Total Pageviews

Tuesday, October 14, 2014

ఏ మిటో ......



ఏప్రిల్  నెలాఖరు  అన్ని చోట్లా ఎలక్షన్  హడావిడి , ఉదయాన్నే  పోలింగ్  బూత్  వెదుక్కుంటూ  వెళ్ళాము . ఒక
స్కూల్  దగ్గర  ఆగి ,లిస్టు  చెక్  చేయ డా నికి  తను వెళ్లారు . నేను తురాయి చెట్టు  ఆను కుని కొమ్మ తెంపి ఆకులు
వేరు చేస్తున్నా వస్తదీ ,    రాదూ , అంటూ ఎందుకంటారా  సినిమాలు  చుట్లేదేటి , పక్కనేవరో మాట్లాడు కుంటున్నారు , బావా కారు  తాళం ఇచ్ఛా వంటే  వీళ్ళని  ఇంటి దగ్గర  దింపి వచ్చే స్తాను , అదేంటి  బావా వచ్చేప్పుడు  ఎలావచ్చేరు ,బందిమీదే  వచ్చాము  ఇప్పుడు చాల మంది అయ్యముగా , సరే ఇక్కడ  నువ్వు
చూసుకో  నేనే దిమ్పేస్తాను , [అంతే కానీ తాళం ఇవ్వడనమాట ]ఎవరీ కృష్ణార్జునులు ? అని తలతిప్పి  చూసా ,
'మేడం  మీరా ' అంటూ  వచ్చేసాడు ,రూప భర్త  కదూ  అనుకుంటూ  బావున్నారా , అన్నాను ,రూప  ఏది
అన్నాను ,తను పొద్దునే  ఓటేసి  వెల్లిపొఇన్ది  అంటూ  నా చుట్టూ  చూస్తూ  సి  ఎమ్  గారు  ఏరి  అన్నాడు .
వాళ్ళు చంద్రని  అలాగే పిలుస్తారు  నేను నా చేతిలో వున్నా కొమ్మతో  అక్కడా ! అనిచుపించాను  ఆనందం గా ,
అటు వెళ్ళాడు . కొంచెం  లావయ్యాడు ,మొహం  మారింది  కాని బొజ్జ మాత్రం  రాలేదు . తర్టి ప్లస్ వుండి ,
బొజ్జ  రాని వాళ్ళకి ఒక గులాబీ ఇద్దామని  వుంటుంది . కాని  సమయానికి  చేతిలో వుండి చావదు . నాకు
మీసాలు  లేని  మగవాళ్ళు , పొట్టవున్న వాళ్ళు చిరాకు , మానాన్న కి మీసాల్లేవు ,చంద్రకి పొట్ట వుంది  అప్పుడే మా  వజ్రానికి  చెప్పే సాను , నాకా రెండు  నచ్చవని . ఇంతలో  చంద్ర తో పాటు  కలిసి  వచ్చాడు ,ఇంటికి పోన్
చేసి తెలుసు కున్నాడట ,నెట్లో చూసి చెప్పారు ఇదే స్కూల్  అని  లోపలే  వెళ్ళండి  అన్నాడు . లో గొంతు తో ,
మా  బాబాయ్ నించున్నారు తెలుసు గా  ఆయనకే వెయ్యాలి  అన్నాడు . సరే  అని  వచ్చేసాము .


