స్నానం
చేసి నీట్  గా  ఉండొచ్చుగా !  [విసుగు ]

మూడేళ్ళ  కి .........

వాడితో పాటు  అక్కడే  స్కూల్  దగ్గర కూర్చుని  ఇంటికి తీస్కురావచ్చుగా , మళ్లీ ఆటో ఎందుకు
 డబ్బు దండుగ ,  [పొదుపు ]

ఆరేళ్ళకి ......

వుద్యోగం  లేదు,   ఎం లేదు ,పిల్లలిని  బాగా చూస్కో  ఇంట్లోపనామేను  పెట్టుకొని , వీళ్ళకి ఆటో పెట్టి ,
డబ్బు దండుగ పనులు  ఎందుకు ఒకపని చెయ్ ,ఇంట్లోనే చీరల కు  పువ్వులు వెయ్యడం ,పూసలు కుట్టడం ,అమ్మడం  చెయ్ .  [సలహా ]

పదిహేనేళ్ళకి ............

ఇంకా  స్నేహితులు ,పుట్టింట్లో  పెళ్ళిళ్ళు అంటే ఎలా ? ఈ ఏడు  బాబు   టెన్త్ కొచ్చాడు  వచ్చే ఏడు
కాలేజ్ ,చెడు స్నేహాలు  పట్టకుండా  నువ్వే  జాగ్రత్తగా  చుసుకొవద్దూ ..  [అదుపు ]

ఇరవై ఐదు  సంవత్సరాలు ...


హమ్మయ్యా  బాబు కి  వుద్యోగం  వచ్చేసింది ,దీని వెనుక '' నా ''కృషి పట్టుదల ''త్యాగం '' ఎంతో వుంది కదా ?!!!.[ఆమె  అంతరంగం ..

అవును నాకు మాత్రం  స్నేహితులు లేరు ,బంధువులు లేరు , పుట్టిల్లు లేదు .ఉనికి కూడా  లేదు ..
 వెనక్కి  తిరిగి  చుస్తే   ఎవరు లేరు   ఏ మిలేదు . ఏ మిలేదు  ఆఖరికి  త్యాగానికి గుర్తింపు  కూడా లేదు ?!!!!!!!. ]

ఇలా  కాకుండా  ఎవరన్నా ,ఆడదాన్ని  ఆదరించే  మగవాళ్ళు   వుంటే  గింటే  వారికీ  ,
భార్యని  ఒక స్నేహితురాలిగా  భావించి గౌరవించే  వారికీ ,జీవితమంతా తోడూ నీడా  గా
నిలిచి చెయ్యిపట్టి  నడిపించేవారికి , నా  నమస్సుమాంజలి .


