Total Pageviews

Thursday, April 9, 2015

''నాగ మల్లిక '' ఇదో ప్రేమ కధ .



కుర్చీలన్ని  గుండ్రంగా  తిప్పేసుకుని ,కూచుని  కబుర్లు చెప్పుకుంటున్నాము . మండపం  దాదాపు ఖాళి ఐంది .
పిల్లలంతా  ధర్మకోల్  బాల్స్ తో  ఆడుతున్నారు ,ఇంకా కొంతమంది ,పూలన్నీ తీసి  విసురుకుంటున్నారు . మా 
కుళ్ళు జోకులతో ,నవ్వులతో ,మా చుట్టూ మాత్రమే  సందడి గా వుంది . ఇంతలో ఒక వ్యక్తీ నా  దగ్గరికి  వచ్చాడు . 
''అమ్మా  నువ్వు ___ చిన్నాన్న గారి  అమ్మాయి వే  కదా '' అన్నాడు  నేను మర్యాద కోసం  లేచినిలబడ్డ ను . 
''అవునండీ  మీరు' ..నసిగెను . '' నేను నీకు  అన్నయ్యను  అవుతానమ్మా నా పేరు  శివ రామ్ ,నిన్ను ఇందాక 
నించి  చూస్తున్నా  ఆకుర్చోడం ,నవ్వడం  ,చిన్నాన్నే  కన్పిస్తున్నారు ,పోల్చేసాను . అందుకే  వచ్చి అడిగేసాను ''. 
అన్నాడు . అయన  అలా  అనగానే  ఉబ్బి తబ్బిబ్బు  అయ్యాను 'హే  ఎస్సేడు 'అనుకున్నా  ఇక్కడొక విషయం 
చెప్పాలి మీకు , నాకు  నన్నెవరన్నా  మా  నాన్నగారితో పోలిస్తే  కర్ణు డిలా  కవచకుండలాలు  వలిచి ఇచ్చేస్తాను . 
అదన్నమాట . ''రా  అమ్మా  అలా కూచుని  మాట్లాడు దాం '' అన్నాడు . మనసులో  ఈనతొ  నాకు మాటలేమి 
వుంటాయి  అనుకుంటూ ,మా  వాళ్లతో ఇప్పుడే వస్తాను  అన్నట్టు చెయ్యి చూపి  ఆయన వెంట  నడిచాను . 
కాస్త దూరం లో  వున్నా  కుర్చీలలో  కూర్చుని, ఎక్కడవుండేది ,  ఎంతమంది పిల్లలు ,ఆదాయ వ్యయాలు 
తాలూకు వివరాలు ,చిన్న ప్రస్నావళి  అయ్యాక ''చాల సంతోషం  అమ్మా అంత  దూరం  నించి పెళ్ళికి రావడం 
మంచి విషయం '' అన్నారు . నేనూ ఏదో అడగాలి కాబట్టి అడుగుతూ  ''మీరెక్కడ వుంటారు పిల్లలెంత మంది ''
అన్నాను . ఆయన  ఆశ్చర్యం గా  చూసాడు ,మొహం చిన్న  బోయింది . ''నీకు తెలీదా నేను పెళ్లి చేసు కోలేదు ''
అన్నాడు . అప్రయత్నం గా  ఎందుకు అన్నాను . ఆయన ముఖం  వాడిపోయింది .చేతి  వేళ్ళు చూసుకుంటూ .. 
నీకు  ''నాగమల్లి ''తెలుసుగా  అన్నారు , నేను  సంశ యంగా చూస్తూ  ''అవునూ.. నాగామల్లి 'క ?'' అన్నాను ,
అవునమ్మా  నీ చిన్నప్పుడు  మీ ఇంటి పక్కనుండే  దమయంతి గారి  మేనకోడలు ,అన్నాడు . అవును 
గుర్తుంది  మర్చి పోయే  రూపమా  ఆమెది ,' కాని తను  చనిపోయింది కదా ..' అన్నాను . అవును అందుకే 
నేను పెళ్లి చేసుకోలేదు ,నువ్వు చిన్నదానివి నీకు గుర్తులేదేమో  అనుకుంటున్నాను  అన్నాడు .

మాది  చాల  పెద్ద ఇల్లు ,ఇవతలి వీధికి   ఎనిమిది   అడుగుల సింహద్వారం  టీక్ వుడ్  తో చేసినది వుంది . 
పిల్లలు గడియ వెయ్యాలంటే ఇద్దరం వేసేవాళ్ళం , డాబా ఇల్లు ,అవతలి వీధి కి  పెంకుటిల్లు  వుండేది రెండిళ్ళ  మధ్యలో రకరకాల  చెట్లు ,మొక్కలు .నీళ్ళ పంపు చుట్టూ  గుండ్రటి సిమెంట్ అరుగు వుండేది . 
గిన్నెలు కడిగేది ,బట్టలుతికేది అక్కడే . చెట్ల కింద మంచాలు వేసుకుని  కుర్చునేవాళ్ళం ,ప్రతి సంక్రాంతి కి 
అందరూ  వచ్చేవాళ్ళు ,ఒకమంచమన్నా విరగ్గోట్టేవాళ్ళు అంతమంది కుర్చునేవాళ్ళం .

