Total Pageviews

Thursday, December 25, 2014

తెలుఘోరాలు ..........


తమిళులు  సినిమాకి   తమిళ్  పేరు  కాకుండా  ఇంగ్లిష్ లో  పెడితే  చూడరు ,వారి భాష  మీద వారికంత ప్రేమ .
 తెలుగు  భాష  ఎప్పుడో , దారి  తప్పి పోయింది , ఎక్కడో  ఒకటి  అరా  ఎవరన్నా పిల్లలికి  తెలుగు  మాట్లాడటం
వస్తుంది . చదవడం  అసలే  రాదు ,ఎందుకంటే ,మనకి  ' ఎంగ్లిష్ ' అంటే  అంత మోజు,  బడి లో  వెయ్యడమే 
 A B C లు  తప్ప ,అ ఆ  లు  దిద్దిన్చము , పిల్లలు తెలుగు  చదువుతున్నారు  అంటే  లోకువై పోతాము 
అనే భయం . ఇంగ్లిష్  ముఖ్యమే  కాని , ఇక్కడ  బ్రతకాలంటే  తెలుగు  కూడా  ముఖ్యమే  కదా ! మీరు కూడా 
చూసే  వుంటారు , బస్టాప్ లో   నించున్నప్పుడు  చాల మంది ,చదువు రాని  వాళ్ళు ' ఆ బస్సు  ఏవూరు 
పోతుందమ్మా ' అని అడుగు తుంటారు . కొన్నాళ్ళకి  మన  పిల్లలు  చదువు కుని కూడా ,ఎవరన్నా  వురి వాళ్ళని 
ఆ  బస్ ఏ  వూరు పోతుంది ' అని అడగాల్సిన  పరిస్తితి  వస్తుంది  ఎందు కంటే  వాళ్ళకి  తెలుగు  రాదు  కదా !
ఇదంతా  మనకి  అవసరమా ,తెలుగు ' కూడా ' ఒక సబ్జెక్ట్  గా  తీసుకోమని  ప్రోత్సహించాలి . మా పిల్లల కి 
అలాగే  తెలుగు  కూడా  తీసుకున్నాను . ఇప్పుడు  మర్చి  పోతారేమో  అని  న్యూస్  చానల్లో వెళ్తున్న లైన్స్ 
చదవమంటాను . ఇదంతా  ఎందుకు చెప్తున్నా నంటే , మన  టీ  వి  లలో  ప్రేజెంటర్  నోట్లో  ద్రాక్ష  పండు 
పెట్టుకుని  మాట్లాడు తుంటారు ,[నేను ద్రాక్ష  పండు పెట్టుకుని  మాట్లాడి  చూపిస్తాను  పిల్లలికి ] అచ్చు 
అలాగే వస్తుంది  మాట . తెలుగేదో తప్పుడు భాష అన్నట్లు ,అది మాట్లాడితే  పరువు పోతుందన్నట్లు 
తయారైంది మన పని . ఈమధ్య న్యూస్  చూస్తుంటే  న్యూస్  రీడెర్ ''ఇవి ఈనాటి  ఇసీసాలు '' అన్నాడు . 
ఏమి సీసాలో  నాకైతే అర్ధం కాలేదు . నిర్ణయం అని పలకడం రాని  వాళ్ళుకూడా  న్యూస్  చదివేస్తారు 
నిరణ యం  అంటారు .  సోనియమ్మ  అనడానికి  '' సో'  నియ్యమ్మ అనేవాళ్ళు వున్నారు .  మీయ పూర్ 