                                           **********************************

Thursday, April 9, 2015

''నాగ మల్లిక '' ఇదో ప్రేమ కధ .కుర్చీలన్ని  గుండ్రంగా  తిప్పేసుకుని ,కూచుని  కబుర్లు చెప్పుకుంటున్నాము . మండపం  దాదాపు ఖాళి ఐంది .
పిల్లలంతా  ధర్మకోల్  బాల్స్ తో  ఆడుతున్నారు ,ఇంకా కొంతమంది ,పూలన్నీ తీసి  విసురుకుంటున్నారు . మా 
కుళ్ళు జోకులతో ,నవ్వులతో ,మా చుట్టూ మాత్రమే  సందడి గా వుంది . ఇంతలో ఒక వ్యక్తీ నా  దగ్గరికి  వచ్చాడు . 
''అమ్మా  నువ్వు ___ చిన్నాన్న గారి  అమ్మాయి వే  కదా '' అన్నాడు  నేను మర్యాద కోసం  లేచినిలబడ్డ ను . 
''అవునండీ  మీరు' ..నసిగెను . '' నేను నీకు  అన్నయ్యను  అవుతానమ్మా నా పేరు  శివ రామ్ ,నిన్ను ఇందాక 
నించి  చూస్తున్నా  ఆకుర్చోడం ,నవ్వడం  ,చిన్నాన్నే  కన్పిస్తున్నారు ,పోల్చేసాను . అందుకే  వచ్చి అడిగేసాను ''. 
అన్నాడు . అయన  అలా  అనగానే  ఉబ్బి తబ్బిబ్బు  అయ్యాను 'హే  ఎస్సేడు 'అనుకున్నా  ఇక్కడొక విషయం 
చెప్పాలి మీకు , నాకు  నన్నెవరన్నా  మా  నాన్నగారితో పోలిస్తే  కర్ణు డిలా  కవచకుండలాలు  వలిచి ఇచ్చేస్తాను . 
అదన్నమాట . ''రా  అమ్మా  అలా కూచుని  మాట్లాడు దాం '' అన్నాడు . మనసులో  ఈనతొ  నాకు మాటలేమి 
వుంటాయి  అనుకుంటూ ,మా  వాళ్లతో ఇప్పుడే వస్తాను  అన్నట్టు చెయ్యి చూపి  ఆయన వెంట  నడిచాను . 
కాస్త దూరం లో  వున్నా  కుర్చీలలో  కూర్చుని, ఎక్కడవుండేది ,  ఎంతమంది పిల్లలు ,ఆదాయ వ్యయాలు 
తాలూకు వివరాలు ,చిన్న ప్రస్నావళి  అయ్యాక ''చాల సంతోషం  అమ్మా అంత  దూరం  నించి పెళ్ళికి రావడం 
మంచి విషయం '' అన్నారు . నేనూ ఏదో అడగాలి కాబట్టి అడుగుతూ  ''మీరెక్కడ వుంటారు పిల్లలెంత మంది ''
అన్నాను . ఆయన  ఆశ్చర్యం గా  చూసాడు ,మొహం చిన్న  బోయింది . ''నీకు తెలీదా నేను పెళ్లి చేసు కోలేదు ''
అన్నాడు . అప్రయత్నం గా  ఎందుకు అన్నాను . ఆయన ముఖం  వాడిపోయింది .చేతి  వేళ్ళు చూసుకుంటూ .. 
నీకు  ''నాగమల్లి ''తెలుసుగా  అన్నారు , నేను  సంశ యంగా చూస్తూ  ''అవునూ.. నాగామల్లి 'క ?'' అన్నాను ,
అవునమ్మా  నీ చిన్నప్పుడు  మీ ఇంటి పక్కనుండే  దమయంతి గారి  మేనకోడలు ,అన్నాడు . అవును 
గుర్తుంది  మర్చి పోయే  రూపమా  ఆమెది ,' కాని తను  చనిపోయింది కదా ..' అన్నాను . అవును అందుకే 
నేను పెళ్లి చేసుకోలేదు ,నువ్వు చిన్నదానివి నీకు గుర్తులేదేమో  అనుకుంటున్నాను  అన్నాడు .

మాది  చాల  పెద్ద ఇల్లు ,ఇవతలి వీధికి   ఎనిమిది   అడుగుల సింహద్వారం  టీక్ వుడ్  తో చేసినది వుంది . 
పిల్లలు గడియ వెయ్యాలంటే ఇద్దరం వేసేవాళ్ళం , డాబా ఇల్లు ,అవతలి వీధి కి  పెంకుటిల్లు  వుండేది రెండిళ్ళ  మధ్యలో రకరకాల  చెట్లు ,మొక్కలు .నీళ్ళ పంపు చుట్టూ  గుండ్రటి సిమెంట్ అరుగు వుండేది . 
గిన్నెలు కడిగేది ,బట్టలుతికేది అక్కడే . చెట్ల కింద మంచాలు వేసుకుని  కుర్చునేవాళ్ళం ,ప్రతి సంక్రాంతి కి 
అందరూ  వచ్చేవాళ్ళు ,ఒకమంచమన్నా విరగ్గోట్టేవాళ్ళు అంతమంది కుర్చునేవాళ్ళం .

