Total Pageviews

Thursday, May 28, 2015

ఇదింతే నేమో
,రెండో అన్నయ్య తో బాగా చనువు గా వుండే నేను ,పెద్దన్నయ్య  అంటే  చాల అభిమానిస్తాను , నన్ను ఎవరన్న ఏదన్న అంటేచాలు వుతికేసేవాడు . కాలేజ్ కి వచ్చి తీసుకు  వచ్చే వాడు ,14 ఏ ళ్ళ కె  స్కూటర్  నడిపే వాడు .
పోలిస్ ఆపితే , స్టేషన్  కి వెళ్దాం  అంటూ తనే ,పోలిస్ ని  వెంట తీస్కెళ్ళి ,సి ఐ తో [ఆయన నాన్న ఫ్రెండ్ ]
ఇంకెప్పుడు ఆపద్దని  చెప్పండి ,అన్నాడట , ఆయన నవ్వేసి లైసెన్స్  లేకుండా ఎలా ,అంటే  నాకు రెండు
రోజుల్లో మీరే ఇప్పించండి ,అని చెప్పి తీసుకున్నాడు . కార్స్  చాల మార్చాడు  ఇప్పుడు ,బొలెరో మర్చి
స్కార్పి యో దగ్గర ఆగాడు . రెండు రోజులైనానిద్ర పోకుండా  డ్రైవ్ చేస్తాడు . ఒకవేళ డ్రై వరుంటే ,తనతో కబుర్లు చెప్తూనే వుంటాడు  ఎక్కడనిద్ర పోతాడోఅని ,మేము మాత్రం ,తన భరోసాతో హాయిగా బజ్జుంటాం  .

నేను దసరాకి  నాల్రోజులు ,వేసవికి వారం రోజులు , తప్ప  పుట్టింటికి వెళ్ళడం  కుదరదు . చంద్రకి  అది కూడా
కుదరదు . నేను మాత్రమే పిల్లలతో  వెళ్తుంటాను . మా పాపకి  నాలుగేళ్ళు వుంటాయేమో ,మేము దిగాల్సిన
 స్టేషన్  వస్తోందని , హడావిడి గా సర్దు తున్నాను . ఇంతలో మా పాప  అమ్మా అదేంటి అంది ,ఏమిటా అని చుస్తే
ట్రై ను  పక్కకి  గేదలున్నాయి , అదా  గేద  ,అనేసాక  మా ఎదుట సీట్లో  ఉన్నాయన  నా వంక  కోపంగా చూస్తూ
కన్పించాడు . ''ఏ  గ్రహం నించి తెచ్చావు  తల్లి ఈ  పిల్లలిని  ,గేద  కూడా తెలియకుండా  పెంచుతున్నావు ?ఏ
ఊరి  పతివ్రతవమ్మా నువ్వు ?''అన్నట్టుంది  ఆయన చూపు ,ఆయన భార్య  నవ్వాపు కోలేక పోతోంది . నాకు
చాల సిగ్గన్పించింది ,సైడ్ బెర్త్ లో వాళ్ళు కూడా  నవ్వుతున్నారు . పాప కి  మూడేళ్ళ వరకు  మాటలు  రాలేదు .
మా పెద్దన్నయ్య 'దీన్ని ఎవడు చేసుకుంటాడో  వాడు  అదృష్ట వంతుడు ,మాటలు  రావు కదా 'అనేవాడు .
స్కూల్లో  లేట్ గ  వేసాము ,అదీ  కాకా  అప్పట్లో  వుండేది  అపార్ట్ మెంట్  రెండో ఫ్లోర్  ఇక  గేద  ఎలా తెలుస్తుంది .
దిగినాక  సామాను కార్లో  పెడుతుంటే ,అదే వ్యక్తీ  ఆటో  మాట్లాడుతూ కన్పించాడు ,'ఈ కాస్త  దూరానికి  యాభై
ఇవ్వాలా ,ఊరికి కొత్తా  అన్నాడు ,ఆటో వాడికి కోపం వచ్చి నట్లుంది 'అవును ఇప్పుడే రైలు  దిగాను  అన్నాడు .
నా కస్సలు నవ్వాగదు , ఆ విధం గా   బదులు తీరి పోయింది  .

మా పెద్దన్నయ్య  అంటే పాప కి  భయం ,రెండో అన్నయ్య తో  చాల క్లోజ్ . వచ్చే టపుడు ట్రైన్  ఎక్కిస్తే  అస్సలు
దిగ  నిచ్చేది  కాదు ,సామర్లకోట  దిగుతానని కూర్చునే వాడు ,ఈలోగా నిద్ర పొతే వొకే  ,లేకపోతె రాజముండ్రి ,
లేకుంటే నాసీట్ పక్కభోగి లో వుంది అక్కడ కూచుంటా  నని  జారుకునే వాడు .

