సమ్మర్ లో కాకినాడ వెళ్ళాము . నాలుగు రోజులకే మామధ్య మారేడుమిల్లి వెళ్ళాలనే చర్చ వచ్చింది . చాన్నాళ్ళు అక్కడవున్నందు వల్ల ,అక్కడిప్రదేసాలు ,చాలా అందమైనవి కావడంవల్ల అలా అన్పించడం న్యాయం కాని ఈసారి వెళ్ళ డానికి కారణం 'బొంగు చిక్కెన్ ' మేము అక్కడ ఉన్నప్పుడు ఈవంటకం లేదు . ఇప్పుడు దానిగురించి తెలిశాక ,కొత్త వంటతిన్నట్టు ఉంటుంది ,కొత్తచోటు పిల్లలకి ,చూపించి నట్లు ఉంటుందని తప్పక వెళ్ళాలని అనుకున్నాము . మరుసటిరోజు ఏడు గంటలకల్లా కార్లో బయల్దేరాం . నాన్నగారు ,అన్నయ్య , వదిన ,నేను వాళ్ళ పిల్లలు ,మాపిల్లలు . కాకినాడ నుంచి జగ్గంపేట , రాజపూడి మీదుగా సాగింది . రాజపూడి ,దాటగానే ,సన్నగాచినుకులు మొదలయ్యాయి వాతావరణం చాల బాగుంది . అసలే వేసవి ,ప్రొద్దున్నే చల్లనిగాలి చినుకులు కారు ఒకచోట ఆపి ,వెంటతెచ్చు కున్న టిఫిన్లు ,కాఫీలు పూర్తి చేస్తుంటే అక్కడికి ఒకతను సైకిల్ కి కల్లు ముంతలు కట్టుకుని వచ్హాడు . నేను మా అన్నయ్య కు చూపించాను , నీకోసం కాబోలు అన్నాను సరదాగా తనువెంటనే అవును బావకి కొనిద్దామని రమ్మన్నాను , అన్నాడు . నేను చుప్ ఇంక . మా పాప మామయ్య నీ ఫ్యాక్టరీ ఎక్కడ అని అడిగింది . దాంతో చుట్టూ ఉన్న అన్ని స్తలాలు ,చూపిస్తూ ,హద్దులు చూపిస్తూ అన్ని మనవే అంటూ చివరిగా చిన్నగా ఉన్న తన 'చిన్న ' ఫ్యాక్టరీ చూపించాడు . [అందులో దుంపలు పొడి చేస్తారట ]. మేము గోకవరం మీదుగా రంపచోడవరం వెళ్ళే టపడికి వర్షం ఎక్కువ యింది . కాంక్రీట్ జంగిల్ నుంచి వచ్చా మేమో ,అడవిలో వెన్నెలే కాదు ,వర్షం కూడా అందమే అనిపించింది . మొత్తానికి తొమ్మిదిన్నరకి మారేడుమిల్లి చేరాము . మొదట అన్నయ్య ఒక గిరిజనుడిని పట్టుకుని ,బొంగు చిక్కెన్ చేయడానికి మాట్లాడేడు . మేము ట్రావెలర్స్ బంగ్లా కి వెళ్లి కూచున్నాం . నాన్నగారు ,అక్కడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పని చేసారు కనుక అప్పటి విశేషాలు చెబుతున్నారు. ఆ బంగ్లా గోరింటాకు సినిమా లో కొమ్మ కొమ్మకో ........ సన్నాయి అనే పాటలో వుంటుంది . మధ్యానం వరకు అక్కడే తిరిగి చూసాము . మేము ఇంటినుంచి ,ఫ్రైడ్ రైస్ తెచ్చు కున్నాము . అన్నయ్య 'బొంగు చిక్కెన్ 'తెచ్చాడు . ఒక ఆకులో మసాలా నూని కలిపి పట్టించి వెదురు మద్యలో ఆకుని పోట్లామ్ కట్టి పెట్టేసి రెండు పక్కల క్లోజ్ చేసి మంటలో కాల్చి ఇచ్చాడు . ఒకటి మూరపోడవున ,ఉన్నాయ్ . చాల తెలివి గా వండిన వంటకం . నాన్వెజ్ ప్రియులంతా తిన వలసిన వంటకం . ఎక్కడో కేరళ కి వెళ్తాము కాని పక్కనే ఉన్న మన వనరులు గురించి తెలుసు కోమని అనిపించింది .