Total Pageviews

Friday, July 4, 2014

పట్టు చీర

 సంత్సరం  కావస్తోంది ,ఈ బ్లాగ్  పెట్టి ,ఈ సందర్భం గా ,నాకునచ్చిన  పాత టపా  ఒకటి
మరొక్కసారి ... మీ పెదవుల పై  చిరునవ్వు  కోసమే ...........

అప్పుడు  మేము  అపార్ట్ మెంట్  లో  ఉండే వాళ్ళం , నాలుగేళ్ళ  క్రితం  అన్నమాట . క్రింది  ఫ్లోర్  లో అంటే ఫస్ట్ ఫ్లోర్  అన్నమాట  ఒక అంటి  ఉండేది .  అపార్ట్ మెంట్  అంటే ఎలా  ఉంటుందో తెలుసుగా  ఒకరి తో ఒకరికి  సంబంధం ఉండదు . కానీ అంటి తరచూ  నాకోసం వచ్చేది ,ఏదైనా సలహా  ఇచ్చే టప్పుడు  మా అత్త  లా  మంచి ,చెడ్డ మాట్లాడే  టప్పుడు  మా నానమ్మ లా  అన్పించేది . అందరూ  దూరంగా ఉండడం  తో ఆవిడకి  బాగా  దగ్గరయ్యాను . ఆమె కి ఉన్నబలహీనత  ఒక్కటే  ఇక్కడి  విషయం అక్కడ , అక్కడి విషయం ఇక్కడా  చెప్పడం . అదిచాలు కదా , కాని నేను  బలహీనతలు  లేని  మనుషులు  ఉంటారా అని ,సర్దుకు పోయేదాన్ని . నన్ను తరచూ టి వి లో వచ్చే ప్రోగ్రామ్స్ కి ఫోన్  చేయ్యమనేది , లేదా 'అమ్మలక్కలు ' అనే ప్రోగ్రాం కి చేసి వాళ్ళు వస్తారండి  మనం చెప్పే ముచ్చ ట్లు ,ప్రసారం  చేస్తారు అనేది ,నాకిష్టం ఉండదంటే అదోల చూసేది . ఒకరోజు  నారత కొద్ది ఒక లైవ్  చూసాను ,పేరేమో 'ముట్టు  కుంటే  ముతక చీర ' అనే ప్రోగ్రాం .  ల్యాండ్ లైన్ ఫోన్  దగ్గరగా  కూర్చున్నానేమో ,[అంటి మాటలు కూడా  పనిచేసి  ఉంటై ]ఫోన్ ట్రై  చేశాను . మొదట  రింగ్ ఐంది కానీ  ఎవరూ తీయ లేదు . నంబర్లు  మనకి ,చీరలు  బందు  వర్గానికి . అని తిట్టుకున్నాను ,మళ్లీ చేశాను ,ఎవరో ఫోన్ తీసారు , మీపేరు,  అడ్రెస్స్ ,వివరాలు ,చెప్పండి  అన్నాడు అన్ని  రాసు కున్నాడు . మీరిలా కాదు గట్టి  గా మాట్లాడాలి ,అని విసుక్కున్నాడు . 'అరె భయ్ ,ఒక్క ఫోన్ కాల్ కె అయిదారు  వేల రూపాయల  చీర  లిస్తుర్రు  జర ఓపిక తో  నుండాలే ' అని సమజ ఇంచు కొంటి . 'లైన్ లోనే ఉండండి ,వేరే కాల్ మాట్లాడు తోంది . అన్నాడు  అదికూడా విన్పిస్తోంది . 'ఆయ్ మీది [ఏకరింగ్ ]చాలా బాగుంటా  దండి , మాకు మీరంటే పేనవండి ఆయ్ ' అంది . లైన్ లో  ఉన్నవాడే మొ'  చీర ఊరికే ఇస్తోంది కదా  'అన్నాడు , అక్కడున్న మగ  గొంతు లన్నీ నవ్వాయి ,నేను పెట్టే ద్దాము  అనుకునే సరికి 'ఉన్నారా లైన్ లో  ,తర్వాత మీరే , అరే  మంచి చీర పోతోందండి ' అన్నాడు . పేరంటి అన్నాను 'చిన్నా 'అన్నాడు . అవతల కాలర్  చీర గెలుచు కుంది  చప్పట్ల ఆడియో  ప్లే చేసారు . మీరే మాట్లాడండి  గట్టిగా , అన్నాడు . 