Total Pageviews

Saturday, August 30, 2014

స్నేహ బంధమూ ....

ఇక్కడికి  వచ్చిన కొత్త లో  హబ్సిగుడా  లో  వున్నాము . మొదటి అంతస్తు  లో ఫర్నిచర్  షాప్ , రెండో  అంతస్తు లో ఇంటి  ఓనర్స్ ,మూడో అంతస్తు లో  మేము వుండే వాళ్ళం . పక్క పోర్షన్  కాళిగా వుంది ,ఎవరన్నా స్నేహం గా వుండే  వాళ్ళు  వస్తే బాగుండునని  అనుకునే దాన్ని ,ఐతే ఒకరోజు  సాయంకాలం  సామాను తో ఎవరో వచ్చారు .
ఎవరో చూద్దామని  చాలా సేపు  ఎదురు చూసాను . ఎవరు  కనిపించలేదు  బహుశా సామాను  సర్దుకుంటూ 
ఉండవచ్చు . ఉదయం చంద్ర ఆఫీస్  కేల్తుంటే బాబుని  ఎత్తుకుని  బయటికి  వచ్చాను . అప్పుడే ఆ పోర్షన్ 
నించి  కుడా వాళ్ళు  బయటికి  వచ్చారు . ఆమె కూడా  బాబుని  ఎత్తుకుని వుంది ,హమ్మయ్య  మంచి ఫ్రెండ్ 
దొరికింది  అని  మనసులో అనుకున్నాను . మగవాల్లిద్దరు  పరిచయం చేసుకుంటూ దిగి  వెళ్లారు ,నేను  ఆమె 
వైపు చూస, తను  నైటీ  లోవుంది  బొట్టు లేదు ,ఉంగరాల జుట్టు ,విల్లు లాంటి కనుబొమలు  బావుంది ,స్నేహంగా 
నవ్వింది ,నేను  'సర్డుకోడం పూర్తయిందా 'అనిఅడిగా  అంతే  'యాను  మలయాళ  కుట్టి ఎంద  పరిందా 'అచ్చంగా 
ఇలాంటి  సౌండ్ ఏదో ఇచ్చింది . చచ్చింది రా గొర్రె  అనుకున్నాను . ఎలా చెప్పాలి ? నేను  తెలుగు అన్నా నావేపు 
వేలితో  చూపించు కుంటూ , కొన్ని శబ్దాలు  సైగలు  తర్వాత తేలింది ఏమిటంటే,  ఇద్దరికీ  నాభాష ఆమె కి రాదు 
ఆమె భాష  నాకు రాదు . సహజ నటి జయసుధ లా  ఏడుపు  నవ్వు కలలిసిన  భావం ఒకటి నా మోహన 
కదిలింది , ఈ మధ్యే  ఎర్ర బస్  దిగాను ,పచ్చపెట్టి తో ,కాస్త దోస్త్  దొరికితే  లోకం  చూద్దామను కున్నా ,ఇలా 
తగలడింది . నా భావం అర్ధమైంది  అనుకుంటా , తను కూడా దిగి  వచ్చింది [మేడ మీంచి కాదు ]ఇద్దరం కల్సి 
హిందీ లో మాట్లాడు కోవాలని నిర్ణ ఇంచుకున్నాము , ఏమిటి మీ అనుమానం ?ఇద్దరికీ హిందీ రాదుగా  ఎలా 
మాట్లాడు కుంటరనే గా ,అదేకదా తమాషా , 'నహయా 'అని అడిగింది    ఏ  హాయి  గురించి అడుగుతోంది ? 
ఛ  ఛ  దానిగురించి ఐ  వుండదు  అనుకుంటూ ,ఏమిటన్నట్లు  మొహం పెట్టా ,తను  మగ్  తో నీళ్ళు భుజాన్న 
వేసుకున్నట్లు  చూపించింది ,నాకు  అర్ధమై  స్నానమా చేశాను  అని ఎందుకన్నా మంచిదని 'హ ' హు ' హై '
అన్నాను . తను వెళ్లి చేసి  వస్తాను  అని  బాబుని  ఇక్కడే ఉంచుతాను  అని చెప్పింది , అబ్బా అదేనండి 
సైగలతో ,సరేనన్నా తను వెళ్ళింది , పిల్లలిద్దరూ  ఆడు కుంటార నుకున్నాను . కానీ వాడు చాల అల్లరి , 
మామగారి  పేరని , పోళ్ మన్  అని  చెప్పింది ,తన పేరు జెస్సి అట  అయన పేరు  జాన్  అనింది . ఏదో 
కేబుల్ లో  పని చేస్తాడట . ఇక వీళ్ళు  ఆట మొదలు పెట్టారు , నీళ్లన్నీ  ఇంటి నిండా పోసారు ,అందులో 
తలగడాలు వేసారు ,అవి బోట్స్ ట ,రెండు  గన్స్ వుంటే  వాటిని నాలుగు చేసారు ,రెండు కార్లు  వుంటే 
వాటిని  ధన్  ధన్  మని గుద్దించారు లైట్లు పోయాయి ,నేను అడ్డుకోవాలని  చూసాను  కానీ  నావల్ల 
కాలేదు ,నేను కోపంగా  చుస్తే చాలు భయ పడే  మా వజ్రం నన్నసలు  పట్టించుకోలేదు . ఇలా గంటన్నర 
జరిగింది . అప్పుడు వేరే  నైటీ వేసుకుని ,పిల్లాడికి  అన్నం కలుపు కుని వచ్చింది . హమ్మయ్యా అనుకున్నా 
వాడికి అన్నం పెడుతుంటే , మావాడు చూస్తున్నాడు నేను వెళ్లి అన్నం  కలిపి తెచ్చాను . కుక్కర్ శబ్దానికి 
పారి పోయే వాడు కాస్తా  అన్నం తినసాగేడు . దానితో  జరిగిన  నష్టం మరిచి పోయాను . ఇలా కొన్నాళ్ళు 
జరిగింది . ఆమెకి  తెలుగన్నా రావాలి ,నాకు హిందీ అన్నా  రావాలి అని పట్టుదలగా  వున్నాను . [ నాకు 
హిందీ యే వచ్చింది ]. 
                               

