Total Pageviews

Wednesday, September 10, 2014

అడవిలో అందాలు .. 2

(మా నాన్న గారు కుమార్ .)

ఒకసారి  ఎవరో వేటకు [హంటింగ్ ] వచ్చి  పులిని  చంపేసారు . అది పులి  అని వాళ్ళకు  తెలీదు  వేరే ఏదో జంతువని  షూట్  చేసారు , దాని అరుపులకు  భయపడి  పారి పోయారు ,నగరం లో పోలిస్  వ్యవస్థ  లాంటిదే  అడవిలో ఫారెస్ట్
వుద్యోగం ,పులిని టౌన్  కి తీసుకు వెళ్తూ , నాకు చూపిద్దామని  లారి లో ఇంటికి  తీసుకు వచ్చారు . చాల పెద్దగా
దాదాపు  లారి వెనుక  భాగమంతా వుంది . నిర్జీవంగా పడి  వున్నా  దాని రాజసానికి  తిరుగు లేదు . అలా చుసిన
భయమేసిందంటే , సజీవంగా  చుస్తే  వుంటది మరీ ...  నేను చూసేక  లారి టౌన్ కి వెళ్ళింది ,అక్కడ చర్మం ,గోళ్ళు ,
వేరు చేయించి ,లక్కీ బోన్  అని వుంటుంది  దాన్ని  ముఖ్యమైన  వాళ్ళకి  ఇస్తారు . పులిచమురు  ఐతే బాటిల్స్  లో
నింపి  కీళ్ళ నొప్పులు  వున్నా వాళ్ళకి  ఇస్తారు . నొప్పులకి  మంచి మందట  ఆ చమురు .


ఇంటి  ముందంతా చెట్లు  ఉండేవి ,అందులో ఒకటి  కమలా ఫలమేమో  అన్నట్లుగా  వుండేది  అది '' ముషి ణి ''
చెట్టు  ఆపండ్లు ఆరెంజ్  రంగులో  చాల బాగుండేవి ,కాని తింటే  చనిపోతారట ,రోజు కొన్నైనా  రాలి పడేవి ముందే
చేప్పడం  వల్ల అవి ముట్టుకునే వాళ్ళం కాదు . ఇంకా కుంకుడు ,శీకాయ ,చింత , చాల  రకాలుచెట్లు   వాటి నించి
వచ్చే  గాలి  ఎంతో మంచిదట  వాటి మీంచి  వచ్చే ' చేదు ' వాసన కూడా  గుండె నిండా పీల్చు కోవాలని పించేది .
పట్న  వాసంలో  టన్ను ల కొద్ది  దుమ్ము పీల్చే  మనకు  ,ఔ షదాల  వాసనేమి నచ్చుతుంది  అంటారా ....