వాటర్ ఫాల్స్ చూడమని చెప్పి నాన్నగారు పడుకున్నారు . మేము పిల్లలిని తీసుకుని వెళ్ళాము . వర్షం కారణం గా చాల బురద గా ఉంది . అక్కడ జలపాతం చేసే శబ్దం బయట కే విన్పిస్తోంది వరుసలో పెంచిన చెట్లు చెట్లకింద బెంచ్ లు పచ్చని లాను ,మద్యలో కాలిబాట ,సంతోషం గా లోపలి అడుగు పెట్టాము . అక్కడున్న బెంచ్ మీద ఇద్దరు యువకులు కూర్చుని మందు తాగుతున్నారు . వాళ్ళు మమ్మల్ని చూసి ''............. లావున్నారు ' అని కామెంట్ చేసారు . అన్నయ్య కోపంగా వాళ్ళ వైపు వెళ్ళాడు ,వెళ్లి 'ఎలాకన్పించారు ' అని అడిగాడు . వాళ్ళు కూడా ఏమి తక్కువతినలేదు గొడవకి వచ్చారు . అన్నయ్య ''ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడి వాళ్ళను కామెంట్ చేస్తావా ' అని మీదకేల్లాడు . వాళ్ళేమో ఇద్దరు ,తాగి వున్నారు . మేముసర్ది చెప్పి , బలవంతం గా అన్నయ్యని తీసుకుని లోపలికి వెళ్ళాము . అక్కడ చాల బావుంది కానీ ఎవరు లేరు , బండలమీద కూచో వాలని కాళ్ళు కడుక్కో వాలని అన్పించింది . కాని ఎందుకో ,అక్కడిక సేఫ్ కాదని వేనుతిరిగాము . వెళ్ళాలంటే అక్కడొక చేట్టుమాను మీదుగా నడచి రావాలి , ఒక్కరు మాత్రమే వెళ్ళగలం కాని వాళ్ళు దాని మీదనే నుంచుని ఏదో మాట్లాడు కుంటున్నారు . వాతావరణం ,చూస్తె వాళ్ళు మమ్మల్ని అటకాఇన్ చడానికి రెడీగా ఉన్నట్లుంది . నాకు మాపెద్దన్నయ్య ,గుర్తు వచ్చాడు . తానైతే ఇందాకే ఉతికేసేవాడు . ఎలారా దేవుడా అనుకున్నాను . అనవసరంగా వచ్చాం అనుకుంటున్నాం . అన్నయ్య అడుగు ముందుకేసి 'బాస్ లేడీస్ వెళ్ళాలి చోటివ్వండి ' అన్నాడు వాళ్ళు వంకరగా నవ్వుతూ అడుగుముందు కేసారు . నేను వదిన వెనక్కి చూసాం అన్నీ రాళ్ళు రప్పలు వెనక్కి వెల్లడ మంటే,,, విలన్ పరిగేట్టిస్తుంటే ,హీరోయిన్ మేడఎందు కేక్కుతున్ది అని నవ్వుకునే వాళ్ళం . ఇప్పుడదే చెయ్యాలని సిద్దమయ్యాం . కాని ,ఇంతలో ముప్పై మంది వరకు స్టూడెంట్స్ గోలగా అరుచు కుంటూ ,దిగి వచ్చారు ,అందరూ మగపిల్లలే ,పైన జలపాతం దగ్గర ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనుకుంటా , వాళ్ళ రాకతో అ'' ఐ ' టి ' లు ఇద్దరూ వెనక్కి నడచి మాకు దారి ఇచ్చారు . బ్రతుకు జీవుడా అని బయట ఫడ్డాం . ఆ తొందరలో వాళ్ళకి అదేస్టూడెంట్స్ కి థాంక్స్ చెప్పలేదు . వాళ్ళకే తెలియకుండా మాకు చాల సహాయం చేసారు . ఆ విధంగా మాపిక్నిక్ కొంచెం ,ఇష్టం ,కొంచెం కష్టం లా జరిగింది .
*************************
No comments:
Post a Comment