Total Pageviews

Wednesday, October 15, 2014

అన్న చెల్లెలు ........



                  ఆ రెళ్ళ  అనురాగం 


నాకో స్నేహితురాలు  వుంది , అంటే తను  అన్నయ్య  క్లాస్ మేట్ , నాకన్నా  నాలుగేళ్ళు  పెద్దది . ఎలాగో మేము
మంచి  స్నేహితులమై ,  పెళ్లి ళ్ళు అయ్యాక  అదేనండి  ఒకొక్క  పెళ్ళే ,ఇద్దరికీ  వేరు వేరు గా  అని  చెప్పడం  నా 
ఉద్దేశ్యం . ఇక్కడికే  కాపురానికి  రావడంతో  తరచూ కలుస్తూ  వుండే వాళ్ళం . విధి  చిన్న  చూపు చూసి ,వాళ్ళు 
బెంగళూర్  దగ్గరలో ఒక కంపెనీ  లో  ఆయనికి ,అదేనండి  వాళ్లాయ నికి వుద్యోగం  రావడంతో  అక్కడికి  వెళ్లారు . 
ఎన్నోసార్లు  నన్ను  కుటుంబం తో  రమ్మన్నది కానీ  పుట్టింటికే  వెళ్ళే టైం లేని రోజులాయె  వెళ్ళడం  కుదరలేదు . 
నా  స్నేహితు రాలి  పేరు మాధురి . వాళ్ళది చాల పెద్ద కుటుంబం ,నలుగురు అన్నలు  ముగ్గురు  అక్కలు . అంతా 
తలా వొక చోట  సెటిలయ్యారు . అందులో ఒక అన్న  ఇక్కడే ఒక హీరో  దగ్గర  పి  ఎ  గా చేసి  అదే  హీరోతో సినిమా 
తీసి చేతులు  కాల్చు కుని  ఈమధ్యే  కోలుకుని ,మంచి  ఏరియా లో  ఇల్లు  కొనుక్కు న్నాడు . ఇంతకీ  విషయం 
ఏమిటంటే ,మాధురి  పుట్టింటికి  వెళ్ళాలంటే ,ఇక్కడికి  అంటే హైదరాబాద్  వచ్చి ,సాయంత్రం  ట్రైన్  ఎక్కి ఉదయం 
రాజమండ్రి లో దిగి  బస్ లో  వాళ్ళ వూరు వెళ్ళాలి . కాని  ఇక్కడ  ఉన్న  అన్న  రమ్మంటేనే  గా  వచ్చి  ఉండగలదు 
తన  భార్య ఒప్పుకోదని  అతను  ఆవిషయమే  మాట్లాడడు . ఇలా  ఊరుకి వెళ్తున్నాను  అని పోన్ చేస్తే  సరే నమ్మా 
అంటాడట ,ఎలావెల్తావు  వచ్చి  ఇక్కడ  రెండు రోజులుండి  వెళ్ళు  అన్న మాటేలేదు . తను  రెండు రోజులకి సరిపడా  టిఫిన్స్  చేసు కుని  పిల్లలితో  అవస్తపడుతూ  వెళ్తుంది . ఎందుకిలా  తనతో పాటు ఇరవై  ఏళ్ళు పెరిగిన చెల్లిని 
ఆమె తో  తనకున్న  అనుబంధాన్ని  మర్చి పోతారు . అసలు అవసరమేముంది మర్చి పోవడానికి ?మగవాళ్ళే 
కదా ,ఇంట్లో  ఆడవాళ్ళు ఎక్కువ  మాట్లాడితే , హద్దులు చూపించ లేరా , బుద్ది చెప్పలేరా , చెల్లెలు  ఏడాదికి  ఒక 
సారే వస్తుంది . అంతగా ఆర్దికంగా  హీన పరిస్తితి  ఐతే కాదు కదా !నాలుగురోజులు సర్దుకోమని  చెప్పలేరా . 
ఒకవేళ  వదిన ఆడ పడుచుకి కుదరక  పొఇన  ,వాళ్ళు  మాట మాట  అనుకున్నా ఇతను  చూస్తూ ఊరుకోవాలి . 
వాళ్ళు ఇద్దరూ  తనకి  ముఖ్య  మైన వ్యక్తులు , వాళ్ళే  సర్దు కుంటారు అనుకోవాలి . ఎవరిని నొప్పించక  తానొవ్వక 
పరిస్తితి  సర్దుబాటు చేసు కోవాలి . అంతే కాని ,పసుపు కుంకుమ  పెట్టి పంపాల్సిన  చెల్లిని  ఎప్పటికి  ఇంటికి 
రమ్మని పిలవక పోవడం మంచి పద్దతి కాదు . తను సంతోషం గా  పుట్టింటి నించి  వెళ్తే  ఆ  సంతోషం  రెట్టింపుగా 
 కుటుంబాన్ని పైకి తెస్తుంది . ఈ పద్దతులన్నీ  మన పెద్దవాళ్ళు ఊరికే  పెట్టలేదు , మన సంప్రదాయాన్ని గౌరవించి 
మంచి ఫలితాలని అందుకోవటం  మన చేతుల్లోనే  వుంది . ఇవన్ని అందరికి తెలిసిన విషయాలే ,సమయం లేదని 
మనం అన్ని విషయాలు ఆలోచించ లేక పోతున్నాము . అమ్మ లో' ' అ ' ని  నాన్న లోని 'న్న ' కలిపితేనే  ''అన్న ''
అని వస్తుంది . తల్లి తండ్రు ల  తర్వాత ఆడపిల్లను  చూసుకోవాల్సిన బాద్యత పూర్తిగా అన్నదమ్ముల దే , అదే 
విస్మరించి ,మనం పొందేది ఏమి వుండదు . పలాయన వాదం అన్ని విషయాల లో  పనికిరాదు . 

