Total Pageviews

Thursday, April 16, 2015

ఎవరిది త్యాగం ?!!!!!!!!!,,



భార్య తో  భర్త పలికే  తియ్యని  మాటలు ...


పెళ్ళైన  వారానికి .......

ఎంత అందం  గా  వున్నావో  తెలుసా ! నిన్ను  పెళ్లి చూపుల్లో  చూడగానే  పడిపోయా ,
నీ చలాకీతనం  హుషారు ,నవ్వు మొహం ,నాకు చూడగానే నచ్చేసాయి ................
నీ జడచుసి  పడిపోయానేమో  అన్పిస్తూ వుంటుంది నాకు  అప్పుడపుడు .............

పెళ్ళైన  నెలకి ........

నువ్వు  పుట్టింటికి  వెళ్తే  నాకు  బావుండదు ,నా  బంగారం నా  కళ్ళ ముందే  వుండాలి ..

పెళ్ళైన  మూడు నెలలకి .........

అమ్మ  నడిగి ,వంట ఇంకా బాగా చెయ్యడం  నేర్చుకోవచ్చుకదా !!!!   [సూచన ]

ఆరు నెలలకి .........

ఎండన పడి వుద్యోగం  చేస్తావా ! నీ ఆరోగ్యం ఏమైపోవాలి ,నేను లేనా !  అంతా నేను
చూసుకుంటాను  నువ్వు పాలు ,పళ్ళు తీసుకుంటూ రెస్ట్  తీసుకో ,పండులాంటి బాబు
కావాలి  నాకు ....... [కోరిక ]

సంత్సరానికి ........

ఎప్పుడు చూడు  జిడ్దోడుతూ  ,వాణ్ణి  చంకనేసుకు  తిరగక పొతే ,నేను వచ్చేసరికి  స్నానం
చేసి నీట్  గా  ఉండొచ్చుగా !  [విసుగు ]

మూడేళ్ళ  కి .........

వాడితో పాటు  అక్కడే  స్కూల్  దగ్గర కూర్చుని  ఇంటికి తీస్కురావచ్చుగా , మళ్లీ ఆటో ఎందుకు
 డబ్బు దండుగ ,  [పొదుపు ]

ఆరేళ్ళకి ......

వుద్యోగం  లేదు,   ఎం లేదు ,పిల్లలిని  బాగా చూస్కో  ఇంట్లోపనామేను  పెట్టుకొని , వీళ్ళకి ఆటో పెట్టి ,
డబ్బు దండుగ పనులు  ఎందుకు ఒకపని చెయ్ ,ఇంట్లోనే చీరల కు  పువ్వులు వెయ్యడం ,పూసలు కుట్టడం ,అమ్మడం  చెయ్ .  [సలహా ]

పదిహేనేళ్ళకి ............

ఇంకా  స్నేహితులు ,పుట్టింట్లో  పెళ్ళిళ్ళు అంటే ఎలా ? ఈ ఏడు  బాబు   టెన్త్ కొచ్చాడు  వచ్చే ఏడు
కాలేజ్ ,చెడు స్నేహాలు  పట్టకుండా  నువ్వే  జాగ్రత్తగా  చుసుకొవద్దూ ..  [అదుపు ]

ఇరవై ఐదు  సంవత్సరాలు ...


హమ్మయ్యా  బాబు కి  వుద్యోగం  వచ్చేసింది ,దీని వెనుక '' నా ''కృషి పట్టుదల ''త్యాగం '' ఎంతో వుంది కదా ?!!!.



[ఆమె  అంతరంగం ..

అవును నాకు మాత్రం  స్నేహితులు లేరు ,బంధువులు లేరు , పుట్టిల్లు లేదు .ఉనికి కూడా  లేదు ..
 వెనక్కి  తిరిగి  చుస్తే   ఎవరు లేరు   ఏ మిలేదు . ఏ మిలేదు  ఆఖరికి  త్యాగానికి గుర్తింపు  కూడా లేదు ?!!!!!!!. ]





ఇలా  కాకుండా  ఎవరన్నా ,ఆడదాన్ని  ఆదరించే  మగవాళ్ళు   వుంటే  గింటే  వారికీ  ,
భార్యని  ఒక స్నేహితురాలిగా  భావించి గౌరవించే  వారికీ ,జీవితమంతా తోడూ నీడా  గా
నిలిచి చెయ్యిపట్టి  నడిపించేవారికి , నా  నమస్సుమాంజలి .


                                           **********************************

6 comments:

  1. నిజంగా ఉంటే ఎంత బావుణ్ణు..!

    ReplyDelete
  2. కదా .. అను .. మీ పోస్ట్ లు కూడా బావున్నాయి .

    ReplyDelete
  3. Replies
    1. ధన్యవాదాలు స్వాతి గారూ !

      Delete
  4. చాలా అన్యాయం. అందరూ రావణాసురులే అయితే స్త్రీలు బతికుండేవారు కాదేమో !!!

    ReplyDelete
    Replies
    1. అన్యాయం కాదండీ ,న్యాయమే .. నేను రావణాసురుడి గురించి రాయలేదు .
      సగటు భర్తగారి పాత్రగురించి రాసాను . ధన్యవాదాలు మీ స్పందనకి ....

      Delete