                 ఒకరోజు  మేము  ఫాన్సీ షాప్ కి వెళ్ళాలని  నిర్ణ ఇంచు కున్నాము . మా స్నేహం గురించి 
అందరికి తెలిసి పోయింది . అపార్ధం చేసు కోకండి ,మేము సైగలతో  మాట్లాడు కుంటా మని . పిల్లలిని 
తీసుకుని  వెళ్ళాము  వాళ్ళని దించి ,గాజులవీ  చూస్తున్నాము ,మా ఖర్మ కొద్దీ ఆ  షాప్ అతను తెలుగు 
కాదు ,మార్వాడి నో ,మహారాష్ట్ర అతనో  ఆ భాషే  వేరుగా  వుంది . పైగా ముసలతను , ఇక చాదస్తానికి 
ఏమి కొదవ ? ఇంతలో ఎందుకో అనుమానం వచ్చి ,కౌంటర్ మీదుగా కిందకి చూసాడు , పిల్లలిద్దరూ 
గోళ్ళ  రంగులు పెట్టె తో సహా దించు కుని కుర్చుని , వాడు మూతికి ,మా వాడు చాల తేలి వైన  వాడు 
సుమీ ,మూతికి కాదు వేళ్ళకి  పూసుకున్నాడు . భలే ముద్దు గా  వున్నాడు ,కానీ ఆ ముసలతనికి 
కోపం వచ్చేసింది ,ఆవేశం గా  ఊగి పోతూ అటు తలుపు తెరచుకుని వచ్చేసాడు . నేను ఎందుకన్నా 
మంచిదని  మావాణ్ణి ఎత్తు కున్నా ,జెస్సి కూడా పో ళ్  మన్  నిఎత్తుకున్నది ,మావాడు వాణ్ణి అలాగే 
పిలుస్తాడు మరి . ముసలతను ఏదో తిట్టాడు ,చాలదన్నట్లు  మా చేతిలో రంగులు కలిసి పొఇన 
గోళ్ళ రంగులు  మా చేతిలో పడేసి నట్లు పెట్టాడు . డెబ్బై రూపాయలు తీసుకున్నాడు . నాకు  చాల 
కోపం  వచ్చింది . అలాంటప్పుడే జేజమ్మ వచ్చి వాల్తుంది ,ఆమె ఎవరను కుంటున్నారా  మన 
అరుందతి అమ్మ , నువ్వు నన్నేమి చెయ్యలేవురా  అని అరవాలని అన్పించింది , నా మొహాన 
ఎర్రని వెలుగు పడింది .  'ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో  కొమ్ములు తిరిగిన  కుమార్ గారి అమ్మాయిని 
నన్నిలా అన్నావని  మా ఇద్దరన్నలతో చెప్పానంటే , నిన్ను జీప్ లో ఎక్కించు కుని ఊరవతలి కి 
తీసు కెళ్ళి తుంగలో తొక్కేస్తారు ' . అని అరిచేను . జెస్సి  బలవంతంగా తీసుకోచ్చేసింది . నాకు 
ఎంత కోపం వచ్చిందంటే  వెంటనే ఈ ఊర్లో నించి  వెళ్లి పోవాలను కున్నా ,కానీ మా అమ్మ కు 
కారణం చెబితే ,'ఆ  చెరువు  మీద అలిగి ----కడుక్కోడం మానేసే  డం టా ' అంటుంది . చంద్ర కి 
చెప్పి చూద్దాము అనుకున్నాను . చెపితే ముందు  ముసి ముసి గా  నవ్వు కుని  ఏమన్నారో 
తెలుసా  మీరు  నవ్వ కూడదు మరి , 'మీ ఆడవా ళ్ళు  షాప్ కి వెళ్తే  వంటి మీద బట్టలే  చుస్కోరు 
పిల్లలిని  ఏమి చుస్కుంటారు ? అన్నారు . అకటా కటకటా  ఎంతటి అవమనమూ .......... 

No comments:

Post a Comment