పక్కనే  వున్న ఇల్లు  దమయంతి గారిది . మా వాళ్లకి స్నేహితులే కాదు  బంధువులు కూడా  అనుకుంటా ,
వరసలతో పిలుచుకుంటూ ,వస్తూ  పోతూ  వుండేవారు . ఆ  దమయంతిగారి  మేనకోడలే  'నాగమల్లిక '. 
తరచూ  మేనత్త  ఇంటికి వచ్చిపోతుండేది ,వాళ్ళది పదిమైళ్ళ దూరం లోవున్న  పల్లెటూరు . ఆ అమ్మాయి 
ఎంతందంగా ఉండేదంటే ,భగవంతుడు  ప్రత్యేకం గా  తయారుచేసిన  బొమ్మలా  వుండేది . అందమే కాదు 
అంతకు మించిన  ,గుణం  కూడా వుంది . వంచిన తల ఎత్తెది కాదు , పలకరించిన వారికి  చిరునవ్వే 
సమాధానం . ఏంతో  నేమ్మదస్తురాలు . అంతకుమించిన  సుకుమారమైన హృదయం అని తర్వాత తెలుసు 
కున్నాను . అత్తకి సాయం  గా  బట్టలు ఆరేస్తూ  పెరట్లో తిరుగుతుంటే ,ఆమె సోగ కళ్ళని ,పేద్ద .. జడని రెప్ప 
వాల్చక  చూస్తూ ఈమె రూపమే ఇలావుంది ,జీవితం ఇంకెంత అందం గమలుచు  కుంటుందో అనుకునే దాన్ని . 
అడిగిన వాళ్ళకి అడగని  వాళ్లకి  దమయంతి గారు ,మల్లి  నా కోడలు అని చెప్పేవారు . ఆ అమ్మాయి ఇది 
తన అత్తవారిల్లు అని నిర్నైన్చేసు కుంది  మనసులో . దమయంతి గారి అమ్మాయితో  కలిసి  గుడికి 
సినిమాకి  వెళ్లి వస్తుండేది .  అన్ని అనుకున్నట్లు జరిగితే  కదేముంది ? అతగాడికి  వుద్యోగం  రాగానే తల్లి కి 
చెప్పాడు  ఎవరినో ప్రేమించానని ,ఆమెనే  పెళ్లి చేసుకుంటానని . ఇద్దరు గొడవ పడ్డారు . దమయంతిగారు 
మెల్లగా నచ్చ చెబితే వింటా డనుకుని  పొరబడ్డారు . కొడుకు కి  భర్త  సపోర్ట్ చెయ్యడం ఆవిడకి నచ్చలేదు . 
మేనకోడల్ని  రానివ్వద్దని  భర్త చెప్పడం  ఆవిడకి బాధకలిగించింది . వీళ్ళిలా తగువులు  పడుతుండగా 
ఎప్పటిలాగే  మల్లి  మళ్లీ  వచ్చింది . ఆరోజు తల్లి కొడుకు  ఆ అమ్మాయి ముందే ఇంగితం  మర్చి పోయి 
గొడవపడ్డారు ,మల్లిని పంపేయమని  అరిచాడు . దమయంతిగారు 'నేను వచ్చి నాన్నతో మాట్లాడతాను ,
ఇక్కడి సంగతులేమి నాన్నకు చెప్పకు ,నువ్వెళ్ళి రా ,' అంటూ ఆమెని  పంపేసారు . తను  ఊరెళ్ళి పోయింది . 
ఆ రాత్రి  దమయంతి  గారు ఏ డ్చుకుంటూ ,వూరికి వెళ్ళిపోయారు . తర్వాత  పెద్దవాళ్ళ మాటల్లో  తెలిసింది . 
నాగామల్లిక  చనిపోయిందని . అంతవరకే నాకు తెలుసు . కాని శివరాం  అన్నయ్య నాకు వేరే  కోణం చెప్పారు . 

