నేను గజినీ నెమో అని నా అనుమానం ఎందు కంటే డ్రైవింగ్ వచ్చినా కార్ తియ్యలేను , రోడ్స్ గుర్తుండవు ,ఎవరైనా ఎంతసేపు రైట్ తీస్కో ,లెఫ్ట్ తీస్కో , అని ఎవరు చెబ్తారు , ఇదొక్కటే కాకా మనకి ఇంకో సుగుణం ఉంది అది మనుషుల ముఖాలు ,ఎక్కడ చుసిన వాళ్ళను అక్కడే చూడాలి ,స్కూల్ దగ్గర చూసినమే ని ఫాన్సీ షాప్ లో చుస్తే గుర్తు రాదు . అప్పటికి నవ్వినా ఇంటికి వచ్చాక ఆలోచిస్తే అప్పుడు గుర్తు వస్తుంది . పాలు పోసే అంకుల్ మార్కెట్ లో కన్పిస్తే అంతే, బుర్ర బద్దలు కొట్టుకుంటా. ఒకసారి చంద్ర తన ఫ్రెండ్ ని ఇంటికి తిస్కోచ్చారు అతని పేరు సుధాకర్ ,పరిచయాలు అయ్యాక ,మంచినీళ్ళు ఇచ్చి ,ఒకటే సిగ్గు పడుతూ ,మెలికలు తిరుగుతున్న ,అతన్ని చూస్తూ 'మీరు తిరుపతి వెళ్లి వచ్చారా ' అని అడిగా అతని నవ్వాగి పోయింది , చంద్ర వేపు చూసాడు ,తనేమో నన్ను చూసి ,'తనకి తలలో చమట ఎక్కువ ,సమ్మర్ లో తన హెయిర్ స్టైల్ అదే ' అని చెప్పారు . ఏమిటి డిప్పా అని అడగ బోయా ,చంద్రేమో కోపంగా చూస్తూ నువ్వెళ్ళి టీ తీస్కురా అని పంపి చేసారు . నాకు మాత్రం చాల ఆనందం వేసింది ,మా ఇంటికి వచ్చి నన్నే చూసి మెలికలు తిరుగు తాడా ,గాలి బాగా తీసేను అని
మరో సారి షాపింగ్ మాల్లో అనుకుంటా తన ఫ్రెండ్ కలిసారు ,హాయ్ శీనూ అంటూ వెళ్లి హాగ్ చేసు కున్నారు . నేను మాత్రం నాపనిలో ఉన్నాను . నాగురించి తెలిసిన చంద్ర ఊరు కోవచ్చు కదా ,నన్ను పిలిచారు పరిచయం చేసారు ,అదికూడా చాల గొప్పగా 'నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే మా శీను అని వీడే ' నేను ఎప్పుడు చూడలేదు ,వాల్లెప్ప్పుడు మాఇంటికి రా లేదు ఈన గారేమో ఎక్కువ చేస్తున్నారు ,నేను నవ్వుతూ హలో చెప్పేసి నాపని అదే బట్టలు చూస్తున్నా ,ఎందుకో అతని ఫేసు నాకు నచ్చాలే ,అదే పల్లికిలింపు , మళ్లీ చంద్ర పిలిచారు , వెళ్లా , శీను పక్కన ఒక భారీ విగ్రహం ఉంది ఆ సదరు శీను ఏదో చెప్పే లోపలే 'మీ అక్కా ?' అని అడిగేను , ఇంక చూడాలి ,మనోడు డబ్బుకు అమ్ముడు పోఇనట్టున్నాడు . డ్రమ్ము మిద చెంబు బోర్లించి నట్లు ఉన్న అమ్మయిని చేస్కుంటే ఇలాగే ఉంటుంది పైగా వేరే వాళ్ళ ని చూసి పల్లికి లింపు ఒకటి మొకం నల్లగా మాడి పోయింది . వస్తాం రా , అంటూ వెళ్లి పోయారు .
నాకో అనుమానం నాకు నిజంగా తింగరి తనం ఉందా ? చంద్ర అన్నట్లు తింగరి బుచ్చినా ,మానాన్న అత్తయ్యలు చెప్పినట్లు తెలివైన దానినా ? ఎవరన్నా నా డౌట్ క్లియర్ చేస్తే బాగుణ్ణు .

No comments:
Post a Comment