'హలో  మీపెరెంటి ' చెప్పాను , మీవారి పేరు?  చెప్పాను  [అదే నేను చేసిన తప్పు ] మీరు ఏం  చేస్తుంటారు ? సాదారణం గా ఈపాటికి భోంచేస్తుంటాను  ఈరోజు  లేటైంది ,ఆమె గలగల మని  నవ్వేసింది . మీ వారేమి చేస్తారు ?  [అచేప్పేస్తారు ] ఆఫీసు కెల్తారు . ఈసారి ఏడవలేక  నవ్వింది ,మీరు నాకన్నా పంచ్ లు వేస్తున్నారు అంది ,[నీకలా అర్ధం అయ్యిందా ]అనుకుని 'ఏదో మీ అభిమానం ' అన్నాను . ఆమె కి ఏమి  అర్ధం కాలేదు ,నిజానికి  నాకూ అర్ధం  కాలేదు . సర్లెండి చీర చూద్దాం మూడు ధరలు  చెప్తాను  ఒకటే రైటు  అదేమిటో చెప్పండి  అంది . చీర చూపించారు  బానే ఉంది  బాగోక పొతే మాత్రం ఏమి చేస్తాం  అప్పనంగా  వస్తోందికదా ,నేనొక ధర చెప్పాను ,ఆమె చప్పట్లు కొట్టి షాపింగ్ బాగా చేస్తారా అంది  నేను అవును ,కాదు  అన్నట్లు  తలకాయ ఆడించాను . మళ్ళి ఆమెకి కనపడదని గుర్తు వచ్చి వెకిలి నవ్వు నవ్వు తూ  అవునండి  అన్నాను .   ఇంతలో ఎవరో వచ్చారు  డోర్ తీసి చూద్దును కదా అంటి ,మీరేనా ఫోన్ లో  అంది  అవును  అన్నాను గర్వంగా  , ఆవిడ ఆయాస  పడుతూ , నాకుతెలుసు  వీళ్ళంతా నమ్మలేదు. అంది ఎవరూ  అంటూ అడుగు బయటకేసాను  , ప్లాట్స్ లో ఆడళ్ళంతా  గుమ్మాలలో నిలబడి ఉన్నారు . నేను గతుక్కు మన్నాను . ఆడని సినిమా  ఆడించ టానికి ఖాళీ దియేటర్ కి వెళ్ళిన 'ఒక్క ' సినిమా హిరోయిన్ లా అందరికి చేతులుపాను . ఇంతసేపు కలగని  సంతోషమేదో వాళ్ళ జెలస్ చూసాక కలిగింది . అంటి అంది  అందరికి చెప్పి బయటకి పిలిచాను ,ముందు ఎవరూ  నమ్మలేదు  అంది . ఇది నీ ఘనకార్యమా తల్లీ  అనుకున్నాను . రండి లోపలి కి టీ తగుదురు గాని  అని లోపలి కి  నడిచాను .  
      నాకా  నిముషం  తెలీదు ఇది  ఎక్కడికి పోయి  ఆగుతుందో ,మూడు రోజుల తర్వాత  ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది  అడ్రెస్స్ కన్ఫర్మ్  చేసుకున్నారు ,నాఖర్మ కొద్ది  ఫోన్  వచ్చినప్పుడు  అంటి అక్కడే ఉంది . చూసారా మీరు  నమ్మ లేదు  వాళ్ళే ఫోన్ చేసారు  అని లేచింది . పాపం ఇప్పుడీమే  మూడు ఫ్లోర్ లు ఎక్కి ,దిగి  విషయం ముప్పయ్  ఫ్లాట్స్ కి  చెప్పి రావాలి కదా  అనుకున్నా . ఇరవయ్ రోజులయ్  నా  చీర  రాలేదు  ఇరుగు పొరుగు  రావడం  'చీర వచ్చిందా చూద్దామని వచ్చాం ' అంటున్నారు . నాకు తల తిరగడం మొదలైంది . ఈయన తో  చెపితే 'తల్లి  నాబుర్ర తినకు  ఐదు వేలు  నేనిస్తాను ,చీర కొని అందరికి చూపించు ' అన్నారు . మరో సమస్య  ఆరోజు ప్రోగ్రాం  అందరు చూసేరు , అందులో అంటి ని  మాయ చెయ్యడం  నావల్ల కాదు . చీర మారిన  విషయం ఇట్టే  పట్టేస్తుంది . ఎలారా  దేవుడా  ఉన్నదానిని ,ఉండకుండా  టి వి  ఎందుకు  చూసితిన్ ,చూసితిని ఫో ,ఫోన్ ఎందుకు చేసితిని . చేసితిని  ఫో ,లైన్  ఎందుకు కలిసినది ,కలిసినది ఫో ,ధర  ఎందుకు చెప్పితిని  అని కడు  విచారము గా నుంటిని .  సరే  అని  అదే నంబర్ కి చేశాను . ఎవరో తీసారు ,పేరు కృష్ణ ట 'ఇదంతా చూసేది భార్గవి మేడం  ట నంబరిచ్చి ఆమె కి  చెయ్యమన్నాడు  చేశాను ,మళ్లీ మొత్తం వృత్తాంతం అంతా  చెప్పాక 'మీ  ఐ  డి  ఫ్రూఫ్స్ తీసుకొని ఆఫీస్ కి రండి  అంది  తప్పుతుందా ,బయటే వివరాల్ని రాసు కుని ,వేలిముద్రలు  తీసు కుని లోపలి పంపారు ,లోపల చాల సేపు కూర్చున్నా , ఎంకర్స్  కబుర్లుచేప్పు కుంటూ తిరుగు తున్నారు . ఒకతను వచ్చి బిల్ సు  వివరాలు తీసుకు వెళ్ళాడు  చీర తో వచ్చాడు . మూత  తీసి చుస్తే ,నాపేరు ఫోన్ నంబరు  ఉన్నాయి . మళ్లీ  ఎంట్రన్స్ దగ్గర  సంతకాలు  వేలి ముద్రలు అయ్యాక  బయటికి వస్తే వర్షం  అలాగే ఆటో పిల్చుకుని  ఇంటి కొచ్చే సరికి  బాల్కనీ లో అంటి నుంచుంది  నా చేతిలో పెట్టె చూడ గానే ఆమె కళ్ళు మెరిసాయి . ఎలాగో ఇంటిలోకి వచ్చి పడ్డాను . అంటి నా వెనకే  వచ్చి చీర చూసి వెళ్ళింది  , ఈవాన లో అన్నిఫ్లోర్స్ తిరగాలీవిడ . మరుసటి రోజు మా ఇంటికి చుట్టాలు  రావడం తో  రెండు రోజులు  ఆమె కి  రావడానికి కుదర లేదు  వాళ్ళిలా  వెళ్ళారో లేదో  వచ్చేసింది 'మీ పట్టు చీర ఇస్తారా  అందరూ  అడుగుతున్నారు  ఆరోజు వర్షమాని  అడగలేదు ఇప్పడు ఇస్తే అందరికి చూపించి  తెస్తాను అంది' నాకు  తిక్క రేగింది  ఈవిడ తీస్కెళ్ళి అందరికి చూపిస్తే ,నేనెలా  కట్టుకునేది ,కట్టుకున్నపుడల్లా  ఇదే  ఫలానా చీర అని  గుస, గుస  లాడితే  తల ఎక్కడ పెట్టుకోవాలి , 'నిన్న  వచ్చిన  మా  బందువులు  తీసు కెళ్ళారు  అందరికి చూపించ టానికి  అని చెప్పాను . ఆవిడ  మొహం  చూడాలి , ఆమె  అటు వెళ్ళ గానే  దొర్లి ,దొర్లి  నవ్వుకున్నాను , అంటే కాదు  ల్యాండ్ లైన్  ఫోన్  తీ ఇంచే సాను  మనసు కోతి  లాంటిది కదా ...........  

No comments:

Post a Comment