తను పొద్దున్న  లేట్ గా  లేస్తాడు ,ఈ లోగా  భార్య రెండు సార్లు  టీ  ఇస్తుంది . మొహం కడగండి  అంటుంది .
ఎం టిఫిన్  చేసావు ' అంటాడు  ఇడ్లీ  అంటే  పెసరట్టు వేసి అప్పుడొచ్చి  లేపు అని పడుకుంటాడు . చాలవెట
కార పురుషుడు . ఒకసారి మా పాప చూసి ' ఛి  యాక్  మొహం కడక్కుండా  టి  తాగు తున్నవేంటి ' అంది
మరి  మీ ఇంట్లో మొహం కడిగి తాగుతారా  అనడిగాడు  ఆశ్చర్యంగా ,మా  మమ్మీ  డాడి  మొహం  కడిగి
కాఫీ  తాగుతారు అంది అదేదో గొప్ప లా  ,  ''భలే దానివే  మొహంకడిగి  తాగితే  ఔషధ  గుణాలు  పోతాయి
చెప్పు మీ డాడి  కి  అన్నాడు . [ఖర్మ ...... ఖర్మ  .. ]

ఇంకో విశేషం  ఏమిటంటే ,మా పెద్దన్న  కూతురు అచ్చం నా లాగానే  వుంటుంది . చివరికి  పళ్ళు కూడా
నావే వచ్చాయి . బాగైంది ,ద్రోహి  నన్ను  నోటినిండా  పళ్ళే ,రెండు వరుసలు , అనేవాడు ,కూతురికి  అలాగే
వచ్చాయి ఏమి చేస్తాడు , అది నవ్వినప్పుడల్లా  నన్నే గుర్తు చేసుకుంటాడట ,అచ్చం మీ అత్త పళ్ళు వచ్చాయి .
అంటాడట  అదే  చెప్పింది . నాకెంత సంతోషమేసిందో [శునకా నందం ] .పళ్ళకి  క్లిప్ వేసుకుంటా అంటే అబ్బే
పన్ను మీద  పన్నుంటే  అదృష్టం  అన్నాడు ఇప్పుడేమి చేస్తాడు . హ్హ హ్హా .  కట్  చేస్తే  మా  వజ్రం  అచ్చం  మా
అన్న లాగానే  వుంటాడు ,మాట్లాడటం చేతులు ,కాళ్ళు , ఇంతే కాక  మేమంతా  ఖాది టవల్స్  వాడితే  వాడు
మా అన్న లాగానే  టర్కీ  టవల్స్   వాడతాడు , అది కట్టుకుని  ఇంట్లో తిరుగుతుంటే  త్వరగా రెడీ కా  అంటూ
అరుస్తుంటాను , ఎందుకంటే  మా అన్న గుర్తు కొచ్చేస్తాడు మరి  . ''ఇదింతే నేమో'''  ప్రతి  ఇంట్లో  తప్పనిది .


                                          ***************************************

Thursday, May 21, 2015

మన చిట్కాలు -2

మొదట  మనం  అందానికి  చిట్కాలు  చెప్పుకున్నాము . ఇప్పుడు  ఆరోగ్యానికి . ఇవన్ని  మా ఇంట్లో మా
పెద్దవాళ్ళు పాటించినవి .   ఇవన్నీ  నేను పాటిస్తుంటాను .పిల్లలికి  ఎక్కువ మందులు వాడే  పని లేకుండా ఉపయోగ  పడుతుంటాయి .


1]  దగ్గు  ఆయాసం  వున్నవాళ్ళు ,కాస్త  చల్లబడగానే  ఊపిరి తీసుకోవడం  కష్టమవుతుంది . అలాంటప్పుడు  కాస్త
వాము  వేయించి , ఒకగుడ్డ లో  మూటకట్టి ,ఛాతి  మీద వీపు  మీద  కాపడం  చేయాలి . త్వరగా  ఫలితం వుంటుంది

2]  ఒకోసారి  తిన్న  తిండివల్లనో ,బయట  బండిమీద తినడం  వల్ల  కూడా  కడుపులో  నొప్పిలా  అన్పిస్తుంది . అప్పుడు  కొంచెం నునె లో  కొంచెం  వాము ఒక  ఎండుమిర్చి , కరివేపాకు   వేయించి వేడి వేడి  అన్నం లో
కలిపి కొద్దిగా  ఉప్పు చేర్చి తినాలి . కడుపునొప్పి  హుష్ కాకి  అయిపోతుంది .