కొంతమంది  గుంపుగా బయలు దేరి రబ్బరు చెట్లు  వుంటాయి  వాటికీ గీత [గాట్లు ]పెట్టుకుంటూ  వెళ్తారు .
నంబర్లు  కూడా వేస్తారు  చెట్టుకి . నాలుగు రోజులాగి  ఈసారి మళ్లీ వెళ్తారు . నాటు పెట్టినచోట పాలలా జిగురు
వస్తుంది ,అది ఎండి పోయి  గట్టిగా అవుతుంది . దాన్ని సేకరించి తీసుకు వచ్చి గిరిజన్  కార్పో రేషన్ కేజీ ఇంతని
ధర వుంటుంది  అక్కడ అమ్ముతారు . ఇక వారాంతపు  మేళ ,అంటే సంత  జరుగుతుంది . అదింకా బాగుంటుంది .
రంగు రంగుల  చీరెలు  కొత్త విధం గా  కట్టుకుని ,మనము  ఎప్పుడూ చూసి కూడా ఉండము  అలంటి  విధి ,
విధాలైన పూలల్లు కుని ,కొప్పున పెట్టుకుని ,రంగు రంగుల పూసల పేరులు  మేడలో వేసుకుని ,గిరిజన స్త్రీలు
అందంగా ముస్తాబయ్యి ,వారికీ తోచినవి ,పండించినవి ,అందుబాటులో  వున్నవి, తీసుకొచ్చి  అమ్మకానికి
పెడతారు . కూడా మంచి నీళ్ళు తెచ్చు కుంటారు . ఎలాగంటే ,ఆనప కాయ  బాగా ముదిరినది  తీసుకుని ,
ఎండ పెట్టి లోపల శుబ్రం చేసి ,నీరు నింపి ,తాడు తో కట్టి  వెంట తెచ్చు కుంటారు . అవి మన వాటర్ బాటిల్స్
కన్నా  అందం గా ,వంపుగా  వుంటాయి . దళారీల బాధ  వాళ్ళకి ఎక్కువే , వాళ్ళు ఏదన్నా  వస్తువు యాభై
అంటే ,దళారీలు  పది  తీసెయ్యి  అని బేరం  ఆడుతారు . గిరిజనులు 'నానియ్యాను ' అంటారు ,వీళ్లేమో  ఇదు
తీసెయ్ ,అంటారు ,వాళ్ళు సరే అంటే  చిల్లర నోట్లు  లెక్క పెట్టి ,పది తగ్గించి  ఇచ్చేస్తారు . వాళ్ళకి  అంతగా లెక్క
తెలీదు కనుక తీసు కుంటారు . ఒకవేళ వాళ్ళు తిరగేసి అడిగినా ,ఒక్కోనోటు వెనకకి  ముందుకి లెక్క పెట్టి
తమాషా  చేసి  వాళ్ళని ఒప్పించి ఇచ్చేస్తారట . మా రెండో అన్నయ్య ఐతే  బాగా చెప్తాడు , సంతను  మన
కళ్ళముందు  ఆవిష్కరిస్తాడు , భాషతోను ,యాసతోనూ .  వాళ్ళు ఈడబ్బు తీసుకుని ,వారికీ దొరకనివి
నూనె ,ఉప్పు  కారం  లాంటివి కొనుక్కుని ,ఇళ్ళకు వెళ్తారు . వాళ్ళు అమ్మే వాటిల్లో , తేగలు ,బుర్ర గుంజూ ,
నాటు కోళ్ళు ,పిట్టలు [మాంసం కోసం] నేరేడు ,, రేగు ..  సీతా ఫలాలు .  ఎక్కువగా  డోర్ మేట్స్  కోసం
వాడే పీచు , వంటకి ఉపయోగించే కట్టెల మోపులు ఇవే వుంటాయి .  బేరంలో  మాత్రం  బాగా  మోసపోతారు .


(మా తాతగారు సూర్యనారాయణ . అయన అటవీ శాకలోనే ఉన్నత ఉద్యొగo  )

