అనుకోకుండా వచ్చిన సెలవు అదీ రెండు రోజులు , అందరికీ కాదు చంద్రకి మాత్రమే , అదికూడా వంట్లో బాగాలేక కాదు . నాకు గొప్ప విషయమే ఎందుకంటే ప్రొద్దునే సూర్యారావు తో వెళ్ళి ,చంద్రరావు తో
ఇంటికి వస్తారు . మధ్యలో నెలకోసారి మీటింగ్ అంటూ రెండు ,మూడు రోజులు జంప్ ! దగ్గరైతే ట్రైన్లోనూ
దూరమైతే , ప్లైన్ లోను . మొన్న గుజరాత్ కెళ్ళి నపుడు నాకో చీర తెచ్చారు ,ఓహో నారాజా కెవ్వు కేక
పోన్లే పాపం అని ,ఆపుకుందామన్న ఆగదు ,మోకాల్లో ఏమని పిస్తే ఆదనేస్తాను ,అరికాల్ల్లో ఏదుంటే అది
అడిగేస్తాను . ఏమను కున్నారో నా ఫేవరేట్ బోటిక్ తీస్కెళ్ళి ,నీ ఇష్టం అని వదిలేసారు , గొలుసు విప్పేసిన
కుక్క లాగా పోలిక చండాలం గా ఉందికదా ! పోనీ షాపింగ్ ఇరగ దీసాను . తర్వాత నా ఫేవరేట్ రెస్టారెంట్
లో భోజనం , లాంగ్ డ్రైవ్ , వచ్చేప్పుడు తను హలీమ్ తిన్నారు . నాకు అలాంటివి పడ వ్ , ఏదో మలయ్
కి సాత్ ఖుబానికా మీటా అంటే ఓ మాట , అదే తిన్నా , వచ్చేక మేడంత పరిగెత్తాన నుకోండి ,పడక
కాదు కేలోరీస్ కరిగించడానికి , పిల్లలికి పార్సిల్స్ . అంతబానే వుంది ఈనగారు సండే మాత్రం ఇంట్లో
వుంటారు , నలుగురం కలిసి భొంచేస్తాం ,మళ్లీ వీక్ డేస్ లో కుదరదు కదా . మరుసటి రోజు మేమిద్దరం
దృశ్యం సినిమా కి వెళ్ళాలను కున్నాము , లంచ్ చేస్తున్నాము ,తనేమడిగేరో తెలుసా ,'అదేంటి నువ్వు
కేప్సికం తినవా ' ప్లేట్లో అన్ని పక్కన పెడుతున్న నేను తలెత్తి ఇదికూడా తెలీదా ,నాకు నచ్చదు అన్నాను
కానీ మనసులో ఎడ్చుకున్నాను . సమత్సరాల తరబడి పెళ్లమనే సాల్తిని ఇంట్లో ఒతాడు ముడేసి పడేస్తారు
తనేమి తింటుందో కూడా తెలీదా ! అకటా కటకటా మగవారి నిలా నమ్మరాదే చెలీ ......
మళ్లీ మోకాల్లో ఉన్నదనేసి ,అరికాల్లో ఉన్నదడి గెద్దాం ,అనుకున్నా . కాని సినిమాకి టైం అవుతోంది .
అదికూడా మెట్నీ కి ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి అయ్యేను . అందుకే విరమించు కున్నా . నేను
ఎంత మంచి దాన్నో కదా ,నాకు బోల్డంత సిగ్గేసేస్తుంది బాబూ ! నన్నెవరు మెచ్చుకుని మేకతోలు కప్పరు
మరి . నేనైనా భుజాలు తట్టు కోవలిగా . సోదరులందరికి చిన్న మనవి మీ ఇల్లాళ్ళని కొంచెం పట్టించు
కుని , కొద్దిగా వాళ్ళని [మీ సెల్ నే కాదు ] రీ చార్జ్ చెయ్యండి .
ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకంక్షలు ............
No comments:
Post a Comment