3]  ఎప్పుడూ చేసుకునే  చారు  విసుగు పుడుతోందా .. ఐతే రెండు  బెండకాయల తో పాటు  చిన్న  బెల్లం ముక్క
వేసి  మరిగించండి , పోపులో  వాము  వేసి  తాలింపు పెట్టండి .

4]  ముఖ్యం  గా  గుర్తు పెట్టుకో  వలసిన  విషయం  వాము త్వరగా  మాడుతుంది ,కాబట్టి చిన్న  మంట మీద
చేసుకోవాలి .

5]  ఎప్పుడన్నా  వాము ఆకు దొరికితే ,బజ్జీ  వేసుకోవడం మర్చి పోకండి . రుచికి రుచి ,ఆరోగ్యానికి ఆరోగ్యం .


6]  సెనగపిండి  పడని  వాళ్ళు చాలామందే  వుంటారు . అలాగే పప్పులు  కూడా  అలాంటి వాళ్ళు , సొంటి పొడి
దొరుకుతుందిదానితో  ధనియాలు ,జీలకర్ర   పొడిచేసుకుని ,అన్నంలో  మొదటిముద్దలో  నెయ్యి  వేసుకుని తినాలి .
       

7]  కడుపులో  కాస్త మండగానే  మందులు గుప్పించేయ్యకండి  ఎర్రని పళ్ళు పరకడుపున  తినాలి . స్ట్రాబెర్రీ ,చెర్రీ
లేదా టమాట పళ్ళను రెండు తీసుకుని  ముక్కలుగా కోసి ,కాస్త పంచదార చల్లి  తిన్నా మంటతగ్గుతుంది . వారం
లో  రెండుసార్లన్నా తీసుకుంటే  త్వరగా  ఫలితం వుంటుంది .


8]  ప్రొద్దుటే తలతిరిగే  బాధ  ముఖ్యం గా  ఆడ వాళ్ళ లో  ఎక్కువగా వుంటుంది . పుట్నాలు [వేయించిన శెనగ
పప్పు ]  పొడి చేసుకుని బెల్లంతో ,కలిపి తినాలి . లేదా పాలుకలుపుకుని  కూడా తినచ్చు .


9]  ఆడపిల్లలికి తరచూ  నువ్వులు బెల్లం  కలిపి చేసే  నువ్వులుండలు  పెడుతుండాలి .
10]   కప్పు నువ్వులు, స్పూను  జీలకర్ర , ఎండుమిర్చి ,వలిచిన  వెల్లుల్లి  కలిపి  వేయించి ,పొడికొట్టి  రొజూ  మొదటి ముద్దలోతినాలి . దీనివల్ల  కాల్షియం  లభిస్తుంది .
11]  వీలైనంత  వరకు  ఖర్జూరం  ఎక్కువ తింటే  మంచిది .
12] నెలకి ఒకసారన్నా  పొద్దున్న ఖాలీ కడుపుతో  దనియాలు  రసం తీసి పుచ్చుకోవాలి  కఫం తగ్గుతుంది .13] పెద్దవాళ్ళకి  కాళ్ళు  నొ ప్పులుగా వున్నప్పుడు ,రాళ్ళ ఉప్పు ను,  వేడిచేసిన  నీళ్ళలో వేసి ,వేడి సరి చూసి
కాళ్ళు ఉంచమని  చెప్పాలి , నొప్పులు తగ్గుతాయి .

14]  దాల్చిన చెక్క  పొడి చేసుకుని ,టీ  కాచేటప్పుడు  చిటికెడు వేసుకుంటే ,కీళ్ళ నొప్పులు  తగ్గుతాయి .
15]  కాస్త నూనె లో  వలిచిన  వెల్లుల్లి  నాలుగు , రెండు  చిదిమిన  ఎండు మిర్చి  వేసి వేయించి ,మెత్తగా
 నూరిన  గసగసాలు ముద్ద  వేసి  కురలా  చెయ్యాలి . ఇది వేడి అన్నం తో తింటే , జిగట విరోచనాలు
  అదే రోజు తగ్గిపోతాయి .


