Total Pageviews

Tuesday, July 29, 2014

సరదాగా కాసేపు

అనుకోకుండా  వచ్చిన  సెలవు  అదీ  రెండు  రోజులు , అందరికీ  కాదు  చంద్రకి  మాత్రమే , అదికూడా  వంట్లో  బాగాలేక  కాదు . నాకు  గొప్ప  విషయమే  ఎందుకంటే  ప్రొద్దునే   సూర్యారావు  తో వెళ్ళి ,చంద్రరావు తో
 ఇంటికి  వస్తారు . మధ్యలో  నెలకోసారి  మీటింగ్  అంటూ  రెండు ,మూడు  రోజులు  జంప్ ! దగ్గరైతే  ట్రైన్లోనూ
 దూరమైతే , ప్లైన్ లోను .  మొన్న గుజరాత్  కెళ్ళి  నపుడు  నాకో చీర తెచ్చారు ,ఓహో  నారాజా  కెవ్వు కేక
 పోన్లే  పాపం  అని ,ఆపుకుందామన్న  ఆగదు ,మోకాల్లో ఏమని పిస్తే  ఆదనేస్తాను ,అరికాల్ల్లో  ఏదుంటే అది
 అడిగేస్తాను . ఏమను కున్నారో  నా ఫేవరేట్  బోటిక్  తీస్కెళ్ళి ,నీ ఇష్టం  అని వదిలేసారు , గొలుసు విప్పేసిన
 కుక్క లాగా  పోలిక చండాలం గా  ఉందికదా ! పోనీ  షాపింగ్  ఇరగ  దీసాను . తర్వాత  నా ఫేవరేట్ రెస్టారెంట్
  లో  భోజనం , లాంగ్ డ్రైవ్ , వచ్చేప్పుడు  తను  హలీమ్  తిన్నారు . నాకు అలాంటివి  పడ వ్ , ఏదో  మలయ్
  కి  సాత్  ఖుబానికా  మీటా  అంటే ఓ  మాట , అదే  తిన్నా , వచ్చేక  మేడంత  పరిగెత్తాన నుకోండి ,పడక
  కాదు  కేలోరీస్  కరిగించడానికి , పిల్లలికి  పార్సిల్స్ . అంతబానే  వుంది  ఈనగారు  సండే మాత్రం ఇంట్లో
  వుంటారు , నలుగురం కలిసి  భొంచేస్తాం ,మళ్లీ వీక్ డేస్ లో  కుదరదు కదా . మరుసటి రోజు  మేమిద్దరం
  దృశ్యం  సినిమా కి  వెళ్ళాలను  కున్నాము , లంచ్ చేస్తున్నాము ,తనేమడిగేరో  తెలుసా ,'అదేంటి నువ్వు
  కేప్సికం  తినవా ' ప్లేట్లో  అన్ని పక్కన పెడుతున్న  నేను  తలెత్తి  ఇదికూడా  తెలీదా ,నాకు నచ్చదు అన్నాను
  కానీ  మనసులో ఎడ్చుకున్నాను . సమత్సరాల  తరబడి  పెళ్లమనే  సాల్తిని  ఇంట్లో ఒతాడు  ముడేసి పడేస్తారు
  తనేమి  తింటుందో  కూడా తెలీదా ! అకటా  కటకటా  మగవారి నిలా  నమ్మరాదే  చెలీ ......


         మళ్లీ  మోకాల్లో  ఉన్నదనేసి ,అరికాల్లో  ఉన్నదడి గెద్దాం ,అనుకున్నా . కాని  సినిమాకి  టైం అవుతోంది .
  అదికూడా  మెట్నీ కి  ఇప్పుడు  మొదలు  పెడితే  ఎప్పటికి  అయ్యేను . అందుకే  విరమించు  కున్నా . నేను
  ఎంత  మంచి  దాన్నో  కదా ,నాకు  బోల్డంత  సిగ్గేసేస్తుంది  బాబూ ! నన్నెవరు  మెచ్చుకుని  మేకతోలు  కప్పరు
  మరి . నేనైనా  భుజాలు  తట్టు  కోవలిగా . సోదరులందరికి  చిన్న  మనవి  మీ  ఇల్లాళ్ళని  కొంచెం  పట్టించు
  కుని , కొద్దిగా  వాళ్ళని [మీ  సెల్  నే  కాదు ] రీ చార్జ్  చెయ్యండి .

ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకంక్షలు ............
        

Friday, July 25, 2014

ముగ్గురు అమ్మాయిలు

కాలనీ లో  కొంత  మంది  ఆడవాళ్ళం  కలిసి  సాయంత్రం  వాకింగ్ చేస్తూ  ఉంటాము . అక్కడ అన్ని విషయాలూ   చర్చ కు  వస్తుంటాయి , నచ్చితే  కల్పించు  కుంటాను ,లేకపోతె  లేదు . ఒకరోజు  మంజుల   వాళ్ళ  అమ్మాయి
రేడియో  జాకీ సెలక్షన్స్ కి  వెళ్తుందని  చెప్పింది . నాకు  రెండు రోజులు  ఏదో పని  వుండి  వెళ్ళలేదు . తర్వాత  కలిసి  అడిగాను ,ఏమైందని  ఆమె  చెప్పింది  విని  విస్తు  పోయాను . అదేమిటో  తెలుసా  వాళ్ళు  నెల్లూరు  నుండి  వచ్చి
ఇక్కడ  సేటిలైన  సాంప్రదాయ  కుటుంబం . అమ్మాయి  కూడా  చాల బాగుంటుంది ,కడిగిన  ముత్యం లా ఉంటుంది
 స్టార్  హోటల్లో  ఉదయం  ఎనిమిదిన్నర కె  రమ్మన్నారట . మంజుల , వాళ్ళాయన ,అమ్మాయిని  తీసుకుని  వెళ్లారు .  కొంతసేపటికి  ఒక హాల్ లోనికి  వచ్చిన  వాళ్ళందరిని  పిలుచుకేల్లారు , పేరంట్స్ చాల తక్కువ ట , దాంతో  వీళ్ళు బయటే  కూర్చున్నారు . ఒక గంట తర్వాత  అమ్మాయి  వచ్చి  వెళ్దాం  అందిట . కార్లో  వాళ్ళ  నాన్న
ఏమి  అడిగారమ్మా , వాయిస్  టెస్ట్  ఎమన్నా చేసారా  అని అడిగితె ,ఏమి లేదు నాన్నా  అందిట . వాళ్ళమ్మ  తరచి  తరచి  అడిగితె  అప్పుడు చెప్పిందట . మగపిల్లలిని  ఒక  ప్రముఖ  రేడియో  జాకీ , ఆడపిల్లలిని  ఆమధ్య  ఒక భారీ  హీరొయిన్ కి  డబ్బింగ్  చెప్పిన  లేడీ జాకీ ,ప్రశ్న లడిగారట , అవేమి ప్రశ్నలో  తెలుసా ''నీ  బాయ్ ఫ్రెండ్  వల్ల  అవాంచిత  గర్భం  రాకుండా  నువ్వు పాటించే  పద్దతులు  ఏమిటి '' ఎమన్నా సంబంధం ఉందా , కనీసం   ,ఏడూ ,
అరిచి  చూపించు ,ఇలాంటివి  కాదు  ఆ  అమ్మాయికి  కోపం  వచ్చి  నాకలాంటి  అవసరం  లేదండి  అంటే  వినదట
అలోచించి  చెప్పు ,ఊహించి  చెప్పు  అంటూ ,ఏదేదో  మాట్లాడు తోందట ,తను  లేచి  చక్కా వచ్చేసిందట . ఊహించని  . మంజుల  భర్త  చాల  కోపిష్టి,  కారపెసి  తంతానని  బయల్దేరితే ,తల్లి ,కూతురు  బ్రతిమాలి తీసు  కొచ్చారు .
                 
