సెలవులకని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం ,కాకినాడకు పదిహేను ,ఇరవై కిలోమీటర్ల దూరం లోవుండేవారు
వాళ్ళది వ్యవసాయ దారుల కుటుంబం . పొలాలు ,కొబ్బరి తోటలు ఉండేవి . మానాన్నగారి తరపు వాళ్ళు బాగా
చదువుకున్న వాళ్ళు వుండేవారు . అమ్మతరపు మాత్రం పొలం ,చేను ,అంటువుండేవారు . ఆ వూరి లో చాల
పచ్చ దనం ,వుండి ,బాగుండేది ,ఇల్లు కూడా ఒకే కాంపౌండ్ లో నాలుగు పక్కలా నాలుగు ఇళ్ళు ఉండేవి . మద్య
మద్య పూలమొక్కలు ,ఒకపక్కగా మందార చెట్టు ,మల్లెపందిరి వుండేది . సాయంత్రం ఐతే అక్కడ మంచం వేసి
కుర్చునేవాళ్ళం ,పూలన్నీ మాలకట్టేవాళ్ళు ,ఆ వేళ్ళు కదిలే తీరు చూస్తుంటే భలే గమ్మత్తు గా వుండేది . చాల
త్వరగా భోజనం పెట్టేసేవాళ్ళు . చేతులకు గోరింటాకు పెట్టడం ,పొద్దున్నే తలంటి పోసి [కుంకుడు కాయ పులుసుతో ]
సాంబ్రాణి పొగవేసేది ,జుట్టు ఆరగానే , పూలజడ వేసేది ,అమ్మమ్మకి ఇవన్ని ఎలా వచ్చునో అని' ఆచ్చేర' పడేదాని
వేసిన కాసేపటి వరకు చాల బాగుండేది ,అసల నాజడే మీటరుండేది ,నేనేమో ములంకాడ లా వుండేదాన్ని .
పూలబరువుతో సహా మయ్యలంటే , ఎంతకష్టం మరి ? కుచో పెట్టి అన్నం తినిపిస్తూ ,బోలెడన్ని కధలు చెప్పేది .
ఆకధలో పడి ,బరువు సంగతి మర్చి పోయేదాన్ని ,పొద్దున్నించి ఎన్ని సార్లడిగిన ,ఒప్పుకోని అమ్మమ్మ సాయంత్రం కాగానే తనే ,జాగ్రత్తగా పూలన్నీ విప్పేసేది . హమ్మయ్య సగం బరువు తగ్గేది . బోలెడన్ని పిండి వంటలు చేసి
పెట్టేది . ఈపనులేకాక ఎండాకాలం కనుక ,తోటనించి కొబ్బరి కాయలువలిపించి తెప్పించి ,సహాయంగా కొంత
మంది ఆడవాళ్ళని పిలిచేది ,వాళ్లతో కాయలన్నీ కొట్టించి ఆ నీరు ఒక బిందెలో వేసే వారు , ఆనీళ్ళ కోసం
చాలామందే వచ్చితీసుకేల్లె వాళ్ళు . కొబ్బరి వేరుచేసి సన్నగా తరిగి ,ఎండపెట్టే వాళ్ళు ,చేస్తున్నంత సేపు
ఒక్కరి నోరు కుడా మూత పడేది కాదు ,వురి లోని సంగతులన్నీ చెప్ప్పుకుంటూ ,చేసేవారు . నేను ముదురు
ముచ్చి లా ఆ కబుర్లన్నీ వింటూ అక్కడే కూర్చునే దాన్ని . ఆకొబ్బరి ఎండినాక ,మర పట్టించి ,నునె కావాల్సి
నంత తీసుకుని మిగతాది అక్కడే అమ్మేవారు . ఈవిధనమంతా నాకు చాల ఆశ్చర్యం గా వుండేది .