ఆయన మాటల్లోనే ..'' మా  పెద్దమ్మ కూతురు  సుగుణ ,నేను  స్వంత  అక్క తమ్ముళ్ళ లా  వుండేవాళ్ళం  మా 
పెద్దమ్మ , అమ్మ  కూడా  వుండేది పక్క పక్కనే కావడం తో ,మరింత కల్సి  మెలిసి   వుండేవాళ్ళం  నా పదేళ్ళ 
వయసు లో అక్కకి  పెళ్లిజరిగింది . బావగారు కూడా  నన్ను బాగా  చూసే వారు . తరచు అక్కతో  వాళ్ళ అత్తవారి 
ఊరికి వెళ్తుండే వాడిని . అప్పుడే  బావగారిఅక్కయ్య  దమయంతి గారి ఇంటికి వచ్చినపుడు ,మీ నాన్న గారిని 
చూసాను  ఆయన  ఒకసారి చుస్తే మరిచి పోయే వ్యక్తీ  కాదు . సుగుణ అక్కయ్యకి  ''నాగమల్లి 'పుట్టింది . అక్క 
నాతొ  ఇది నీ పెళ్ళాం రా  అంది . ఎందుకో  కాని  నాకు  చాల నచ్చేసింది  మల్లి ,వాళ్ళ వురు వెళ్ళాక  నేను 
చదువులో  పడి పోయాను . సెలవుల్లో వచ్చినపుడు ,మల్లి నేను  బాగా ఆడుకునే వాళ్ళం . నేను  మల్లి మీద 
ఇష్టం పెంచుకుంటున్న  సమయం లోనే  తను దమయంతి గారి  అబ్బాయి ని  ఇష్ట పడటం  మొదలు పెట్టింది . 
నాకు వుద్యోగం  రాగానే  అక్క బావగారిని  పెళ్లి గురించి అడిగింది ,అడిగింది  అనేకంటే  నేను అడిగించేను  అంటే 
బావుంటుంది . కాని  బావగారు  మల్లి ని  తన మేనల్లుదికే  ఇచ్చి చేస్తాను  అని చెప్పే సే రు . అక్క సంబంధాలు 
చూస్తాను అని  చెప్తున్నా వినకుండా మూడేళ్ళు గడిపేసాను . ఇంతలో  దమయంతి గారి  అబ్బాయికి వుద్యోగం 
వచ్చింది . అక్కబావ దమయంతిగారిని  అడిగారు, ఆవిడ  మల్లి నా కోడలు  అని మాటిచ్చారు . వాళ్ళ అబ్బాయి 
ఎవరినో  ప్రేమించడం ,ఆసమయానికి  అక్కడవున్న  మల్లిని తండ్రి, కొడుకు వేల్లిపోమ్మనడం . తిరిగి వస్తూ  మల్లి 
నిద్రమాత్రలు తెచ్చుకుని వచ్చింది . అప్పుడే వచ్చేసా వేంటి  అని  అక్క అడుగు తున్నా ,అన్నం తినమన్నా వద్దు 
ఎండలో  వచ్చాను కదా  అందట . ఎంత పిలిచినా పలకదట ,రాత్రికి  బావగారు రాగానే  తలుపులు తెరచి చుస్తే 
ఏముంది  నిర్జీవంగా కూతురు . అలా  కూతుర్ని చుసిన  ఆయన తట్టుకోలేక పోయాడు . ఆమె చేతిలోని వుత్తరం 
చదివి ,ఐనవాళ్ళ ద్రోహాన్ని జీర్ణించుకోలేక పోయాడు . భార్యని ఒదార్చవలసిన వాడు పక్కగది లో  ఉరితాడుతో 
తన  దారి తను చూసు కున్నాడు . ఇప్పుడు అక్క  నా దగ్గరే  ఉంటోంది . ఎన్నోసార్లు  పెళ్లి చేసుకోమని అడిగింది . 
కాని చనిపోయే ముందు ,నాగామల్లిక  రాసిన వుత్తరం  చదివాను ''నాకెవరు లేరు  నాన్న ,నేను ఒంటరిదాన్ని 
అందుకే వెళ్ళిపోతున్నా  అని రాసింది . అది నిజం కాదు  తనకు నేను వున్నాను ,ఎన్నో ఏళ్ళు ఎదురు చూసాను . 
చూస్తాను  చూస్తూనే  వుంటాను ,నేను జీవితమంతా పెళ్ళిచేసు కోకుండా వుండి  పోతేనే  తనేక్కడున్నా తనకు 
నా ప్రేమ  అర్ధం అవుతుంది . అప్పుడే మరో జన్మ లోనన్నా  నన్ను కరుణిస్తుంది . తనకు పెళ్లై వుంటే అప్పుడే మర్చిపోయే  వాడినేమో ,నాకెవరు లేరంటూ ప్రాణం తీసుకుంది . నేను ఇలా ఒంటరిగా ఉండిపోతే  తనకోసం 
నేనున్నానని తెలుసుకుంటుంది . అందుకేనమ్మా  నేను పెళ్ళిచేసుకోలేదు'' .ఎందుకో తెలీదు రెండు కన్నీటి 
చుక్కలు  బుగ్గల మీదుగా  బరువుగాజారి  పడ్డాయి ,రెండుచేతులూ వాటికవే జోడించుకున్నాయి ........

