ఈరోజు మనం డిన్నర్ కి వెళ్తున్నాం ,వాసుదేవ్ ఫామిలీ తో వస్తున్నాడు . అన్నారు . ఇది చాన్నల్లనించి అనుకుంటున్నదే ,వాసుదేవ్ గురించి చెప్తే వినడమే కాని పరిచయం లేదు ,ఈరోజు చుస్తామన్నమాట అనుకున్న ,
చంద్ర వచ్చే సరికే మేము రెడీ గా వున్నాము ,తనుకూడా ఫ్రెష్ అవగానే అంతా కల్సి, ఒక సినీ హీరో గారి
రెస్టారెంట్ కి వెళ్ళాము . పార్కింగ్ లోనే పరిచయలయ్యాయి ,భార్య నందిని , తల్లిని ,ఇద్దరు పిల్లల్ని తీసుకువచ్చాడు
వాసుదేవ్ . వాళ్ళమ్మగారు చాల పద్దతిగా వున్నారు , టీచర్ గా చేసారట . మసక చీకటి గా వున్నా మంద్రమైన
సంగీతం మనసుకు ఆహ్లాదం గా వుంది . వాసుదేవ్ కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు . తను ప్రయత్నిస్తే
కాంట్రాక్ ట్లు ఎలావచ్చేస్తాయో , ఎంతమందికి జాబ్స్ వేయించాడో ,ప్రమోషన్ లు ఇప్పించాడో ,ఇలాంటివన్నీ
మా ఇంట్లో ఈ ఆ ట లన్ని ఎప్పుడో ఆడేసారు ,మా నాన్నగారి కుర్చీ చేతి మీద కుర్చున్నపుడే ఈకధలన్ని
వినేశాను . నాకు పెద్ద శ్రద్ద లేదు ,రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నా మెమో ,నా ప్రక్కన వాసు వాళ్ళ అమ్మ గారు
వచ్చారు ,ఆమె తో మాటలు కలిపాను . భోజనాలు ఆర్డర్ ఇచ్చారు , వైటర్ చంద్రకి నాకు మధ్యలో కొద్దిగా వంగి
కుందేలు మాంసం వుంది తింటారా అని అడుగు తున్నాడు . చాచి చెంప పేలగోట్టాలని పించింది . చూస్తేనే
మనసుకు ఆనందం కలిగించే దాన్ని ఎవరన్నా కోసుకు తింటారా ? చంద్ర కళ్ళతోనే సైగ చెయ్యడం తో ఊర్కున్నా లేకపోతె అన్యాయానికి అడ్డం పడే అలవాటుంది .మొత్తానికి భోజనం ఆర్డర్ చేసారు .
వాసు భార్య ,పిల్లలు ,అతనిలాగానే భారీ గా వున్నారు . ఆవిడ ముస్తాబు కూడా అలాగే వుంది . మూడు
అంతస్తులు గా జుట్టు పిచ్చు క గూళ్ళు పెట్టింది ,పర్లేర్ లో ఎంతసేపు కుర్చుందో మరి . టీ నే జ్ లో వున్నా
అమ్మాయికి చేతుల్లేని జుబ్బా [తాళ్ళు మాత్రం కట్టి వుంది ,దాని మీద డూ యూ లవ్ ఇట్ అని వుంది ]
వేసి తీసుకొచ్చింది . తల్లి కూతురు పాముల్లా వున్నా బొట్లు పెట్టుకున్నారు ,మూతికి రంగులేసు కొచ్చారు .
నన్ను చూసి ఆమె చాల నిరాశ పడింది , చాల పోష్ గా ఊహించుకుని వుంటుంది . జడ వేసుకుని ,మైసూర్
సిల్క్ సారి లో సింపుల్ గా వున్నాను . తనలా లేక పోయేసరికి తనకంత నచ్చలేదు కూడా 1 అంతగా
మాట్లాడలేదు . వాళ్లపిల్లలు భోజనం తిన్నారో చల్లరో ,తెలీదు ,అలా చేసారు ,పార్లేర్ వెంబడి తిరక్క పొతే
పిల్లలికి పద్దతులు నేర్పించు కోవచ్చుగా ! . మాటల్లో వాసుదేవ్ 'నా వైఫ్ ది కూడా భీమవరమే' అంటఉంటే
ఆమెగారు గొంతు సవరించు కుంది . అతను ను అంతటితో ఆ సంభాషణ వదిలేసాడు . భలే కంట్రోల్ లో
పెట్టిందే అనుకున్నా , ఫాలో అవ్వండీ అని మోచేత్తో పోడుద్దమనుకున్నా కాని అది మా స్టైల్ కాదు .
పిల్లలికి ఖరీదైన పోన్ లు . వాటి లో ఆడుతూనే వున్నారు ,ఆమెకి పోన్ లు వస్తూనే వున్నాయి , వచ్చీ
రాని ఇంగ్లిష్ లో మాట్లాడేస్తోంది . భోజనం కాగానే వాష్ రూం కి కదిలారు తల్లికుతుర్లు మేకప్ కోసం .
ఆ కొంచెం టైం లోనే ,వాసు తల్లిగారు తన పోన్ లో ,కోడలి పాత పోటో చూపించారు ,పసుపు ఎరుపు
కల గలిసిన గళ్ళ పట్టుచీరలో తలనిండా కనకాంబరం పూలతో పెరట్లో దిగిన పోటో అది ఎంతబావుందో .
నా ఆశ్చర్యం చూసి ఆవిడ పెదవి విరిచి ఒక భావం వ్యక్తం చేసారు . ఆవిడ ఎన్నిక చేసినపుడు అలా
వుండేది కాబోలు ,ఇప్పుడు పట్నం పోకడలు బాగానే వంట పట్టాయి . మళ్ళీ రంగులు అద్దుకుని
వచ్చారు . మేము ఫింగర్ బౌల్స్ లోనే చేతులు కడిగి కూర్చున్నాము . వాసు మా పిల్లలిని అడిగారు
సెల్ పోన్ లేదా అని ,ఇద్దరూ బాగా చదువుకుని ,జాబు వచ్చాక కొనుక్కున్ టాము , అని చెప్పారు .
వాళ్ళ పిల్లలు హాయ్ ,బాయ్ తప్ప మా వాళ్లతో మాట్లాడిందే లేదు , సెల్ పోన్ లేని వాళ్లతో మాటలేంటి .
అనుకుని ఉండచ్చు . అందరం పార్కింగ్ ప్లేస్ లో బై చెప్పుకుని ,బయల్దేరాం ,కార్ రివర్స్ చేస్తుంటే
వెనక్కి చూసా ,వెనక సీట్లో వున్న పిల్లలిని చుస్తే ,క్రమ శిక్షణ పేరుతొ 'శిక్షి 'స్తున్ననా అన్పించింది .
*********************************
క్రమశిక్షణ ఎప్పుడూ శిక్షే అనిపిస్తుంది దాని ప్రయోజనం తెలియనంతవరకు.
ReplyDeleteనిజమేనండి కాని వాళ్ళు అర్ధం చేసుకుంటే ఓకే ,
ReplyDeleteఅపార్ధం చేసుకుంటే ?.