అనేది  హైదరాబాద్ లో ఒక ప్లేస్  దాన్ని ''మీ  అయ్యా పూర్ ''అని   అఫ్జల్ గంజ్  ని ''అప్పలగంజ్ ''అని 
చదువుతున్నారు  . నేను ఊరికే చెప్పడం లేదు మీరుకూడా  పరిశీలించండి  తెలుస్తుంది మీరే ఆశ్చర్య 
పోతారు . ఒంటేలు  మీద [ఒంటెలు మీద  ] ఊరేగారు , ఇలాంటివి విని  నాకు చాల బాధ  అన్పిస్తుంది .
 ఎలాంటి పక్షపాతం లేకుండా  పరిపాలిస్తానని ప్రమాణం  చేస్తున్నాను . 
 ఎలాంటి ' పక్షవాతం ' లేకుండా ,ఇది  సరైనదా . 
ఇక   ప్రకటనల్లో  జరిగే  తప్పులైతే అన్నీ  ఇన్నీ  కావు . 
హార్లిక్స్  ఏ డ్  ;  ఈవేల  హార్లిక్స్  ఇచ్చవ .. 
ఒక  నిముషం పాటు  కడిగితే  కాని ''క్రీములు ''పోవు [క్రిములు ]. 
సేవంటి  ఫైవ్  రూపాయలకే [సేవేంటి ఫైవ్  రుపీస్ అనాలి ,లేదా  డెబ్బై ఐదు అనాలి  కదా ] .
మీ టూత్  పేస్ట్ లో  వుప్పుంద్యా [ ఉప్పు వుందా ] .
దురగ  నై , అంటే తెలుసా ,''దుర్గా  నెయ్యి '' అన్నమాట .  
కొన్ని తెలుగు  పదాలు  అసలు   ఎప్పుడో కొట్టుకు పోయాయి .
విపులీకరించడం ,
విసదీకరించడం ,
విడమరచి  చెప్పడం  ,
మోషాడ గొట్టడం ,
వెగటు , నోటికి హితవు ,   ఇలాంటివి  చాలా .......... 
ఇలాంటి వి  ముందే ఊహించారేమో , మా  నాన్నగారు  మమ్మల్ని కూర్చో పెట్టి ,
''తక్షణమే  హస్తినకేగి ''
''విక్ష్వక్షేనుని  కొడుకు ఖస్  ఖస్  ఖం భట్లు '' ఇలాంటి కష్ట మైన పదాలు  నేర్పించే వారు . 
''రాముని  తో  కపివరుండు  యిట్లనియె '' అని రాయడానికి  ఒకతను  ఇలా  రాసాడని 
 వ్రాసి  చూపించే వారు . 
''రాముని   తోక   పీకి వరుడిట్లనియే '' అలా  వుంటుంది  భాష మీద పట్టు లేక పొతే . 
కాకినాడ లో ' గొడా రి గుంట ' వెళ్ళే దారి లో  ఒక కొట్టు  వుండేది . దాని పేరిలా  వ్రాసి  వుండేది . 
ఇప్పుడుందో లేదో ,పేరుమర్చారో  తెలీదు మరి . 
 ''కన్యకు     మారికి    రాణా షాప్ ''    అసలు   పేరు   ''కన్యా  కుమారి  కిరాణ   షాప్ ''   అదీ   విషయం .