 ''పురుషులందు  పుణ్య పురుషులు వేరయా ... ''
                                                              *********************

Thursday, April 2, 2015

జమా ఖర్చులు .


''సంసారానికి   పొదుపు  ,వ్యాపారానికి  మదుపు'' ,మదుపు  అంటే  పెట్టుబడి  అన్నమాట . వ్యాపారానికి పెట్టుబడి
ఎంత ముఖ్యమో ,సంసారానికి పొదుపు అంత  ముఖ్యమన్న మాట . మరి  అంత ముఖ్యమైన  విషయాన్నీ మనం 
పక్కన  పెట్టకూడదు  కదా ,డబ్బును  ఎంత గౌరవిస్తే  అంత మంచిది .మానవ  సంబంధాలన్నీ  ఆర్ధిక సంబంధాలు
అన్నాడు  ఒక ఆంగ్లకవి , నిజంగానే  డబ్బులేని వాళ్ళు  ఎందుకు కొరగారని పిస్తుంది  ఈరోజుల్లో ... మనం
డబ్బు చేతిలో ఉండకుండా ,డబ్బు  మన చేతిలో  ఉండేట్టు  చూసుకోవాల్సిన  బాద్యత  మనదే  కదా మరి .....
మనం ఏ ఆర్ధిక  స్థితి లో  వున్నా  మన పిల్లలు  అంతకు మించిన స్థితి లో వుండాలని  కోరుకోవడంలో  తప్పు
లేదు కదా అందుకు కొన్ని జాగ్రత్తలు  తీసుకోవడం లో కూడా ,మనం ముందుండాలి .

 డబల్  డోర్ ఫ్రిజ్   కొంటే , యాభై  యూనిట్  లు  తేడా వస్తుంది .అందువల్ల  యూనిట్ రేట్  మారి పోతుంది 
 ఎంతమంది  వున్నా  వారాం తం  లో కూరలు తేవడం తప్పదు . రెండు వారాలు కూర గాయలు లు   ఫ్రిజ్  లో  వుంచి తినలేము  కదా ,ఐస్  వాటర్ కావాలంటే రెండు ఐస్ ట్రే లు  ఎక్కువ పెడితే  సరిపోతుంది .

టి  వి  ఇది  కూడా  మన అవసరాన్ని  బట్టి  కొనాలి , పెద్ద హాల్  వుంటే  పెద్ద టి వి , కొనచ్చు  చిన్న ఇంట్లో ,
42 ఇంచీల  టి వి  అవసరం రాదు కదా ! మన  బడ్జెట్  బట్టి  కొంటె మంచిది ,అంతే కాని  పక్కింటి వాళ్ళు 
కొన్నారని కొంటె  ఫలితం ? కళ్ళకి  సైటు  రాక తప్పదు . మళ్ళీ  అదో ఖర్చు . .

