Total Pageviews

Friday, July 25, 2014

ముగ్గురు అమ్మాయిలు

కాలనీ లో  కొంత  మంది  ఆడవాళ్ళం  కలిసి  సాయంత్రం  వాకింగ్ చేస్తూ  ఉంటాము . అక్కడ అన్ని విషయాలూ   చర్చ కు  వస్తుంటాయి , నచ్చితే  కల్పించు  కుంటాను ,లేకపోతె  లేదు . ఒకరోజు  మంజుల   వాళ్ళ  అమ్మాయి
రేడియో  జాకీ సెలక్షన్స్ కి  వెళ్తుందని  చెప్పింది . నాకు  రెండు రోజులు  ఏదో పని  వుండి  వెళ్ళలేదు . తర్వాత  కలిసి  అడిగాను ,ఏమైందని  ఆమె  చెప్పింది  విని  విస్తు  పోయాను . అదేమిటో  తెలుసా  వాళ్ళు  నెల్లూరు  నుండి  వచ్చి
ఇక్కడ  సేటిలైన  సాంప్రదాయ  కుటుంబం . అమ్మాయి  కూడా  చాల బాగుంటుంది ,కడిగిన  ముత్యం లా ఉంటుంది
 స్టార్  హోటల్లో  ఉదయం  ఎనిమిదిన్నర కె  రమ్మన్నారట . మంజుల , వాళ్ళాయన ,అమ్మాయిని  తీసుకుని  వెళ్లారు .  కొంతసేపటికి  ఒక హాల్ లోనికి  వచ్చిన  వాళ్ళందరిని  పిలుచుకేల్లారు , పేరంట్స్ చాల తక్కువ ట , దాంతో  వీళ్ళు బయటే  కూర్చున్నారు . ఒక గంట తర్వాత  అమ్మాయి  వచ్చి  వెళ్దాం  అందిట . కార్లో  వాళ్ళ  నాన్న
ఏమి  అడిగారమ్మా , వాయిస్  టెస్ట్  ఎమన్నా చేసారా  అని అడిగితె ,ఏమి లేదు నాన్నా  అందిట . వాళ్ళమ్మ  తరచి  తరచి  అడిగితె  అప్పుడు చెప్పిందట . మగపిల్లలిని  ఒక  ప్రముఖ  రేడియో  జాకీ , ఆడపిల్లలిని  ఆమధ్య  ఒక భారీ  హీరొయిన్ కి  డబ్బింగ్  చెప్పిన  లేడీ జాకీ ,ప్రశ్న లడిగారట , అవేమి ప్రశ్నలో  తెలుసా ''నీ  బాయ్ ఫ్రెండ్  వల్ల  అవాంచిత  గర్భం  రాకుండా  నువ్వు పాటించే  పద్దతులు  ఏమిటి '' ఎమన్నా సంబంధం ఉందా , కనీసం   ,ఏడూ ,
అరిచి  చూపించు ,ఇలాంటివి  కాదు  ఆ  అమ్మాయికి  కోపం  వచ్చి  నాకలాంటి  అవసరం  లేదండి  అంటే  వినదట
అలోచించి  చెప్పు ,ఊహించి  చెప్పు  అంటూ ,ఏదేదో  మాట్లాడు తోందట ,తను  లేచి  చక్కా వచ్చేసిందట . ఊహించని  . మంజుల  భర్త  చాల  కోపిష్టి,  కారపెసి  తంతానని  బయల్దేరితే ,తల్లి ,కూతురు  బ్రతిమాలి తీసు  కొచ్చారు .
                 
