నా చిన్నతనంలో ఎవరో ఒక మైనా తెచ్చి ఇచ్చారు కొంత మంది గోరింక అంటారు ,నల్లగా ఉండి ముక్కుపాదాలు పసుపు రంగులొ ఉండేవి మనం ఏమిపలికితే అదేఅనేది . పంజరంలో మూడు భాగాలుగా ఉండేది . మొదటిది ,మద్యలో కర్రా , పైన చిన్న కొయ్యలా వుండేది ,మైనావాలినప్పుడు ఊగుతూ ఉండేది . చిన్న ఆవకాయ ముద్ద తనాహారం . జామకాయలు పళ్ళు స్నాక్స్ అన్నమాట . ఒకకప్పులో పసుపునీళ్లు పెడితే స్నానంచేసి ,రెక్కలార్చుకునేది . పంజరం క్లీనింగ్ కోసంనీళ్ళ పైప్ పెట్టేవాళ్ళం . అప్పట్లో కరివేపాకు ఇంటింటికి గంపలో తెచ్చే వారు . కవలసినవాళ్ళు గుప్ప్పెడు బియ్యంకాని ,చిల్లరకాని ఇచ్చి కొనేవాళ్ళు . మావీధిలొకి వచ్చే ఆమేపీరు అప్పయమ్మ . కరేపాకూ అనిఆమె అరవగానే , మైనా కూడా 'కరేపాకూ 'అని అరిచేది . ఆవెంటనే మాపిలుపు కూడతనేపిలిచేది ,'అప్పయమ్మా 'అని సైకల్ మీద అమ్మడానికి వచ్చే ,తోటకూరా , గొంగూరా అన్నీ పిలుస్తుండేది . 'నీపెరెంటీ ' అంటే ,మైనారావు అనేది ,తర్వాతర్వాత నీపేరెంటి అంటే తిరిగి 'నీపేరెంటి 'అనేదనుకోండి ,ఎవరెలా నవ్వితే తనూఆలా నవ్వేది . ఎవరో నోరుముయ్యి అనినేర్పించారు ,ఇక మొదలు అందర్నీ ఆదేఅనేది . మాన్పించడం చాల కష్టమైంది . ఎందుకంటే మైనా మాటలు వినడానికి పెద్ద పెద్ద వాళ్ళుకూడా వచ్చేవారు .అప్పట్లో కాకినాడలో అది టాక్ ఆఫ్ ద టౌన్ మరి . ఆదివారం వస్తే మైనాకి 'వస' ఆరగ తీసి నోట్లో పోసెవారు . అందుకేనేమో ఏదంటే అదనేది . మాపిల్లలందరికి మైనా ఆంటే చాలా ఇష్టం . 8సం మాఇంట్లో మెంబరు గా ఉంది . ఒకభోగి రోజు ప్రొద్దునే చనిపాయింది . చాన్నాళ్ళు నాకు మైనా పంజరంలో ఎగురు తున్నట్లుఉండేది ఆపంజరానికి కట్టిన మువ్వలసడి ఇప్పటికిగుర్తే . నాకిప్పుడు పెట్స్ అంటే ఇష్టంలేదు మైనా అడవిలోనే ఉంటే ఇంకో మైనా తో సంతోషం గా ఉండేదేమో ఆనుకుంటూ ఉంటాను .
No comments:
Post a Comment