16]  ఒక  గుప్పెడు గోధుమలు  ఒక రోజంతా ,నీళ్ళ లో  నానించి ,వాటిని  ఒక తొట్టిలో మొలకేత్తించాలి  ఆ గడ్డి
  కట్ చేసి , గ్రైండ్  చేసి వడపోసి ,నిమ్మచెక్క పిండి ,కాస్త తేనే కలిపిఉదయమే  పుచ్చుకొండి ఆ రోగ్యంకోసం .17]  రోజు మొత్తం లో  ఒక పది నిముషాలన్నా వ్యాయామం  మంచిది . ప్రొద్దుటే చెయ్యడం  వీలు కాక పొతే
  తిన్న తర్వాత  నాలుగు గంటల విరామం  ఇచ్చి వ్యాయామం  చేస్తే మంచిది . అవి కూడా  యోగా సనాలు
   శరీరాన్ని  భాదించ కుండా  నిదానం గా  చేసుకుంటూ  వెళ్ళడం  ముఖ్యం . ఇప్పటికే   వచ్చి వుంటే
  సరే లేక పొతే ,టి వి   లో చూసి కాకుండా ఎవరన్నా  నిపుణుల దగ్గర నేర్చుకుని  కనీసం రోజుకు  పది
    ఆ సనాలు  వెయ్యగలిగే  ప్రయత్నం చెయ్యాలి .
 .

                                 ***********************************************

Thursday, May 14, 2015

పెళ్ళిసంబంధం


ఉదయం తొమ్మిది  గంటలికి  పెళ్లి . ఈ పెళ్ళిలో  ఎలా  అన్నా ఒక  మంచి అమ్మాయి  మా  అరుణ్  కి దొరకాలి ,అని  అనుకున్నాను . అరుణ్  మా  అక్క  కొడుకు . హైదరాబాద్ లో  విలయమ్స్'లో  జాబ్  చేస్తున్నాడు . నేను ,చంద్ర, అరుణ్   కలిసి  మండపం లో  గాలింపు  మొదలు  పెట్టాము . చాలామంది  అమ్మయిలు  వచ్చారు . 'కలర్స్' తో  కళకళ లాడిపోతోంది  మండపం . కానీ అదేంటో దేశం లో  తిండికి  కఱువు  వచ్చి నట్లు ఉంటే  సన్నగా వానపాము  లావున్నారు . లేకుంటే తినడమే  జీవిత ద్యేయం  అన్నట్లు  ఇటు పక్క ఎమ్ 'అర్ 'ఎఫ్ టైర్   అటు పక్క బ్రిడ్జిస్టోన్ , వున్నవాళ్ళు  కన్పిస్తున్నారు , లంగా  ఓణి , చూసి  అమ్మాయిలను  కోవాలి  తప్ప లేకపోతె .......... ఇంతలో ,అరుణ్  ఒక వైపు  చూపించాడు , ఓహో ..  నారాజా  మావాడి  పంట  పండింది . నిమ్మపండు  రంగు చీర లో  నిమ్మపండు  లా  మెరిసి  పోతూ  చాల  అందంగా ఉంది . అరుణ్ కేమో కానీ  నాకుమాత్రం పూల వర్షం  ,మెరుపులు  లాంటివన్నీ  అని  పించి నాయి . చంద్రని  వెతికి  పట్టుకున  అమ్మాయి ని  చూపించాం . తనకి  కూడా నచ్చింది . నీపంట పండింది  రా  అబ్బాయ్ 'అన్నారు . మావాడు ,' థాంక్స్ ' బాబాయ్'. అన్నాడు . పెళ్లి ఐంది , భోజనాలు  చేస్తూ ,కిలో  బరువున్న పళ్ళాలు పట్టుకు  తిరుగుతూ  అమ్మాయి కోసం  వేదికాము  ఒక చోట మూడు  నాలుగేళ్ళు ,బాబు  ఏడాది ,పాపకి  అన్నం పెడుతూ ఆమె ,నీళ్ళ గ్లాస్ పట్టుకుని  ఆమె  భర్త  కన్పించేరు . 'జిగ్'మని  తలలు తిప్పి ఒకరి  మొహం ఒకరు చూసుకున్నాం .. కరెక్  టైం కి వచ్చేసారుచంద్ర   'ఏమి టైం మిన్ గ్ వై 'అనుకున్న . రావడమే  అటు చూసి 'ఏరా  వాళ్ల  ఆయన ఇక్కడే  ఉన్నట్లున్నాడు  అడిగి  చూడ కూడద ', అన్నారు . అరుణ్  'అబ్బ  పిన్ని గుండెల్లో కలుక్కు మంది ' అన్నాడు . నాక్కూడా  అనుకుంటూ 'నువ్వేమి ఫీలవ్వకు నీకు  మంచి  పిల్లని  చూసే బాద్యత నాది అన్నాను . నాకప్పుడు తెలీదు పెళ్ళంటే మాటలు కాదు  నాకున్న అనుభవం ,అవగాహనా సరిపోవని .   అన్ని రకాల పేపర్లు  తెచ్చాము . మాట్రిమొని లకి ఫోన్ చేసాం .కొన్ని సెలక్ట్ [మా సామజిక  వర్గం ] సెలక్ట్  చేసాం . మూడు ఫోన్లు చేసాం అవేమంత  గొప్పవి కాదు కానీ ఒక ఫోన్  గురించి  మాత్రం  చెప్పాలి . kg  బంగారం ఇస్తారట అమ్మాయి కి ,నా కల్లుమేరిసాయి  ఇంకేం వాళ్ళకి చేశా ,ఆఫీసు లో రిసెప్షనిస్ట్ లా  చాల కాజువల్  గా మాట్లాడింది . పెల్లికుతురి  అక్కట  .   వివరాలడిగింది  చెప్పాను .

