గోరింటాకు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు ? నాకు చాల ఇష్టం , ఆకు దొరికితే రుబ్బి పెట్టు కుంటే బాగుంటుంది
దొరకనపుడు పౌడర్ తప్పదు , కాళ్ళకి , చేతులకి , పుసేస్తాను , ఎంత సేపైనా కదల కుండ కూచుంటాను . నా ఓపిక చూసి మా వాళ్ళు నవ్వుతారు , చిన్నప్పుడు ఎప్పుడూ చేతులకేన మూతికి ఎందుకు పెట్టు కోకూడదు అనిపించింది , ఎవరూ చూడ కుండా మూతికి కూడా అంటించుకుని కూర్చున్నా , నాకప్పుడు శ్రీదేవి అంటే ఇష్టం , ఆమె లాగే నా మూతి కూడా ఎర్రగా అవుతుందని మురిసి పోయాను ,గంట గడిచాక కడిగి చుస్తే
ఆంజనేయ సామి లా ఉన్నాను , ఎవరికీ చూపించ లేను , దాచలేను , మా నానమ్మ చూసి తిట్టింది . నోట్లోకి పొతే చచ్చి పోతారని చెప్పింది , తర్వాత ఎప్పుడు అపిచ్చి పని చెయ్యలేదనుకోండి . కానీ ఇక్కడ మాత్రం అంటే
తెలం గా ణ లో కొంచెం గోరింటాకు ముద్ద గా చేసి నోట్లోకి తీసు కుంటే ,పుట్టబోయే బిడ్డ పెదవులు ఎర్రగా ఉంటాయని నమ్ముతారు , నాకైతే మాత్రం మా నానమ్మ పెట్టిన భయం అలాగే ఉంది .
గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడట , అసలు పండని వారికీ కూడా మంచి మొగుడు వచ్చాడు , నాకు తెలిసినవారికి . మంచి మొగుడంటే చెప్పిన మాట వినేవాడు , అంతే కదా, మాటవినడం అంటే బానిస ల్లా ఉండడం కాదు . ఒకరితో ఒకరు అవగాహన తో సర్దుకు పోవడం . నేను చెప్పిందే వేదం , నా కుందేలు కి మూడే కాళ్ళు , అంటే రెండో వాళ్ళు ఎంతసేపని ఓపిక పడతారు , ఒక రోజు వాళ్ళు విసిగి పోతారు , దాన్నే తెగే దాక లాగడం అంటారు . చిన్న సర్దుబాటు లేక ఓపిక లేక ,విడి పోతున్న వాళ్ళు ఎంతమందో , ఇద్దరు సంపాదించేది మరింత సౌకర్య్యంగా బ్రతకడానికే కానీ ,ఇదినాది ,అది నీది , అని
వాటాలు వేసుకోడానికి కాదు . సంపదిస్తున్నామని విరగ బడితే మిగిలేది ఒంటరి తనమే . అమ్మ , నాన్న ఎంత వరకు సపోర్ట్ చేస్తారు ? అన్న ,తమ్ముడు వాళ్ళ కుటుంబం వాళ్ళకి వుంటుంది . పెళ్ళికి అర్ధమే చివరి వరకూ కలిసి ఉండడం . సమస్య లు నా అన్న వాళ్లతో కూడా వస్తాయి . చిన్నప్పటి నుంచి ఎంత మంది తో గొడవ పడి వుంటాము , కలిసి పోలేదా ఇది అంతే , కాదు ,కాదు అంత కన్నా ఎక్కువ . జీవితం తో ముడి పడిన
విషయం , పిల్లలు ఉంటె ఇంకా నరకం , మనకి కాదు వాళ్ళకి తోటి పిల్లలికి పేరెంట్స్ ఇద్దరు మనకి ఒక్కరే
ఎందు వల్ల అని నలిగి పోతారు అప్పుడు వాళ్ళ మానసిక పరిస్టితి ఎలా మారితే ఎవరి బాద్యత, చేతులారా
చేసుకుని విచారించే కంటే , ముందే జాగ్రత్త పడితే అదే సర్దు బాటు చేసుకుంటే మంచిదని చెప్తున్నా.
ఆకుపచ్చని గోరింట చేతులకి పెట్టుకుంటే ఎర్రని రంగు పండేక వస్తుంది , తమలపాకులో సున్నమేసి వక్క
కలిపి తింటే నాలుక పండు తుంది . రెండు విధాలయిన కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు కలిసి చేసే సంసారం , దాంపత్య మౌతుంది ,పిల్లలతో నందన వనమౌతుంది , విపరీత పోకడలు పోకుండా జీవితాన్ని పండించు కొండి . మంచి భార్య గా, తల్లిగా , ఉండాలని పి జి లు చేసిన వాళ్ళు కూడా గృహిణి గా ఉండి పోయిన వాళ్ళు వున్నారు , వాళ్ళందరికీ నిజం గా చేతు లెత్తి నమస్కరించాలి , వాళ్ళ సంస్కారం తో ఒక మంచి కుటుంబం , ఈ సమాజం లో భాగం అవుతున్నందుకు .

No comments:
Post a Comment