Total Pageviews

Thursday, March 12, 2015

సరిగమల , పదనిసల , ప్రయాణం ...........


'' ఏమిటి  పెళ్ళికి  ట్రైన్  లోనా ! హబ్బా  బోర్ ! కార్  లో వెల్లిపోదాం ''
 ''వద్దు  ఎందుకు  రిస్క్ ,అక్కడకి వెళ్లాకే కార్  ఎంగేజ్  చేస్కుందాం ''
''ఏంటీ  జన్మ భూమి లోనా  నో  మీరు రెండు  రకాల  పేపర్లు  కొని
చదువు కుంటూ  కూచుంటారు ,పిల్లలేమో  ఒకరు తిండి మిల్
ఒకరు  సెల్ లో గేమ్స్  ఆడుతూ  కూచుంటారు ,నేను మిగతా
ప్రయాణికుల్ని చూస్తూ  మధ్య  మధ్య  కునుకు' పాట్లు'  పడాలి
ఇదొక  ప్రయాణమా !'గౌతమి ' లో  ఐతే శుభ్రంగా పడుకుని
పొద్దునే లేవచ్చు ,ప్రెష్  గా  వుంటుంది . '' ఇలా  అనేక చర్చోప చర్చలు  జరిగాక , ప్రయాణం  నిర్ణయించాము.
మధ్యా నమనగా  క్యాబ్  కి  పోన్ చేస్తే  వెతుకుతూ ,పోన్లో  మమ్మల్ని సంప్రదిస్తూ ,ఎట్ట కేలకు చిట్ట  చివరకు,అర్ధ గంట ఉందనగా  వచ్చాడు .  ఎంత వేగం గా  తీసుకొచ్చాడ ంటే , స్టేషన్ కి  వచ్చేసరి కి  గుండె  రైలు శబ్దం లా కొట్టు
కుంటోంది . ఎలాగో పరిగెత్తించి  రైల్ ఎక్కించారు . ఒక గంటవరకు  ప్రాణం గూట్లో పడలేదనుకోండి .





బాగా  అలసి పోయాం [పరిగెట్టడం  వల్ల ] ఏదో ఇంత  తినిబెర్త్   వాలుద్దమనుకునే  సరికి  మొదలయ్యింది అసలు
కధ . ఎక్క గలిగిన వారికీ  ఎక్కలేని వారికీ , లోయర్  బెర్త్  మాత్రమే  కావాలి  అసలు లోయెర్  కావాలని  రిజర్వ్
చేసుకున్న నా  అభిప్రాయం  అక్కడ  ఎవరికీ  అక్కరలేదు . అదో ప్రహసనం  , తరచూ ప్రయాణం  చేసే వారికీ
ఇదంతా అనుభవమే కాబట్టి  దానిగురించి  రాయట్లేదు . ఇక నిద్రపోదాం  అనుకునే  సరికి  ఎవరిదో పోన్ రింగ్
'అంతేనా... ఇంకేం కావాలి ... కుదిరితే కప్పు కాఫీ  వీలయితే  ...  నాలుగు  మాటలు ... ఇలా రెండు సార్లు వచ్చాక
తీసాడయన ,మాటల్ని  బట్టి  కొడుకుతో మాట్లాడుతున్నాడు ,కూతురి  పెళ్లి శుభలేఖ  షిర్డీ  లో  సాయినాధుని
పాదాల వద్దవుంచి  హైదరాబాద్  లో వున్న మరో కూతురిని అల్లుడిని పెళ్ళికి  పిలిచి తిరిగి వెళ్తున్నాడు . అదొక
అర్ధగంట  మీటింగ్  అయ్యాక ముగించాడు . హమ్మయ్య అనుకుని నిద్ర కుపక్రమించాను , ''గాల్లో తేలినట్టుందే ..
గాల్లో  తేలి .. గాల్లో  తేలి ....మరెవరిదో  మిస్ కాల్ ?...మరొకా యన కాల్  బ్యాక్ చేసాడు , పొద్దిన కల్లవచ్చేస్తానని
స్టేసన్ కి  బండి తేవాలని  మరి మరీ  చెప్పి  పెట్టేసాడు . ఎలాగో  ముసుగేసి నిద్దరోదామని ట్రై  చేస్తున్నా , ఇంతలో
పెద్దసబ్దం ,ఎవరో చిన్నపిల్ల  పయ్ బెర్త్  మీదనించి కిందడింది , పెద్ద హడావిడి ,అదిముగిసి ఏడుపు మనేసరికి
మరో పావుగంట . ఆ మహాతల్లికి పసిదాన్ని  అవతలి పక్క పడుకో బెట్టుకోవాలని  తెలీదా ! ఎవరెవరికో మరిన్ని
పోన్  లు  వచ్చాక అప్పుడు ప్రశాంత మయ్యింది . ఒక పెద్దాయన  విమానం స్టార్ట్ [గురక ] చేసాడు . అది మెల్లిగా
పెరుగుతూ  హెలికాఫ్టర్  గా  మారి  పావురాల గుట్టమీదుగా  స్తిరంగా  ఎగురసాగింది . వారి  శ్రీమతి ని తలుచు
కొని  పుట్టెడు  జాలేసింది . దేవుడా  ఇంత  డబ్బు పోసి  రిజర్వేషన్  చేసుకుంది  పడుకోవడానికి  కాదా !
ఇంతలో కాళ్ళదగ్గర   మెత్తగా .. ఉలికి పడి  ముసుగు తీసా , ఎవరో కుర్చునున్నాడు . ''హలో ఇక్కడనించి
లేస్తారా  ''అన్నాను  అంతే  గబ గబా వెళ్ళిపోయాడు . పెళ్లి కదా అని  వస్తువులన్నీ  సర్దేసాను , ఆ  బాగ్ కి
చైన్  వేసారో లేదో ? తలకింద  పెట్టు కుంటా ఇమ్మని చెప్పా .. వినేరకమా  ఏమన్నానా , ఆ  పెట్టె తీసుకు
దిగిపోతాడో  ఏమో ?, నిద్రపట్టలేదింక . పెళ్ళంటే  నగలు చీరలు  ప్రదర్శన , అవిలేకుండా  వెళ్తే[  ఈగో ]కత్తి
ఖంగు మంటూ  కింద డి పోద్ది . పక్కింటి పేరంటానికి  కూడా  పట్టుచీర  కట్టనిదే లోపలి కూడా రమ్మనరు .
మా ఆడవాళ్ళకి ఎన్ని సమస్యలో ఎలాచేబితే అర్ధమౌతున్ది ,చెప్పండి , అసలే నా  పుత్రుడు  అడిగాడు ' మళ్ళీ  తెచ్చావా  టిష్యు  పేపర్లు ' అని . అదేంటి  బోలెడు ఖరీదు పెట్టి పట్టు చీరెలు కొనుక్కొస్తే  టిష్యు  పేపర్లంటావా !
 అంటే ' అంతే  కదా  ఒకసారి  అందరూ  చుసేరంటే  నోటేడ్  అయిపోతాయి  కదా మళ్లీ  కట్టుకోవుగా  ' '
 నా బంగారు కొండకన్నీ  నా బుద్దులే  వచ్చాయి ....