       
    కరెంటు  పుణ్యమా  అని  మేడమీద  తిరుగుతున్నాను , పక్క మేడమీద ఒక అమ్మాయి  ఉంది  కొత్తగా  ఎవరా
అని చూసాను . నవ్వుతూ  ఈచివరికి  వచ్చి  మీది  వైజాగ్ ట  కదా  అంది . ఇక్కడ  ఒక  విషయం , ఆమె  మాటకి
ముందు ఒక  ఆంటి  వెనకొక టి  పెడుతోంది , నాకా  పదం అంటే  ఎలర్జీ  అందుకే  రాయను  కావలసిన  వాళ్ళు  కలిపి  చదువు కోమని  మనవి . కాసేపు ముచ్చట్లు  పెట్టాము . రెండు  రోజుల క్రితం  వైజాగ్  నించి  వచ్చి  ఇక్కడ
అద్దెకు  వచ్చారట , పేరు  మాలిని  మిగాతయిద్దరు  డ్యూటీ కి  వెళ్లారు , ఏదో టెక్  లో ఉద్యోగం , అక్కడ లేవా  ఇంత
దూరం  ఆడపిల్లలు  రావాలా  అన్నాను . వాళ్ళ పేరెంట్స్  ఇక్కడైతే  గొప్పగా  వుండదు , హైదరాబాద్  లో  అయితే
చెప్పుకోడానికి  బాగుంటుంది . అనిచెప్పి  ముగ్గురున్నారు  కదా  అని  పంపించారట . హతవిధీ  ఎక్కడికి పోతున్నాం  మనం  అని  పించింది . తను  ఫోన్  నెంబర్  అడిగింది  ఇచ్చి  వచ్చేసాను .  నాలుగోరోజు  రాత్రి  రెండు  గంటలికి  మెలుకువ  వచ్చింది , లేచి చుస్తే  నా  సెల్ రింగవుతోంది . మా ఇంట్లో భోంచేసే టప్పుడు ,పది తర్వాత
టి  వి  , బెడ్ రూమ్ లో సెల్  ఫోన్  నిషేధం . హాల్ లో ఫోన్  తీస్తే  మాలిని ట  అప్పుడే  నిద్ర లేచానేమో  గుర్తు రావడాని  కొన్ని సెకనులు  పట్టింది . చెప్పు మాలినీ  అన్నాను ,ఆఫీసు  నించి  వస్తూ  ఇల్లు  మర్చి  పోయాను
కాబ్ డ్రైవర్  తిడుతున్నాడు  గంట పైన అయింది . అంది . మరి ఉదయం  వెళ్ళే టప్పుడు  ఏమి గుర్తు  పెట్టు  కున్నావు , అన్నాను  విసుగ్గా  కొబ్బరి బొండాల  బండి ఉండాలి  అంది . 'అకటా  కటకటా ' వాడు రాత్రి  ఈమె
వచ్చే వరకు  ఉంటాడా , ఈ పీత  బుర్ర కెవరు  టెక్  లో ఉద్యోగం  ఇచ్చింది , ఇచ్చితిరి పో , నమ్మి ఇంతదూరం
పంపిన  పేరెంట్స్  కి  నా  లాల్  సలాం  అనుకున్నా మనసులో 'ఎక్కడి వరకు  వచ్చారు  అనిఅడిగా  ,చెప్పింది
అక్కడ కుడి వైపు కమాను  ఉంటుంది  అన్నాను ,కమనంటే  అంది  తల్లి  డ్రైవర్ కి  ఇవ్వమ్మా  అన్నాను  వాడు
ఒకటే  నవ్వు గంట నించి  తిప్పుతోంది ,ఏడుస్తోంది ఎవరన్న  చుస్తే  నన్ను తంతారు  అన్నాడు , అడ్రెస్స్  చెప్పి
వచ్చి  పడుకున్నాను ..
 
   
          మరో సారి  రాత్రి  ఎనిమిది  గంటలికి  ఇంటికి  వస్తుంటే ,ఒక అమ్మాయి  కుక్కలిని  చూసి  భయపడుతూ
జిగ్ జాగ్గా ,పోతూ కంగారు  పడుతోంది ,నేను తనని  గుర్తు పట్టి  చంద్రని  కారపమని  ఎక్కమన్నాను ,మరో
ఆలోచన  లేకుండా  ఎక్కేసింది ,చాల భయ పడుతోంది , నేను తెలుసా  అని  అడిగాను  తెలిదు  అంది ,మీఇల్లు
సెల్ టవర్  దగ్గర కదా  అన్నాను ,అవును  మీరు? అంది  రోడ్ పక్కన ఒకే  లాంటి వి  రెండు ఇళ్ళు ఉన్నాయి  కదా
 అందులో ఉంటాము ,నిన్ను రోజు చూస్తాను ,ఈన కి బై  చెప్పి గేటు వేసుకునే టైం లో  ఇయర్  ఫోన్  పెట్టుకుని
మెసేజ్  చేసుకుంటూ  వెళ్తూ ఉంటావు  ,తలెత్తి చుట్టూ  ఎవరున్నారో ,ఏమిజరుగుతుందో .చుస్తె కదా ఎప్పుడన్నా
అన్నాను  సిగ్గు పడింది ,నేను ఇక్కడ నించి వెళ్తాను  అని  మాఇంటి  దగ్గర దిగి  నడచి  వెళ్లి పోయింది . తర్వాత
రోజు  వాకింగ్ కెళ్తే  వాళ్ళమ్మ గారితో  వచ్చింది , తనకి  కుక్కలంటే  చాల భయమండి  అన్నారావిడ , తర్వాత  ఎప్పుడన్నా  కలిసే వారు  , తనకి  ఆస్ట్రేలియా  లో  సీట్  వచ్చింది  వెళ్తున్నానండి  అంది . వెళ్ళాక ఫోన్  చేసింది
అక్కడ దిగగానే  ఎయిర్ పోర్ట్  లో  కుక్కలు  సోదా  చేస్తాయట , అంత పెద్ద కుక్క  నా భుజాల మీద  కాల్లేసి  నించుంటే ,పయ్  ప్రాణాలు  పయ్ నే పోయాయి  అని మీరు గుర్తు  వచ్చారు ,అంది . అక్కడ పార్ట్ టైం జాబ్
దొరికిందట ,ముగ్గురు కలిసి  వుంటారట ,ఒకరు డ స్టింగ్ ,ఒకరు కుకింగ్ , ఒకరు కావలసినవి షాపింగ్  చేస్తారట
వారిలో  ఒకరు  అబ్బాయని  చెప్పింది . బాగా చదువు కోమని  చెప్పాను  నా వంతుగా ....... 

