చుట్టూ కొండలే సాయంత్రం అయ్యే సరికి అవికాస్తా తగలబడుతూ ఉండేవి . కొండల మీద ఉన్న చెట్లు అంటుకు
పోయి అంతా మంటలే ఎటు చూసినా గాలికి ఎగసి పడుతూ మంటలే ..... మనం వచ్చిన దారైనా వుందా తిరిగి
వెళ్లి పోవడానికి ? ఇక్కడి నించి ఎప్పుడు వెళ్లి పోతాము అని భయంగా వుండేది . నా చిన్న తనం లో అడవిలో
కాపురం , నాన్నగారి ఉద్యోగ రీత్యా అడవిలో వుండే వాళ్ళం . ఇంటి చుట్టూ మొక్కలే , గడ్డే ,చెట్లే చుట్టూ పచ్చని
అందాలే , ఐతే ఇవన్నీ వుంటే పాములు రావా ! అంటే వస్తాయి అందుకే ,నెమళ్ళు పెంచే వాళ్ళం . వాటిఅరుపు
లకి ,పాములు చుట్టు పక్కలకి రావు ,నెమళ్ళ ముక్కులు వాడిగా వుంటాయి ,వాటితో కళ్ళు పొడిచేస్తాయని
వాటి భయం . అందుకే రావు . కాలక్షేపాని కి కుందేళ్ళు పెంచే వాళ్ళం , వాటి కళ్ళు భలే మెరుస్తూ ,గుండ్రం గా
వుంటాయి . పావురాళ్ళ కోసం , కుందేళ్ళ కోసం తాయారు చేసే వాటి ఇల్లు [గూళ్ళు ] చాల బాగుంటాయి .
కుందేళ్ళ ను పట్టు కోవడం చాల కష్టమట , నిమిషాల్లో పొదల్లోకి వెళ్లి పోతాయి . కానీ వాటికీ స్వాభి మానం
ఎక్కువట ,ఎవరన్నా అవి వెళ్లి న పోదాచుట్టు గీత గీస్తే ,అవి ఆ గీత దాట వట ,అంతే కాదు ,వర్షం నీరు ,మంచు
బిందువులు ,ఆకుల మీద వున్నవే తప్పా , ఎవరు పోసిన నీరు తాగవు . ఈబల హీనత ఆధారంగా ,వేటగాళ్ళు
పొద చుట్టూ గీత గీసి వాటిని పట్టేసు కుంటారు . ఇక అత్తి పత్తి [టచ్ మీ నాట్ ] మొక్కలు ముట్టుకుంటే
ముడుచు కుంటూ ,ఎంతసేపు ఆడుకున్నా విసుగు రాదు . ఎర్రని మెత్తని ముఖ్ మల్ బట్టలాంటి మృదువైన
ఆరుద్ర పురుగులు ,అవి మెల్లగా నడుస్తూ అలికిడికి ముడుచుకు పోతాయి . అప్పుడవి ఎర్రని పగడా ల్లా
వుంటాయి . పేరు కె పురుగులు , వాటి అందం చుస్తే ఇంట్లో దాచి పెట్టు కోవాలని పిస్తుంది .
కాఫీ తోటలు ఉండేవి దగ్గరలో , వాటి తో కలిపి కో కో పంట కూడా ,కో కో కాయలు తింటుంటే ,తియ్యని వగరు
రుచి ,బావుంటాయి . వెదురు మొక్కలు , వాటిని నమ్ముకుని పాకే తమల పాకు తీగెలు ,మిరియం ,ఎంత
సేపు తిరిగి నా ,విసుగు రాని వైనం . కాఫీ తోట లోకి పులి వస్తుందని చెప్తారు . రాత్రి ఐతే నక్కల అరుపులు
ఇంకా ఏవో పేరు తెలీని జంతువుల అరుపుల తో , భయంగా వుండేది . తెల్లవారిండా చక్కని ఉషోదయం ,
నిలువెత్తు చెట్లని చీల్చు కుని వచ్చే వెలుగు రేఖలు , రాత్రి కానీ వర్షం పడితే మొక్కలు చెట్లు అన్నీ కడుక్కు
పోయి పచ్చగా మెరిసి పోతూ అద్బుత మైన అడవి , సమత్సరా నికి ఒక సారి అన్నా వెళ్లి మూడు రోజులు
వుంటే చాలు ,ఏడాదికి సరిపడా ఉత్సాహం తో రావచ్చు . కోతులు ఉండేవి కాని వాటి తో ఇబ్బంది లేదు .
