జూబిలీ బస్ స్టాప్ దగ్గర సిగ్నల్ పడింది , మా కార్ ముందు ఒక బైక్ వచ్చి ఆగింది . బైక్ పైన ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు , అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు అమ్మాయి ఇద్దరికి సరిపడే చోటు వదిలేసి ,అబ్బాయి చేతుల కిందు గా చెయ్యి లేసి భుజాలు బిగించి పట్టుకుంది . తానెవరో తెయకుండా ముఖానికి గుడ్డ కట్టుకుంది వెనుకభాగామంతా వది లేసింది , రెండు నెంబర్ లు తక్కువున్న జీన్స్ వేసుకుంది . రెండు ఇంచీలు పొట్టిగున్న టాప్ వేసింది ,వేసుకున్నబట్టలు ఎక్కడ కవర్ చెయ్యాలో అక్కడ కవర్ చెయ్యట్లేదు . సిగ్నల్ వచ్చే వరకు ,జనం టీ ,వి చూసినట్లు ,చూస్తూ పండగ చేస్కున్నారు . జీవితం లో ఆమె కూడా చూస్కుని ఉండని భాగం ఎగ్జిబిషన్ కి ,పెట్టింది . సిగ్గుతో నా తల వాలి పోయింది . ఈమధ్య పెళ్ళైన వాళ్ళు పిల్లల తల్లులు అందరూ లెగ్గింన్స్ వేస్తున్నారు . వేస్కుంటే వేస్కున్నారు కనీసం మోకాళ్ళ వరకైనా టాప్ ఉంటె బాగుంటుంది . సైడ్ లో అంత డీప్ కట్ కాకుండా ,కొంచెం క్రింది కి ఉంటె బాగుంటుంది . లేగ్గింన్స్ కాలేజ్ పిల్లలకు బాగుంటుంది . లేదా సన్నగా ఉన్నాకూడా ఓకే . కాని గజరాజు కి అటు ,ఇటు గా ఉన్నా కూడా వేసుకుంటున్నారు . మీరు మొహాలకు గుడ్డ కట్టు కుంటారు . మేము కళ్ళకు కట్టుకో లేము గా . ఆఫీస్ కి చీర కట్టు కేల్లలేరు ,నిజమే కానీ బస్సు ఎక్కాలన్నా బండి నడపాలన్న కష్టమే ,కానీ చుడిదార్ ,పటియాల ,అంటూ చాల మోడల్స్ ఉన్నాయ్ . ఈ బట్టలు , కత్తి రించి నా జుట్లు ''ఎలపరం 'వచ్చేస్తోంది . సండే ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళండి ,బుల్లి గౌను ల్లో ,పెద్ద పాపలు ,చిన్న ,చిన్న నిక్కర్లు ,త్రీ ఫోర్త్ లు , వయసు తో సంబంధం లేకుండా వేసుకొస్తారు . సినిమా లో వేసుకున్నారంటే ,వాళ్ళకి షాట్ రెడీ అయ్యే వరకు ,కప్పి ఉంచు తారు . బయటికి వస్తే బౌన్సెర్స్ వుంటారు . మరి మనకి ?.. కొంచెం వాడితే తెలుస్తుంది . తెర వేరు ,జీవితం ,వేరు మనం బయటకెళ్ళి క్షేమం గా తిరిగి రావాలంటే మన బట్టలు ,ప్రవర్తన కూడా ముఖ్యం . ఎంత ఫాషన్ అయిన చెయ్యొచ్చు . కానీ సరీరభాగాలు [స్కిన్ షో ] ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం ?.
కొంచెం వాడండి పెద్ద ప్రయోజనం పొందండి 'గుడ్ లక్ '..........
********************************
No comments:
Post a Comment