Wednesday, July 23, 2014

గోరింటాకు

గోరింటాకు  అంటే  ఎవరికీ  ఇష్టం  ఉండదు ? నాకు చాల  ఇష్టం ,  ఆకు దొరికితే  రుబ్బి  పెట్టు కుంటే  బాగుంటుంది
దొరకనపుడు  పౌడర్  తప్పదు , కాళ్ళకి ,  చేతులకి , పుసేస్తాను , ఎంత సేపైనా  కదల కుండ కూచుంటాను . నా ఓపిక   చూసి  మా వాళ్ళు  నవ్వుతారు ,  చిన్నప్పుడు  ఎప్పుడూ  చేతులకేన  మూతికి  ఎందుకు  పెట్టు కోకూడదు  అనిపించింది , ఎవరూ  చూడ కుండా  మూతికి  కూడా అంటించుకుని  కూర్చున్నా , నాకప్పుడు  శ్రీదేవి  అంటే  ఇష్టం , ఆమె లాగే  నా మూతి  కూడా ఎర్రగా అవుతుందని  మురిసి  పోయాను ,గంట  గడిచాక  కడిగి  చుస్తే
 ఆంజనేయ సామి  లా ఉన్నాను , ఎవరికీ  చూపించ లేను ,  దాచలేను , మా నానమ్మ చూసి  తిట్టింది . నోట్లోకి  పొతే  చచ్చి పోతారని  చెప్పింది , తర్వాత ఎప్పుడు  అపిచ్చి పని చెయ్యలేదనుకోండి . కానీ ఇక్కడ మాత్రం  అంటే
 తెలం గా  ణ  లో కొంచెం  గోరింటాకు ముద్ద గా  చేసి  నోట్లోకి  తీసు కుంటే  ,పుట్టబోయే  బిడ్డ పెదవులు  ఎర్రగా  ఉంటాయని  నమ్ముతారు , నాకైతే  మాత్రం  మా నానమ్మ పెట్టిన  భయం  అలాగే ఉంది .
                 
           గోరింటాకు  ఎంత  ఎర్రగా పండితే  అంత  మంచి  మొగుడు  వస్తాడట ,  అసలు  పండని  వారికీ  కూడా  మంచి  మొగుడు  వచ్చాడు , నాకు తెలిసినవారికి  . మంచి మొగుడంటే  చెప్పిన మాట  వినేవాడు  ,  అంతే  కదా,  మాటవినడం  అంటే  బానిస ల్లా  ఉండడం  కాదు  . ఒకరితో  ఒకరు  అవగాహన  తో  సర్దుకు  పోవడం . నేను చెప్పిందే  వేదం  , నా కుందేలు కి  మూడే   కాళ్ళు , అంటే  రెండో  వాళ్ళు  ఎంతసేపని  ఓపిక  పడతారు , ఒక రోజు  వాళ్ళు  విసిగి పోతారు , దాన్నే  తెగే దాక  లాగడం  అంటారు . చిన్న సర్దుబాటు  లేక  ఓపిక  లేక ,విడి పోతున్న  వాళ్ళు  ఎంతమందో , ఇద్దరు  సంపాదించేది  మరింత  సౌకర్య్యంగా  బ్రతకడానికే  కానీ  ,ఇదినాది ,అది నీది , అని
 వాటాలు వేసుకోడానికి  కాదు . సంపదిస్తున్నామని  విరగ  బడితే  మిగిలేది  ఒంటరి తనమే . అమ్మ , నాన్న  ఎంత  వరకు  సపోర్ట్  చేస్తారు ? అన్న ,తమ్ముడు  వాళ్ళ  కుటుంబం  వాళ్ళకి  వుంటుంది . పెళ్ళికి  అర్ధమే  చివరి  వరకూ  కలిసి  ఉండడం . సమస్య లు   నా  అన్న వాళ్లతో  కూడా  వస్తాయి . చిన్నప్పటి  నుంచి  ఎంత మంది తో  గొడవ  పడి  వుంటాము , కలిసి  పోలేదా  ఇది  అంతే , కాదు ,కాదు  అంత  కన్నా  ఎక్కువ . జీవితం  తో ముడి  పడిన
  విషయం  , పిల్లలు  ఉంటె  ఇంకా  నరకం , మనకి  కాదు  వాళ్ళకి  తోటి పిల్లలికి  పేరెంట్స్ ఇద్దరు  మనకి ఒక్కరే
  ఎందు వల్ల  అని  నలిగి పోతారు  అప్పుడు  వాళ్ళ  మానసిక  పరిస్టితి  ఎలా మారితే  ఎవరి  బాద్యత,  చేతులారా
  చేసుకుని  విచారించే  కంటే , ముందే  జాగ్రత్త  పడితే  అదే  సర్దు  బాటు  చేసుకుంటే  మంచిదని  చెప్తున్నా. 
     ఆకుపచ్చని  గోరింట  చేతులకి  పెట్టుకుంటే  ఎర్రని  రంగు పండేక  వస్తుంది , తమలపాకులో  సున్నమేసి  వక్క
 కలిపి తింటే  నాలుక  పండు తుంది  .  రెండు విధాలయిన  కుటుంబం  నుంచి  వచ్చిన  ఇద్దరు  కలిసి  చేసే  సంసారం , దాంపత్య మౌతుంది ,పిల్లలతో  నందన  వనమౌతుంది , విపరీత  పోకడలు  పోకుండా  జీవితాన్ని  పండించు కొండి .  మంచి  భార్య గా,  తల్లిగా , ఉండాలని  పి  జి  లు  చేసిన  వాళ్ళు కూడా  గృహిణి  గా  ఉండి  పోయిన  వాళ్ళు  వున్నారు , వాళ్ళందరికీ  నిజం గా  చేతు లెత్తి  నమస్కరించాలి , వాళ్ళ  సంస్కారం తో  ఒక  మంచి  కుటుంబం , ఈ  సమాజం లో  భాగం  అవుతున్నందుకు . 

Sunday, July 20, 2014

తిండి గోల

 నేనేమంత  తిండి  పోతుని  కాదండి , ఏదో  ఎవరేజ్  గా  తింటాను . కానీ  స్వీట్స్  అంటే  ఇష్టం . కానీ మా  ఇంట్లో  మా  ఆకరి  అత్త  చేసే  వంటలంటే  నాకు  చాల  ఇష్టం ,నాన్ వెజ్  ఐతే  'ఇరగ  తీస్తుంది ',అత్త  చేసే  స్వీట్స్ తింటే  మీరు  కూడా  ఒప్పేసు  కుంటారు . పంచదార  అరిసెలు  చేసిందనుకో  కళ్ళు  మూసేసి  తినిపించా  మనుకో  మీరు  వెంటనే  చెప్పే స్తారు  'కోవా ' అని . అంత  బావుంటై , అదే  మైసూర్ పాక్  చేస్తే  నోట్లో వేసు కుంటే  కరిగి పోయి  ఎటు  పోయిందో  మీకే  తెలీదు , ఎప్పుడూ  ఒకే టేస్ట్  ఎలా వస్తుందబ్బా ?  నేను చేస్తే  ఒకసారి  మెత్తగా   కేక్ లా ,మరో  సారి  గాట్టిగా  సుత్తి లా , ఒకో సారి  రవ్వ లా  పొడి  పొడి  గా ,ఎందు కు లెండి  తన  మేన కోడలి నని  చెప్పుకుంటే  సిగ్గు  చేటు . కొత్తి మిర  పచ్చడి , బిర్యానీ లు ,నాన్  వెజ్  పచ్చడులు  బాగా చేస్తుంది . నేను బిర్యానీ లు  మాత్రం  బాగా  చేస్తాను . ఈమధ్య  అరిసెలు  తెచ్చు  కున్నాము ,' గులహా  ఫుడ్స్ ' నుంచి ,ధర గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది .  బొబ్బట్లు  తెస్తే  పంచదార  తప్ప  ఏమి లేదు . నేను ఇప్పుడిప్పుడే  ఇంట్లో  చేస్తున్నా  బాగా  వస్తున్నాయి . జామున్స్  ఒకటి  ఈమధ్య  ప్రతి  వాళ్ళు చేస్తున్నారు . నేను మాత్రం  జామున్ మిక్స్  వాడను , షుగర్ లెస్ కోవా  అంటే  పచ్చి కోవా  అంటారు  కదా  అదన్నమాట , దాన్లో కొంచెం  మైదా  వేసి  జామూన్స్ చేస్తే  బాగా వస్తాయి .
   