పక్కనే  వున్న ఇల్లు  దమయంతి గారిది . మా వాళ్లకి స్నేహితులే కాదు  బంధువులు కూడా  అనుకుంటా ,
వరసలతో పిలుచుకుంటూ ,వస్తూ  పోతూ  వుండేవారు . ఆ  దమయంతిగారి  మేనకోడలే  'నాగమల్లిక '. 
తరచూ  మేనత్త  ఇంటికి వచ్చిపోతుండేది ,వాళ్ళది పదిమైళ్ళ దూరం లోవున్న  పల్లెటూరు . ఆ అమ్మాయి 
ఎంతందంగా ఉండేదంటే ,భగవంతుడు  ప్రత్యేకం గా  తయారుచేసిన  బొమ్మలా  వుండేది . అందమే కాదు 
అంతకు మించిన  ,గుణం  కూడా వుంది . వంచిన తల ఎత్తెది కాదు , పలకరించిన వారికి  చిరునవ్వే 
సమాధానం . ఏంతో  నేమ్మదస్తురాలు . అంతకుమించిన  సుకుమారమైన హృదయం అని తర్వాత తెలుసు 
కున్నాను . అత్తకి సాయం  గా  బట్టలు ఆరేస్తూ  పెరట్లో తిరుగుతుంటే ,ఆమె సోగ కళ్ళని ,పేద్ద .. జడని రెప్ప 
వాల్చక  చూస్తూ ఈమె రూపమే ఇలావుంది ,జీవితం ఇంకెంత అందం గమలుచు  కుంటుందో అనుకునే దాన్ని . 
అడిగిన వాళ్ళకి అడగని  వాళ్లకి  దమయంతి గారు ,మల్లి  నా కోడలు అని చెప్పేవారు . ఆ అమ్మాయి ఇది 
తన అత్తవారిల్లు అని నిర్నైన్చేసు కుంది  మనసులో . దమయంతి గారి అమ్మాయితో  కలిసి  గుడికి 
సినిమాకి  వెళ్లి వస్తుండేది .  అన్ని అనుకున్నట్లు జరిగితే  కదేముంది ? అతగాడికి  వుద్యోగం  రాగానే తల్లి కి 
చెప్పాడు  ఎవరినో ప్రేమించానని ,ఆమెనే  పెళ్లి చేసుకుంటానని . ఇద్దరు గొడవ పడ్డారు . దమయంతిగారు 
మెల్లగా నచ్చ చెబితే వింటా డనుకుని  పొరబడ్డారు . కొడుకు కి  భర్త  సపోర్ట్ చెయ్యడం ఆవిడకి నచ్చలేదు . 
మేనకోడల్ని  రానివ్వద్దని  భర్త చెప్పడం  ఆవిడకి బాధకలిగించింది . వీళ్ళిలా తగువులు  పడుతుండగా 
ఎప్పటిలాగే  మల్లి  మళ్లీ  వచ్చింది . ఆరోజు తల్లి కొడుకు  ఆ అమ్మాయి ముందే ఇంగితం  మర్చి పోయి 
గొడవపడ్డారు ,మల్లిని పంపేయమని  అరిచాడు . దమయంతిగారు 'నేను వచ్చి నాన్నతో మాట్లాడతాను ,
ఇక్కడి సంగతులేమి నాన్నకు చెప్పకు ,నువ్వెళ్ళి రా ,' అంటూ ఆమెని  పంపేసారు . తను  ఊరెళ్ళి పోయింది . 
ఆ రాత్రి  దమయంతి  గారు ఏ డ్చుకుంటూ ,వూరికి వెళ్ళిపోయారు . తర్వాత  పెద్దవాళ్ళ మాటల్లో  తెలిసింది . 
నాగామల్లిక  చనిపోయిందని . అంతవరకే నాకు తెలుసు . కాని శివరాం  అన్నయ్య నాకు వేరే  కోణం చెప్పారు . 