మీకు బాగా  పిజా లు ,బర్గర్  ఇష్టమా , నెలలో  నాలుగు సార్లు  తింటున్నారా ,ఐతే  రెండు సార్లకు  తగ్గించండి . 
కష్టం  అనుకుంటున్నారా ,ఎప్పుడన్నా తింటే'  ఇష్టం' అలాగే వుంటుంది . తరచూ తింటే  ఇష్టం  పోతుంది . 
బయట  తినాలి  అనుకుంటే , మాంచి భోజనమే చేయ్యోచ్చుకదా ! అదికూడా  ఎప్పుడన్నా  చేస్తే  అది మనకు 
గుర్తుండి పోతుంది .భోజనం  అయ్యాక  తప్పక ఐస్  క్రీం  తినాలని పిస్తుంది  కదా ,అదే  హోటల్  లో  కుర్చుని
రెట్టింపు ధర ఇచ్చే కన్నా  బయట కి  వచ్చేక  క్వాలిటీ  వారి ,బండి ముందు  కారాపి  కావాల్సిన వి తినచ్చు ,
అంతేకాదు  పెద్దసౌండ్  తో పాటలు వింటూ  కార్ డోర్స్  అన్ని  తీసి పెట్టుకుని ,సరదాగా   పిల్లలతో కల్సి అల్లరి చెయ్యచ్చు .  పుట్టినరోజులు  ,పెళ్లి రోజులు అలాంటివన్న మాట ,అలాంటి సందర్బాలల్లో  ఎంతో బావుంటుంది .
పిల్లలికి  ఎప్పటికీ  గుర్తుండి పోతుంది .ఆలోచిస్తే మీకు ఇంతకన్నా  మంచి ఐడియా లే  రావచ్చు .

వచ్చే దాంట్లో  సగం  మాత్రం ,ఇంటికి తెచ్చే అలవాటు చేసుకోవాలి , అప్పుడే  పొదుపు అలవాటు  అవుతుంది . 
మొత్తం తీసుకొస్తే  ఖర్చు మాత్రమే వుంటుంది . ఉదాహరణకి  ముప్పయ్  ఐదు  వేల జీతం  అనుకుందాం 
ముందుగా  పదిహేను వేలుమాత్రం  ఇంటికి తెచ్చి ,చెల్లింపులు  చెయ్యండి  ఖచ్చితం  గా  చాలవు . పదిహేను 
తారీకు  మరో  ఐదు వేలు మాత్రం  తీసుకురావాలి , అంతే  కాదు , ఇకడబ్బు  లేదనుకోవాలి ,తెచ్చే పని పెట్టద్దు 
ముందేప్పుడ న్న  మీతో వుద్యోగం  చేసేవారికి కాని ,పక్కింటి వారికి కాని డబ్బు  చేబదులు గా  ఇచ్చినట్లయితే 
మొహమాటం లేకుండా అడిగి  తీసు కొండి , ఉదయం  9 నుండి  రాత్రి 7 వరకు కష్టపడితే వచ్చిన  సొమ్మది . 
కేవలం ఆదివారమే  మార్కెట్  లో  ఇంట్లోని జనాభా ని బట్టి  వెయ్యి నించి  రెండు వేలు ఔ తుంది  . జాగ్రత్త గా  నడిపితే , మీరు  మళ్లీ  మొదటి తారీకు  జమ చెయ్యడానికి  తప్ప  బ్యాంకు వేపు  వెళ్ళే  పని వుండదు . 
పోదు పన్నాను  కదా  అని  తినడం మానేసేరు , తిండి మాత్రం  శుభ్రం గ  తినాలి ,చక్కగా పనిచేసుకోవాలి 
అన్నిరకాల  పోషకవిలువలు  శరీరానికి  అందాలి , అన్నికూరలు  తెచ్చుకోవాలి , పళ్ళు ఎక్కువ తినాలి 
దానివల్ల  మంచి ఆరోగ్యం . స్వీట్స్ ,తినకూడదని  ఏమిలేదు  తినచ్చు ,నాలుగు తినేవాళ్ళు  ఒకటన్నా తినాలి 
మొత్తానికి  నోరుకట్టేసు కొనక్కర్లేదు . నడక మంచిదట  ఇన్సులిన్  పెరుగుతుంది ట .