                                         **************************

                                        క్రిస్మస్ శుభాకాంక్షలు 

                                         
                                        *****************************************

Thursday, December 18, 2014

చెక్కిన అందాలు . 1.
మాటల్లేవ్     మాట్లాడు కోడా ల్లేవ్ . 

                                                      *******************************

Thursday, December 11, 2014

త్రిష కి నచ్చే రంగులు

త్రిషకి  అన్ని  రంగులు  నచ్చ వేమో  అని  అనుకుంటున్నా ,లేకపోతే  సెంటి మెంట్ కూడా  కావచ్చు  ఎప్పుడూ
ఎక్కువగా  కనిపించేది ,పింక్  లేదా  బ్లూ . బహుశా  ఆ  రంగుల్లో  బావుంటుందని ,తనకనిపించి  ఉండచ్చు
నేను మాత్రం  త్రిషకు  నచ్చిన  రంగులు ఇవే  అని  ఫిక్స్  అయ్యాను .అదండీ  విషయం , ఏ దోవోకటి  కాకుండా, ఏ ది  నప్పుతుందో  అది వేసు కోవలన్నమాట . 

******************************
              

Friday, December 5, 2014

ఇది పెళ్లంటారా !!!.........

ఆ మధ్య  ఒక పెళ్ళికి  వెళ్ళాము . పెళ్ళికొడుకు  ముంబై  లో  ఉద్యోగం . పెళ్ళికూతురు  హైదరాబాద్  లో  ఉద్యోగం .
ఆమె  తల్లి తండ్రులు ,మావురే  కావడం వల్ల ,పెళ్లి ఇక్కడే  కనుక  వెళ్ళాం . వరుడి బామ్మ చాల  చలాకి  గా వుంది . 
ఆడపెళ్ళివారి తరపున  మర్యాదలకు ,లోటు జరిగినా , సర్దుకు పోతూ ,ముఖం మాడ్చుకున్న కోడలికి నచ్చచేప్తు ,
వధువు తండ్రిని హెచ్చ రిస్తూ ,అజమాయిషీ  చేసేస్తోంది . అందరింట్లో బామ్మలు ఇలా వుంటే ,సర్దుకు పోతుంటే 
ఏ ఇబ్బందులు  రావుకదా ! అనుకుంటూ  వెళ్ళిన కొంచెం సేపటికే  తన అభిమాని ని  అయిపోయా ,నేనుకూడా 
బామ్మనయ్యాక ఇంతే అవగాహనతో  అందరి తో [ఆశ్రమం లో చేర్పించ కుండా  ఇంట్లో  ఉండనిస్తే ]సర్దుకు పోవాలి 
అని  నిర్ణ ఇంచు[చేసు ] కున్నాను . మొదట్లో  ఐదు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవి ,తర్వాత  ఒకరోజు కి వచ్చాయి . 
ఇప్పుడేమో గంటల్లోకి వచ్చాయి . హైదరాబాద్  ట్రాఫ్ఫిక్ లో పడి ''కాస్త '' లేటు గా  వెళ్ళాం అనుకోండి  అంతే ,
విప్పేసిన పూలు ,ఎత్తేసిన కుర్చీలు ,బోర్లించిన  గిన్నెలు  కనబడతాయి . పెళ్లి వాళ్ళు వెళ్లి పోవడము ,మరో 
పెల్లివాళ్ళు వచ్చి అలంకారం  మొదలు పెట్టడం జరిగి పోతాయి . బిక్కమొగమేసి ,ఇదేమిటి ఇలా జరిగింది ?
భోజనం లేకపోతే  పోయే ,అలంకారం  వృధా ఐతే పోయే ,పెట్రోల్ పొతే పోయే , అసలు పెళ్లి వాళ్ళు  'పలక రించిన '
'పలకరించక పోయినా ' కనీసం  వాళ్ళ దృష్టి లో నన్నా పడాలి లేదా ,వీడియో  లోనన్న '  పడాలి ' తర్వాతన్న 
చూసుకుంటారు . ఆ అవకాసము పోయే ,ఇలా ఒకటి రెండుసార్లు జరిగాక ,నేను అందరికంటే  ముందు  అంటే 
ఉదయం తొమ్మిదికి ముహూర్తం  ఐతే ,ఏ డున్నరకే  అక్కడుండడం  మొదలు పెట్టాను . నేను వెళ్లాకే  ఆడ పెళ్లి 
వాళ్ళు ,మగ పెళ్లి  వాళ్ళు వస్తారన్నమాట . అలా ముందుగా  వేల్లికుచోడం  వల్ల  బామ్మ  మంచి ఇంట్రస్టింగ్
అన్పించింది ,ఆమె చుట్టూ అక్కడక్కడే  తిరగసాగెను ఇంతలో  ఒకరొకరె  రాశాగేరు . అందరు ముందుగ బామ్మ
