Total Pageviews

Thursday, April 2, 2015

జమా ఖర్చులు .


''సంసారానికి   పొదుపు  ,వ్యాపారానికి  మదుపు'' ,మదుపు  అంటే  పెట్టుబడి  అన్నమాట . వ్యాపారానికి పెట్టుబడి
ఎంత ముఖ్యమో ,సంసారానికి పొదుపు అంత  ముఖ్యమన్న మాట . మరి  అంత ముఖ్యమైన  విషయాన్నీ మనం 
పక్కన  పెట్టకూడదు  కదా ,డబ్బును  ఎంత గౌరవిస్తే  అంత మంచిది .మానవ  సంబంధాలన్నీ  ఆర్ధిక సంబంధాలు
అన్నాడు  ఒక ఆంగ్లకవి , నిజంగానే  డబ్బులేని వాళ్ళు  ఎందుకు కొరగారని పిస్తుంది  ఈరోజుల్లో ... మనం
డబ్బు చేతిలో ఉండకుండా ,డబ్బు  మన చేతిలో  ఉండేట్టు  చూసుకోవాల్సిన  బాద్యత  మనదే  కదా మరి .....
మనం ఏ ఆర్ధిక  స్థితి లో  వున్నా  మన పిల్లలు  అంతకు మించిన స్థితి లో వుండాలని  కోరుకోవడంలో  తప్పు
లేదు కదా అందుకు కొన్ని జాగ్రత్తలు  తీసుకోవడం లో కూడా ,మనం ముందుండాలి .

 డబల్  డోర్ ఫ్రిజ్   కొంటే , యాభై  యూనిట్  లు  తేడా వస్తుంది .అందువల్ల  యూనిట్ రేట్  మారి పోతుంది 
 ఎంతమంది  వున్నా  వారాం తం  లో కూరలు తేవడం తప్పదు . రెండు వారాలు కూర గాయలు లు   ఫ్రిజ్  లో  వుంచి తినలేము  కదా ,ఐస్  వాటర్ కావాలంటే రెండు ఐస్ ట్రే లు  ఎక్కువ పెడితే  సరిపోతుంది .

టి  వి  ఇది  కూడా  మన అవసరాన్ని  బట్టి  కొనాలి , పెద్ద హాల్  వుంటే  పెద్ద టి వి , కొనచ్చు  చిన్న ఇంట్లో ,
42 ఇంచీల  టి వి  అవసరం రాదు కదా ! మన  బడ్జెట్  బట్టి  కొంటె మంచిది ,అంతే కాని  పక్కింటి వాళ్ళు 
కొన్నారని కొంటె  ఫలితం ? కళ్ళకి  సైటు  రాక తప్పదు . మళ్ళీ  అదో ఖర్చు . .

మీకు బాగా  పిజా లు ,బర్గర్  ఇష్టమా , నెలలో  నాలుగు సార్లు  తింటున్నారా ,ఐతే  రెండు సార్లకు  తగ్గించండి . 
కష్టం  అనుకుంటున్నారా ,ఎప్పుడన్నా తింటే'  ఇష్టం' అలాగే వుంటుంది . తరచూ తింటే  ఇష్టం  పోతుంది . 
బయట  తినాలి  అనుకుంటే , మాంచి భోజనమే చేయ్యోచ్చుకదా ! అదికూడా  ఎప్పుడన్నా  చేస్తే  అది మనకు 
గుర్తుండి పోతుంది .భోజనం  అయ్యాక  తప్పక ఐస్  క్రీం  తినాలని పిస్తుంది  కదా ,అదే  హోటల్  లో  కుర్చుని
రెట్టింపు ధర ఇచ్చే కన్నా  బయట కి  వచ్చేక  క్వాలిటీ  వారి ,బండి ముందు  కారాపి  కావాల్సిన వి తినచ్చు ,
అంతేకాదు  పెద్దసౌండ్  తో పాటలు వింటూ  కార్ డోర్స్  అన్ని  తీసి పెట్టుకుని ,సరదాగా   పిల్లలతో కల్సి అల్లరి చెయ్యచ్చు .  పుట్టినరోజులు  ,పెళ్లి రోజులు అలాంటివన్న మాట ,అలాంటి సందర్బాలల్లో  ఎంతో బావుంటుంది .
పిల్లలికి  ఎప్పటికీ  గుర్తుండి పోతుంది .ఆలోచిస్తే మీకు ఇంతకన్నా  మంచి ఐడియా లే  రావచ్చు .

