Total Pageviews

Thursday, January 1, 2015

కొత్త గా వచ్చిన రెక్కలు [ హ్యాపీ న్యూ ఇయర్ ].










 మాంచి  ఐ  టి వుద్యోగం ,ఐదు  అంకెల  జీతం , కాలేజ్  విడిచేసి ,రెక్కలు విప్పుకుని ,విశాల ప్రపంచం లోకి 
హాయిగా  స్వేచ్చ గా  అడుగు పెట్టి ,సంపాదన  భారం  తో ,కాంపస్  సెలక్షన్  ఇచ్చిన  ఆత్మా విశ్వాసం కొండొకచో 
గర్వం కూడా , డ్యూటీ  చేసి  రావడం  అంటే ఏదో  సాధించేసాం ,అనే భావం . అదే  నాన్న పాతికేళ్ళు గా సాధించి 
అలసి పోయారని  మర్చి పోయే  క్షణాలు ,వాటిగురించి ఆలోచించే టైం లేని ,స్నేహితులు . గజి బిజీ ఎంజాయ్ 
మెంట్ ,ఓహో లైఫ్  అంటే ఇదేరా ! అంటూ కాలం దొర్లించేసే  రోజులు . ఇక్కడే కొంచెం ,చెప్పాలి ,వింటానంటే ........

ఒకో కంపెనీ  రూల్  ఒకో లా  వుంటాయి . ఒకనెల  ఫోర్మెల్స్ ,ఒక నెల  కేసుఅల్స్  అంటూ  డ్రెస్ కోడ్ . కాబ్  కి , 
పోట్ లక్  కి , నైట్  డ్యూటీ లో  తినడానికిఖర్చు,  ఖరీదైన  షూ లు  , చెప్పులు  ,ఓ  నాలుగు  జతలైన  వుండాలి  . 
ఇవి కాక  నెల నెలా ,కంపెనీ తరపున  ,పళ్ళ  డాక్టరో , కళ్ళ  డాక్టరో , జుట్టుకి  కూడా ట్రై కాలజిస్ట్  వస్తారు . 
వచ్చి చెక్  చేసి ,మందులు ,మాకులు  రాస్తారు . పళ్ళకి  క్లిప్ ,లేదా వైటనింగ్ , స్కిన్ కి  టాన్  ఐంది , 
సన్ స్క్రీన్  లోషన్ ,  జుట్టుకి షాంపూ ,కండిషన్ ఎర్  , సబ్బులు సెంట్లు  ఉండనే  వుంటాయి . ఇన్ని వాడుతూ 
ఇంట్లో  అమ్మకి కాని , నాన్న కి  కాని  బాగా లేదని  వాళ్ళు అలాగే బండి  లాక్కొ స్తున్నారని ,ఆలోచన కూడా 
రాదు . ఎందుకంటే కొత్తగా  వచ్చిన వుద్యోగం కదా ! . వీకెండ్ లో   లేదా  మంత్  ఎండ్  లో ,రిసార్ట్స్  కి వెళ్లి 
రిలాక్స్  అవ్వడలు . కంపెనీ  తీసుకెళ్తుంది  మరి , కాదనడాని కి లేదు .  తల్లేమో  చీకట్లో  రాకండి  నాన్నా  అని 
జాగ్రత్త చెప్తుంది  వస్తే ఏమి అవుతుందో , ఆమెకి తెలుసు మరి ,'' మన  రాష్ట్రం లో తాగడాని కే  కాని ,తిరిగి 
ఇంటికి  రావడానికి , పర్మిషన్  లేదయ్యే ...''  ఐనా  తెలియనట్టే  సాగనంపుతుంది . అది  ఆమె దురదృష్టం . 
 కొన్నాళ్ళు చూసి  తండ్రి  ఇంట్లో ఎమన్నా  జీతం ఇచ్చేది  వుందా అని  అడుగుతాడు . ఈ జీతం  సరిపోదని 
మళ్లీ  పి  జి  చేస్తామంటారు .  లేదా సర్టిఫికేట్  కోర్సులు ,  ఆ  పెద్దాయన  భుజాలకు  మళ్లీ  బరువుమొదలు .
ఇంతా చేసి  వాళ్ళకు జాబు  వస్తే సరే  లేక పొతే బిజినెస్  అంటారు . మళ్లీ లక్షలతో పని . అదిబాగా నడిచే 
సరికి  ఎన్నేళ్ళు  పడుతుందో ........... తల్లి పిల్లల  బిజినెస్ లో  తల్లి తండ్రులే ఎక్కువ నష్ట పోతున్నారని 
పిస్తోంది . వాళ్ళకేగా బొచ్చె లో రాయ ? ఈ లోపు  పెళ్లి ఐతే  అసలే మొండి చెయ్యి  ,పేరెంట్స్ కి గొయ్యి .
కాస్త పెద్ద వాళ్ళ గురించి  కూడా పట్టించు  కుంటే ఎంత బాగుంటుంది ,ఎంతో  శ్రమకోర్చి ,నెత్తురు  పంచి 
ఇచ్చి ,అందం ,ఆరోగ్యం  ధారపోసి , పెంచడానికే  సత్తువంతా  ఖర్చు చేసి న తల్లిని , వీళ్ళ ఆనందాల 
కోసం శారీరక  శ్రమతో అలసి పోయి ,వీళ్ళ సరదాలు తీర్చడం కోసం ,పని చేసే  చోట ,పది మాటలు  పడి 
పైకి చిరునవ్వు పులుముకుని ,పడిన కష్టం పైకి తెలియ కుండా ,ఏ దడిగినా  సరే అనే ఆనాటి  నాన్న 
ముఖం ఒక్క  సారి  గుర్తు చేసు కుంటే ,కుటుంబం  కోసం ఏ దైనా  చెయ్యగలం  అన్పిస్తుంది  . ఇదంతా 
కేవలం '' మధ్య తరగతి  మిధ్యా  భారతం '' ధనికులకు  ఈ ఇబ్బంది లేదు  ఎందు కంటే డబ్బు' కల 'వారు .   బీదలకు ఈ బాధ లేదు . వాళ్ళు ఎప్పుడూ  రెక్కలను నమ్ముకు బ్రతుకు తారు . ఎటూ  చెందని  ,
మధ్య  తరగతి  వాళ్లకి మాత్రం  ఎన్ని నియమాలో , 

అందరూ ఇలాగె వున్నారని  కాదు  కాని  ,చాల మంది  ఇలాగె  వున్నారు . పెద్ద వాళ్ళ అదృష్టం  బట్టి ,
 మీలో  పేరెంట్స్  ని చూసు కుంటున్న వాళ్ళు చెయ్యి ఎత్తండి ప్లీజ్...   నేను ఎత్తడం  లేదు  ఎందుకంటే 
లేడీస్  కోటా లో  తప్పించు కున్నాను  .                          


********************************************

No comments:

Post a Comment