ఉదయం లేస్తూనే నేను ఈ రోజు లంచ్ తీసుకు వెళ్ళను , సాయంత్రం వస్తే 4కి వస్తాను ,ఎయిర్ పోర్ట్ కి వెళ్తే
పది అవుతుంది . అనిచేప్పేసారు . అదివిని పిల్లలికి హుషారు వచ్చేసింది ,మేముకూడా బయట తినేస్తాము .
అనిచేక్కేసారు ,కాని ఒక్కళ్ళు కూడా నువ్వేమి తింటావని ,అడగలేదు . దుర్మార్గుల్లరా ! వచ్చేక వుంది మీ
పని , పొండి రా పొండి ,మీకాలం ఖర్మం కలిసోస్తేనే రండి అని పాడుకుంటూ ,గేట్ లాక్ చేసుకుని ,ఒక మగ్
నిండా కాఫే కలుపుకుని ,టి వి ఆన్ చేశాను . ఈ రోజు మొత్తం నాది వండే పని లేదు ,ఫ్రూట్స్ తిని పండగ
చేస్కుంటా అనుకుంటూ దివాన్ మీద సెటిలయ్యను . టి వి పెట్టగానే ముందు గా ఒక రిషి గారు ప్రత్యక్షం
అయ్యారు . ఒకామె తన కష్టాలన్నీ ఏ కరువు పెడుతోంది ,ఆయన అన్ని విని ,చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి
అన్నిటికి కలిపి నేనొక పరిష్కారం చెప్తాను చేసుకోండి ,చాల చిన్నది ,వెంటనే మంచిగై పోత్కది . అన్నారు .
అబ్బా ఇన్ని సమస్యలికి ఒకటే పరిష్కారమా !అని ఆసక్తి గా వింటున్నా , '' ఒక అరటి చెట్టుకి మీరు రోజు
పాలు పోసి రావాలి ,ఎవరు చుడ్కోడాద్ [చూడ కూడదు ] అచేట్కు గెల వుండాలి ఇలా 80 వారలు చేస్తే ,
మీ సమస్య పరిష్కరమైపోత ది ''. అన్నారు . మహా ఐతే ఆరు వారలికి ,పోని పది వారాలికి గెల కొట్టేస్తారు .
ముందుగ అరటి చెట్టు కొట్టాకే గెల కొడతారు ,ఎందుకంటే ,ఒకటే గెల వేస్తుంది కాబట్టి ,గెల కొట్టిన తరువాత
చెట్టు ఆడవాళ్ళూ చూడ కూడదని ,పూర్వం పెట్టిన పద్దతది ,అప్పుడు గంపెడు సంతానం కోరేవారు కదా 1.
అందుకే గెల తీసిన చెట్టుని చూడ్ కోడ్ దంటారు ,బాబోయ్ నా తెలుగెంటిలా ! మరి 80 వారాలు పాలు ఎలా
పోస్తారు . 80 వారాలు తర్వాత సమస్య పరిష్కారంకాక పోఇనా ,అలవాటైపోతుంది అని అలా చెప్పి వుంటారు .
అనుకుని వేరే ఛానల్ మార్చాను . అది ఒక న్యూస్ ఛానల్ ,ఒక వ్యక్తిని పట్టుకుని పది మంది పైనే దరువే
స్తున్నారు . ఎంటా విషయం అని చుస్తే ,ఒకామె స్నానం చేస్తుంటే ,సెల్ ఫోన్ లో చిత్రీ కరించాడట. ఆమె చూసి
అందరిని పిలిచింది . విలేకరి ఘర్షణ చిత్రీకరించి ,ఆ సెల్ పోన్ తెచ్చిచ్చి నట్టున్నాడు ,ఆ పోన్ లో దృశ్యాలు
చక్కగా [మసగ్గా ] ప్రసారం చేస్తూ ,ఇలాంటివాళ్ళని ఏమి చెయ్యాలి ,ఇంతబాగా టెక్నాలజీ వాడుకుంటున్న
వారిని ,ఎలా దండించాలి అనే విషయం మీద మన స్టూడియో కి వచ్చారు ... అంటూ మొదలు పెట్టాడు .
ఇంట్లో అగ్గి పెట్టె వుంటుంది దానితో దీపం వెలిగించ వచ్చు ,ఇల్లూ వెలిగించ వచ్చు ,మనవివేకం మీద
ఆధారపడి వుంటుంది .
ఇంకో ఛానల్ ,అది మ్యూజిక్ ఛానల్ ,ఏ0కర్ అడుగుతోంది కాల్ చేసిన అబ్బాయిని ,ఇంకా ప్రేమించాలేదా !