అర్ధరాత్రి కావచ్చింది   ఎవరో టీ  అమ్మేవాడిని  పిలిచి ఏ  స్టేషన్  అని అడిగారు ,టీ  కావాలా  అన్నాడు ,
వద్దు నిద్ర దిగిపొద్ది  అనగానే  ఆ టీ  వాడు 'రైల్ స్టేషన్ ' అని వెళ్ళిపోయాడు . హబ్బో  గోదారి గాలి మొదలై
నట్టుంది అందుకే  వెటకారం మొదలైపోయింది  . తెలంగాణా  నించి ఆంధ్రప్రదేశ్ గా   మారేక ఇదేరావడ0 చాల
ఆనందం కలిగింది . విజయవాడ దాటింది  ,ఏ లూరు  లో  రావాల్సిన  ''దోసు  దొసూ '' అనే  శబ్దం  రాలేదేమిటో
లయబద్దం  గ  చప్పుడు చేస్తూ  బ్రిడ్జ్ మీద  ట్రైన్ వెళ్తోంది . గోదావరిని ఆ మసక  వెలుగులో చూస్తేనే  సంతోషం
చుట్టుముట్టేసింది . వంశీ ''వెన్నెల్లో గోదారి అందం .. పాట  ఇళయరాజా  సంగీతం , జానకమ్మ ,గళం ..ఒహ్ ..
అన్నట్లు  రాజమండ్రి  విద్యార్ధులు  శ్రీ మాన్ చంద్రగారు [మా వారే ] లేచి గోదారిని దర్శించ నే లేదు . వారు
చిన్న సైజ్  a  c   బస్  నడిపిస్తున్నారు  అదేనండి  సౌండ్ తక్కువుండే , [గురక ] గరుడ బస్  అన్నమాట .
తెల తెల వారుతోంది  రైస్ మిల్  పచ్చని పొలాలు ,సాయిబాబా  గుడి  అన్ని వరుసలో  నన్ను  పలుక రిస్తూ ..
వెళ్తున్నాయి ,ఈ పచ్చని అందాలూ చూడని కన్నులేందుకు ,అన్పిస్తుంది  కాని  ఒక రోజే ,మళ్లీ  ఊరికి
ఎప్పుడు వేల్లిపోతమా  అన్పిస్తుంది . సికింద్రాబాద్ స్టేషన్  లో రైలు  దిగ్గానే  హమ్మయ్యా  అన్పిస్తుంది .
అక్కడ  పెళ్లింట్లో  మా  వాళ్ళు  నాకోసం  ఎదురు చూస్తూ వుంటారు . మొదట  పలకరింపులు ,తర్వాత కౌంటర్లు
ఎన్కౌంటర్లు , టైర్లు  సెటైర్లు  మొదలైపోతాయి . మనం మాత్రం  మళ్లీ ఇదే  టైంకి,  ఇదే  చోటులో  వచ్చేవారం
  హైదరాబాద్ లో కలుద్దాం  ................... !

                                                   **********************************

No comments:

Post a Comment