        ఒకసారి  అప్పుడే  జామూన్ మిక్స్ వస్తోంది , ఆ టైం లో  అత్త  అయ్యప్ప స్వాములకి  ఒక  పది  మంది కి  భోజనాలు  పెట్టింది , అప్పుడు  నేను కూడా  వెళ్ళాను , ఐతే భోజనాలు  కాగానే  జామున్స్  చిన్న బౌల్  లో  సర్వ్  చేస్తే  వాళ్ళు 'ఇది  ఏమి  చెయ్యాలి ' అన్నారు  అయో మయం గా , అప్పుడు అత్త  అది  స్వీట్  అని  పాకం తో  సహా  తీసుకోవాలని  చెప్పింది . మావయ్యగారు  ఆఫీసు  నుంచి  వచ్చాక  విషయం  చెప్పాము , అయన  నవ్వుతూ స్వీట్  నోట్లో  వేసుకుని  పాకం  నెత్తికి  రాసుకో మని చెప్పక  పోయారా  అన్నారు  సరదాగా .
       
          ఒకసారి  ఊరు  వెళ్తున్నాం ,  మా  బావగారికి  ఫోన్  చేసి  '' నాకు  జున్ను కావాలి  ఎల్లుండి  ఉదయానికి  అక్కడికి  వస్తున్నా , గేదకి  డెలివరీ  చేస్తారో , సిజె రియన్  చేస్తారో  నాకు  తెలిదు ,  జున్ను రెడి చేయండి  '' అన్నా
లక్కీగా  పాలు  దొరికాయట  వండించి  ఉంచారు , ముక్కలు  కోసే లా ఉందది . అబ్బ ...  మనసు  పాడై పోతుంది .
రుచుల  విషయం  ఎలాగు  వచ్చింది  కనుక  ఈ సీజన్ లో  చెప్పు కో వలసినది  ''పొలస చేప '' గురించి ,గోదావరి
వరదలు  వచ్చి  నపుడు  కొత్త నీటి తో  పాటు  సముద్రం పు  ఉప్పు  నీటి లో కలుస్తుంది . దానితో  ఆ చేపకి  మంచి
రుచి  వస్తుంది , పులుసు పెడితే  అంతే ,బెండకాయ , టమాట  వేసి  చెయ్యాలి .  గోదావరి  జిల్లాల్లో  ఒక  సామెత
ఉంది  ''పుస్తెలమ్మి  పొలస  తినమని '' . అంత  పని  వద్దు కానీ  దొరికితే  మాత్రం  కొని ,తిని  ఎంజాయ్  చెయ్యండి . 

Thursday, July 17, 2014

నా కో అనుమానం

నేను  గజినీ నెమో   అని  నా  అనుమానం  ఎందు కంటే  డ్రైవింగ్  వచ్చినా  కార్  తియ్యలేను , రోడ్స్  గుర్తుండవు ,ఎవరైనా  ఎంతసేపు  రైట్ తీస్కో ,లెఫ్ట్ తీస్కో , అని  ఎవరు చెబ్తారు , ఇదొక్కటే కాకా  మనకి ఇంకో సుగుణం ఉంది  అది  మనుషుల  ముఖాలు ,ఎక్కడ చుసిన  వాళ్ళను  అక్కడే చూడాలి ,స్కూల్  దగ్గర చూసినమే ని ఫాన్సీ  షాప్  లో  చుస్తే  గుర్తు రాదు . అప్పటికి నవ్వినా  ఇంటికి వచ్చాక  ఆలోచిస్తే  అప్పుడు గుర్తు వస్తుంది . పాలు పోసే అంకుల్  మార్కెట్ లో కన్పిస్తే  అంతే,  బుర్ర  బద్దలు కొట్టుకుంటా.  ఒకసారి చంద్ర  తన ఫ్రెండ్ ని ఇంటికి  తిస్కోచ్చారు  అతని  పేరు  సుధాకర్ ,పరిచయాలు అయ్యాక ,మంచినీళ్ళు  ఇచ్చి ,ఒకటే సిగ్గు  పడుతూ ,మెలికలు తిరుగుతున్న ,అతన్ని చూస్తూ  'మీరు తిరుపతి  వెళ్లి వచ్చారా ' అని  అడిగా   అతని  నవ్వాగి పోయింది , చంద్ర వేపు చూసాడు ,తనేమో  నన్ను చూసి ,'తనకి తలలో చమట  ఎక్కువ  ,సమ్మర్ లో తన హెయిర్  స్టైల్  అదే ' అని చెప్పారు . ఏమిటి  డిప్పా  అని  అడగ బోయా ,చంద్రేమో  కోపంగా చూస్తూ  నువ్వెళ్ళి టీ  తీస్కురా  అని పంపి చేసారు . నాకు  మాత్రం  చాల ఆనందం  వేసింది ,మా ఇంటికి  వచ్చి  నన్నే చూసి మెలికలు  తిరుగు తాడా ,గాలి బాగా తీసేను అని    
      మరో సారి  షాపింగ్  మాల్లో  అనుకుంటా  తన  ఫ్రెండ్  కలిసారు ,హాయ్  శీనూ  అంటూ వెళ్లి  హాగ్  చేసు కున్నారు . నేను మాత్రం  నాపనిలో  ఉన్నాను . నాగురించి  తెలిసిన  చంద్ర  ఊరు కోవచ్చు  కదా ,నన్ను పిలిచారు  పరిచయం  చేసారు ,అదికూడా చాల గొప్పగా 'నేను  ఎప్పుడు చెప్తూ ఉంటానే  మా శీను  అని వీడే ' నేను ఎప్పుడు   చూడలేదు ,వాల్లెప్ప్పుడు  మాఇంటికి రా లేదు  ఈన గారేమో  ఎక్కువ చేస్తున్నారు ,నేను నవ్వుతూ హలో  చెప్పేసి  నాపని అదే  బట్టలు చూస్తున్నా ,ఎందుకో అతని ఫేసు  నాకు నచ్చాలే ,అదే పల్లికిలింపు , మళ్లీ చంద్ర పిలిచారు , వెళ్లా , శీను  పక్కన  ఒక భారీ  విగ్రహం ఉంది  ఆ సదరు  శీను  ఏదో చెప్పే లోపలే 'మీ  అక్కా ?' అని  అడిగేను , ఇంక  చూడాలి ,మనోడు  డబ్బుకు  అమ్ముడు  పోఇనట్టున్నాడు .  డ్రమ్ము మిద  చెంబు  బోర్లించి  నట్లు  ఉన్న  అమ్మయిని  చేస్కుంటే  ఇలాగే  ఉంటుంది పైగా వేరే  వాళ్ళ ని  చూసి  పల్లికి  లింపు  ఒకటి    మొకం  నల్లగా మాడి పోయింది . వస్తాం  రా ,  అంటూ వెళ్లి  పోయారు .
         
       నాకో  అనుమానం  నాకు నిజంగా  తింగరి  తనం  ఉందా ? చంద్ర  అన్నట్లు తింగరి  బుచ్చినా ,మానాన్న  అత్తయ్యలు  చెప్పినట్లు  తెలివైన దానినా ? ఎవరన్నా నా  డౌట్  క్లియర్ చేస్తే  బాగుణ్ణు .