ని పలకరించి వెళ్తున్నారు . ఇంతలో ఒకామె 'అత్తమ్మా 'అంటూ బామ్మని  వాటేసుకుంది ,ఎలాగున్నవే కాత్యాయిని
అంటూ ,మీ ఆయనేడే అంది ,ఆమె అటువేపు చూపిస్తూ  అక్కడున్నారు  అంది . అక్కడ చాలమందే  వున్నారు .
ఎవరెవరో  నాకర్ధం కాలా ,బామ్మకి అర్ధమైతే చాలని వుర్కున్నాను . ''నా కోడలివి  కావలసిన దానివి  ఈరోజు
ఇదంతా నీ చేతుల మీదుగా జరగాల్సిన  తంతు '' అంటూ బామ్మ  నిట్టూర్పు  విడిచింది . అబ్బో అనట్టు తలాడిస్తూ
ఇంతవిషయం  వుందా అనుకున్నాను . ''నీ తమ్ముడేగా  నువ్వు  హక్కుతో నాలుగు కేక లేస్తే  వినక పోయే వాడా
అంతా నువ్వు చేసి  ఇప్పుడనుకుని ఏమి లాభం ?'' అని  ఇదంతా నిన్నే జరిగినట్లు  నిష్టురమాడింది కాత్యాయిని
ఆమె గారి కళ్ళు కూడా తడిసాయని  నా అనుమానం . ''అవునే అత్తమ్మా మన సోమేసు [వరుడు సోమశేఖర్ ]
ముంబై లో వుద్యోగం ,అమ్మాయి హైదరాబాద్ ,మరి కాపురం ఎక్కడ పెడతారు''  అని అడిగింది . 'నీ మొహం
ఈ రోజుల్లో కాపురం అదీ  ఏమిటి ,వాడికేప్పుడు సెలవు దొరికితే అప్పుడు వస్తాడు ,రెండు రోజులుంది  వెళ్తాడు .
పిల్లా  అంతే ,డబ్బు ఉండాలే కాని  విమానం ఎక్కితే  గంటలో అక్కడుంటారు ,ఇద్దరికీ కలిపి  ఎంతోస్తుందో తెలుసా
...  లక్షలు . ' అంది . కత్యాయినికి  మండినట్టుంది  'ఆన్ లైన్ కాపురం అన్నమాట  అంది లేచి వెళ్తూ . బామ్మ
బాగా  ఆ లోచిస్తుందని ,ప్రోద్దుట్నించి ' ఆరాధించిన 'నేను  ఖంగు తిన్నాను . ఎందుకీ  పెళ్లి ? డబ్బుంటే  చాలా !
ఇద్దరికీ ఉద్యోగాలు మంచి జీతాలు వుంటే చాలా , జీవితం వద్దా , ఇప్పుడు ఈ బామ్మని కదిపినా ,పెళ్లి ఐన కొత్తలో
సంగతులన్నీ  ఒక్కటి  మరచి పోకుండా ,కులుకుతూ  చెప్పు కొస్తుంది . ఎందుకంటే  అందరి జీవితాల్లో అవి అంత
ముఖ్యమైన  రోజులు . మరి వీళ్ళకి వద్దా ఆ జీవితం ? మొదట్లోనే  ఒక అభిప్రాయం ఎ ర్పడుతుంది ,ఆ  ఇష్టం
లోనించి  సర్దు బాటు అలవాటు అవుతుంది . మరి అలాంటప్పుడే ఎవరి వుద్యోగం వాళ్ళు చేసు కుంటూ  ఎవరి
బిజీ  లో  వాళ్ళుంటే ,ఒకరిమీద ఒకరికి  అవగాహన  ఎప్పుడొస్తుంది  . కొత్తజంట కీ ఆవిషయం  ఎవరు చెప్తారు .
చెప్పాల్సిన పెద్దలే  ఇంత కింతని లెక్కలు చుస్తే  వాళ్ళకి  అదే  నిజమన్పిస్తుంది . వాళ్ళన్న పెల్లిచుపులప్పుడు
ఒక అర్దగంట కూచుని ,ఇంట్లో వుంటావా ,వుద్యోగం చేస్తావా ,నువ్వు నాతొ వుంటావా ,నేను  నీతో  ఉండనా ,
[మన ప్రారబ్ధం చుడండి  ఎంతగా  దిగాజారాయో  పరిస్తితులు ]అడిగి  ఒక అవగాహనకి వస్తే  బాగుంటుంది కదా
అబ్బే నాజీతం నాది ,నీజీతం  నీది ,ఆన్ లైన్ లో ఇవి మాత్రం  బాగా చర్చిస్తారు . జీవితం, ప్రేమ , పిల్లలు , అనే
ఆ లోచనే కనపడదు . పోనీ ఇదొక  వ్యాపారం అనుకుందా మంటే ,పిల్లలు పుట్టు కొస్తారే  మరి ?వారి  అతీ  గతీ ?
వాళ్ళుకూడా ''రోబో ''లైతే  బాగుండు ,కాని మన లాంటి జీవులే .  చీర కట్టుకోడం  రాదు ,ఐదు అంకెల జీతం ,
పెళ్ళంటే బాద్యత అని తెలీదు , లక్షలు  కోట్లు ఖర్చు పెట్టి ,పెళ్లి ళ్లు , భర్త తో  సహజీవనం  అంటే సర్దు బాటని  వీళకి
ఎప్పుడు  అర్ధం అవుతుందో ...... ఎప్పుడెలా  పరిస్తితులు  మారతాయో తెలియని  జీవితాలు మనవి  ఉన్నదాంట్లో
సంతోషం గా  .......     ప్రతి నిముషం  సరదాగా గడుపుతూ  ........... ,ఆనందం గా  బ్రతికేస్తే  చాలదూ .........