       
    కరెంటు  పుణ్యమా  అని  మేడమీద  తిరుగుతున్నాను , పక్క మేడమీద ఒక అమ్మాయి  ఉంది  కొత్తగా  ఎవరా
అని చూసాను . నవ్వుతూ  ఈచివరికి  వచ్చి  మీది  వైజాగ్ ట  కదా  అంది . ఇక్కడ  ఒక  విషయం , ఆమె  మాటకి
ముందు ఒక  ఆంటి  వెనకొక టి  పెడుతోంది , నాకా  పదం అంటే  ఎలర్జీ  అందుకే  రాయను  కావలసిన  వాళ్ళు  కలిపి  చదువు కోమని  మనవి . కాసేపు ముచ్చట్లు  పెట్టాము . రెండు  రోజుల క్రితం  వైజాగ్  నించి  వచ్చి  ఇక్కడ
అద్దెకు  వచ్చారట , పేరు  మాలిని  మిగాతయిద్దరు  డ్యూటీ కి  వెళ్లారు , ఏదో టెక్  లో ఉద్యోగం , అక్కడ లేవా  ఇంత
దూరం  ఆడపిల్లలు  రావాలా  అన్నాను . వాళ్ళ పేరెంట్స్  ఇక్కడైతే  గొప్పగా  వుండదు , హైదరాబాద్  లో  అయితే
చెప్పుకోడానికి  బాగుంటుంది . అనిచెప్పి  ముగ్గురున్నారు  కదా  అని  పంపించారట . హతవిధీ  ఎక్కడికి పోతున్నాం  మనం  అని  పించింది . తను  ఫోన్  నెంబర్  అడిగింది  ఇచ్చి  వచ్చేసాను .  నాలుగోరోజు  రాత్రి  రెండు  గంటలికి  మెలుకువ  వచ్చింది , లేచి చుస్తే  నా  సెల్ రింగవుతోంది . మా ఇంట్లో భోంచేసే టప్పుడు ,పది తర్వాత
టి  వి  , బెడ్ రూమ్ లో సెల్  ఫోన్  నిషేధం . హాల్ లో ఫోన్  తీస్తే  మాలిని ట  అప్పుడే  నిద్ర లేచానేమో  గుర్తు రావడాని  కొన్ని సెకనులు  పట్టింది . చెప్పు మాలినీ  అన్నాను ,ఆఫీసు  నించి  వస్తూ  ఇల్లు  మర్చి  పోయాను
కాబ్ డ్రైవర్  తిడుతున్నాడు  గంట పైన అయింది . అంది . మరి ఉదయం  వెళ్ళే టప్పుడు  ఏమి గుర్తు  పెట్టు  కున్నావు , అన్నాను  విసుగ్గా  కొబ్బరి బొండాల  బండి ఉండాలి  అంది . 'అకటా  కటకటా ' వాడు రాత్రి  ఈమె
వచ్చే వరకు  ఉంటాడా , ఈ పీత  బుర్ర కెవరు  టెక్  లో ఉద్యోగం  ఇచ్చింది , ఇచ్చితిరి పో , నమ్మి ఇంతదూరం
పంపిన  పేరెంట్స్  కి  నా  లాల్  సలాం  అనుకున్నా మనసులో 'ఎక్కడి వరకు  వచ్చారు  అనిఅడిగా  ,చెప్పింది
అక్కడ కుడి వైపు కమాను  ఉంటుంది  అన్నాను ,కమనంటే  అంది  తల్లి  డ్రైవర్ కి  ఇవ్వమ్మా  అన్నాను  వాడు
ఒకటే  నవ్వు గంట నించి  తిప్పుతోంది ,ఏడుస్తోంది ఎవరన్న  చుస్తే  నన్ను తంతారు  అన్నాడు , అడ్రెస్స్  చెప్పి
వచ్చి  పడుకున్నాను ..
 
   
          మరో సారి  రాత్రి  ఎనిమిది  గంటలికి  ఇంటికి  వస్తుంటే ,ఒక అమ్మాయి  కుక్కలిని  చూసి  భయపడుతూ
జిగ్ జాగ్గా ,పోతూ కంగారు  పడుతోంది ,నేను తనని  గుర్తు పట్టి  చంద్రని  కారపమని  ఎక్కమన్నాను ,మరో
ఆలోచన  లేకుండా  ఎక్కేసింది ,చాల భయ పడుతోంది , నేను తెలుసా  అని  అడిగాను  తెలిదు  అంది ,మీఇల్లు
సెల్ టవర్  దగ్గర కదా  అన్నాను ,అవును  మీరు? అంది  రోడ్ పక్కన ఒకే  లాంటి వి  రెండు ఇళ్ళు ఉన్నాయి  కదా
 అందులో ఉంటాము ,నిన్ను రోజు చూస్తాను ,ఈన కి బై  చెప్పి గేటు వేసుకునే టైం లో  ఇయర్  ఫోన్  పెట్టుకుని
మెసేజ్  చేసుకుంటూ  వెళ్తూ ఉంటావు  ,తలెత్తి చుట్టూ  ఎవరున్నారో ,ఏమిజరుగుతుందో .చుస్తె కదా ఎప్పుడన్నా
అన్నాను  సిగ్గు పడింది ,నేను ఇక్కడ నించి వెళ్తాను  అని  మాఇంటి  దగ్గర దిగి  నడచి  వెళ్లి పోయింది . తర్వాత
రోజు  వాకింగ్ కెళ్తే  వాళ్ళమ్మ గారితో  వచ్చింది , తనకి  కుక్కలంటే  చాల భయమండి  అన్నారావిడ , తర్వాత  ఎప్పుడన్నా  కలిసే వారు  , తనకి  ఆస్ట్రేలియా  లో  సీట్  వచ్చింది  వెళ్తున్నానండి  అంది . వెళ్ళాక ఫోన్  చేసింది
అక్కడ దిగగానే  ఎయిర్ పోర్ట్  లో  కుక్కలు  సోదా  చేస్తాయట , అంత పెద్ద కుక్క  నా భుజాల మీద  కాల్లేసి  నించుంటే ,పయ్  ప్రాణాలు  పయ్ నే పోయాయి  అని మీరు గుర్తు  వచ్చారు ,అంది . అక్కడ పార్ట్ టైం జాబ్
దొరికిందట ,ముగ్గురు కలిసి  వుంటారట ,ఒకరు డ స్టింగ్ ,ఒకరు కుకింగ్ , ఒకరు కావలసినవి షాపింగ్  చేస్తారట
వారిలో  ఒకరు  అబ్బాయని  చెప్పింది . బాగా చదువు కోమని  చెప్పాను  నా వంతుగా ....... 

No comments:

Post a Comment