చాలా మందికి  క్రెడిట్  కార్డ్  వేరే వాళ్ళకు  ఇచ్చే అలవాటు  వుంటుంది . వాళ్ళు షాపింగ్  చేసి  డబ్బు గడువు
లోపు  కట్టేస్తే  సరే లేక పొతే ?!!!!!!!!మన పరిస్తితి  ఏ మిటి ,అటు స్నేహము పోతుంది ఇటు  డబ్బు పోతుంది .
నేను ఇంకా సరిగా  చెప్పలేదు ,నాకు ఉన్న పరిధి దాటి  రాయలేను  కదా ! మీరు ఇంతవరకు జాగ్రత్తలు తీసు
కోక పొతే మాత్రం  ఇకమీదట  తీసుకోండి . నేను మొదటి నించి ఇంటి బాద్యతలు  తీసుకుని  ప్రతి అడుగు
ఆలోచించి  వేస్తూ ,అమ్మా నాన్నల , అత్తా మామల  సహాయం , ''కట్న కానుకలు  వగైరా  లేకుండా'' ఇల్లు
కొనుక్కున్నాము . ఎంత పట్టుదలతో  ప్రయత్నిస్తే  అవుతుంది ? కాబట్టి ఇదంతా చెప్పడానికి  నాకు
అర్హత  ఉందనుకుంటున్నాను . నాకు చిన్నప్పటి నించి  డబ్బుదాచే అలవాటు  వుండేది  ఎవరిదగ్గర లేకపోఇనా
నావేపే  చూసేవాళ్ళు  వెళ్లి నీ ''ముత్యాలమ్మ  మూట తీస్కురా ''అనేవాళ్ళు . వడ్డీ ఎంతోతెలుసా ,ఎంతకు  అంత .
గంటలో ఇచ్చినా  సరే ! అదే వడ్డీ !!!! .సెలవుల్లో  పిల్లలికి ,భార్యకే కాదు  మగవాళ్ళకి కూడా  కాస్త  ఆహ్లాదం గా  వుంటుంది . పోదు పంటూ అసలు 
మానకుండా , మీవాళ్ళకి  ఎంతలో  వెళ్లిరావాలను కుంటున్నారో  చెప్పి  వారి సహాయం తో  తక్కువ లో ఎటన్నా 
వెళ్లి రావడానికి ప్రయత్నించండి . కొంచెం ఖర్చు అటూ  ఇటూ  అయినా  నొచ్చుకోకండి , ఎందుకంటే  మళ్ళీ 
వెళ్ళేది సమత్సరం  తర్వాతే  కదా ,అలాగే ఆరోగ్యభీమాలు ,జీవిత భీమాలు  ఎంతో  ముఖ్యమని గుర్తించండి .


లేని వారికి  ఏ బాధ  లేదు ,రేపటి గురించిన చింత లేదు , ఉన్నవాళ్ళకి  డబ్బుగురించి  ఆలోచించే పనే లేదు .
మధ్య తరగతి  వాళ్లకి ,లేని బాధ లేదు  అన్ని తిప్పలు వాళ్ళకే . ఇటు దేనికో తెలియని  ఆరాటం ,అటు దేనికో
తెలియని పోరాటం .... హమ్మయ్య అన్నీ బాద్యతలు పూర్తయ్యాయి .. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాము అంటే
మనచేతిలో  ఆరోగ్యం వుండా లి కదండి . ఇది జీవితం  కష్ట సుఖాలు అనేవి  వచ్చిపోతుంటాయి . వాటి కోసం
దుఖి స్తూ  కూచుంటే ,కాలం కరిగి పోతుంది . ఇప్పుడు మనచేతిలో ఉన్నదే మనజీవితం . తప్పకుండా
సఫలం  చేసుకుందాం ... మనకు ఉన్నంత లోనే ఏ మంటారు ?!!!!!!!!!!.

                                                ****************************************