 ఆమె _ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ?

నేను -ఇక్కడే  హైదరాబాద్  లోనే 

ఆమె - ఎకంపనీ ?

  నేను -  అదేనండి   విలయమ్స్  నెలకి 80 వేలు వస్తుంది  అబ్బాయి  చాల మంచి వాడు  తల్లిని ,చెల్లిని  బాగాచూస్... 
ఆ మె -తల్లికి గంజి ఎయ్యనోడు  పిన్నమ్మకి  కోకేట్టాడఅంట  మా  అమ్మయిని ఎలా చూసు కుంటాడో మాకదే  ముఖ్యం . ఇంతకీ సాఫ్ట్ వేర్   ఇంజినీరేనా ? అంది .  నేను - కాదండి  చార్టెడ్ అక్కౌంట్ టెంట్  అన్నా ఆమె -మాకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్  కావాలి , అని ఫోన్  పెట్టేసింది . నేను  పట్టువదలని  విక్రమార్కిని లా మాట్రిమోని లన్ని  వెతకబట్టేను . ఒక మేరజే బ్యురోకి చేశాను . ఇన్నివేలైతే మీకు  నచ్చే వరకు చూపిస్తాం  తక్కువైతే  ,మూడే చూపిస్తాం . అన్నారు . 'నాకుముందు అమ్మాయి ల  ఫోటో లు  కావాలి డబ్బు కట్టాక మీరు  అల్లాటప్ప వి చూపిస్తే ' అన్నాను  ఆమె సరే ఫోన్ నంబర్ మాత్రం  డబ్బు కట్టాక ఇస్తాను  అంది . సరే అన్నా అరుణ్ మెయిల్ ఐ  డి  తీస్కుని మూడు ఫోటో లు పంపింది .   అరుణ్  మెయిల్  ఐ  డి  కి ఫొటోస్  రాగానే  మూడు ఫొటోస్  లో ఒకటి సెలెక్ట్  చేసాడు . పేరు  మాన్విత ,ఇద్దరు అన్నలు  ,తనేమో  బి టెక్  చదివింది .  నాన్న ట్రావెల్స్  నడుపుతారట . ఇంతలో  ఎవరో అరుణ్ కి  చెప్పారట , డబ్బు  తీసు  కున్నాక  మంచి వి  చూపించరని . ఏమి చెయ్యాలి  అని  ఆలోచించాము , చివరికి  వద్దనుకున్నాం .   కానీ  మేరేజ్ బ్యూరో  వాళ్ళు ఫోన్  చేస్తూనే  ఉన్నారు . నేను ఏదో  చెప్పి తప్పించు  కుంటూ  వస్తున్నా . ఒక రోజు  అరుణ్ కే  ఫోన్ చేసి   అమ్మాయి  తల్లి రేపు  వస్తుందని  మాట్లాడమని  చెప్పారట . తను వెంటనే నాకు చేసాడు . నేను చంద్రకి  విషయం  చెప్పాను , 'ఏమి కాదు మాట్లాడు ' అన్నారు . అనుకున్నట్లే ఫోన్  వచ్చింది . 'పెళ్లి కూతురి  తల్లి వచ్చారు  మాట్లాడండి  అని ఫోన్  ఇచ్చారు . పరిచయాలు చేసుకున్నాం . పెద్దా విడ  గొంతు వింటే  చాల  మర్యాదస్తు రాలి లా  వున్నారు . మీరు  పెళ్లి చూపులకి  ఎప్పుడు  వచ్చేది  చెపితే  మా తమ్ముడు  వాళ్ళని  పిల్చు కుంటా మంది . మీ నంబరు ఇవ్వండి  అన్న  వెంటనే  మేరేజ్ బ్యూరో  ఆమె  తీసుకుని  మీరు డబ్బు కట్టకే నెంబర్  ఇస్తామంది . పెళ్ళికూతురు  వాళ్ళు డబ్బు కట్టేసారండి అనిచెప్పింది . సరే అంతా బావుంది కదా  అని డబ్బు కట్టేం .