 పనస  పండు  ఏమి చేస్తారో  తెలుసా ,ఏటికి  తీస్కు వెల్లి ,పారే  నీళ్ళలో  వేసి కాళ్ళతో మెత్తగా తొక్కేస్తారు .
తొనలన్ని వెళ్ళిపోయి ,గింజలు మాత్రం మిగులు తాయి . అవి మాత్రమే తీసుకుని  వండు కుంటారు .
కొండ మామిడి  పళ్ళు ఎంత రుచో .. వాళ్ళు పళ్ళు తిని  టెంకలు  సేకరించి ఉంచు కుంటారు . వాటితో
పులుసు చేసుకుంటారు . జీడి  ఉన్నప్పుడైతే  జీడి  తో జావ కాచు కుని తాగుతారు . అది ఆరోగ్యానికి
అంత మంచిది కాదు ,అదివాళ్ళకి తెలీక జబ్బుపడతారు . పట్టు పురుగుల పరిశ్రమ  వుండేది ,
 [సిరికల్చర్ ] పట్టు పురుగులను గూళ్ళ తో సేకరించి ,మరుగుతున్న  నీళ్ళలో వేస్తారు . అవి జిగురు
లాంటి పదార్ధాన్ని  స్రవిస్తాయి . దాన్నిదారం లా చుట్టుకుంటూ వెళ్తారు , అవేపట్టు దారాలు  ,వాటికే
రంగులవి  అద్ది  పట్టుచీరెలు  నేస్తారు . వాటిషేల్స్ తో దండలు చేసి ,ఇళ్ళలో ఫోటో లకి  అలంకరించడానికి
అమ్ముతారు  చాల బాగుంటాయి . ఎన్ని పట్టు పురుగులు చంపితే  అంత  పట్టు దారం . అడవి లో
రోడ్  వుంటుంది  కాని  విద్యుత్ లేక  లైట్స్  వుండవు . బండి కండి షన్ లో వుంటే  సరే ,మద్యలో
లైట్స్  లేక పోయినా చాల ఇబ్బంది . ఒకసారి  బుల్లెట్ కి  అడ్డం గా  రాత్రి పూట ,పదునైన  కొమ్ములతో
అడవి దున్న  నిలబడి  వుందట ,లైటు పడి దాని కళ్ళు  టార్చ్ లా మెరుస్తున్నయిట ,భయం  తో
ఆగి పోతుందో ,లేక  నాన్నగారే  ఆపెసారో  తెలియదట ,ఇంజన్ ఆగి పోతుంది . పులి వచ్చినా  అంతే
లైటు  ఆపేయాలి . శబ్దానికి  రెచ్చి పోతుంద ని  ఆపేసి కదల కుండా  వుండి పోతారు . అది వెళ్లి పోతుంది .
ఒకసారి  ఎలుగు బంటి ఒకతన్ని గాయ పరచింది , కూడా వున్న వ్యక్తీ అగ్గిపుల్ల వెలిగించి  చూపిస్తే
భయం తో పారి పోయిందట , వళ్ళంతా  వెంట్రుకలే కదా  ,నిప్పు చుస్తే  వళ్ళు కాలి పోతుందని దాని
భయం . రెండు  పిల్లలిని  పెట్టి పులి చని పొతే ,గార్డు కి దొరికాయి  తీసుకు వచ్చి ఫై ఆఫీసర్ కి ఇచ్చాడు .
అయన  చైన్ వేసి ఇంట్లో తిప్పెవారట ,ముద్దుగా కుక్క పిల్లలిని పెంచి నట్లు  పెంచారు ,అయన కూడా
వచ్చి ఎక్కడ కూర్చుంటే  అక్కడే కుర్చునేవట . పెద్దవయ్యే కొద్ది అందరూ భయ పడుతుంటే  ''జూ ''
కి ఇచ్చే సారని  చెప్తారు . 

మేము  కూడా కొన్ని  జంతువులు పెంచాము ,వాటి గురించి ,మా ప్రయాణం లో
చుసిన పులి గురించి తర్వాత ఎప్పుడన్నా  చెప్తాను . 

6 comments:

  1. తనూజ అంజలి గారూ,మీ కబుర్లతో మమ్మల్ని అడవి లోకి పిక్నిక్ కి తీసుకు వెళ్ళారు .మంచి అనుభూతి .ఇంకా గిరిజనుల జీవితాల గురించి కూడా ఎన్నో విషయాలు చక్క గా వివరించారు ధన్యవాదాలు

    ReplyDelete
  2. మీ ఇద్దరికీ ధన్యవాదాలు , మీ పేర్లు తెలియ పరచలేదు ........... ?

    ReplyDelete
    Replies
    1. బావుందండీ ఈ పోస్టు కూడా. చదివిన వారందరికీ వనవిహారం చేసిన అనుభూతి ,అదీ ఉచితంగా .చక్కగా వ్రాసారు .రెండో ఫోటోలో మీ తాతయ్య గారితో పాటుగా ఉన్న 'రేలంగి' గారి గురించి ప్రస్తావించలేదేమిటండీ?

      Delete
  3. ఆ ఫోటో లో ఇంకా బి ఎ సుబ్బారావు గారు డైరెక్టర్ ,రామారావు గారు ,
    ప్రముఖులే వున్నారు ,ఎవరెవరో నాకు అవగాహన లేదు ,తాత గార్కి
    సినీ ప్రముఖులతో దగ్గరి సంబంధాలు ఉండేవి . ఎక్కువ చెన్నై లో
    గడిపే వారు .

    ReplyDelete
  4. స్పందించండి

    ReplyDelete