Total Pageviews

Sunday, July 20, 2014

తిండి గోల

 నేనేమంత  తిండి  పోతుని  కాదండి , ఏదో  ఎవరేజ్  గా  తింటాను . కానీ  స్వీట్స్  అంటే  ఇష్టం . కానీ మా  ఇంట్లో  మా  ఆకరి  అత్త  చేసే  వంటలంటే  నాకు  చాల  ఇష్టం ,నాన్ వెజ్  ఐతే  'ఇరగ  తీస్తుంది ',అత్త  చేసే  స్వీట్స్ తింటే  మీరు  కూడా  ఒప్పేసు  కుంటారు . పంచదార  అరిసెలు  చేసిందనుకో  కళ్ళు  మూసేసి  తినిపించా  మనుకో  మీరు  వెంటనే  చెప్పే స్తారు  'కోవా ' అని . అంత  బావుంటై , అదే  మైసూర్ పాక్  చేస్తే  నోట్లో వేసు కుంటే  కరిగి పోయి  ఎటు  పోయిందో  మీకే  తెలీదు , ఎప్పుడూ  ఒకే టేస్ట్  ఎలా వస్తుందబ్బా ?  నేను చేస్తే  ఒకసారి  మెత్తగా   కేక్ లా ,మరో  సారి  గాట్టిగా  సుత్తి లా , ఒకో సారి  రవ్వ లా  పొడి  పొడి  గా ,ఎందు కు లెండి  తన  మేన కోడలి నని  చెప్పుకుంటే  సిగ్గు  చేటు . కొత్తి మిర  పచ్చడి , బిర్యానీ లు ,నాన్  వెజ్  పచ్చడులు  బాగా చేస్తుంది . నేను బిర్యానీ లు  మాత్రం  బాగా  చేస్తాను . ఈమధ్య  అరిసెలు  తెచ్చు  కున్నాము ,' గులహా  ఫుడ్స్ ' నుంచి ,ధర గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది .  బొబ్బట్లు  తెస్తే  పంచదార  తప్ప  ఏమి లేదు . నేను ఇప్పుడిప్పుడే  ఇంట్లో  చేస్తున్నా  బాగా  వస్తున్నాయి . జామున్స్  ఒకటి  ఈమధ్య  ప్రతి  వాళ్ళు చేస్తున్నారు . నేను మాత్రం  జామున్ మిక్స్  వాడను , షుగర్ లెస్ కోవా  అంటే  పచ్చి కోవా  అంటారు  కదా  అదన్నమాట , దాన్లో కొంచెం  మైదా  వేసి  జామూన్స్ చేస్తే  బాగా వస్తాయి .
   
        ఒకసారి  అప్పుడే  జామూన్ మిక్స్ వస్తోంది , ఆ టైం లో  అత్త  అయ్యప్ప స్వాములకి  ఒక  పది  మంది కి  భోజనాలు  పెట్టింది , అప్పుడు  నేను కూడా  వెళ్ళాను , ఐతే భోజనాలు  కాగానే  జామున్స్  చిన్న బౌల్  లో  సర్వ్  చేస్తే  వాళ్ళు 'ఇది  ఏమి  చెయ్యాలి ' అన్నారు  అయో మయం గా , అప్పుడు అత్త  అది  స్వీట్  అని  పాకం తో  సహా  తీసుకోవాలని  చెప్పింది . మావయ్యగారు  ఆఫీసు  నుంచి  వచ్చాక  విషయం  చెప్పాము , అయన  నవ్వుతూ స్వీట్  నోట్లో  వేసుకుని  పాకం  నెత్తికి  రాసుకో మని చెప్పక  పోయారా  అన్నారు  సరదాగా .
       
          ఒకసారి  ఊరు  వెళ్తున్నాం ,  మా  బావగారికి  ఫోన్  చేసి  '' నాకు  జున్ను కావాలి  ఎల్లుండి  ఉదయానికి  అక్కడికి  వస్తున్నా , గేదకి  డెలివరీ  చేస్తారో , సిజె రియన్  చేస్తారో  నాకు  తెలిదు ,  జున్ను రెడి చేయండి  '' అన్నా
లక్కీగా  పాలు  దొరికాయట  వండించి  ఉంచారు , ముక్కలు  కోసే లా ఉందది . అబ్బ ...  మనసు  పాడై పోతుంది .
రుచుల  విషయం  ఎలాగు  వచ్చింది  కనుక  ఈ సీజన్ లో  చెప్పు కో వలసినది  ''పొలస చేప '' గురించి ,గోదావరి
వరదలు  వచ్చి  నపుడు  కొత్త నీటి తో  పాటు  సముద్రం పు  ఉప్పు  నీటి లో కలుస్తుంది . దానితో  ఆ చేపకి  మంచి
రుచి  వస్తుంది , పులుసు పెడితే  అంతే ,బెండకాయ , టమాట  వేసి  చెయ్యాలి .  గోదావరి  జిల్లాల్లో  ఒక  సామెత
ఉంది  ''పుస్తెలమ్మి  పొలస  తినమని '' . అంత  పని  వద్దు కానీ  దొరికితే  మాత్రం  కొని ,తిని  ఎంజాయ్  చెయ్యండి . 

No comments:

Post a Comment