Total Pageviews

Wednesday, August 20, 2014

పెళ్లి కాన్సిలా?

 మా  నిశ్చితార్ధం  కి  , పెళ్ళికి  చాల  గ్యాప్  వచ్చింది .  కొన్ని కారణాల  వల్ల  నెలలు  పట్టింది ,అందు వల్ల  నిశ్చితార్ధం  గ్రాండ్  గ  చేసారు ,అత్తవారి ఊరునించి  చుట్టాలు  బానే  వచ్చారు . వాళ్ళ లో  సూర్యం  అనే
 అతను  నాన్న గారితో  తరచూ  ఎవోవొక  పనులతో  ఇక్కడికి  వస్తుంటాను ,అని  చెప్పాడు  నాన్న గారు
 ఐతే  వచ్చినప్పుడు  ఇక్కడికే  రావాలని ,పని కాంగనే  భోంచేసి , రెస్ట్  తీసుకుని  వెళ్ళ వచ్చని ,చెప్పారు
 అతను  అప్పుడప్పుడు  వచ్చే  వాడు . పని కాగానే  వచ్చి ,భోంచేసి , రెస్ట్ తీసుకుని  సాయంత్రం  వెళ్ళే వాడు.
 ''సాగర  తీరం '' వాళ్ళం  కదా ఇంట్లో  ఎప్పుడూ  చేపలు  వండు తూ వుండే వారు . దాంతో  వెజ్ తక్కువ.
  సీజన్  లో మా  అమ్మ కాకరకాయ  తప్పకుండ  వండేది ,అది  ఎవరం  తినే వాళ్ళం  కాదు ,చేదు ,చేదు అని
  తను  మాత్రం చేసు కు తినేది . మాకు  మానాన్నగారి  సపోర్ట్  ఒకటి ,ఇది కాక  మా పెద్దన్న  కూడా చుస్తే
  పడేసేవాడు . తను మాత్రం  చక్కగా  వేపుడు  చేసుకు తినేది . అంతే కాదు రెండు ,మూడు  రోజులు  ఫ్రిజ్
  లో  పెట్టుకు తినేది . మా నాన్నగారు అలా  తింటే చచ్చి పోతారని ,తినవద్దని  ,చెప్పేవారు . అమ్మ మరి
  ఫ్రిజ్ ఎందుకు ,నిల్వ  పెట్టడానికే  అనేది . పోనీ పులుపు  పెడతాను ,అలా ఐతే  పాడవ్వ దు ,అని చెప్పి
  పులుసు  పెట్టింది . నేను ఫ్రిజ్  సర్దుతూ ,పులుసు పడేస్తాను ,అన్నాను . మంచిదే  ఉండనీ  అని  నాకు
  క్లాస్  పీకింది ,నాదేమి  పోయింది  అని  ఊరుకున్నాను . మధ్యానం  నేను  అత్తా వాళ్ళింటికి  వెళ్లి  వచ్చే
  సరికి  సాయంత్రం  ఐంది . వస్తుంటే బయటే  సోఫాలో  సూర్యం  తల  వాల్చేసి , నాలిక  వదిలేసి ,నిద్ర
  పోతున్నాడు , చూసుకుంటూ  లోపలి కి  వచ్చేసాను . మా రెండో అన్నయ్య  కాస్త  నల్లగా  ఉంటాడు .
  అందుకే  అత్తయ్య  తనకి  కన్నా  అని పేరు  పెట్టింది , ఇప్పటికి  అదేపేరు  పెద్ద అయినా ఎవరికీ అసలు
  పేరు  తెలీదు . పనులు కూడా  అన్ని కన్నయ్య పనులే ,మనిషికి  నిలువెల్లా  వెటకారం . ''వచ్చేవా రా
  నీ పెళ్లి  ఆగి పోయింది '' అన్నాడు ,నా గుండె  గుభేల్  మంది , ఎంగేజ్  మెంటే  పెళ్ళిలా  చేసారు ,ఇప్పటికే
  అందరూ ఇంత  గ్యాప్  ఎందుకు  వచ్చింది ? ఇన్నాళ్ళు  లేట్ చేస్తే పెళ్లి [ఆగి ] తిరిగి  పోతుంది ,అనే వారు
  అనుకున్నంతా  ఐంది  అని ఏడుపొచ్చేసింది ,కన్నా మాత్రం  ''బయట  చూసేవా మీ  అత్తవారి  వూరు
 నించి  వచ్చిన  సూర్యం  చచ్చి పడున్నాడు ,అమ్మ భోజనం లో  కాకరకాయ  వేసి పెట్టింది ,అది కూడా
 మూడు రోజుల క్రితం ది ,తినేసాడు  చచ్చి పాయిన ట్టున్నాడు''  అన్నాడు . నేను  వస్తూ చూసాను  గా
 నమ్మేసాను , ఆ భంగిమ  తల వాల్చేసి ,నాలుక వదిలేసి  నిజమే  నని పించింది . ఉదయం  ఫ్రిజ్ నుండి
 తీస్తుంటే  వద్దని  ఉన్చేసిందిగా ,వేసేసి  ఉంటుంది , తినేసి వుంటాడు ,అతనికేమి  తెలుసు  పాపం పోయాడు
 పెళ్లి  ఆగిపోఇంది , చంద్రకి  కూడా  కాకరకాయ  పులుసు  పెడుతుందేమో  అని అత్తమ్మ  పెళ్లి వద్దంటుంది
 ఏ డుపు  వచ్చేసింది ,అప్పుడు  అంత   అమాయకంగా  వుండే  దాన్ని . ఇంతలో  బయట  మాటలు
 వినిపించాయి  నాన్న వస్తూ ,సూర్యం  గారిని  పలకరిస్తూ , టీ  తీసుకుని  వెళ్ళమని  చెప్తున్నారు ,అతనేదో
 అంటున్నాడు ,    బ్రతికే  ఉన్నాడు   ఇదంతా  మా  అన్న  వేళా  కోళం  అన్న మాట  అతని గొంతు  వినగానే  అమ్మయ్యా  ప్రాణం  లేచి వచ్చింది . చాల రోజులు  అన్నయ్య  ఇంటికి  వచ్చిన  వాళ్ళందరికీ  ఇదే  చెప్పేవాడు , నాకు  కూడా  తరచు గుర్తు  వచ్చి  నవ్వుకుంటాను ..............
   
   

2 comments:

  1. :)
    చాలా చక్కగా వ్రాస్తున్నారు .. మరి అన్నయ్యకు మీ పనిష్మెంటేమీ లేదా ??

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ శినుగారు , పనిష్మెంట్ లేకుండా ఎలాగా ?
      నాన్నగారి తో చెప్పి అక్షింతలు వేయించా ...

      Delete