ఆయన మాటల్లోనే ..'' మా  పెద్దమ్మ కూతురు  సుగుణ ,నేను  స్వంత  అక్క తమ్ముళ్ళ లా  వుండేవాళ్ళం  మా 
పెద్దమ్మ , అమ్మ  కూడా  వుండేది పక్క పక్కనే కావడం తో ,మరింత కల్సి  మెలిసి   వుండేవాళ్ళం  నా పదేళ్ళ 
వయసు లో అక్కకి  పెళ్లిజరిగింది . బావగారు కూడా  నన్ను బాగా  చూసే వారు . తరచు అక్కతో  వాళ్ళ అత్తవారి 
ఊరికి వెళ్తుండే వాడిని . అప్పుడే  బావగారిఅక్కయ్య  దమయంతి గారి ఇంటికి వచ్చినపుడు ,మీ నాన్న గారిని 
చూసాను  ఆయన  ఒకసారి చుస్తే మరిచి పోయే వ్యక్తీ  కాదు . సుగుణ అక్కయ్యకి  ''నాగమల్లి 'పుట్టింది . అక్క 
నాతొ  ఇది నీ పెళ్ళాం రా  అంది . ఎందుకో  కాని  నాకు  చాల నచ్చేసింది  మల్లి ,వాళ్ళ వురు వెళ్ళాక  నేను 
చదువులో  పడి పోయాను . సెలవుల్లో వచ్చినపుడు ,మల్లి నేను  బాగా ఆడుకునే వాళ్ళం . నేను  మల్లి మీద 
ఇష్టం పెంచుకుంటున్న  సమయం లోనే  తను దమయంతి గారి  అబ్బాయి ని  ఇష్ట పడటం  మొదలు పెట్టింది . 
నాకు వుద్యోగం  రాగానే  అక్క బావగారిని  పెళ్లి గురించి అడిగింది ,అడిగింది  అనేకంటే  నేను అడిగించేను  అంటే 
బావుంటుంది . కాని  బావగారు  మల్లి ని  తన మేనల్లుదికే  ఇచ్చి చేస్తాను  అని చెప్పే సే రు . అక్క సంబంధాలు 
చూస్తాను అని  చెప్తున్నా వినకుండా మూడేళ్ళు గడిపేసాను . ఇంతలో  దమయంతి గారి  అబ్బాయికి వుద్యోగం 
వచ్చింది . అక్కబావ దమయంతిగారిని  అడిగారు, ఆవిడ  మల్లి నా కోడలు  అని మాటిచ్చారు . వాళ్ళ అబ్బాయి 
ఎవరినో  ప్రేమించడం ,ఆసమయానికి  అక్కడవున్న  మల్లిని తండ్రి, కొడుకు వేల్లిపోమ్మనడం . తిరిగి వస్తూ  మల్లి 
నిద్రమాత్రలు తెచ్చుకుని వచ్చింది . అప్పుడే వచ్చేసా వేంటి  అని  అక్క అడుగు తున్నా ,అన్నం తినమన్నా వద్దు 
ఎండలో  వచ్చాను కదా  అందట . ఎంత పిలిచినా పలకదట ,రాత్రికి  బావగారు రాగానే  తలుపులు తెరచి చుస్తే 
ఏముంది  నిర్జీవంగా కూతురు . అలా  కూతుర్ని చుసిన  ఆయన తట్టుకోలేక పోయాడు . ఆమె చేతిలోని వుత్తరం 
చదివి ,ఐనవాళ్ళ ద్రోహాన్ని జీర్ణించుకోలేక పోయాడు . భార్యని ఒదార్చవలసిన వాడు పక్కగది లో  ఉరితాడుతో 
తన  దారి తను చూసు కున్నాడు . ఇప్పుడు అక్క  నా దగ్గరే  ఉంటోంది . ఎన్నోసార్లు  పెళ్లి చేసుకోమని అడిగింది . 
కాని చనిపోయే ముందు ,నాగామల్లిక  రాసిన వుత్తరం  చదివాను ''నాకెవరు లేరు  నాన్న ,నేను ఒంటరిదాన్ని 
అందుకే వెళ్ళిపోతున్నా  అని రాసింది . అది నిజం కాదు  తనకు నేను వున్నాను ,ఎన్నో ఏళ్ళు ఎదురు చూసాను . 
చూస్తాను  చూస్తూనే  వుంటాను ,నేను జీవితమంతా పెళ్ళిచేసు కోకుండా వుండి  పోతేనే  తనేక్కడున్నా తనకు 
నా ప్రేమ  అర్ధం అవుతుంది . అప్పుడే మరో జన్మ లోనన్నా  నన్ను కరుణిస్తుంది . తనకు పెళ్లై వుంటే అప్పుడే మర్చిపోయే  వాడినేమో ,నాకెవరు లేరంటూ ప్రాణం తీసుకుంది . నేను ఇలా ఒంటరిగా ఉండిపోతే  తనకోసం 
నేనున్నానని తెలుసుకుంటుంది . అందుకేనమ్మా  నేను పెళ్ళిచేసుకోలేదు'' .ఎందుకో తెలీదు రెండు కన్నీటి 
చుక్కలు  బుగ్గల మీదుగా  బరువుగాజారి  పడ్డాయి ,రెండుచేతులూ వాటికవే జోడించుకున్నాయి ........

 ''పురుషులందు  పుణ్య పురుషులు వేరయా ... ''
                                                              *********************

2 comments:

  1. మీ సూచనలు పాటిస్తాను ,పెద్దవాళ్ళు చెపితే ఎప్పుడూ తప్పుగా అనుకోను ,ధన్యవాదాలు .

    ReplyDelete