                          ************************************************

Tuesday, December 2, 2014

ఆరు నెలల కాలం .ఆరు నెలల  క్రితం   బ్లాగ్  పెట్టినపుడు , నేనేమంత  ఆ లోచించ  లేదు . పత్రికలకి  పంపిస్తే  తిరిగో స్తాయి   అనీ
బ్లాగ్  లో  ఐతే  'కొంత మంది 'చదువు తారు ,అన్న  ఆలోచన  తో ,మొదలు పెట్టాను . కాని 'ఇంతమంది '
చదువుతారు అనుకోలేదు .


కొన్నినేలలు  అంటే  రెండున్నర  నెలలు  ఎలాంటి  కామెంట్స్  రాలేదు . నా పని  నేను చేస్తూ  వెళ్ళాను . నిజానికి
నాకు ' కామెంట్స్  అంత  ముఖ్యమని  తెలీదు'  అంటే  సరిపోతుంది . ఇప్పటికీ  వారం లో  ఒకరోజు  మాత్రమే
ఆలోచించి  టైప్  చేస్తాను , ప్రతి రోజు ఒక  గంట  మిగతా  బ్లాగ్  లన్ని  చదువు తాను . నాకు  నా  కుటుంబం
ఎంత ముఖ్యమో   నా  కున్న  హాబీలు  అంతే  ముఖ్యం . అలాగే   నేను ముచ్చట  పడి ,పెట్టుకున్న  నా బ్లాగ్
కూడా  నాకంతే  ముఖ్యం  నా  భావాలన్నీ  మీతో పంచు కోవాలి గా ... చాల మందే  స్నేహితులయ్యారు .
అన్నీ  మంచి కామెంట్లే  వచ్చాయి .


ఉత్తమ  బ్లాగ్  లో  చోటు  దక్కడం  నాకు  చాల  ఆనందం  . ఎప్పటికీ  చది వి  ఆదరిస్తారని  నమ్ముతూ
 మీతో  కలసి   ఎంతో   ప్రయాణం  చెయ్యాలని   ఆశిస్తూ ...                                                 

బ్లోగిల్లు   వారికి  ,  ఇండి బ్లాగర్  వారికి   నా కృతఙ్ఞతలు .