నా చిన్నతనం  లో మా వీధి లో  ఒక కుటుంబం వుండేది ,చెల్లెలు తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని 
వాళ్ళిద్దరి పరిచయానికి కారణం తనే  అని భావించి ,అంతగా ఆర్దిక స్తోమతు లేని అతనితో  తన చెల్లి కి ఇబ్బంది 
రాకుడదని తలచి  ఆ  అన్నయ్య  పెళ్లి చేసు కోకుండా  ఉండి పోయారు . నిజం .... మా కుటుంబ  స్నేహితుడే 
ఆయన , ఇప్పటికీ  పెళ్లి చేసు కోలేదు  అంతే కాదు , ఈమధ్యనే  మేన కోడలికి  పెళ్లి చేసాడు . జీవితాలు 
త్యాగం  చెయ్యక్కరలేదు . జీవితం లో  చిన్న భరోసా కల్పిస్తే చాలు . నీకు మేమున్నాము  అని ధైర్యం ఇవ్వ 
గలిగితే  ఆమె ఆనందానికి  అవధులే వుండవు . భర్త పిల్లలు ,సంసారం  ఎన్ని వున్నా , నావాళ్ళు  అనే 
భావమేవేరు .  నా అన్న  వాళ్ళ కోసం  ఆమె  ఎదురు చూస్తూనే  వుంటుంది  జీవితాంతం  .




      అరవై   ఏ ళ్ళ  అనుబంధం 

                ''  నాన్న ''  నాకెంతో ఇష్టమైన  ఆఖరి అత్త   ''దేవకీ  ''  
               
నాకు  ఆడపడుచు వుంటే ఎలా చుసుకునేదన్నో కాని ,తప్పకుండా బాగా చూసుకునేదాన్ని అన్పిస్తుంది . 
కాని వీళ్ళు  ఐదుగురు అన్నదమ్ములు  ఈయనే  ఆఖరి వారు . దీపావళి  తర్వాత  వచ్చే  పండుగ వుంది 
''భగిని హస్త  భోజనం '' ఆరోజు  సోదరులు ,చెల్లెలింటికి  వెళ్లి భొంచేస్తే చాల మంచిదట . యమధర్మ రాజు 
తన  సోదరి  యమున ఇంట్లో భోజనం చేసి  ఆమె కు  ఎన్నో వరలనిచ్చాడు  అని చెప్తారు . బలి చక్రవర్తి ,
తన సోదరిని  గౌరవించింది  కుడా ఈనాడే నట ,  అందుకే  కార్తిక  విదియకి అంత  ప్రాముఖ్యం ఉన్నదట . 
ఎవరైనా  ఒకే మాట పదిసార్లు చెబితే  అదే నిజమని పిస్తుంది , మన ఆలోచన, వివేకం , మనం కాపాడు
కోవడం ముఖ్యం . మీరు సుహాసిని  నటించిన '''సంసారం ఒకచదరంగం ''సినిమా చూసారా ,మంచి సినిమా ,
అందులో సుహాసిని ,శరత్ బాబుతో ''మగపుట్టుక పుట్టాక రెండు విషయాలికి  లెక్క చూడకుడదు ,ఒకటి
అక్కచెల్లెలికి  పెట్టే  పెట్టుబోతలు , తల్లి తండ్రులకి  పెట్టే  కూడు గుడ్డలు '' అంటుంది . ఎంత నిజముంది కదా .