పులి వస్తే ముందు వాటికే తెలుస్తుంది ,పులినించి వచ్చే చెడ్డ వాసన రెండు మైళ్ళు వస్తుందట ఆ
వాసనకి కోతులు పారి పోతాయని చెప్తారు అదే సూచన , ఒకసారి పోన్ వైర్లు బాగు చేస్తూ పోల్ మీద
వున్న వ్యక్తీ కింద వున్న పులిని చూసి ,బెదరి పోల్ మీదనే వుంది పోయాడు . ఫోన్ చేసి ఎవరికైనా
చేబ్దామన్నా , భయం తో పోన్ జారి పోయింది . పులి మాటు వేసి కూర్చుంది . తెల్ల వారే వరకు అలాగే
నరకం చూసాడు . వెలుగు వచ్చాక పులి వెళ్లి పోయింది . అప్పుడు పోల్ దిగి లారి పట్టుకుని ఊర్లోకి వచ్చాడు .
పారే సెలయేళ్ళు ,నీళ్ళు తాగడానికి వచ్చే జింకలు , యేరు దగ్గరకి స్నానానికి వెళ్ళే వాళ్ళం అదీ ఎవరన్నా
చుట్టాలు వచ్చినపుడే , కాని చాల జాగ్రత్తగా వుండాలి . పైన కొండల్లో ఎక్కడ వర్షం కురిసినా ఒక్కసారిగా
వాగులు పొంగి ఉవ్వెత్తున నీరు పెద్ద శబ్దం తో వచ్చి పడుతుంది . అడవిలో మంచి నీళ్ళు ఎలాగో తెలుసా
యేటి వడ్డున తడి ఇసుకలో ,చేతులతో తవ్వి కొంత సేపు వేచి చూడాలి . అప్పుడు కొంత నీరు వూరు తుంది .
చిన్న గిన్నె తీసుకుని ,ఆనీరు తీసి బిందె కు పలుచని వస్త్రం కట్టి అందులో వేసు కోవాలి . ఆనీటిని కాచి
చల్లార్చి తాగాలి . వాడు కోవడానికి తెచ్చే నీరు కూడా యేటి లోనిదే , కావిడి కట్టుకుని తెస్తారు . వర్షా
కాలం బురద మాయం గా ఎర్రని నీరు వచ్చేది . ఎలా వాడతాం ,అందుకే పెద్ద కడవలలో నీరు నింపి
అందులో ''పటిక ''దంచి వేస్తే ,కొంత సమయానికి నీరు పైకి ,మురికి కిందకి అవుతుంది . అప్పుడు
ఉపయోగించు కోవాలి . ఇంట్లోనే గార్డ్ ,వాచెర్స్ వుండే వారు ,ఏమి కావాలన్నా వండి పెట్టేవారు . ఎక్కడికి వెళ్ళాలన్నా జీప్ తెచ్చి తీసుకెళ్ళేవారు . నాన్న గారికి బుల్లెట్ వుండేది ,అడవి లో ఆ నిశ్శబ్దం లో అయన
వస్తుంటే రెండు మైళ్ళ దూరం నించి ఆ శబ్దం వినపడటం మొదలయ్యేది . వెన్నెల రాత్రుల్లో తప్పకుండా
బయట చెక్కలతో మంటవేసి ,చుట్టూ కూచునే వాళ్ళం ,ఒక గార్డ్ తందూరి బాగా చేసేవాడు . అప్పుడు
నాకు తెలీదు అది తందూరి అని . నాన్న అది చీల్చి అందరికి పెట్టే వారు .
ఇంకా వుంది ......
అయితే మీది బంగారు బాల్యం అన్నమాట .బావున్నాయండీ !మీ అనుభవాలు ,అనుభూతులు.
ReplyDeleteధన్యవాదాలు నాగరాణి గారూ , మీరు స్పందిచే తీరు బాగుంటుందండి ...
ReplyDeleteచదివితేనే ఇంత బావుంది. ఇంక స్వయంగా అనుభూతించిన మీరు ఎన్నెన్ని అడవి జ్ఞాపకాలని ఇంకా పచ్చగా దాచుకుని ఉంటారో.
ReplyDeleteనిజమే నండి ,చాల వున్నాయి వరసగా అవే పెట్టి బోర్ కొట్టిన్చేయాలని వుంది .
ReplyDeleteVery nice:):) mee blog,,, postlu chalaa chalaa bagunnaayi:):-)
ReplyDeleteనేను నిజమనేసుకుంటున్నా మరి తర్వాత మీ ఇష్టం
ReplyDelete