Friday, July 11, 2014

పిచ్చి డాక్టర్

నా ఫ్రెండ్   నీలిమ  తనకి ఒక్కడే  బాబు  పేరు   నిస్సు .. నిస్సాంత్ , వాడలాగే చెప్తాడు 'బాండ్ జేమ్స్ బాండ్' 'అన్నట్లు ,నీలిమ  భర్త చాల మంచి జాబ్ , కార్ ,బంగ్ల ,కూక్ , సర్వెంట్స్ ఉండడానికి ,ఒక అవుట్ హౌస్ ,తనకి  ఆయనకి ,డ్రైవర్స్ . ఎప్పుడూ పార్టీ లంటూ తిరుగు తూ  ఉంటుంది . సంతోష మైన ,సందడి ఐన జీవితం . అంత  బిజీ లోను ,నన్ను అప్పుడప్పుడు ఫోన్ లోను ,చూడలన్పిస్తే స్వయం గా వచ్చి ,పలకరిస్తూ ఉంటుంది . ఒక  రోజు  ఫోన్  చేసి నిస్సు ని డాక్టర్ కి చూపించాలి , వస్తావా  అంది . రెగ్యులర్ చెకప్ కేనా అన్నా ,కాదు కొంచెం సీరియస్ , సైకాలజీ  డాక్టర్ దగ్గరికి అంది . ఆశ్చర్య పోయాను పదేళ్ళ పసివాడికి సైకలాజికల్  ప్రాబ్లం ? నీకెవరన్న డాక్టర్  తెలుసా ,నువ్వు నెట్ చూస్తావు గా ,ఎవరినైనా చూసి కాల్ చేసి అప్పాయింట్ మెంట్ తీస్కో పొద్దిన్నె పదికి  వస్తాను  అంది . తప్పే దేముంది ? ఆమధ్య టి వి లో బంధాల గురించి మాట్లాడిన డాక్టర్ పేరు తో వెతికి అప్పాయింట్ మెంట్  తీసుకున్నా ఉదయం పదకుండు కి . నీలిమ రాగానే బయల్దేరాము ,హాయ్ నిస్సు అన్నా ఒకసారి తల ఎత్తి చూసి  మళ్లీ గేమ్స్ లో మునిగాడు ,టాబ్ లో ఏవో గేమ్స్ ఆడుతున్నాడు ,బ్యాక్ సీట్లో కుర్చుని . నీలిమ డ్రైవర్ ని కూడా తేలేదు  ఎవరికీ తెలియ కూడదని . వీడికి అద్దాలు ఎప్పుడు వచ్చాయి ,అన్నాను . ఈమధ్యే లే  అంది .[ అద్దాలు  కావవి  భూతద్దాలు ]కమర్షియల్  ఫ్లోర్ లో ,అపార్ట్ మెంట్ లో ఉందది . సింగల్  బెడ్ రూమ్ ఫ్లాట్ ,హాల్ ని చైర్స్ వేసి కుర్చోడా నికి  వీలుగా ,కిచెన్ లో పెద్ద చైర్స్ వేసి ఉన్నాయ్ అందులో పేషంట్ లు కూర్చున్నారు ,వాళ్ళ తలకి వైర్లు పెట్టి ఉన్నాయ్ ,బెడ్ రూం లో డాక్టర్  టేబుల్ ,చైర్ ,ఉన్నాయ్ ,గెడ్డం తో ఉన్న డాక్టర్ కుర్చు ని ఉన్నారు . హల్లో టేబుల్  వేసుకుని కుర్చున్నతను ,మీరు వెళ్ళండి ,అన్నాడు . మేం లోపలికి  వెళ్ళాము విష్ చేసి  కూర్చో గానే ,పేషెంట్  ఎవరు , అని అడిగారు ,నామనసు  చివుక్కు  మంది . నిస్సు ని స్టూల్  ఫై కూర్చో పెట్టాము . నీలిమ  వాడు  ఎవరి తో  కలవడని ,ఇంటికి  ఎవరు వచ్చినా  మాట్లాడడని ,స్కూల్ లో కూడా అంతే ,రాత్రిళ్ళు  నిద్ర  పట్టదంట ... తను చెప్తూనే ఉంది ,విచారించ  వలసిన  విషయం ఏమిటంటే  అయన సెల్ రింగ్ అవుతూనే  ఉంది  అయన  మాట్లాడు తూనే  ఉన్నాడు ,ఆపేస్తా డే  మో  అనుకున్నా కానీ ఆపలేదు ,అలా ఒకసారి  కాదు ఐదు  ఆరు  సార్లు  జరిగింది ,మళ్లీ నీలిమ కోన సాగించడం , నాకర్ధ మైన  దేమిటంటే ,అయన టీనెజ్ పిల్లలిని  టూర్ తీసు కేల్తున్నాడట ,ఒకరికి యాభై  వేలు చార్జ్ చేస్తున్నాడట ,అక్కడ  వాళ్ళకి ,బిహే వియర్ ,కల్చర్ , ఇతరులతో  మాట్లాడే  పద్దతి  నేర్పిస్తాడట . ఆడపిల్లలైతే  అత్తారింట్లో నడచు కునే విధానం ,తీరు అన్ని చెప్తాడట ,ఇక  రెండే  సీట్స్  ఉన్నాయ్ ట ,అరవై వెలిస్తే ,ఈట్రిప్  లేకపోతె  వచ్చే ట్రిప్ ,అని బేరం ఆడుతున్నాడు . నాకు  ఆశ్చర్యం  వేసింది ,ఇవన్నీ నేర్పడం ఎందుకు ? వాటికీ డబ్బెందుకు ? తల్లి తండ్రి ని చూసి పద్దతి ,ప్రవర్తనా ,అయిన వాళ్ళని ,బందువులని  చూసి ఇతరులతో నడచుకునే  పద్దతి ,అవే వస్తాయి కదా ,దానికి డబ్బిచ్చి ట్రైనింగ్  అవ్వాలా ,పైగా  టి వి లో వచ్చినప్పుడు ,డబ్బు కన్నా భాంధవ్యాలు  ముక్యమన్నాడు ? మాట్లాడు తూనే నిస్సు ని మౌస్  లాంటి  దానిమీద  చెయ్యి పెట్ట మన్నాడు . పెదవి విరిచాడు ,కొన్ని బొమ్మలు డిజైన్ లు ఉన్న బుక్స్ చూపించాడు ,అవి వాడికి  ఎలా కన్పిస్తున్నాయో  అడిగి తెలుసు  కున్నాడు . ఇంతలో బయటినుంచి  అసిస్టెంట్  వచ్చాడు ,తను కొని తెచ్చిన మాత్రలు ఇచ్చాడు . అవి తీసు కుని ,అన్నిచించి తీసాడు , మాత్ర పేరు తెలియ కుండా అన్నమాట ,వాటిని  ఒక బ్రౌన్  కవర్ లో వేసి అతనికిస్తూ 'ఇవి వాడమను ,ఐపోతే మళ్లీ  రమ్మను ,రెండు వేలు  తీస్కో 'నేను  నోరు వెళ్ళ బెట్టాను ,మహా ఐతే  అవి  రెండు  వందలు ఉంటాయి . నీలిమ ఓపికగా  ఎదురు చూస్తోంది ,అంతా అయ్యాక ,అప్పుడు  పిల్లాడికి మందులు  వాడమని ,తను ట్రిప్ నించి  వచ్చాక  ట్రీట్ మెంట్  మొదలు పెడతానని ,చెప్పాడు , బయటికి  వచ్చి డబ్బు కట్టి బయట పడ్డాము . నాకు తెలియ కుండ నిస్సు ని  దగ్గరకి  తీసుకున్నను . ఐస్ క్రీం  పార్లర్ లో  కూర్చున్నాం , నీలిమా  మందులు కొనకు  అన్నాను ,ఎందుకు  అంది . వాడికి ఏ ప్రాబ్లెం లేదు  వాడు  ఒంటరి  తనం ఫీల్  అవుతున్నాడు ,అంతే ,వాడి తో ఎక్కువ టైం గడుపు ,వీలయితే ఊరికి  తీస్కెళ్ళి ,మీవాల్లందరి తో  గడపండి ,ఇక్కడ  ఎలా అని ఆలోచించకు  వాడి చేతుల్లో ఫోన్ ,ట్యాబు  తప్పించు ,కళ్ళు మండేది  అందుకే ,నిద్ర  రానిది  అందుకే ,ఇంతే కాక  మీకు ఇంకో బిడ్దగురించి  ఆలోచన వుంటే  ఇదే  మంచి  టైం  అనిచెప్పి ,ఇద్దరికి బై  చెప్పి   బస్  లో వచ్చే సాను . నిస్సు కి ఇప్పుడు  ఒక చెల్లి , నీలిమ తనకి 'ప్రత్యూష ' అని పేరు  పెట్టింది . నేను  తనని  అడిగాను ,నీకు పేరు  ఎన్  మీ ద  కదా ఇష్టం  అని . నిజమే కానీ పాప  మా  జీవితం లో  వెలుగు కదా  అంది  చెల్లి తో ఆడు  కుంటున్న నిస్సు ని  చూస్తూ ....... 