రెండు  నంబర్ లు  ఇచ్చారు . ఒకటి  వాళ్ళ నన్నది , ఇంటిది . వాళ్ళ నాన్నగారికి చేసాము . అయన బిజి  ట  ఇంటికి  మాట్లాడమన్నారు . ఆ నెంబర్ కి చేస్తే  ఒకపోష్  లేడీ ; యా  హూ  ఈస్  దిస్ ' అంది . నేను  మొ త్తమ్  చెప్పి వాళ్ళ అమ్మకిమ్మన్నాను . ఇంటికేల్లక చేపిస్తానని  అంది . నేను తెగ  మురిసి పోయా అసలే మనం బి ఏ  'డిస్క్ ' ఏమో  ఇంగ్లిష్  కోడలు  పిల్లలు కూడా ఇంగ్లిష్  లోనే ఏడుస్తూ ,నవ్వుతూ ,'అన్నీ ' ఇంగ్లిష్ లోనే  చేస్తుంటే  ఎంత  బాగుంటుంది ,అనుకున్న . వారం  తిరిగింది  ఎ  ఫోనూ రాలేదు . మగ పెళ్లి వాళ్ళ మయ్యె ... ఆరోజు  అంత  కంగారు పడింది  ఇప్పటికి చెయ్యలేదు . ఆఖరికి  నేనే చేసినా  ఎవరెవరో  తీసేవారు . పొంతన  లేని  సమాధానాలు , విసిగి  పోయి  ఇలా  కాదని , .... క్షణ  మేరేజ్  బ్యూరో  కి  చేశాను  మా  'కేసు ' చూసే  ఆమె  సెలవు  లో ఉందట . వచ్చేక  మాట్లాడమన్నారు . నేను  చేస్తూనే  ఉన్నాను ,పదిహేను రోజులు  గడిచాయి . అప్పటికి ఆమె  వచ్చింది . నేనెవరో  ఆమెకి  మొత్తం  గుర్తు చెయ్యాల్సి వచ్చింది . 'అయ్యో మీరా ఆ  అమ్మాయి కి  పెళ్లి కుదిరింది  కదా  మీరు  వేరే ఫొటోస్  చూడండి  పంపిస్తాను . అంది . ఇంకేమంటాను ,పొరగా పొరగా  మూడు  ఫొటోస్  పంపింది . ముమైత్  కి మార్పులు  చేసి నట్లు ఒకామె , వేదం లో ' కర్పూరం ' లా  ఒకామె ,మూడోది  మెల్లకన్ను . నేను ఫోన్  చేసి  చెడ మడ తిట్టేను , ఆమె ఏమి పట్టించు కోలేదు . ఇది మాములే అన్నట్లు ఉంది .  నా రక్తం  మరిగింది ,కళ్ళు ఎరుపెక్కి  పిడికిళ్ళు బిగిసు కున్నాయి . నా ఈగో హర్ట్ ఐంది . వెంటనే ఫోన్ తీసి  గుండె లదిరే  సౌండ్ తో బ్రేకింగ్ న్యూస్  వేసీ  ఛానల్ కి  ఫోన్  చేశాను . మాకు జరిగిన అన్యాయం  చెప్పాను . ఎలా  అయినా  ... క్షణ   ని  మూ ఇంచా లన్నాను  మాకు  జరిగిన  అన్యాయం ఎవరికీ  జరగ  కుడదన్నాను .  'తప్ప కుండా  మేడం అన్నాడు .
నేను -ఎప్పుడు  వెళ్తారు .
ఛానల్  వాళ్ళు -మీరెప్పుడంటే  అప్పుడే .
నేను -అవునా.. తక్షణమే  వెళ్ళండి .
ఛా  వా - మీరెప్పుడు  డబ్బిస్తే  అప్పుడే .
నేను - డబ్బే మిటి ..
ఛా  వా - ఒక పెళ్లి కొడుకుని  సెట్ చేసి  తీస్కేల్లాలి ,చిన్న కెమెరా ఉండాలి ,సంబాషణ రికార్డ్ చెయ్యాలి
   రెండు , మూడు ,సార్లు  అక్కడికి , ఇక్కడికి ,తిరగాలి  .. అంతా కలిసి పదిహేను , ఇరవయ్ వేలు  అవుతాయి .
నేను -ఆ ?
ఛా  వా -   ఆ ;;.....


ఇప్పుడు  అరుణ్ పెళ్ళి  జరిగింది ,బందువుల  అమ్మాయి  తో నే  . వాళ్ళు హ్యాపీ గా వున్నారు .


Thursday, May 7, 2015

నా డ్రైవింగ్

  ఇదీ పాత  టపానే  చదివి  మీరు  నవ్వుకున్నారానుకోండి  నాకదో ''తుత్తి ''.

