Total Pageviews

Wednesday, September 17, 2014

అత్త గారూ .. కోడలూ ...

అత్తలంతా  శాడిస్ట్ లేనా ,ఒక్కసారి  ఆలోచించండి .
అత్తా  ఒకింటి కోడలే ,మరి కోడలిని  అత్తా నిలబడ
నివ్వదని ,మనమంతా  ఎందుకను కుంటాము .
ఆడ పిల్లకి  తండ్రి దగ్గరా ,మగపిల్లా డికి తల్లి
దగ్గరా , చేరిక  ఎక్కువ ,దాంతో ప్రతి  తల్లి
కొడుకు మీద ఎక్కువ ప్రేమ పెట్టుకుంటుంది .
కోడలు రాగానే  వాళ్ళిద్దరే  లోకంగా వుండడం
ఆమె కి  కొంచెం  ఇబ్బంది  కరమేమో , కానీ

చాల మంది  అత్తలు ,ఈడూ  జోడూ గా ,కళ్ళ ముందు  తిరుగుతున్న జంటని  చూసి ముచ్చట  పడే వాళ్ళే  ఎక్కువ . దానికి తోడూ అమ్మయిని  కాపురానికి  పంపే టపుడు ,'మీ అత్తగారితో  జాగర్త 'అంటారు అంటే
ఏమిటిఅర్ధం  ? ఆమె  జీవితాంతం  కలిసుండ బోయే  భర్త గురించి చెప్పరు ,అత్త గురించి హెచ్చరిస్తారు .
అప్పుడే ఆమెకి  కొంచెం  అవగాహన  వచ్చే స్తుంది . నేనిలాగే వుండాలి  అని నిర్ణ ఇంచు కుంటుంది .
దానికన్నా  అత్త తో కూడా  అమ్మ దగ్గర లాగే సర్దుకు పోతూ ,ఆమె ఏదన్నా  అన్నా మన అత్తే ,అనో
పెద్దావిడ  కదా అనో  ఊరుకుంటే ,ఐపోతుంది ఇంటికి పెద్దావిడ ,మనకన్నా  ఒక తరం ముందు  వచ్చినామే
రేపు  మంచి  చెడు ,చెప్పాల్సినామే  భవిష్యత్ లో  ఎన్నో విషయాల  గురించి ,కుటుంబ బాద్యతల గురించి ,
ఆవిడేగా  తెలియ పరచాలి . పుట్టింటి పద్దతులు ఇక్కడ నడవు ,ఇక్కడి పద్దతి ప్రకారమే చెయ్యాలి . అన్నీ
తన దగ్గరే తెలుసు కోవాలి . తన వాళ్ళని  వదులుకుని  ఎవరి చెయ్యి పట్టుకుని ఈ  ఇంటికి వచ్చిందో ,
ఆ  భర్తను  కన్నతల్లి . ఈఒక్క  విషయం చాలు ,ఆవిడను గౌరవించడానికి . ఇప్పుడంతా  చదువు కున్న
అమ్మాయిలు ,తెలివైన వాళ్ళు , కానీ  నిశ్చితార్దం  కాగానే ,కాబోయే భర్తను వాళ్ళు అడిగేదోక్కటే  ప్రశ్న ,
'మన ప్లాట్  ఎక్కడ తీసావు  సింగల్  బెడ్ రూమ్  ఐనా  ఓ కే ' . చిన్నపుడు అన్నం  తినిపిస్తూ అడిగో
బూచాడు అంటారు , పెద్ద అయ్యే కొద్ది  అదిగో అత్తబూచి  అనిమాత్రం చెప్పకండి .

      చాల ఇళ్ళలో ఇలా అంటుంటారు ,'ఇలాగే  పగలబడి  నవ్వుతావా ! అత్తారింట్లో  ఊరుకోరు '
'మామ గారి  ముందు  ఇలాంటి బట్టలతో  తిరిగితే  అత్తారింట్లో  నవ్వుతారు '    'ఇలాగే అక్కడ  కుడా
వండే వంటే  పళ్ళు ఊడ  కొడతది  అత్త ' .   దురదృష్ట  వశాత్తు  మన రాత్రిని  విదేశీయుల పగలుకు
తాకట్టు పెట్టాము . ప్రతి వాళ్ళు ఆడా  మగా ,తేడా  లేకుండా రాత్రిళ్ళు పని చేయక  తప్పదు . పగలు
 పడుకోక  తప్పని పరిస్తితి . అత్త  వారింట్లో కుదరదేమో , ఊళ్ళోనే విడిగా  వుంటే సరిపోతుంది ,వారానికి
ఒకసారి  వెళ్లి చూసి రావచ్చు  అనే భావం , అదే విషయం  వివరంగా మాట్లాడు కుంటే  పెద్దవాళ్ళ
''మనోభావాలు'' దెబ్బ తినకుండా  వుంటాయి .
నిజంగా  అత్తగారు  అంత  భయంకర మైనదా ....
         ఈమధ్యే పెళ్లి చేసుకున్న  ఆఫియా  వుద్యోగం మానేస్తాను  అంటే  అత్తగారు 'వద్దమ్మా రోజంతా
ఎదురెదురుగా  కుర్చుని  పోట్లాటలు తప్ప  ఏముంది  నాకు కూరలు తరిగిచ్చి వెళితే చాలు అందరికి
లంచ్ బాక్స్ లు సర్దేస్తాను ' అందట  ఆవిడకి  నిజంగా దణ్ణం పెట్టాలి .  ఇందు మతి  అత్తగారు 'ఇందు
అని  ముద్దుగా పిలుస్తుంది . ''పిల్లలిని  నేను చూసుకుంటాను మీ వూరు  వెళ్లి  చీరలు తెచ్చి నీ
బ్యుటి పార్లర్ లో  పెట్టిచూడు నాకు ఎందుకో  బాగా వె ల్తాయని  అనిపిస్తోంది''  . ఈమాత్రం అండగా
వుంటే చాలదూ , ఆడవాళ్లు కూడా చక్రాలు తిప్పేస్తారు . ఇద్దరి మధ్య  నలిగి పోవాల్సిన  ఆ కొడుకు
వత్తిడి తగ్గి ఎన్నో విజయాలు సాధిస్తాడు .

          ఇంత చెప్పి  మా అత్తగారి గురించి చెప్పక పొతే  ఎలా ? మా అత్తగారు  అమాయక మైన ,
ముక్కు సూటి మనిషి , ఏ దుంటే అది అనేస్తారు ,మనసులో ఏది దాచుకోలేరు . చాలామందికి
ఇబ్బంది ఐనా ,నాకలవాటు  కాబట్టి  కోపం ఎపుడు రాలేదు . అందులోను మేనరికం  కనుక
నాకు పిలుపుకే కాదు  మనసుకూ    తను  ''అత్తమ్మ ''.
   

No comments:

Post a Comment