                                         **********************************





5 comments:

  1. బావుందండీ పోస్టు .

    ReplyDelete
  2. ధన్యవాదాలు నాగరాణి గారూ .

    ReplyDelete
  3. నాలుగురోజులు సర్దుకోమని చెప్పలేరా .
    >>ఒకవేళ వదిన ఆడ పడుచుకి కుదరక పొఇన ,వాళ్ళు మాట మాట అనుకున్నా ఇతను చూస్తూ ఊరుకోవాలి .
    వాళ్ళు ఇద్దరూ తనకి ముఖ్య మైన వ్యక్తులు , వాళ్ళే సర్దు కుంటారు అనుకోవాలి . ఎవరిని నొప్పించక తానొవ్వక
    పరిస్తితి సర్దుబాటు చేసు కోవాలి .

    meerentha amayakulandi. okappudu meelaage anukunna kabatti, ilaa antunnaanu. Naa friend oka ammai tammudu ame kante mundu, tvaraga naa pelli chestara leka nene choosukona ani bedirinchi ( atanu choosukuntante aa kulam ammaye kanakkarledu ane bhayam tho, amma nanna aa abbai ki modata pelli chesesaaru - aunu arranged marriage ye ). Naa friend maradali tho - edo girl talk chestonte pelli mundu oka roju ame kavalane apartham vetukkuni, ippatiki aa akka tammudintiki vellakapoina, asalu aa tammudu jeevi amma nannala intiki vellakapoina, akka pelli vishayam pattinchukokapoina - chala years nunchi - mee akka aa roju nannu ala andi, nuvvu enduku ameni tittaledu, kottaledu, nuvvem magadivi ani ippatiki porutundi anta.

    pellam puttintiki pothe, aa tammudu anabade jeevi tana akka ni, parents ni rammannadu. Naa friend vellaledu anukondi. Ala unnai relations. Konni konni relations dooram ga untene andariki manchidi. If your friend went to her brothers place, she may feel even more hurt. If that annayya doesn't say a word to support his wife, then he'll face lot of music later. Atu chelli tanaki support cheyaledani badha padutundi. Iddari madhyalo atanu badha padaali. Andaru badha pade badulu, konni paristhitullo - dooram nunchi prema ga rendu mukkalu matladithe saripodaa ?

    Aada paduchu artha mogudu ani pelliki munde satruvu gaa choose samskriti nunchi vastunna kastaalu ivi. Adi unna illallo - entha dooramoooooooo adi antha cheruvuuu ani padukodame better. Meeku sarigga artham kaatledu ....

    ReplyDelete
  4. kosamerupu -
    naaku baaga telisina oka peddaavida ( eeme iddaru annalaki chelli - andulo oka anna assalu rammanadu, eppudu sanugutu untundi pellam tappa chellelu pattadu antu .... inko anna-vadinato manchi relations unnai , ee annayya intiki veltu untundi ) - tana kooturito antunna maatalu. ( eevidaki oka koduku kooda unnadu ).

    " Ee sambadham naaku baaga nachindi. Abbai ki talli ee madhyane poyindi anta. Kabatti atta gaari badha ledu. Inka abbai ki akkalu, chellellu leru - so aada paduchulu leru. Katnam kooda lakshe adugutunnaru. Ee rojullo laksha katnam ante kooli vallu kuda ekkuve ichukuntunnaru. Kabatti ventene ok anesei ani. " Aa ammai aa sambadham ok cheyaledu ee basis meeda - kani cheptunnanu, elaaa women spread hatred for other women.

    Tanaki oka koduku unnadu kadaa - mari kaboye kodalu side vallu matram, aadapaduchu, attagaru iddaru unna sambadham ani adi "chedu sambandham " ani anukoodadu. Attagaru undatam adrustam, aame devatha anukovali ! Adee Lekkha !

    Real life incidents nunche TV serials teestuntaaru anipistundi - ee women hating women drama serials. :-) Ee uttama naari TV serials choodaru mari, aavidaki TV serials ante chiraku. Idemitidi TV llo ila aada villians ni choopistaru - idem poye kaalam, aadallu antha chedda vallena ani badha padutu untaaru.

    ReplyDelete
  5. మధు గారూ ,వినేవాళ్ళకి చెప్పగలం ,పెరిగినవాతవరణం పరిస్తితులు కూడా ,ప్రభావం
    చూపిస్తాయి . అందరి మనస్తత్వం ఒకేలా వుండదు కదా !.

    ReplyDelete