వచ్చే దాంట్లో  సగం  మాత్రం ,ఇంటికి తెచ్చే అలవాటు చేసుకోవాలి , అప్పుడే  పొదుపు అలవాటు  అవుతుంది . 
మొత్తం తీసుకొస్తే  ఖర్చు మాత్రమే వుంటుంది . ఉదాహరణకి  ముప్పయ్  ఐదు  వేల జీతం  అనుకుందాం 
ముందుగా  పదిహేను వేలుమాత్రం  ఇంటికి తెచ్చి ,చెల్లింపులు  చెయ్యండి  ఖచ్చితం  గా  చాలవు . పదిహేను 
తారీకు  మరో  ఐదు వేలు మాత్రం  తీసుకురావాలి , అంతే  కాదు , ఇకడబ్బు  లేదనుకోవాలి ,తెచ్చే పని పెట్టద్దు 
ముందేప్పుడ న్న  మీతో వుద్యోగం  చేసేవారికి కాని ,పక్కింటి వారికి కాని డబ్బు  చేబదులు గా  ఇచ్చినట్లయితే 
మొహమాటం లేకుండా అడిగి  తీసు కొండి , ఉదయం  9 నుండి  రాత్రి 7 వరకు కష్టపడితే వచ్చిన  సొమ్మది . 
కేవలం ఆదివారమే  మార్కెట్  లో  ఇంట్లోని జనాభా ని బట్టి  వెయ్యి నించి  రెండు వేలు ఔ తుంది  . జాగ్రత్త గా  నడిపితే , మీరు  మళ్లీ  మొదటి తారీకు  జమ చెయ్యడానికి  తప్ప  బ్యాంకు వేపు  వెళ్ళే  పని వుండదు . 
పోదు పన్నాను  కదా  అని  తినడం మానేసేరు , తిండి మాత్రం  శుభ్రం గ  తినాలి ,చక్కగా పనిచేసుకోవాలి 
అన్నిరకాల  పోషకవిలువలు  శరీరానికి  అందాలి , అన్నికూరలు  తెచ్చుకోవాలి , పళ్ళు ఎక్కువ తినాలి 
దానివల్ల  మంచి ఆరోగ్యం . స్వీట్స్ ,తినకూడదని  ఏమిలేదు  తినచ్చు ,నాలుగు తినేవాళ్ళు  ఒకటన్నా తినాలి 
మొత్తానికి  నోరుకట్టేసు కొనక్కర్లేదు . నడక మంచిదట  ఇన్సులిన్  పెరుగుతుంది ట .

చాలా మందికి  క్రెడిట్  కార్డ్  వేరే వాళ్ళకు  ఇచ్చే అలవాటు  వుంటుంది . వాళ్ళు షాపింగ్  చేసి  డబ్బు గడువు
లోపు  కట్టేస్తే  సరే లేక పొతే ?!!!!!!!!మన పరిస్తితి  ఏ మిటి ,అటు స్నేహము పోతుంది ఇటు  డబ్బు పోతుంది .
నేను ఇంకా సరిగా  చెప్పలేదు ,నాకు ఉన్న పరిధి దాటి  రాయలేను  కదా ! మీరు ఇంతవరకు జాగ్రత్తలు తీసు
కోక పొతే మాత్రం  ఇకమీదట  తీసుకోండి . నేను మొదటి నించి ఇంటి బాద్యతలు  తీసుకుని  ప్రతి అడుగు
ఆలోచించి  వేస్తూ ,అమ్మా నాన్నల , అత్తా మామల  సహాయం , ''కట్న కానుకలు  వగైరా  లేకుండా'' ఇల్లు
కొనుక్కున్నాము . ఎంత పట్టుదలతో  ప్రయత్నిస్తే  అవుతుంది ? కాబట్టి ఇదంతా చెప్పడానికి  నాకు
అర్హత  ఉందనుకుంటున్నాను . నాకు చిన్నప్పటి నించి  డబ్బుదాచే అలవాటు  వుండేది  ఎవరిదగ్గర లేకపోఇనా
నావేపే  చూసేవాళ్ళు  వెళ్లి నీ ''ముత్యాలమ్మ  మూట తీస్కురా ''అనేవాళ్ళు . వడ్డీ ఎంతోతెలుసా ,ఎంతకు  అంత .
గంటలో ఇచ్చినా  సరే ! అదే వడ్డీ !!!! .



సెలవుల్లో  పిల్లలికి ,భార్యకే కాదు  మగవాళ్ళకి కూడా  కాస్త  ఆహ్లాదం గా  వుంటుంది . పోదు పంటూ అసలు 
మానకుండా , మీవాళ్ళకి  ఎంతలో  వెళ్లిరావాలను కుంటున్నారో  చెప్పి  వారి సహాయం తో  తక్కువ లో ఎటన్నా 
వెళ్లి రావడానికి ప్రయత్నించండి . కొంచెం ఖర్చు అటూ  ఇటూ  అయినా  నొచ్చుకోకండి , ఎందుకంటే  మళ్ళీ 
వెళ్ళేది సమత్సరం  తర్వాతే  కదా ,అలాగే ఆరోగ్యభీమాలు ,జీవిత భీమాలు  ఎంతో  ముఖ్యమని గుర్తించండి .


లేని వారికి  ఏ బాధ  లేదు ,రేపటి గురించిన చింత లేదు , ఉన్నవాళ్ళకి  డబ్బుగురించి  ఆలోచించే పనే లేదు .
మధ్య తరగతి  వాళ్లకి ,లేని బాధ లేదు  అన్ని తిప్పలు వాళ్ళకే . ఇటు దేనికో తెలియని  ఆరాటం ,అటు దేనికో
తెలియని పోరాటం .... హమ్మయ్య అన్నీ బాద్యతలు పూర్తయ్యాయి .. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాము అంటే
మనచేతిలో  ఆరోగ్యం వుండా లి కదండి . ఇది జీవితం  కష్ట సుఖాలు అనేవి  వచ్చిపోతుంటాయి . వాటి కోసం
దుఖి స్తూ  కూచుంటే ,కాలం కరిగి పోతుంది . ఇప్పుడు మనచేతిలో ఉన్నదే మనజీవితం . తప్పకుండా
సఫలం  చేసుకుందాం ... మనకు ఉన్నంత లోనే ఏ మంటారు ?!!!!!!!!!!.

                                                ****************************************

No comments:

Post a Comment