అలా సరదాగా బయటికి వెళ్లి నపుడు , గుడి లోనో ,మాల్ లోనో , సినిమా హల్లోనో ,పసి పిల్లలని ఎత్తుకున్న
తల్లి తండ్రులను చుస్తే భయమేస్తుంది . పిల్లల పువ్వు లాంటి బుగ్గలిని తడిమి నపుడో , వాళ్ళ గుప్పిటని చేత్తో
పట్టుకున్నపుడో ,అన్పిస్తుంది వీళ్ళ భవిష్యత్ ఏమిటని ..... ముందు పక్కింటి వాళ్ళను కూడా వరస పెట్టి
అత్తయ్య గారానో ,వదిన గారనొ పిలిచేవాళ్ళం . మరి ఇప్పుడో ,ఐన వాళ్ళను కుడా ఆదరించ లేని బిజీ లో
వున్నాము . నా అన్నవాళ్లు కూడా దూరమైన పరిస్తితి . ఎవరి నైనా ఐదు వేలు అప్పు అడిగమంటే అంతే
ఆరోజు తో ఆస్నేహమో ,చుట్టరికమో అంతటి తో సరి . ఆస్తులు పంచుకునే చోట తోడ పుట్టిన వాళ్ళు కూడా
దూరం అవ్వాల్సిందే . అపార్ట్ మెంట్స్ వచ్చాక పక్కవాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు . ఒక కనుబొమ
ఎత్తి వింత జంతువును చూస్తున్నట్లు చూసుకుంటూ వెళ్లి పోతాము . మన తరానికే ఇలా వుంది . మరి
ముందు ముందు ? డాలర్లు ,రూపాయలు ,హ్యాండ్ రైడ్ పోన్ లు ,ట్యాబ్ లు , లాప్ టాప్ లు, గటేడ్ కమ్యునిటీ లు
విల్లాలు ,లగ్జరీ కార్ లు ,ఇవి మన సంభాషణ లోకి రాకుండా ఒక్కరోజు మొత్తం మనం మాట్లాడు కోగలమా ,
మనమే సజీవ మైనవి వదిలేసి ,నిర్జీవ మైన యంత్రాలతో మమేకం అవుతున్నాము . మరి రాబోయే తరాలు
ఎంత ప్రమాదం లో వున్నాయో చుడండి . ఖరీదైన , పేరుమోసిన ,కాలేజ్ లో చదువు 'కొంటేనే ' చదువు .
విమానం లో వెళ్లి విదేశాల్లో డాలర్లు సంపాదిస్తేనే మనిషి ,ఇక్కడ ఉన్న వాళ్ళంతా వట్టి చాతకాని వాళ్ళు .
రూపాయలు ఎందుకు పనికి వస్తాయి ?డాలర్లు అయితేనే గౌరవం ? .
ఇంత చెప్తున్నానా ,లోపలెక్కడో నాపిల్లలు అమెరికాలో సెటిలైతే
బాగుండునని వుంది . ఎంతైనా నేనుకూడా '' ఇండియన్ విమెన్ ''కదా , ఎం కాదా .........
ఇంత చెప్తున్నానా ,లోపలెక్కడో నాపిల్లలు అమెరికాలో సెటిలైతే
బాగుండునని వుంది . ఎంతైనా నేనుకూడా '' ఇండియన్ విమెన్ ''కదా , ఎం కాదా .........
No comments:
Post a Comment