డాన్సు కథ అల ముగిసింది మరోసారి సంగీతం నేర్చుకుంటనన్ను .ఎక్కువ బయిటికి పంపే వారు కాదు కనుక టీచర్ ని ఇంటికి పిలిచారు . ఆవిడ కూడా తమాషా గ ఉండేవారు . గడ్డి లాంటి జుట్టు ఎలాగో దగ్గరికి లాగి జడ వేసేవారు . జబ్బకి చేతి సంచి తగిలించుకుని , జాకెట్ జుబ్బ నో తెలియకుండా మధ్యరకంగా ఉండేది . ఆమె బ్లౌస్ నులు చీర కట్టుకుని వచ్చేది . 4 రోజులు నేర్పగానే "ఫా ఫా" గొంతు బాగుంది ,శ్రుతి లోకి రావాలంటే పొద్దునే నేర్పాలి అంది . సరే అని రమ్మనారు . ఆవిడ "పాప" అనడానికి "ఫాఫా" అనేవారు .పల్లు బాగా ఎత్తుగా వుండడం వల్ల ముందు పళ్ళ మధ్య ,ఖాళీ వల్ల శబ్దం అల వచ్చేదో కానీ సరిగమలు కూడా అంతే ... "స రి గ మా ఫా " అనేది .నెను ఎలాగన్నా సంగీతం నేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాను . అందుకే ఏమి అనకుండా ఆమె దగ్గరే నేర్చుకుంటునాను 5:30 నుంచి అర్రుకు అటు ఇటు గ సాగేది క్లాస్సు ,తరువాతే రెడీ అయి స్కూల్ వెళ్ళే దాని . అఇతే ఒక శుభోదయన్నమా సంగీతం సాధనం జోరుగా సాగుతుంది మేడమీద ,ఇంతలో మెట్లమీద అలికిడి అయింది . ఎవ్వర అని చుస్తే మా నాన్న గారు .నాకు తెలిసి అయన అంత పొద్దునే ఎప్పుడు లేవలేదు .నన్ను చూసి కూడా నవ్వలేదు .ఏమిటా అని చూస్తున్నా . ఆయన తిన్నగా కోపంగా మా దగ్గరికి వచ్చారు . నడుం మీద చెయ్ వేసుకుని టీచర్ ని కోపంగా చూస్తూ "ఎవ్వరు నువ్వు " అని అడిగారు . ఆమె భయపడుతూ'"ఫా ఫా " కి సంగీతం నేర్పడానికి వచ్చాను ' అని అంది . 'ఇప్పుడు ఈ చలిలో న ' అని అడిగారు . "ఇప్పుడు అయితేనే గొంతు శ్రుతి లో పడుతుందని ఏదో చెప్పా బోయి "లే ముందు వెళ్ళు " అని మెట్ల వైపు చెయ్ చూపించారు . సంచి తీస్కుని సినిమాల్లో చూపిస్తారు అలా మాయం అయిపాయింది .నన్ను తెసుకుని కిందకి వచ్చే సారు .ఇందులో నాకు తెలిసిన నీతి ఎంటంటే "చలిలో ,మంచులో సంగీతం నేర్చుకోవడం దోషం అని అర్ధమైయింది .
తరువాత మైయినారావు ...........................
తరువాత మైయినారావు ...........................
పాపం సంగీతం టీచర్..:-)
ReplyDeleteఆవిడ కదండీ ' పాపం ' నేనే ' పాపం' ఎందుకంటే ఇప్పటికీ నేను సంగీతం నేర్చు కోలేక పోయాను .
ReplyDelete