ఉన్నది  ఒక్క  ఆదివారం , ఇంట్లో  ఉండేదే  తక్కువ , ఒక స్కూటీ  కొనిస్తే ,కూరలు ,  కరెంట్  బిల్ ,పోన్ బిల్ 
అన్ని  నేనే  చూసుకుంటాను  కదా .  పాత  సినిమాలో  ఇల్లాలి  లా ' ఇన్నేళ్ళ  కాపురం లో  మిమ్మల్ని ఎప్పుడన్నా
ఎమన్నా  అడిగానా , అన్నా . గొంతు లో  పచ్చి వెలక్కాయ  పడ్డట్టు  చూసారు  చంద్ర . అంతే  కాదు  చూద్దాం  లే 
అంటూ  దాటేసారు . ఒక్కసారి  నా  మోకాల్లోకి  ఒక ఆలోచన  వస్తే  ఎంతకీ పోదు [నా  బుర్ర  అక్కడే వుంది  మరి ]
వదలకుండా  జిడ్డులా  పట్టుకున్నా , మాట్లాడితే  ఇన్నేళ్ళ  కాపురం లో ....ఎప్పుడన్నా  ఏదన్నా  మిమ్మల్ని .... 
ఈనస  భరించ లేక , ఒక 'సరైన  సమయం లో ' కొత్తది  కాదు ,పాతది  కొనిస్తా ,నీకు  బాగా వచ్చాక  మార్చి కొత్తది 
 కొంటాను  అని  కమిట్  చేయించారు . మెకానిక్  చెప్పి ,ఒక వైట్  స్కూటీ  కొన్నారు . దానికి  పూల మాల  వేసి 
పసుపు ,బొట్టు ,పెట్టి  నిమ్మకాయలు  తొక్కించి ,పార్క్  తీసుకేల్లాము ,కంటోన్మెంట్  ఏరియా  కావడంతో  పార్క్ 
లో ప్రేమ  జంటలుండవు , మనం  డర్టీ పిక్చర్  చూడక్కర్లేదు . బాయ్స్ మాత్రం  క్రికెట్  ఆడుతుంటారు . స్కూటీ 
నేర్చు  కోవడం మొదలు పెట్టా , ఎలాగో  కిందా ,మీదా   పడి  నాలుగు  రోజుల్లో  నేర్చేసుకున్నాను . ప్రాక్టిస్  బాగా 
చెయ్యమని  చంద్ర  ఒకచెట్టు  చూసుకుని  పేపర్  తీసారు , నేను జాం   జాం మంటూ రౌండ్స్  కొట్టేస్తున్నను . 
ఇంతలో  పెద్ద శబ్దం ,కళ్ళు  చీకటి  కమ్మాయి . చుస్తే  స్కూటీ 7 వ  నెంబర్ ,నేను 3 వ  నంబరే  వేసున్నాము . 
ఎక్కడో  ఏదో  కలుక్కు  మంది . నేను  ఇక్కడ  వుంటే ,స్కూటీ పదడుగుల  దూరం లో వుంది . బాయ్స్ పరుగున 
వచ్చి  స్కూటీ  లేపారు ,చంద్ర పరుగున  వచ్చి వాళ్ళెక్కడ  నన్ను లేపెస్తారో  అని  తనే ముందు  నన్ను  లేపారు . 
[జెలసి ]. మొత్తానికి  అన్ని పార్ట్లు  బానే  ఉన్నాయని  నిర్ధారించుకుని ,ఇంటికి  వచ్చాము ,మరుసటి రోజు  నేను 
భయ  పడుతూ  కూర్చుంటే  కుదరదు ,సాహసం  చేయరా  డింబకా ,రాజకుమారి  దొరుకుతుంది  అనుకుంటూ 
స్కూటీ  తీసి మార్కెట్  కి  వెళ్ళాను ,  ఒక  టీ బడ్డి  దగ్గర బండి  పెట్టేసి , స్టైల్ గా  కీ  ఊపుతూ  వెళ్ళి  కూరలు   కొన్నాను  బండేగా  మోస్తుంది  అని కొంచెం  ఎక్కువే కొన్నాను  ఎలాగో  అవి తీసుకుని  వచ్చి స్కూటీ కి తగిలించా 
వెళ్ళేప్పుడు  లేని  ఒక  బైక్ ,రెండు సైకెల్  అక్కడ  వున్నాయి . రోడ్  ఎత్తులో వుంది ,మట్టి లోనించి  తీసి  రోడ్  ఫై 
పెట్టడం  నావల్ల కావడం  లేదు , చుట్టూ చూసాను ఎవరి పనుల్లో  వాళ్ళున్నారు . టి షాప్ అతను చిల్లర లెక్క 