నాకు ఇప్పుడు గుర్తు వస్తోంది ,ఇంతకూ ముందు కూడా  ఇదే స్కూల్ దగ్గర  అంతా కలిసాము . రేషన్  కార్డు
ఫొటోస్  తీస్తున్నారంటే ,ఫామిలీలు  ఫామిలీలు  వచ్చేసాం ,అప్పుడు అంతా ఒకే చోట ,అంటే  అపార్ట్ మెంట్
లో  వుండే వాళ్ళం  తర్వాతి రోజు ,మెట్లమీద  ఎదురు పడి ,మేడం మీ రేషన్  కార్డు పోటో లు  వచ్చాయా అని
అడిగాడు . నేను అక్కడికీ  మనసును హెచ్చరిస్తూనే వుంటాను ,ఎక్కువ మాట్లాడకు చిట్టీ ,నీకీ మద్య మోకాలి
నించి నాలికకు  డైరెక్ట్  కనెక్షన్  అయి పోయింది  అని ,అతను పోటో లు  వచ్చాయా,అని అడిగి నపుడు ,
అవును  అనో  కాదు  అనో  చెప్తే సరిపోయే దానికి ,'ఆవచ్చాయి  పోలిస్ స్టేషన్ లో ,రైల్వే స్టేషన్  లో దొంగల
పోటో ల్లా వున్నాయి ' అన్నాను . అంతే  అతను నవ్వి నవ్వీ  పొట్టపట్టుకుని  రయలింగ్ మీద పడుకుండి
పోయాడు . నవ్వు ఆపుకుని  సి  ఎమ్  గారు లేరా  అన్నాడు . '''ఆయనా  నేనే పగలెప్పుడూ  ఆయన్ని
చూడలేదు  ఇంక  మీరేమి  చూస్తారు ? అన్నాను .. [హే  మల్లెస్సేను ] అతనికి ఏ  అర్ధం స్పూరించి ఇన్డో
మరి  ఈసారి మెట్ల మీద  కూచుండి పోయాడు .చాలసెపు నవ్వాక  పొట్ట పట్టుకుని  హమ్మ  హయ్యో
అనుకుంటూ  వస్తాను  మేడం  అంటూ  వాళ్ళ ఫ్లాట్  వేపు  వెళ్లి పోయాడు . నేను మెట్లు  దిగుతూ
వెనక్కి చూసి  భుజాలెగరేసాను  ఏమిటో ......... అనుకుంటూ ........

ఎలాగూ  పొట్ట సంగతి వచ్చింది కనుక  ఒక చిన్న  జోక్ వుంది  చంద్ర పొట్టమీద  ఇప్పుడే చెప్పేస్తాను  కానీ
మీరు నాకో  మాటివ్వాలి ,  నేనుమీకు  చెప్పానని  మీరు తనతో చెప్పద్దని   చెప్తున్నా , చెప్పారని చెప్తే నేను
ఏమిచెప్పను  ఇంక , ఏమిటో  ఏమి అర్ధం కాలేదు కదూ ! వదిలేద్దాం  . అసలు విషయం ఏమిటంటే ఒకసారి
సమ్మర్లో వెనకింటి ఆమె  నన్ను పిలిచింది గోడదగ్గరకి ,గోడంటే పెద్ద గోడేమి  కాదు నాలుగు  అడుగులు
ఉంటుంది  అంతే ,'' జ్యూస్  చేశాను  ఫ్రిజ్ లో  పెడదామంటే  గాజు సీసాలు  లేవు రెండు వుంటే ఇవ్వండి ''
అంది  నాకేమి అర్ధం కాలేదు ,ఇప్పుడన్నీ పెట్ బాటిల్స్  కదా గాజువేక్కడివి , అన్నాను ,అందుకే మిమ్మల్ని
అడుగుతున్నాను  అంది . మాదగ్గర కూడా లేవండి  అన్నాను నన్ను అదోలా చూస్తూ వెళ్లి తలుపేసుకుంది .
 పెద్ద చప్పుడు కుడా వచ్చింది .

నేనేమి  పేపర్లు సీసాలు అమ్ముకుని ,కొనే వ్యాపారం చెయ్యట్లేదు  ఎందుకామే  నన్నుఅడిగింది అని ఆలోచిస్తున్నా
సాయంత్రం చంద్ర వచ్చాక  చెప్పాను  తనువెంటనే ''నేను మందు  తాగుతానని అనుకుని వుంటుంది ''.
అన్నారు  నాకు నవ్వాగలేదు ,నిజమే మీ పొట్ట చూసి  నమ్మకంగా నన్నే అడిగింది ,అన్నాను నవ్వుతూ

 . చిన్న చారు గిన్నంత  పొట్టకే  ఇంత రాద్దాంతం చెయ్యలా ,మరి పెద్ద బానల్లా వేసుకు తిరుగు తావుంటారు  వాళ్ళకేమి కామెంట్లురావా ,మీరేమి అనుకున్నా సరే ,నేను కొత్తలోనే ఒకటడి గాను  తనని  స్టైల్ గా  సిగెరట్ కాల్చి చూపించమనిఎంతషాకై పోయాడంటే నేను ఇప్పటికి మర్చి పోలేదు ,నాముచ్చట తీరా  లేదు .రాముడు
మంచి బాలుడు అన్నట్లు గా వుంటే ఎలా మరీ ...... ఏమిటో .........

No comments:

Post a Comment