Total Pageviews

Thursday, March 5, 2015

ఎక్కడో చదివాను . .............
ఎక్కడో చదివాను .... కోకిల  కి  గూడు  వుండదట .  కాకి గూటి లోనే  గుడ్లు  పెడుతుందట .
కాకి    తెలియక తన గుడ్ల తో పాటు  ,  పొదిగి పిల్లలిని చేసి   ఆహరం  తెచ్చి పెంచుతుందట .
 కూత మొదలుపెట్టగానే 'కా కా ' బదులు 'కూ  కూ ' వినగానే  కొయిల ని  గూటిలోంచి పడేస్తుందట .
కాకి గూటి లోంచి  వచ్చింది   కనుక  కొయిల  పెంచదు ,కొయిల పిల్ల   కనుక  కాకి చేర
నివ్వదు . ఎంత హృదయ విదారకం . కమ్మని పాటల   కొయిల కు ఎంత కష్టం , కేవలం
మావిచిగురు తిని ,మన  మనసులు  రంజింప చేసే  కొయిల కు  కూడా  విషా దమేనా ?
ఇందులో ఎమన్నా తప్పులుండవచ్చు ,  నెనుమరచిపొఇ  ఉండవచ్చు తెలిసిన వారు
సరిదిద్దండి .ఎక్కడో చదివాను ...  ఏనుగు చిన్న  పిల్లగా  వున్నప్పుడు   పెద్ద గొలుసు తో బందిస్తారట .
పెద్దయ్యాక  సన్నని తాడుతో  కడతారట ,ఎందుకలా  అంటే ,చిన్నప్పటి  నించి ఆ బంధనాన్ని
తెంచుకోవాలని  ప్రయత్నించి, ప్రయత్నించి  విసిగి పోతుందట ,ఇకనావల్లకాదు  అని ఓటమి
ఒప్పుకుని ,ప్రయత్నం విరమించు కుంటుందట . అప్పుడు  గోలుసుతీసి  తాడు వేస్తారు ,
కాని అప్పటికే  ఇక  ప్రయత్నిచడం  మానేసిన ఏనుగు ఆ విషయం  పట్టించు కొదు .
అంత పెద్ద తలకా యవున్న,  తెలివికదా  ముఖ్యం . మనం కూడా ఒకోసారి  కొన్ని విషయాలు
దాటావేస్తుంటా ము [ఓవర్ లుక్ ] దానిఫలితం కూడా మనదే అనుకోండి . అన్నట్టు ఏనుగు
బంధించే గోలుసుపేరు ''  శృంఖలాలు   '' అంటారట .
ఎక్కడో  చదివాను ...  గోమాత  గొప్పదనం  గురించి  మనకితెలుసు కదా  దేవాలయం లో పూజ
చేస్తాము . ఇంటికొస్తే  అరటిపండో  కడిగిన బియ్యంలో  కొబ్బరి బెల్లం  కలిపి  పెడతాము ,కాళ్ళకి
నమస్కరించి  ఎంతో  తృప్తి పడతాము . ఆవుపాలతో  పోషకాలే  కాదు,  యజమాని  దగ్గరకి
వచ్చి గంగ డోలు  దువ్వి  ముద్దు చేసినప్పుడు ,అతని శ్వాస ద్వారా ,అనారోగ్యాన్ని  పసికట్టి
ఆ  వ్యాధి కి విరుగుడు గా  పనిచేసే ఆకులు ,తీగెలు వెతికి తిని  వచ్చి  యజమానికి ఔషధ
గుణము కలిగిన పాలనిస్తుందట  . ఎంత ఆశ్చర్యం .. అందుకేనేమో ''గోమాత '' అన్నారు
మనపెద్దవాళ్ళు ఏదీ  ఉరికే  పెట్టలేదండి  ప్రతి నియమం  వెనుక కొండంత అర్ధముంటుంది .
అందుకే  ఇంట  గోవును పెంచాలన్నారు .ఎక్కడో చదివాను ... గ్రద్ద డెబ్భై ఏళ్ల  పయ్  బడి జీవిస్తుందట , కానీ సగం జీవితం గడిచేసరికే
దాని రెక్కలు దానికే  బరువై తయట ,ముక్కు వాడి తగ్గి పోతుందట ,గోర్లు పదును పోతుందట
అప్పుడు గ్రద్ద  ఒక కొండ శిఖరం  పైన కూర్చుని ,తన రెక్కలకున్న ఈకలన్నీ పీకేస్తుందట ,
గోర్లన్ని  వాడియైన ముక్కుతో ,పెకలించి వేస్తుందట  , ముక్కును శిఖరం  అంచుతో రుద్ది మళ్లీ
మొలిచేవరకు  ఎదురు చూస్తుంది . అలా కొన్ని నెలలు ఆహారం  లేకుండా  ఎంతో శ్రమ తో
భాదతో కూడిన వ్యయ ప్రయాసల కోర్చి , కొత్త  జీవితాన్ని మొదలుపెట్టి ,మిగతా జీవితాన్ని
సంతోషంగా  గడిపేస్తుంది . ఆ  సంకల్పబలాన్ని భగవంతుడు మనకి కూడా  ఇచ్చాడు కాని
ఎంతవరకు  సద్వినియోగం  చేస్తున్నామో మనకే  తెలియాలి .

                                            ****************************

8 comments:

 1. ఇవన్నీ నేను కూడా ఎక్కడో విన్నాను మళ్లీ ఒకసారి గుర్తు చేశారు ధన్యవాదాలు.

  ReplyDelete
 2. మహీ గారు ధన్యవాదాలు .

  ReplyDelete
 3. chala baga chepparu...........-

  ReplyDelete
 4. ఎవరో మహానుభావులు రాసారు నాకునచ్చి అందరికి తెలియచేయాలనీ
  ఇక్కడుంచాను . ధన్యవాదాలు

  ReplyDelete