Wednesday, July 9, 2014

swayam krutam

ఒక సారి  కిట్టి  పార్టీ  లో  ఫ్రెండ్స్ తో  నాకు  మ్యూజిక్  అంటే ఇష్టమని  ఇప్పటికి  నేర్చుకోవాలని  ఉందని  అన్నాను  రూప  అనే  ఆమె  రోడ్ కి  అవతలి వేపు  ఉన్న ఇండి పెండెంట్  ఇంట్లో  ఉంటున్నమే  వీణ  నేర్పిస్తుంది . వెళ్తారా  అంది . నేను  గబ  గబా  మంచిది చూసుకుని ,  రుపకి  చేప్పేను  ఆరోజు ఇద్దరం  వెళ్దామని . నేను ,రూప  వెళ్ళేము   తన  పేరు  అఖిల  ట . అఖిల  కి మంచి  టేస్టు  ఉంది . చక్కగా  ఇంటి చుట్టూ ,మొక్కలేసింది , చాలవన్నట్లు  కుండీ లు  పెట్టింది . ఎటు చూసినా  పచ్చ దనమే , బెల్ కొట్టే లోపల  తనే వచ్చి గుమ్మం  లో నుంచుంది ,నవ్వుతూ  కలర్  తక్కువైనా , కళ అయిన  మొహం . మాఈడే  ఉంటుంది . 'రండి అంటూ లోపలి కి నడచింది . వెళ్లి కూర్చున్నాం , పరిచయాలయ్యాక  నన్ను  రుపతో చాల సార్లు  చూశానని  చెప్పింది . నాకైతే గుర్తు లేదు  మరి .  వచ్చిన పని  చెప్పాము ,తప్పకుండ  నేర్పిస్తానని  చెప్పింది . రొజూ  పదకుండు కి  వస్తానని  చెప్పాను ,ఆ  టైము  లో  ఐతే  ఎవరికీ  యిబ్బంది  ఉండదు . ఈ రోజు  మంచిది  ఎంతో  కొంత  నేర్పమని  అడిగాను . ఆమె కూడా  కాదనకుండా  వీణ తెచ్చి శృతి  చేయించింది . తర్వాత ఇల్లంతా  చూపించింది . వాళ్ళ బ్యాంకు  వాళ్ళదే , వాళ్ళది  ఉమ్మడి  కాపురం  కావడం తో , కొలీగ్స్  కదా జాగ్రత్త  గా  చూసుకుంటారని , వీళ్ళకి  ఇచ్చారట . నిజంగానే తను  బాగా  ఉంచింది ,ఇల్లంతా పూసల తెరలు ,పువ్వుల పరదాలు ,పెయింటింగ్స్, చాలాబావుంది . నేనూ  నీట్  గా  ఉంచుతాను ,కానీ సింపుల్  గా వుంటుంది , మా ఇల్లు . కాసేపు ఉండి వచ్చేసాము . వస్తుంటే రూప అన్నది 'ఆమె కి  ఖర్చు ఎక్కువని ,భర్తని బాగా  సతా యిస్తుందని . నిజం  చెప్పొద్దూ ఇలాంటి మాటలు  నాకు పెద్దగా నచ్చవు . మనకన్నా రిచ్ గ ఎవరైనా  ఉంటె సహించ లేక పోవడం  మనవ సహజం ,కాస్త ఇంగితం తో దాన్ని  అదిగ  మించ      వచ్చు . తర్వాత రోజు నుండి  పాఠానికి వెళ్ళే దాన్ని , నాకు చాల సంతోషం గ వుండేది ఎప్పుడు ఏమి నేర్చు  కావాలన్నా ఏదో ఒక  అవాంతరం  ఉండేది యిన్నాళ్ళకు  సాధన  సాగు తోంది  ,అనుకున్నా ,అఖిల కు నాకు  బాగా  స్నేహం కుదిరింది . తను  టి  వి  లో  వంటలు చేస్తుందట  అప్పుడప్పుడు ,నేను ఎప్పుడు చూడ లేదు . ఈసారి వచ్చి నప్పుడు  చూస్తా నన్నాను . పిల్లలిని స్కూల్ నుంచి  స్కూటీ మీద తీసు కు వచ్చేది . తరచూ మా యింటి కి వచ్చేది . నెల గడచిందో లేదో ,అఖిల భర్త  యింట్లో ఉంటున్నాడు . ఇది నాకు ఇబ్బంది గా ఉండేది . బెడ్  మీద  కూర్చుని ఉండే వాడు . తిన్నగా ఎదురు .. ఈపక్కకి మారుదా మంటే టి వి ,అటుపక్క దేవుడి గది . ఇటు మెయిన్ డోర్ . ఇక తప్పక ఆ గోడ దగ్గరే కూర్చు నే వాళ్ళం . నాలుగు రోజులు చూసి ఇక మానేద్దాం అనుకుంటుండ గా ,ఊరికి వెళ్ళవలసి  వచ్చింది . అఖిలకి ఫోన్ చేసి  చెప్పేను . తిరిగి వచ్చే సరికి పది రోజులు పట్టింది . వచ్చేక రుపకి  చేశాను . 'అయ్యో మీకు తెలీదా  ఆవిడ గారి ఖర్చులు ,బడాయిలు ,వేలల్లో  బట్టలు కొంటుంది ,పిల్లలికి  వేసిన బట్టలు  వెయ్యదు ,యింతింత ఖర్చు లకి  జీతాలు  సరి పోతాయా ?బ్యాంకు  డబ్బంతా వాడేసారు . అన్న  ను  'సస్పెండ్ 'చేసారు ' అంది . నా నోరంతా చేదు గా  విషం మింగి నట్లు ఐంది . ఒక చక్కని ఇల్లు సంసారం  ముక్కలై  నట్లేనా , చాల బాధనిపించింది . మరుసటి రోజు అఖిలే వచ్చింది,ఎప్పుడు  వచ్చారు అంటూ ,నవ్వు  మాత్రం  చెక్కు చెదర లేదు . నిన్ననే వచ్చాము పనుల వల్ల  రాలేక పోయాను అని చెప్పాను . 'నాకో మూడు వేలు   కావాలి ఇస్తారా 'అంది . వెంటనే తీసిచ్చాను . మూడు రోజుల్లో యిస్తాను  అంది . వారం  గడచింది  నేను వెళ్ళట్లేదు,   మళ్లీ తనే వచ్చింది , టి వి లో వండటానికి  వెళ్తుందట ,మంచి రంగుల్లో చీరెలు కావాలంది ,ఆమె వేసుకున్నాక  నేనెలా వేసుకొను ? మీకున్న వాటిలో కెమెరా కి ఏమి బాగుంటాయో చెప్ప గలను ,పెయింటింగ్స్ చేస్తాను కనుక  కలర్స్ మీద అవగాహన ఉంది , ఏది  బాగుంటుందో చెప్తానన్నా మీయింటికి వెళ్దాం అన్నా , వద్దు లెండి  మీరు మొన్న పండుగ రోజు వేసుకున్న సెట్ చాల బాగుంది ,అది ఇవ్వండి  రేపే తెచ్చి యిచ్చే స్తాను. అంది , అవన్నీ  బ్యాంకు లాకర్ లో ఉన్నాయ్ , అన్నా  మొదటి సారి ఆమె మొహం లో నవ్వు ఆగి పోయింది . 'వస్తాను 'అని వెళ్లి పోయింది . తనలా వెళ్లి పోవడం  నాకు చాల బాధని పించింది . ఒక రోజు వర్షం లో  నా డబ్బు తెచ్చి ఇచ్చేసింది . మళ్లీ  రాలేదు ,బయట కన్పించినా కనీసం నవ్వేది కాదు , ఆరు నెలలు గడిచాక  ఒక రోజు రూప ఫోన్ చేసింది . 'అఖిల  వాళ్ళు రాత్రికి  రాత్రే  సామాను సర్దుకుని వెళ్లి పోయారని ,ఎవ్వరికి చెప్పలేదని ,ఊరంతా అప్పులు  చేసారట  వీళ్ళు వెళ్లి పోయారని తెలియ గానే  అప్పులవాళ్ళు ఇంటికి తాళం  వెయ్య బోయారట ,స్వంత ఇల్లని చెప్పి డబ్బు  తెచ్చిందట ,అసలు ఓనర్స్ వచ్చి వాళ్లతో గొడవ పడ్డారట ,మాఇల్లు  అంటూ ,మొత్తానికి ఎక్కడికి వెళ్లి పోయారో ఇప్పటికి  తెలీదు ,అఖిల భర్త  చాల నెమ్మదస్తుడు . భార్య కోసం ఇదంతా చేసాడు ,పచ్చని సంసారం ,పరువు , మర్యాద  అన్ని పోయాయి . కాలనీ అంతా  నెల వరకూ ఇదే మాట్లాడు కున్నారు . సహజం గానే అంతా వాళ్ళని మర్చి పోయారు ,ఉన్నంతలో సర్దుకుని ఉంటె ఇలా జరిగేది కాదు ,పక్క వాళ్లతో పోటీ పడితే జరిగేదిదే , మగ వాళ్ళని  ముంచినా ,తేల్చినా ,ఆడవాళ్ళ మీదే ఆధార పడి వుందని పించింది . 