తర్వాతది ఆవకాయ పెట్టడం , కారం ఇంట్లోనే కొట్టేవారు , ఆరోజు మాత్రం మమ్మల్ని బయటకి రానిచ్చేది కాదు
కౌలు దారు కాయలు తెచ్చిచ్చే వాడు వాటిని కడిగి తుడిచి ,ఆవలుపొడి చేసి ,జాడీలు కడిగి ,అబ్బబ్బా ఎంత
ఓపికొ ... శనివారం ,కొబ్బరి పచ్చడి మిక్సి లో వెయ్యలంటేనే ,నాకు బద్ధకం ,మరి అన్ని పనులు అమ్మమ్మ
ఎలాచేసేదో , ఆ మొహం లో నవ్వు చెరిగి పోయేది కాదు . తర్వాతది పూతరేకుల ప్రహసనం , బియ్యం
నానపెట్టి , ఒకామె వుండేది స్పెషలిస్ట్ అన్నమాట ,తనతోనే రుబ్బించేది ,చాల మెత్తగా ,రావాలట ,కుండ
తెచ్చి ,కట్టెల పొయ్యి రెడీ చేసి దాని మీద కుండ బోర్లించి పెట్టి , మంట సరిచూసుకుని ,అంటే ఎక్కువ తక్కువ
కాకుండా చూసి ,మెత్తని బట్ట ,పిండిలో ముంచి , ఒక్కసారి కుండమీద వేసి తీసేస్తారు , నిమిషం లో రేకులా
లేచేస్తుంది ,అదితీసి పక్కన పెట్టి మళ్లీ వేస్తారు . అలా రాత్రంతా చాల వేసేవారు . మరుసటి రోజు మధ్యానం
అమ్మమ్మే కుర్చుని బెల్లం మెత్తగా చేసి ,నెయ్యి వేడి చేసి ,రెండు కాని మూడు కాని రేకులు పెట్టి వాటి
మీద ,తురిమిన బెల్లం ,నెయ్యి వేసి చుట్టేసి ఇచ్చేది , తెల్లగా మధురంగా ఉండేవి . వుంటే జీడి పప్పు పొడి
కూడా వేసేది ,అవి మాత్రం నాన్నగారికోసమే .
అలాగే సున్నుండలు చేసేది ,మినపప్పు వేయించే టప్పుడు చూడాలి , సగం ఊరుకి తెలుస్తుంది వాసన ,
ఎవరో సున్నుండలు చేసుకుంటున్నారు అని . అంతా బాగానే వుంది కానీ .. పంటికింది రాయి లా మామయ్య
ఉండేవాడు ,అప్పటికి టీనేజ్ లో వుండుంటాడు . రాక్షసుడు , మేము చిన్న పిల్లలం ,ఆరుగురం వున్నాం .
ఇద్దరక్కల తర్వాతేమో గారం తో పాడు చేసారు ,చదువు సంధ్య లేకుండా ఊరంతా తిరగటం ,కేరమ్స్
ఆడటం ,పొలం వెళ్తే ఆడళ్ళతో వెటకారాలు ,నచ్చని కూర వండితే ,గిన్నెతో సహా ఇంటిమీద విసిరేవాడు .
అలంటి వాడికి ''పిల్లలికి పొలం చూపెట్ట మని అమ్మమ్మ అప్పగించింది . తెగ నవ్వేసుకుంటూ పదండి
అని తీసుకెళ్ళాడు ,మూడు కిలో మీటర్లు నడిపించాడు , పొలమంతా తిప్పిచుపించాడు ,అసలే ఎండా
కాలం బాగా దాహం గా వుంది , ఇకవెల్దాం అనే టైం కి మజ్జిగ తాగుతారా అని అడిగాడు . ఇక్కడ
మజ్జిగ ఎలా దొరుకు తుంది అని అడిగే తెలివి కాని వయసు కాని మా కెవరికి లేదు . ఒకచోట కుండ
పెట్టుకుని కూచున్న ముసలతన్ని ,వీళ్ళంతా మా ఇద్దరక్కల పిల్లలు ,ఎండలో తిరిగి అలసి పోయారు
అందరికి మజ్జిగ ఇవ్వు అన్నాడు . ఆళ్ళ కొద్దులెండి మీరు పుచ్చుకోండి అన్నాడా ముసలతను ,
ఇవ్వరా అని వాడిని ### తిట్టాడు ,వాడు మా అందరికి ,ఆకులు దొప్పలు చేసి ''మజ్జిగ ''ఇచ్చాడు .
అందరం దాహం తో ఉన్నామేమో పుచ్చుకున్నాం .... తిక్క తిక్కగా వుంది ,మళ్లీ ఎండలో మూడు
కిలోమీటర్లు వెనక్కి నడిపించి తీసు కొచ్చాడు . ఇంటికెలా వచ్చామో మాకే తెలీదు . అమ్మమ్మ
వాడి పోయిన మా మొహాలు ,మా దగ్గర నించి వస్తున్నా సుగంధం చూసి ,తాత కి చెప్పింది .
ఓహో అలాంటి ############## భాష ఆకొట్టుడు ,అంతకు ముందు కాని తర్వాత కాని నేను
ఎక్కడా వినలేదు ,చూడ లేదు . [మామయ్యకి సారి చెప్తున్నా ].........................
*********************************
Nice
ReplyDeletethanks
ReplyDeleteమీ చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. బాగా రాశారు. అభినందనలు.
ReplyDeleteధన్యవాదాలు .
Delete