సెలవులు ,పండుగరోజులు ,అందరూ ఆటవిడుపు గా ,ఆనందం గా వుండి వుంటారు కదా ,అలా సరదా గా
'' వర్గల్ సరస్వతి ''
'' రత్నాలయం ''
కుటుంబం తో బయటకు వెళ్ళాలని పిస్తోందా , అబ్బా ఎవరు డ్రై వ్ చేస్తారు అనుకుంటున్నారా ,అందుకే
ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేసే చోటు ,అది కూడా పుణ్యం , పురుషార్దం కలసి వచ్చే లాగ దగ్గరి లోని
ఒక గుడికి , ఈపండుగకి అనుసందానం గా వుంటుంది .
'' వర్గల్ సరస్వతి ''
''వర్గల్ సరస్వతి '' గుడికి . మీలో చాల మందికి తెలిసే వుంటుంది . తెలియని వారి కోసం ఒక్కసారి వివరాలు
చెప్పాలను కుంటున్నాను . సికింద్రాబాద్ జూబిలీ బస్ స్టాప్ నుండి 45,50 కిలో మీటర్ల లోపే వుంటుంది .
ఉదయాన్నే బయల్దేరితే ,గంటన్నర లోపే కరీం నగర్ రోడ్ లో వుంటుంది . వర్గల్ అన్న పేరు తో ప్రక్క
రోడ్ లోకి ఆహ్వానిస్తూ ఆర్చ్ కన్పిస్తుంది . మీకు దారి ఏ మాత్రం అనుమానం వున్నా అడుగుతూ
వెళ్ళారంటే చెబుతారు . పల్లెటూరు వాతావరణం వుంటుంది సిటీ కాదుగా చెప్తారు . గుడి బాగా ఎత్తులో
వుంటుంది ,మీ కూడా పెద్ద వాల్లున్నట్లయితే ,మెట్ల పక్కకే లిఫ్ట్ వుంటుంది . ఆలయ అభివృద్ధి నిమిత్తం
నామమాత్రం రుసుము అంటే 5రూపాయలు మాత్రమే వుంటుంది . అమ్మవారి కి అర్చన ,ఒకసారికి
ఆరు కుటుంబాల చొప్పున ,కూర్చుండ బెట్టి పూజ జరిపిస్తారు . చదువు కునే పిల్లలందరి పేర్లు చెప్పవచ్చు .
వీలయితే వారి పుస్తకాలూ పెన్ను [కొత్తవి ] తీసుకువెళ్ళండి . అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇస్తారు .
'' రత్నాలయం ''
మీకు\ఇష్టమైతే అక్కడే భోజనం ఏర్పాట్లు వుంటాయి . లేదంటే మీరు తిరుగు ప్రయాణం లో అలియాబాద్
క్రాస్ రోడ్స్ దగ్గర వున్నా వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఆగవచ్చు . అక్కడ కూడా స్వామి ఎత్తులోనే వుంటారు .
కాని మెట్లు ఎక్కగలిగేట ట్లు వుంటాయి . గుడి చాల ఆహ్లాదం గా మనసు కెంతో ప్రశాంతం గా వుంటుంది .
చుట్టూ చాల బాగా అభి వృద్ది చేసారు . మీరు వెంట తెచ్చు కున్న పలహారాలు వుంటే అక్కడే తినవచ్చు .
పిల్లలు ఆడుకోవడానికి ,అన్ని వసతులూ వున్నాయి . సాయంత్రం దాక అక్కడే ఉండి ,వీలయితే మరో
సారి దర్సనం చేసుకుని తిరుగు ప్రయాణం కండి . వచ్చే టప్పుడు ప్రసాదం ,అదేనండి అక్కడ వడ ,లడ్డు ,
దొరుకుతాయి తెచ్చు కోవడం మర్చి పోవద్దు . మీచిన్నరులకి అక్షరాబ్యాసం చెయ్యాలన్న కూడా
వర్గల్ చక్కని ఆలోచన .
No comments:
Post a Comment