Total Pageviews

Thursday, April 23, 2015

నాకు నచ్చినవి ఇవి . మరిమీకు నచ్చాయా.

నాకు నచ్చిన  జోక్స్  ఇవి ..  మీకు నచ్చుతాయనుకుంటున్నాను .

కస్టమర్ ;   బాబూ  పెసరట్టు  ఆర్డరిచ్చి  ఎంతసేపయ్యింది ,ఇంతవరకు  రాలేదు ??.
సర్వర్ ;  ఉండండి  సార్ , పెసర పప్పుకోసం  వెళ్ళిన కుర్రాడు  ఇంకా  రాలేదు .....
[కుర్రాడు  పెసరపప్పు  తెచ్చాక  నానబెట్టి ,అప్పుడు పెసరట్టు వేసి ఇస్తాడన్నమాట .
పాపం  కష్ట మర్ ..... ]



ఒకతను  చిలకను  పెంచుకుంటున్నాడు . ఆ  చిలుక  మాటలు బాగా  నేర్చింది .
పక్కింటి  ఆమెను ,'కాంతమ్మా ' అని  పేరుతొ  పిలిచేది . పలకక  పొతే ,
'ఒసేయ్ కాంతమ్మా ' అనేది . దాంతో  కోపమొచ్చి ఆమె  చిలుక  యజమాని తో
గొడవకొచ్చింది . యజమాని  చిలుకకి  ఎంతచెప్పినా  ఆ పిలుపు  మానలేదు .
దాంతో  కోపమొచ్చిన  యజమాని  దానిని  శిక్షగా ఫ్రిజ్ లో  పెట్టాడు . ఒక గంట
తర్వాత  దానిని  బయటికి తీసి , ''తిక్క కుదిరిందా '' అని  అడిగాడు . కాని
చిలుక  ''నా సంగతి  పక్కనుంచు  ఆ  కోడి ఏమని తిట్టింది  దాని  ఈకలు  పీకి
మరీ ఫ్రిజ్  లో పెట్టావు '' అందట .   తందూరి  చూపించి .



రాము ;  ఒరేయ్  శ్యాము , నా  హోం వర్క్  బుక్  నాకు  మండే లోగా  ఇచ్చెయ్యాలి .
శ్యాము ; నీకు ' మండ'కుండానే  ఇచ్చేస్తాలేరా [?]


భర్త ;  ఏమోయ్  మీ  బంధువులు  వచ్చారు . అనిపిలిచాడు , ఆ నందంగా వచ్చిన  భార్యకి
గాడిద లను  చూపించాడు .  ఆమె  ఇంకా  రెండు ఆకులు ఎక్కువే చదివింది .
భార్య ; రండి  అత్తయ్య గారూ .. రండి మావయ్య గారూ ..  అంది . [పాపం  భర్తగారు .. ].


టీచర్ ; రామూ  ఇంత లేట్  ఎందుకయ్యింది ?
రాము ; టీచర్  దారిలో  ఒకాయన  10 రూపాయలు  పడేసుకున్నారు .
టీచర్ ; గుడ్  వెతికిచ్చి  వచ్చావా ...
రాము ; నో  టీచర్  ఆయన వెళ్ళేదాకా  నోటు మీద  కాలుంచి ,వెళ్ళేక  తీసుకుని  వచ్చాను ,
అందుకే లేట్  అయ్యింది .



టీచర్ ;  మీరు  కోటీశ్వరు లైతే  ఏమిచేస్తారు  , అని  వ్యాసం రాసుకు  రమ్మన్నాను  రాసారా !!!!!!
ఏరా  రాము  నువ్వు రాసావా ?
రాము ; నన్ను అడుగుతా రేంటి  టీచర్  నా   సెక్రటరీ  ని  అడగండి .


భార్య ; ఏమండీ  ఆ పాతకాలం  గడియారం తీసి పారేయమంటే  వినరు  ఇప్పుడు చూడండి ,
కొంచెముంటే  మా అమ్మ  తల పై  పడుండేది ..
భర్త ;  వెధవ  గడియారం  ఎప్పుడూ  లేటే ...

భర్త ; ఏమోయ్ ! రాత్రి నాకు  పీచు మిఠాయి  తిన్నట్టు  కలవచ్చింది .
భార్య ; అందుకేనా  తలగడ లోని  దూది  అంతా మాయమైంది ??????


భర్త ; ఈ రోజు  కాఫీ  ఇంతబాగుందేమిటి ?
భార్య ;మీ మొహం మండా ,నాకోసం  చేకున్న కాఫీ  తాగేసారా  ఏమిటి .. ???


                                            ******************************

2 comments:

  1. ఆఖరి జోక్ బ్రహ్మాండం.
    కాని ఏమాటకామాట చెప్పుకోవాలి - నిజ జీవితంలో ఆడవాళ్ళు అలా వుండరు పాపం. తమకైనా తగ్గించుకుని భర్తకి పిల్లలకి మంచివే పెడతారు.

    ReplyDelete
  2. ఆహా ఎంతబాగా ఆడవారిని అర్ధం చేసుకున్నారండి , మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .

    ReplyDelete