పెట్టుకునున్నాడు . ఏమి చెయ్యాలి అని చూస్తున్నాను , బల్లమీద  కూచుని  చిన్న గాజు  గ్లాస్  లో టి  తాగుతున్న 
ఒకతన్ని చూసా ,పూలు అమ్ముతడను కుంటా పక్కనే సైకిల్  దానిమీద జంగిడి  దానిలో పూలు తడి  గుడ్డ కప్పి 
వున్నాయి ,''భయ్యా '' అనిపిల్చాను ,అతను అటు  ఇటు  చూసి  తననే  అని నిర్దారించుకుని 'హా  బోలో 'అన్నాడు 
'జర  గాడి నికాలో భయ్యా ' అన్నా ప్లీసింగా ,వెంటనే వచ్చి  బండి రోడ్ మీద  పెట్టేసి 'ఠీక్ హైనా 'అన్నాడు నేను 
థాంక్స్  చెప్పాను 'అరె ఇస్మే  క్యాహే బెహన్ ' అన్నాడు ,ప్రతి వారం ఈ టైం కి  ఇక్కడే  ఉంటాడా  అడుగుదామను
కున్నా , బావోదేమో  అని ఊరుకున్న ,మెల్లగా  బేలన్స్ చేసుకుంటూ  బయల్దేరా , అదేమీ చిత్రమో  అందరూ 
నన్ను దాటి  వెళ్లి పోతున్నారు , ఆఖరికి సైకిల్  వాళ్ళు కుడా ,వాళ్ళని ఆశ్చేర్యం గా చూసుకుంటూ  ఇంటి 
దారి పట్టా , లారి  వచ్చినా ,బస్ వచ్చినా ప్రక్కకు  ఆపేస్తూ , మళ్ళి రోడ్ మీదకి వస్తూ ,నానా  తంటాలు  పడుతూ 
వస్తుంటే  ఎదురుగా కార్ లో  వస్తున్న 'స్మార్ట్ ఫెల్లో ' నవ్వుతూ ఏదో సైగలు చేసాడు ,''సచ్చినోడ ,అక్కా ,చెల్లెళ్ళు 
లేర్రా ,పోతవురరేయ్  వెళ్ళే దార్లో  కరెంటు స్తంబానికి  కార్ గుద్దుకుని ,కాళ్ళు  చేతులూ  విరిగి పోతాయి రా ''
అని  సపించాను . ఇంకాస్త ముందుకు రాగానే  బైక్ ఫై  వస్తున్న వాడు కూడా ఏదో సైగ చేస్తూ  వెళ్ళాడు . ఏమైంది 
ఈవేళ  ఈసచ్చి నోల్లందరికి  వీడుకూడా  బస్ గుద్దు కుని ... ఒక పెద్దాయన 'అమ్మా రైట్ సిగ్నల్ వేసుకు ని 
వెళ్తున్నావు  అన్నాడు [ఆడవాళ్ళం కదా అనుమానం  ముందు పుట్టి  వెనకాల మేము పుడతాము . ]అయ్యయ్యో 
ముందు  వెళ్ళిన వాళ్ళిద్దరిని కాపాడు  దేవుడా నామంచికె  చెప్పారు ,అని అనుకుంటూ  డ్డు .. డ్డు మంటూ 
ఇల్లుచేరాను ,ఛత్రపతి లా  సంచి లాక్కుంటూ వచ్చా . అన్న మాట ప్రకారం  పనులన్నీ  నేనే చేసే దాన్ని అయితే 
ఇలా రెండు నెలలు కూడా గడవలేదు ,స్కూటీ సెల్ఫ్ స్టార్టర్ పోయింది . మెకనిక్ చూపిస్తే  వాడు  బండి ఖరీదు 
అడిగాడు , ఇలా కాదని  కిక్ అలవాటు చేసుకున్నాను . స్కూల్కి వెళ్లి పిల్లలిని  తేవాలంటే మూడింటికి మొదలు 
పెట్టాలి కిక్ కొట్టడం ,ఒకోసారి  నాలుగయ్యేది ,వాళ్ళే వచ్చేసి ,బాగ్స్  నా మొహాన  పారేసి  వెళ్ళేవారు  కోపంగా 
మరుసటి రోజు నుంచి  లంచ్  అవర్ కె మొదలు పెట్టే దాన్ని కానీ నా కాలు  ఎందుకూ పనికి రాదనిపించి న్ది . 
ఇంక ఇలా కాదని  నాకు  నేనే  బండి  అమ్మేయ్  అన్నాను . వెంటనే ఉత్సాహంగా [ఇలాంటి వాటికీ ముందుంటారు 


అమ్మి పారేసారు . నా జీవితంలో ఎప్పుడు  ఏమి  అడగనండి  అని పరోక్షం గా  నాతోనే  అనిపించారు .