నేను ఏప్రిల్ నెల నించి ,ప్రణాళిక తో వున్నాను ,ధర తగ్గింది కనుక బంగారం కొందాం అని . ఎంత కొన్నాను ఏమి
కొన్నాను ,అనేది పక్కన పెట్టేస్తే ,బంగారం కొనే చోట ఎలా వుంది అనేది మీకు చెప్పాలని ,ఎవరికన్నా ఉపయోగ
పడచ్చని పించి ఇది రాస్తున్నా ... మొదటిగా రొజూ ధర ఎంతవుంది అనేది చుస్తున్దేదాన్ని ,నేను అనుకున్న ధర
ఒకరోజు వచ్చింది . ఆరోజు ' k ' తో మొదలయ్యే ఒక షాప్ కి వెళ్ళాము . రద్దీ బాగానే వుంది ఒకామె వచ్చి ఏమి
కొంటమో అడిగి అక్కడ ఉన్న సోఫాలో కూర్చో మని చెప్పింది . అక్కడ చాల మందే వున్నారు ,ఐనా పావు గంట
లో వచ్చి మమ్మల్ని పిలిచింది . బహుశా చిన్నది కొంటే ,తర్వాత పిలిచేదేమో ! నేను నాకు కావలసిన వస్తువు
బరువు ,పొడవు చెప్పేను . ఆపొడవు లేవని డిజైన్ నచ్చితే రింగ్స్ పెడతామని చెప్పేరు . సరే అన్నాను .
ఏవి నాకు నచ్చలేదు అనే కన్నా ,అస్సలు డిజైన్స్ లేవు అంటే బావుంటుందేమో ! వాళ్ళు నాకు నచ్చచెప్పడం
మొదలు పెట్టారు ,నచ్చక పొఇన కొనడానికి అది తక్కువ ధర కాదుగా ,మళ్లీ మార్చామా ,సగానికి మాసి
పోతాము . ధర తగ్గి పోవడం తో వాళ్ళు బాగా బాధలో ఉన్నట్లున్నారు ,కొత్త గా ఏమి లేవు . నేను లేచేసెను .
దగ్గరలోనే ఉన్న మరో 'k ' కి వెళ్ళాము . అబ్బే .. వాళ్ళు అంతే ,నాకర్ధమయ్యింది , బయటపడ్డాము వాళ్ళు
వెంట పడుతున్నా వినలేదు . విదేశాల్లో శాఖ లున్న మరో షాప్ అదీ శ్రీ కే' నే ,అక్కడ ' ఈగలు' ఏమి చేస్తాం .
అని వాళ్ళని కూడా వదిలించు కుని , ఒక 'n ' కి వెళ్ళాము ,హబ్బబ్బో ఎన్ని డిజైన్సో ,ఎంత రద్దీ ,వాళ్ళు పావుగంట
ఎదురు చూసాక ,నగలు చూపించడం మొదలు పెట్టారు . మొదటి ''వాయ'' లోనే వాళ్ళకి నా అభిరుచి తెలిసి
నాకు నచ్చేవే చూపించారు . చాల త్వరగా ఎంచు కున్నాను .
ఇక అప్పుడు మొదలైంది ,అసలు కధ . మజూరి గ్రాముకి ,150, తరుగు తులా నికి ఎంతో తెలుసా మనం
నాలుగు తులాలు కొంటే ,ఒక తులం ధర వాళకి ఇచ్చేసి రావాలి . నేను మజూరి కాని ,తరుగు కాని ఒకటే
ఇస్తానని చెప్పాను . [టి వి తెలివి ] అందుకతను వెంటనే ఒప్పుకున్నాడు . మజూరి [మేకింగ్ చార్జ్ ]తీసేసాడు.
వెళ్లి ఓనర్ ని తీసుకు వచ్చాడు ,ఆయనతో బేరం మొదలైంది . కొంచం మాట్లాడేక ,దిగి వచ్చాడు . ఏదో చీరల
షాప్ లా ఈ బేరలేమి టో నాకు అర్ధం కాలా !అదే అడిగాను ,మెత్తగా మాట్లాడడం మొదలు పెట్టాడు తరుగు బయట వేరే షాప్ లో అంతలేదన్నాను . మీరు ఎంత చెబితే అంతే వేస్తానన్నాడు [?] సరే అని పదకొండు
శాతం అన్నాను . అతను కాసేపు చర్చలు జరిపేడు ,నేను అప్పటికే ఎక్కువ చెప్పానా ,అనుకుని ,బిగిసి
పోయా ,నేను చెప్పిన ధరకి ఇస్తే ఇవ్వండి ,లేకపోతె ఫరవాలేదన్నట్లు మొహం పెట్టాను . మనసులో మాత్రం
నాకది బాగా నచ్చేసింది . ఇంతే కాక తొమ్మిది ముత్యలకి 5 వేలు ,4 అన్ కట్ కి మరో ధర వేసి చూపాడు
సి జేడ్స్ వేరే ధర ,వెరసి తులం ముప్పై వేలు ఐంది . ఏతా వాతా బాగానే వడ్డించారు 24వేలకి కొనాలని వెళ్తే ,ఇలావుంది మరి ముప్పైఅప్పుడు కొంటే ఏమిటి పరిస్తితి ?. వస్తువు చేతిలో పెడుతూ తరచూ మా
షాప్ కె రావలన్నాడు . అదేమన్నా కూరల కొట్టా ,మళ్లి మళ్లీ రావడానికి ? నవ్వాపుకుంటూ అటు వైపు
తిరిగి పోయాను మా వారి మొహం చూసే ధైర్యం లేదు మరి ?................
***************************************
Ila beram cheyyachchaa
ReplyDeleteఅందుకే కదండీ అందరికి తెలియాలని ,యధా తధంగా రాసింది .
ReplyDeleteఅన్నట్లు మీకు ధన్యవాదాలు .
అఎంత ఖర్చు? ఎంత మిగులు? మాకు టీ అయినాలేదా? :)
ReplyDeleteనమస్తే , అంతకన్నానా ,మహద్భాగ్యం దయచేయండి ,భోజనమే చేద్దాం
ReplyDelete