ఇంతవరకు గాళ్ ఫ్రెండ్ లేదా అంటూ అతడిని ,విసిగిస్తోంది ,ఏ కెరియర్ గురించో అడగచ్చు కదా ఉహూ
ప్రేమ గురించి అయితేనే ,ఛానల్ మార్చరని వాళ్ళ ఐడియా . ఒక పాట వచ్చింది ,ఈ మధ్య రిలీస్ ఐన
సినిమా లోంచి ,హీరో ,హీరోయిన్ ,లుంగీలు కట్టుకుని ఎగురు తున్నారు ,ఇంకా అసహ్యమైన విషయం
ఏమిటంటే ,వెనుక జూనియర్ ఆర్టిస్టులు మగవాళ్ళు చీరలు కట్టు కుని ,గుండ్లు కొట్టించు కుని ఎగురు
తున్నారు ,యాక్ ఛి ..
వంటల టైం ఐంది ఒక సాలిడ్ గ వున్నా ఏంకర్ ,డాక్టర్ వచ్చారు ,ఆమె రోజంతా మజ్జిగ తోనే ఉండి స్కిన్
గ్లో ఎలాపెంచు కోవాలో చెబుతుంది . ఒక్కదానికి వంటచేసుకునే ఆలోచన లేదు కనుక సర్దుకు కూర్చున్న
ఈరోజు ఇదే ఫాలో అవుదాము అని ,ప్రొద్దునే అరటిపండు మజ్జిగ మిక్సి వేసుకు తాగాలట ,ఆల్రెడీ ఆరు
ఇడ్లీ నెయ్యి కొబ్బరి పచ్చడి తో లాగించాను కనుక అవకాసం లేదు . 11గం కల్లా ,కేబాజ్ ఆకులు మజ్జిగ
మిక్సి వేసుకు తాగాలిట ,ఒక కాఫే మగ్ నిండా కాఫీ పట్టించాను కాబట్టి అదీ అవకాసం లేదు . సాయంత్రం
పాలకూర వేసి ,ఆకలి కూడా ఎక్కువే వేస్తుంది కాబట్టి ,బాదాం పప్పులు వేసి మజ్జిగ వేసి మిక్సి వేసి
తాగాలిట . మాములుగా ఐతే ఈ పాటికి పప్పు ,కుర , రసం ,తో భోజనం చేస్తాను .,పిల్లలితో కలిసి స్నాక్స్
లేదా చిన్న కప్ ,నట్స్ తిని పని మొదలు పెడతాను . నాలుగు బాదాం పప్పులు ఏ మూలకి అది కూడా
భోజనం లేకుండా .. ఇలా కాదు కానీ పొద్దున్నే లేచి లంచ్ బాక్స్ ఇవ్వలేదను కొండి ,నా వీపు విమానం
మోత మోగుతుంది [అంతలేదక్కడ ] అనుకుంటూ ఏదో వొకటి తిందామని లేచాను .
అసలీ విప్లవాత్మక నిర్ణయం ఎందుకు తీస్కున్నానో తెలుసా మా పక్కింటి అత్తకోడలు ఒక్కనిముషం
కుడా బయటికి రారు వంట కూడా ఇండక్షన్ స్టౌ పెట్టుకుని టి వి ముందే చేస్తారు . బ్రేక్ లో మాత్రం
బయటికి వచ్చి బట్టలు ఆ రేస్తుంది , ఇంతలో ; అత్తగారు భానూ బ్రేక్ ఐపొఇన్ది రా ; అంటూ కేకలు
మాట్లా డ దమన్నా కనపడనే కనపడరు ,అసలా బుల్లి పెట్టెకి అంత పవరేంటో అని ...............
అంతటితో కట్టేస్తే వదిలేది ,కాని మళ్లీ పెట్టాను ఈ రోజు ఏమైనా వదిలేది లేదు అనుకుని కూర్చున్నా .
లైవ్ వస్తోంది ,చీరలిస్తోంది ఓ ఏ0 కర్ ,చాన్నాళ నించి చేస్తుంటే తగల్లెదండి ,ఇప్పుడు తగిలింది [ఎక్కడ ]
మీరెంత బాగుంటారో ,ఎంత బాగా మాట్లాడ తారో ,మీది చాల బాగుంతదండి [ఏ కరింగ్ ] అన్నది .