Friday, July 4, 2014

పట్టు చీర

 సంత్సరం  కావస్తోంది ,ఈ బ్లాగ్  పెట్టి ,ఈ సందర్భం గా ,నాకునచ్చిన  పాత టపా  ఒకటి
మరొక్కసారి ... మీ పెదవుల పై  చిరునవ్వు  కోసమే ...........

అప్పుడు  మేము  అపార్ట్ మెంట్  లో  ఉండే వాళ్ళం , నాలుగేళ్ళ  క్రితం  అన్నమాట . క్రింది  ఫ్లోర్  లో అంటే ఫస్ట్ ఫ్లోర్  అన్నమాట  ఒక అంటి  ఉండేది .  అపార్ట్ మెంట్  అంటే ఎలా  ఉంటుందో తెలుసుగా  ఒకరి తో ఒకరికి  సంబంధం ఉండదు . కానీ అంటి తరచూ  నాకోసం వచ్చేది ,ఏదైనా సలహా  ఇచ్చే టప్పుడు  మా అత్త  లా  మంచి ,చెడ్డ మాట్లాడే  టప్పుడు  మా నానమ్మ లా  అన్పించేది . అందరూ  దూరంగా ఉండడం  తో ఆవిడకి  బాగా  దగ్గరయ్యాను . ఆమె కి ఉన్నబలహీనత  ఒక్కటే  ఇక్కడి  విషయం అక్కడ , అక్కడి విషయం ఇక్కడా  చెప్పడం . అదిచాలు కదా , కాని నేను  బలహీనతలు  లేని  మనుషులు  ఉంటారా అని ,సర్దుకు పోయేదాన్ని . నన్ను తరచూ టి వి లో వచ్చే ప్రోగ్రామ్స్ కి ఫోన్  చేయ్యమనేది , లేదా 'అమ్మలక్కలు ' అనే ప్రోగ్రాం కి చేసి వాళ్ళు వస్తారండి  మనం చెప్పే ముచ్చ ట్లు ,ప్రసారం  చేస్తారు అనేది ,నాకిష్టం ఉండదంటే అదోల చూసేది . ఒకరోజు  నారత కొద్ది ఒక లైవ్  చూసాను ,పేరేమో 'ముట్టు  కుంటే  ముతక చీర ' అనే ప్రోగ్రాం .  ల్యాండ్ లైన్ ఫోన్  దగ్గరగా  కూర్చున్నానేమో ,[అంటి మాటలు కూడా  పనిచేసి  ఉంటై ]ఫోన్ ట్రై  చేశాను . మొదట  రింగ్ ఐంది కానీ  ఎవరూ తీయ లేదు . నంబర్లు  మనకి ,చీరలు  బందు  వర్గానికి . అని తిట్టుకున్నాను ,మళ్లీ చేశాను ,ఎవరో ఫోన్ తీసారు , మీపేరు,  అడ్రెస్స్ ,వివరాలు ,చెప్పండి  అన్నాడు అన్ని  రాసు కున్నాడు . మీరిలా కాదు గట్టి  గా మాట్లాడాలి ,అని విసుక్కున్నాడు . 'అరె భయ్ ,ఒక్క ఫోన్ కాల్ కె అయిదారు  వేల రూపాయల  చీర  లిస్తుర్రు  జర ఓపిక తో  నుండాలే ' అని సమజ ఇంచు కొంటి . 'లైన్ లోనే ఉండండి ,వేరే కాల్ మాట్లాడు తోంది . అన్నాడు  అదికూడా విన్పిస్తోంది . 'ఆయ్ మీది [ఏకరింగ్ ]చాలా బాగుంటా  దండి , మాకు మీరంటే పేనవండి ఆయ్ ' అంది . లైన్ లో  ఉన్నవాడే మొ'  చీర ఊరికే ఇస్తోంది కదా  'అన్నాడు , అక్కడున్న మగ  గొంతు లన్నీ నవ్వాయి ,నేను పెట్టే ద్దాము  అనుకునే సరికి 'ఉన్నారా లైన్ లో  ,తర్వాత మీరే , అరే  మంచి చీర పోతోందండి ' అన్నాడు . పేరంటి అన్నాను 'చిన్నా 'అన్నాడు . అవతల కాలర్  చీర గెలుచు కుంది  చప్పట్ల ఆడియో  ప్లే చేసారు . మీరే మాట్లాడండి  గట్టిగా , అన్నాడు . 'హలో  మీపెరెంటి ' చెప్పాను , మీవారి పేరు?  చెప్పాను  [అదే నేను చేసిన తప్పు ] మీరు ఏం  చేస్తుంటారు ? సాదారణం గా ఈపాటికి భోంచేస్తుంటాను  ఈరోజు  లేటైంది ,ఆమె గలగల మని  నవ్వేసింది . మీ వారేమి చేస్తారు ?  [అచేప్పేస్తారు ] ఆఫీసు కెల్తారు . ఈసారి ఏడవలేక  నవ్వింది ,మీరు నాకన్నా పంచ్ లు వేస్తున్నారు అంది ,[నీకలా అర్ధం అయ్యిందా ]అనుకుని 'ఏదో మీ అభిమానం ' అన్నాను . ఆమె కి ఏమి  అర్ధం కాలేదు ,నిజానికి  నాకూ అర్ధం  కాలేదు . సర్లెండి చీర చూద్దాం మూడు ధరలు  చెప్తాను  ఒకటే రైటు  అదేమిటో చెప్పండి  అంది . చీర చూపించారు  బానే ఉంది  బాగోక పొతే మాత్రం ఏమి చేస్తాం  అప్పనంగా  వస్తోందికదా ,నేనొక ధర చెప్పాను ,ఆమె చప్పట్లు కొట్టి షాపింగ్ బాగా చేస్తారా అంది  నేను అవును ,కాదు  అన్నట్లు  తలకాయ ఆడించాను . మళ్ళి ఆమెకి కనపడదని గుర్తు వచ్చి వెకిలి నవ్వు నవ్వు తూ  అవునండి  అన్నాను .   