Total Pageviews

Monday, June 30, 2014

ఇద్దరిది ఒకె పేరు ............

 సండే  పేరుకే పనులు  మాత్రం బోలెడు . ఆల్వాల్ రైతు బజార్  వెళ్లి కూరలు ,పళ్ళు తెచ్చి అవన్నీ  ఫ్రిజ్ లో సర్ది , నాన్వెజ్  వండి,  తిని ,అబ్బబ్బో ఎన్నిపనులు , అవన్నీ పూర్తయ్యి మద్యాన్నం  పేపర్ తీసాం . చంద్ర న్యూస్   చదువు  తున్నారు . నేనేమో సాయంత్రం  వెళ్ళడానికి ఈవెంట్స్  ఏమి  ఉన్నాయా  అని  చూస్తున్నాను . ఇంతలో  నా సెల్  రింగ్ అయింది . నంబర్ చుస్తే  కొత్తది   ఈ టైం లో  ఎవరూ చెయ్యరు . లేవగానే ఫోన్  పలకరింపులు  ఐ పో తాయి
 ఒక  వేళ  పర్సనల్ లోన్  కావచ్చు ,బ్యాంకు లు  సండే  కూడా పంచేస్తున్నాయా  అనుకుంటూ  ఆన్ చేశాను .
 'నమస్తే  నా పేరు  నిరుపమ  మీరు  తనుజ కదా ' అంది . అవును  అన్నాను . మీతో కొంచెం  మాట్లాడ వచ్చా ?  అంది . ష్యూర్  నేను  వరాలు ఇచ్చే దేవతలా  బిల్డప్ప్ ఇచ్చెను . మీది   బి  టెక్   అయిందా  అని  అడిగింది . నిజం  చెప్పొద్దూ , నకేదన్న  నచ్చు తుంది  కానీ చదువు  మాటంటే  కాలుద్ధి . ఎన్ని ప్రయత్నాలు  చేసిన  పేరు పక్కన  డిస్క్ , తప్ప డిగ్రీ చేర్చు  కోలేక పోయాను . ఇంక  బి  టెక్  ఒకటా  నా  మొకానికి ? 'ఎందుకు ' అన్నాను , కాదండి   మీ  నాన్నగారు  మీ బయో డేటా  ఇచ్చారు , మాతమ్ముడి  కోసం  వాడేమో ఫలానా సొల్యు షన్స్ లో పంచేస్తున్నాడు  మీకు  జాబ్ లేక పోఇన   ఫర్లేదు  జాబు పెట్టించు  కునే  పరపతి  వాడికి ఉంది ' అంది . అయోమయం  లో ఉన్న  నేను  మా నాన్న బయో డేటా  ఇవ్వడ మేంటి ? ఆయనే కదా వద్దు  మొర్రో అంటున్నా  వినకుండా  ముద్దుల మేనల్లుడి కి ఇచ్చి[  'బాల క్రిష్ణ కాదు ] కట్టబెట్టాడు . మనసు మార్చు  కున్నడా  నాన్న  నువ్వు  నాన్నవి  కాదు దేవుడివి  కూతురికి  ఒక పెళ్లి  చెయ్యడమే  గగన మైన  ఈ రోజుల్లో  నాకు మరో  సంబంధం  చూస్తున్నావా  నిజంగా దేవుడివి  నాన్న దేవుడివి  అనుకుని  ఆనంద భాష్పాలు  తుడుచుకుని  ఒక్క నిముషం  అనిచెప్పి , తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్  లా 'యే  దండనక  దండనక  అని  స్టెప్పేసు  కుని  'చెప్పండి  నాన్న  మేకు  ఫోన్  చేసారా  మీరు  మాట్లాడారా ' అనడిగేను   ఆత్రుతగా . 'అబ్బే మీ తాత గారు  మాట్లాడారు , బయో డేటా ఇచ్చి వెళ్లారు  మీతో  ఒకసారి  మాట్లాడ మంటే ఫోన్ చేస్తున్నాను ' అన్ది.  తాత  గారా ? ఇద్దరు  తాతల్ని పైకి  పంపే సాను  కదా  'మీకు అసలు ఎవరు కావాలి ' అన్నాను  'మీరు తనుజ  కదా  మీది ఫలానా కులమేకద  మీతోనే మాట్లాడాలని చేశాను . నంబరు కూడా  ఇదే  మీ అమ్మగారు  కూడా  మిమ్మల్ని ఒప్పించ మన్నారు . 'అమ్మా నువ్వు కుడానా , పెళ్ళికి ముందు ఎప్పుడు సినిమాకి పంప లేదని పంపినా నలుగురు సెక్యూరిటీ కూడా పంపావని పరదాలు [కర్టైన్ ] సర్దేసి నన్ను లోకం తెలియకుండా పెంచావని ఎన్నిఅనుకున్నాను ,అలాంటిది  ఇలా ,ఎలా , మారిపోయా వమ్మా ? అనుకుని 'మీరొక పని చెయ్యండి తాతగారి ఫోన్  నమ్బరిస్తారా  అనడిగా  'ఓ  విత్తనాల సత్తి  బాబు గారు కదా మీతాతగారి  పేరు ?... ' కాదండీ అయన  నాకు బాబాయ్ అవుతారు , నమ్బరివ్వండి  అనితీస్కున్నాను . మీతో సాయంత్రం మాట్లాడ తాను  అని చెప్పాను . చంద్ర వేపు చూస్తూ  టి  వి  లో సుమ  వేస్కుంటుంది  కదా అలంటి లంగా ,ఓణి  లు ఒక మూడు కావాలి ' అన్నాను . ఎందుకు  కోపంగా అడిగారు . ఒకటి  పెళ్ళికి ,ఒకటి రీసె ....... 'ఆమె  బి టెక్  కావలన్నట్లుంది ? ఈయన టైమింగ్  ఉంటుందే  నేను గాలి పెట్టిన బలున్ లా  ఉన్నప్పుడు  ఒక గుండు సూది పుచ్చు కుని  ఆ చుట్టు ప్రక్కలే  తిరుగు తుంటారు సమయం చూసి గుచేస్తారు . తుస్స్సు ........ మంటూ గాలి పొతే  సంతోషం  తనకి . పెద్ద వాళ్ళు  కదా పడు కుని  ఉంటారను  కుని  సాయంత్రం  బాబాయ్ కి  ఫోన్ చేశాను విషయం విని  నవ్వుకొని  వివరాలు ఇచ్చింది నేనే మీ చెల్లెలు వినయ [అయన కూతురు ,తన  కూతురు కి నీ  పేరే పెట్టు కుంది . బయో డేటా  తనది ఇచ్చి కాంటాక్ట్ నంబరు  నీది ఇచ్చాము  రేపో ఎప్పుడో  నీతో మాట్లాడ దమను కుంటున్నాము  ఇంతలోనే వాళ్ళు నీకు ఫోన్ చేసే సారు అన్నారు  అదీ  విషయం  అలా జరిగింది . పెల్లికుతురి  పేరు ,నాపేరు  ఒకటే కావడంతో ఇలా  ఐంది , ఏమాట కా  మాట చెప్పు కోవాలి చంద్ర చాల  మంచోడు కదా . 

No comments:

Post a Comment