ఆమె తెగ ఆనంద పడి ,మీరేమి చేస్తారు ,మీవరేమి చేస్తారు ,అంది ఆమె హౌస్ వైఫ్ అనగానే ఏమి
వండారు అంది , మరదే నక్కాలేది , ఇంతలో చీర చూడండి అంది ,కట్ చేస్తే షాప్ లో ఒకాయన
చీర పరిచి దాని గురించి వివరిస్తున్నాడు ,''సాముద్దిరిక పోట్టండి [పట్టు ] చీరంతా పింకు రంగోచ్చండి
బోడ్రు కి మూడు పక్కలా సెక్స్ అండీ ,[అద్దిరి పడ్డారా అవి ''' చెక్స్ ''అంతే ]బోడ్రు లో సెక్సే వచ్చాయి
కాబట్టి జాకెట్ కి సెక్సే ఇచ్చాడండి '' నేను ఏ చానెల్ పెట్టినా ఇలాగె వుంటుంది . అందుకే న్యూస్
మాత్రమే చూస్తాను . వాటిలో కూడా మధ్యానం ఐతే చానెల్ లోంచే వైద్యం చెప్పేస్తారు . హతవిధీ ..
నేను ఇంకా సీరియల్స్ జోలికి వెళ్ళలేదు చూడను కాబట్టి ,ఒకరోజంతా చూసి అవికూడా చెప్తా ఈసారి .
చంద్ర పోన్ చేసారు ,వస్తున్నా వచ్చిన వాళ్ళు వెళ్లి పోయారు . నీకోసం సమోసా తెస్తున్నా .. అనిహమ్మయ్య .. వేడి నీళ్ళతో మొహం కడిగితే కాని ఈ తలనొప్పి తగ్గదు . మీరుకూడా ఓ కప్ కాఫీ
తాగండి , నాతలనోప్పి మీకంటించానో ఏ మిటో నబ్బా ... తిట్టుకోరుగా ....
***************************
సీరియల్స్ పొరబాటున కూడా చూడకండి.
ReplyDeleteప్రస్తుతం మీరు చూసిన ఛానెల్స్ వలన మీకు తలనొప్పి మాత్రమే వచ్చింది.
సీరియల్స్ కాని చూసారా, మీకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చినా ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు.
తస్మాత్ జాగ్రత జాగ్రత.
సీరియల్స్ చూసి ఇంటికొచ్చిన కోడలి మీద ప్రయోగాలు చేసి వీధిన పడ్డ
ReplyDeleteకుటుంబాన్ని చూసాను ,అందుకే నాకు అసహ్యం ,ఎవరన్నా ఈ సైకో
సీరియల్స్ మీద విప్లవం తెస్తే బాగుండునండీ .....
ఆ పనేదో ఆడవాళ్ళే చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళల్లో నూటికి తొంభైశాతం విలన్లే వాటిలో. అప్పుడప్పుడూ అక్కడక్కడా భూమిపట్టనంత మంచి అమ్మాయిలూ ఉంటారు వింతమాటలతో. ఆడజాతి అంతా దొంగలూ విలన్లూ అంటుంటే లొట్టలు వేసుకుంటూ ఎలా చూస్తున్నారో నారీమణులు నా కర్థం కాదు.
Deleteఆపని మగవాళ్ళూ చేయవచ్చు. సాయంత్రం మొగుదుగారు కొంపచేరుకునే సరికి పెద్దపెద్ద అరుపులూ పొలికేకలూ రోదనధ్వానాలూ భీబత్సమైన దరిద్రపు మ్యూజిక్క్లులూ అన్నీ ఇల్లు ఊగిపోతూ ఉంటే ఆ మానవుడు తల ఏ గోడకేసి కొట్టుకోవాలో తెలియక..... ఎందుకులెండి ఇంకా విశదీకరింఛటం.
<< "ఎందుకులెండి విశదీకరించటం .... " >>
ReplyDeleteహ హ్హ హ్హ. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారా శ్యామలరావు గారూ? అసలు మనలాటి వాళ్ళంతా కలిసి టీవీ సీరియళ్ళ బాధితుల సంఘం మొదలెట్టాలేమో.
టపా బాగా వ్రాసారు అంజలీ తనూజ గారూ. కాకపోతే పరిష్కారం కనుచూపు మేర లో లేనటువంటి సమకాలీన సమస్య ఇది.
ధన్యవాదాలు రావు గారు ,మన మోత చాలదన్నట్లు ,ముసుగులతో
ReplyDeleteవేరే భాష ల్లో వాటిని కూడా డబ్ చేసి వదులు తున్నారు మన నెత్తిమీదికి .