ఇంతలో ఎవరో వచ్చారు  డోర్ తీసి చూద్దును కదా అంటి ,మీరేనా ఫోన్ లో  అంది  అవును  అన్నాను గర్వంగా  , ఆవిడ ఆయాస  పడుతూ , నాకుతెలుసు  వీళ్ళంతా నమ్మలేదు. అంది ఎవరూ  అంటూ అడుగు బయటకేసాను  , ప్లాట్స్ లో ఆడళ్ళంతా  గుమ్మాలలో నిలబడి ఉన్నారు . నేను గతుక్కు మన్నాను . ఆడని సినిమా  ఆడించ టానికి ఖాళీ దియేటర్ కి వెళ్ళిన 'ఒక్క ' సినిమా హిరోయిన్ లా అందరికి చేతులుపాను . ఇంతసేపు కలగని  సంతోషమేదో వాళ్ళ జెలస్ చూసాక కలిగింది . అంటి అంది  అందరికి చెప్పి బయటకి పిలిచాను ,ముందు ఎవరూ  నమ్మలేదు  అంది . ఇది నీ ఘనకార్యమా తల్లీ  అనుకున్నాను . రండి లోపలి కి టీ తగుదురు గాని  అని లోపలి కి  నడిచాను .  
      నాకా  నిముషం  తెలీదు ఇది  ఎక్కడికి పోయి  ఆగుతుందో ,మూడు రోజుల తర్వాత  ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది  అడ్రెస్స్ కన్ఫర్మ్  చేసుకున్నారు ,నాఖర్మ కొద్ది  ఫోన్  వచ్చినప్పుడు  అంటి అక్కడే ఉంది . చూసారా మీరు  నమ్మ లేదు  వాళ్ళే ఫోన్ చేసారు  అని లేచింది . పాపం ఇప్పుడీమే  మూడు ఫ్లోర్ లు ఎక్కి ,దిగి  విషయం ముప్పయ్  ఫ్లాట్స్ కి  చెప్పి రావాలి కదా  అనుకున్నా . ఇరవయ్ రోజులయ్  నా  చీర  రాలేదు  ఇరుగు పొరుగు  రావడం  'చీర వచ్చిందా చూద్దామని వచ్చాం ' అంటున్నారు . నాకు తల తిరగడం మొదలైంది . ఈయన తో  చెపితే 'తల్లి  నాబుర్ర తినకు  ఐదు వేలు  నేనిస్తాను ,చీర కొని అందరికి చూపించు ' అన్నారు . మరో సమస్య  ఆరోజు ప్రోగ్రాం  అందరు చూసేరు , అందులో అంటి ని  మాయ చెయ్యడం  నావల్ల కాదు . చీర మారిన  విషయం ఇట్టే  పట్టేస్తుంది . ఎలారా  దేవుడా  ఉన్నదానిని ,ఉండకుండా  టి వి  ఎందుకు  చూసితిన్ ,చూసితిని ఫో ,ఫోన్ ఎందుకు చేసితిని . చేసితిని  ఫో ,లైన్  ఎందుకు కలిసినది ,కలిసినది ఫో ,ధర  ఎందుకు చెప్పితిని  అని కడు  విచారము గా నుంటిని .  సరే  అని  అదే నంబర్ కి చేశాను . ఎవరో తీసారు ,పేరు కృష్ణ ట 'ఇదంతా చూసేది భార్గవి మేడం  ట నంబరిచ్చి ఆమె కి  చెయ్యమన్నాడు  చేశాను ,మళ్లీ మొత్తం వృత్తాంతం అంతా  చెప్పాక 'మీ  ఐ  డి  ఫ్రూఫ్స్ తీసుకొని ఆఫీస్ కి రండి  అంది  తప్పుతుందా ,బయటే వివరాల్ని రాసు కుని ,వేలిముద్రలు  తీసు కుని లోపలి పంపారు ,లోపల చాల సేపు కూర్చున్నా , ఎంకర్స్  కబుర్లుచేప్పు కుంటూ తిరుగు తున్నారు . ఒకతను వచ్చి బిల్ సు  వివరాలు తీసుకు వెళ్ళాడు  చీర తో వచ్చాడు . మూత  తీసి చుస్తే ,నాపేరు ఫోన్ నంబరు  ఉన్నాయి . మళ్లీ  ఎంట్రన్స్ దగ్గర  సంతకాలు  వేలి ముద్రలు అయ్యాక  బయటికి వస్తే వర్షం  అలాగే ఆటో పిల్చుకుని  ఇంటి కొచ్చే సరికి  బాల్కనీ లో అంటి నుంచుంది  నా చేతిలో పెట్టె చూడ గానే ఆమె కళ్ళు మెరిసాయి . ఎలాగో ఇంటిలోకి వచ్చి పడ్డాను . అంటి నా వెనకే  వచ్చి చీర చూసి వెళ్ళింది  , ఈవాన లో అన్నిఫ్లోర్స్ తిరగాలీవిడ . మరుసటి రోజు మా ఇంటికి చుట్టాలు  రావడం తో  రెండు రోజులు  ఆమె కి  రావడానికి కుదర లేదు  వాళ్ళిలా  వెళ్ళారో లేదో  వచ్చేసింది 'మీ పట్టు చీర ఇస్తారా  అందరూ  అడుగుతున్నారు  ఆరోజు వర్షమాని  అడగలేదు ఇప్పడు ఇస్తే అందరికి చూపించి  తెస్తాను అంది' నాకు  తిక్క రేగింది  ఈవిడ తీస్కెళ్ళి అందరికి చూపిస్తే ,నేనెలా  కట్టుకునేది ,కట్టుకున్నపుడల్లా  ఇదే  ఫలానా చీర అని  గుస, గుస  లాడితే  తల ఎక్కడ పెట్టుకోవాలి , 'నిన్న  వచ్చిన  మా  బందువులు  తీసు కెళ్ళారు  అందరికి చూపించ టానికి  అని చెప్పాను . ఆవిడ  మొహం  చూడాలి , ఆమె  అటు వెళ్ళ గానే  దొర్లి ,దొర్లి  నవ్వుకున్నాను , అంటే కాదు  ల్యాండ్ లైన్  ఫోన్  తీ ఇంచే సాను  మనసు కోతి  లాంటిది కదా ...........